ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు! | Janhvi Kapoors More Than Rs 1 Lakh Red Organza Saree With Pearl And Sequin Work | Sakshi
Sakshi News home page

ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్‌ లుక్‌..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Published Fri, Aug 16 2024 11:22 AM | Last Updated on Fri, Aug 16 2024 12:42 PM

Janhvi Kapoors More Than Rs 1 Lakh Red Organza Saree With Pearl And Sequin Work

బాలీవుడ్‌ నటి, దివంగత టాలీవుడ్‌ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల మనుసులను దోచుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ ఆయా సినిమాల ప్రమోషన్‌లతో డిఫరెంట్‌ డిజైనర్‌వేర్‌లతో సందడి చేస్తోంది. ఇటీవల ఎన్‌ఎంసీసీలో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న రాజాధిరాజ్‌ అనే మ్యూజికల్‌ ప్రీమియర్‌ కోసం రెడ్‌కార్పెట్‌పై ఎరపు రంగు ఆర్గాంజా చీరతో అబ్బురపరిచింది. 

కొత్త పెళ్లికూతురు లుక్‌లా ఉంది ఆమె శారీ డిజైనింగ్‌ స్టైల్‌. ఆ చీరకు తగ్గట్లు కాంగ్రాస్ట్‌ గ్రీన్‌ బ్లౌజ్‌ జాన్వీకి మరింత అందాన్ని ఇచ్చింది. ఫ్యాషన్‌ ఔత్సాహికులందర్నీ జాన్వీ కపూర్‌ ఎంపిక చేసుకున్న సరోజా రమణి చీరలపై దృష్టిసారించేలా చేసింది. ఇక్కడ జాన్వీ ధరించిన ఆర్గాంజా ఎరుపు రంగు చీరపై చేతిలో చేసిన ఎంబ్రాయిడరీ, పురాతన డబ్కా, మోతీ, సీక్విన్‌ వర్క్‌లతో అలంకరించి ఉన్నాయి. 

దీంతోపాటు బాల్డా లేస్‌ బార్డర్‌ కూడా ఉంది. జెనీ సిల్క​ ఆకుపచ్చ బ్లౌజ్‌ జత చేయడం ఆ ఎరుపు రంగు ఆర్గాంన్జా చీర లుక్‌ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అంతేగాదు ఈ బ్లౌజ్‌ పూర్తి నిడివి గల స్లీవ్‌ని కలిగి ఉంది. అలాగే నెక్‌లైన్‌లో ఉండి, క్లిష్టమైన జరీ వర్క్‌ కలిగి ఉంది. ఈ చీర ఖరీదు రూ. 1.62 లక్షలు. ఈ చీర జాన్వీ దేశీ లుక్‌ని ఓ లెవెల్‌కి కనిపించేలా చేసింది. ఆ చీర తగ్గట్టు చెవిపోగులు, నెక్‌లెస్‌తో సింపుల్‌గా కనిపించింది. జుట్టుని కూడా వదులుగా వేసి అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా అందంగా కనిపించింది. 

 

(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్‌ వేరేలెవెల్‌!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement