
ఘనంగా క్రిష్ నిశ్చితార్థం
గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త మార్పుకు స్వాగతం పలుకుతున్నాడు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రస్తుతం షూటింగ్ హడావిడి నుంచి గ్యాప్ తీసుకున్న క్రిష్ నిశ్చితార్థం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్యతో క్రిష్ వివాహం ఆగష్టు 8న జరగనుంది. ఈ కార్యక్రమంలో క్రిష్, రమ్యల కుటుంబ సభ్యులతో పాటు నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా పాల్గొన్నారు.