కోలివుడ్‌కి చెందిన శ్రుతి హాసన్.. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా నటన, గాత్ర ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఆమె అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదట. ఎందుకంటే..‘ఒకప్పుడు నన్ను అన్‌లకీ అన్నవాళ్లే తర్వాత లకీ అనడం మొదలుపెట్టారు. అందుకే తానస్సలు దాన్న నమ్మను అంటోంది. కేవలం హార్డ్ వర్క్‌ని, దేవుడిని నమ్ముతాను అని నర్మగర్భంగా చెప్పింది. చెక్కిన శిలంలా చూపులను కట్టిపడేసేలా ఉండే శృతి అందాన్ని మరింత పెంచే ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో తెలుసా!..
అర్పితా మెహతా
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా బాల్యంలోనే.. తన ప్యాషన్‌ని ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్‌ఎన్‌డీటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్‌ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం. ఇక్కడ శృతి ధరించిన అర్పితా మెహతా డిజైన్ చేసిన చీర ధర ఏకంగా రూ. 1,05,000/-.
అపాలా బై సుమిత్
సుమిత్ సాహ్నీని జ్యూలరీ డిజైనర్ అనడం కంటే వెండి సంప్రదాయ నగల పరిరక్షకుడు అనొచ్చు. వెండి అంటే అంత పిచ్చి అతనికి! 2006లో ‘అపాలా బై సుమిత్’ బ్రాండ్ ప్రారంభించి, వెండి హస్తకళ సరిహద్దులను పెంచుతూ అసాధారణ.. అందమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ప్రభుత్వ ఆత్మసమ్మాన్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యాన్ని పొంది, ఢిల్లీలోని ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ (అఆఇఈ)లో అద్భుతమైన అపాలా ఆభరణాలను ప్రదర్శించాడు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
--దీపిక కొండి
(చదవండి: యానిమల్ చిత్రంతో ఓవరనైట్ స్టార్ అయిన తృప్తి డిమ్రీ ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment