‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ మరోసారి వాయిదా! | NTR Mahanayakudu Postponed Again | Sakshi
Sakshi News home page

Jan 18 2019 11:29 AM | Updated on Jan 18 2019 11:30 AM

NTR Mahanayakudu Postponed Again - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్‌ మూవీ యన్‌.టి.ఆర్‌. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై డివైడ్‌ టాక్‌ రావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందుగా రెండో భాగం యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు సినిమాని జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్‌ డేట్‌ను ఫిబ్రవరికి మార్చారు. ఫిబ్రవరి 7న యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు రిలీజ్‌ అవుతుందని ప్రకటిస్తూ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్‌ డేట్‌ను మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు సినిమాను వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement