నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఎన్టీఆర్ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్ టాక్ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్.టి.ఆర్ క్యాష్ చేసుకోలేకపోయింది.
గత బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్ షేర్ కూడా సాధించలేదని ఇంటర్‌నేషనల్ బిజినెస్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యన్.టి.ఆర్ కథానాయకుడు బ్రేక్ ఈవెన్ సాధించటం సాధ‍్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పండుగ సెలవులు కూడా అయిపోవటంతో కలక్షన్లపై మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యన్.టి.ఆర్ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment