ముత్యాలతో చేసిన చీరలో షానాయ​ కపూర్‌..! | Shanaya Kapoors Manish Malhotra Saree Made With Pearls | Sakshi
Sakshi News home page

ముత్యాలతో చేసిన చీరలో షానాయ​ కపూర్‌..! ఏకంగా 'లక్ష'..!

Published Thu, Jul 18 2024 1:31 PM | Last Updated on Thu, Jul 18 2024 1:37 PM

Shanaya Kapoors Manish Malhotra Saree Made With Pearls

ముత్యాలతో చేసిన నగలు, వాచ్‌లు అదిరిపోతాయి. ముత్యపు కాంతి, అందమే ఓ రేంజ్‌లో ఉంటుంది. వాటిని ధరిస్తే ఏదో ప్రకాశవంతమైన అనుభూతి కలుగుతుంది. ఎంత ఖరీదు చేసే డైమండ్లు ఉన్నా.. ముత్యాల ముందు అవన్నీ పక్కకు వెళ్లిపోవాల్సిందే అన్నంతగా ప్రకాశిస్తుంటాయి. అలాంటి ముత్యాలతో చీరనే రూపొందిస్తే.. ముత్యాల చీర దాని అందమే మతిపోయేలా ఉంటుంది. అలాంటి చీరనే ధరించింది బాలీవుడ్‌ నటి షానాయ కపూర్‌.

ఆమె ఇటీవల జరిగిన అనంత్‌ రాధికల పెళ్లికి హాజరైన ఫోటోలను నెట్టింట షేర్‌ చేసింది. ఆ వేడుకలో అందరూ పలు ఖరీదైన డిజైనర్‌ చీరలు,లెహంగాలతో దర్శనమివ్వగా. షానాయ మాత్రం ఓ డిఫెరెంట్‌ లుక్‌లో ప్రత్యేక ఆకర్షగా కనిపించింది. ఆమె ఈ గ్రాండ్‌ వివాహ వేడుకకి మల్హోత్రా డిజైన్‌ చేసిన ముత్యాలతో చీరలో తళుక్కుమంది. 

దాదాపు లక్ష ముత్యాలతో రూపొందించిన చీరలో ప్రకాశవంతమైన లుక్‌తో మెస్మరైజ్‌ చేసింది. వాటికి తగ్గట్టు చెవులకు సింపుల్‌ డైమండ్‌ స్టడ్‌లు, చేతికి చక్కటి ముత్యాలతో కూడిన బ్రాస్‌లెట్‌తో అదిరిపోయింది. హెయిర్‌ని చాలా సింపుల్‌ పోనీస్టైల్‌ని ఎంచుకుంది. అలాగే ప్రకాశవంతంగా కనిపించే లైట్‌ మేకప్‌కి ప్రాధాన్యత ఇచ్చింది షానాయ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: వైద్యురాలు కమ్‌ మోడల్‌: తొలి మిస్‌ యూనివర్సల్‌ పెటైట్‌గా కన్నడ బ్యూటీ!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement