భల్లాలదేవ భార్యగా..! | sriya, pairing with rana for bahubali 2 | Sakshi
Sakshi News home page

భల్లాలదేవ భార్యగా..!

Published Thu, Oct 22 2015 1:33 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

భల్లాలదేవ భార్యగా..! - Sakshi

భల్లాలదేవ భార్యగా..!

టాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్గా నటించిన సీనియర్ హీరోయిన్ శ్రియ గోల్డెన్స్ ఛాన్స్ కొట్టేసిందన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సెలక్టివ్గా సినిమాలు చేస్తున్న ఈ భామ, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2లో నటించనుందట. తొలి భాగంతో ఘనవిజయం సాధించిన బాహుబలి యూనిట్ సీక్వెల్ను మరింత భారీగా తెరకెక్కించటానికి ప్లాన్ చేస్తోంది.

బాహుబలి చిత్రంలో నెగెటివ్ రోల్లో భల్లాలదేవగా నటించిన రానాకు జోడిగా రెండో భాగంలో శ్రియ నటించనుందట. తొలి భాగంలో రానాకు కొడుకు పాత్రను మాత్రమే చూపించిన రాజమౌళి రెండో భాగంలో భల్లాలదేవ భార్యను కూడా చూపించనున్నాడు. కథలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఈ పాత్రకు స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన యూనిట్ సభ్యులు ఈ పాత్రకు శ్రియను ఎంపిక చేశారట. అయితే ఇప్పటి వరకు బాహుబలి సినిమాలో శ్రియ పాత్రపై యూనిట్ సభ్యుల అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేయకపోయినా, బాహుబలి 2లో శ్రియ అంటూ టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్, రానాలు లీడ్ రోల్లో నటించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ 2016 జూలై నాటికి బాహుబలి 2ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement