నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా తేజను దర్శకుడిగా తీసుకున్నారు. ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరిగిన తరువాత తేజ తప్పుకోవటంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజకు యన్.టి.ఆర్ కథానాయకుడికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
అయితే ఈ విషయంపై స్పందించిన తేజ.. తాను ‘సీత’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా ఆ సినిమా చూడలేదని చూసిన తరువాత స్పందిస్తానంటూ సమాధానమిచ్చారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment