
బాలయ్య శాతకర్ణి లుక్ వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇది బాలయ్య వందో సినిమా కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.
దసరా సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ శనివారం బాలయ్య సింహాసనం మీద కూర్చున్న రాయల్ లుక్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే పౌరాణాక జానపద పాత్రల్లో అలరించిన బాలయ్య ఈ చారిత్రక పాత్రలోనే ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి అభిమానులు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తుండగా, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.