కాంజీవరం చీరలో జాన్వీ కపూర్‌..ఏకంగా 1983 ప్రపంచ కప్‌..! | Sakshi
Sakshi News home page

కాంజీవరం చీరలో జాన్వీ కపూర్‌..ఏకంగా 1983 ప్రపంచ కప్‌..!

Published Wed, May 22 2024 2:37 PM

Janhvi Kapoor Merges Cricket And Fashion In Styles

దివంగత నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడూ ఫిట్‌నెస్‌కి సంబంధిందిచిన ఫోటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా డిజైనర్‌ డ్రెస్‌ల ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ప్రసుత్తం జాన్వీ వరుస బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలో మంచి బిజీగా ఉంది. ఆమె తన తాజా చిత్రం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ‍ప్రచారం కోసం వారణాసిలో భారతీయ సంప్రదాయ చీరతో తళుక్కుమంది. 

అందమైన లేత నీలి రంగు చీరలో జాన్వీ లుక్‌ మిస్మరైజింగ్‌ ఉంది. ఆమె ధరించిన కంజీవరం చీర జాన్వీ అందాన్ని రెట్టింపు చేసింది. అయితే జాన్వీ ధరించిన చీర క్రికెట్‌ అభిమానులకు అలానాటి మధుర జ్ఞాపకాలను కళ్ల ముందు కదలాడేలా చేసింది. క్రికెట్‌కి జాన్వీ ధరించిన చీరకు సంబంధం ఏంటా ? అని అనుకోకండి. ఎందకంటే..? ఆమె చీర పల్లుపై నాటి 1983 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ని చాలా చక్కగా చిత్రీకరించారు. దీన్ని చాలా వివరణాత్మకంగా చేతితో చిత్రించారు. 

భారతదేశం ట్రోపీని కైవసం చేసుకున్న ఆ టోర్నీని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూస్తే కళ్లు తిప్పుకోలేం. మంచి కళాత్మక స్ట్రోక్‌లతో పూర్తి స్టేడియం నుంచి బ్యాట్స్‌మ్యాన్‌ సిక్సర్‌ కొట్టడం దాక చాలా చక్కగా అవగతమయ్యేలా చిత్రీకరించారు. క్రికెట్‌ థీమ్‌తో ఆలోచనాత్మకంగా చీరను తీర్చిదిద్దాలనుకువడం హైలెట్‌గా నిలిచింది. ఒక పక్క జాన్వీకి సంప్రదాయ బోర్డర్‌లోతో ఉన్న చీర మంచి లుక్‌ని తీసుకురాగా, దానిలో ఉన్న క్రికెట్‌ నేపథ్య చిత్రం చూపురులను మరింతగా ఆకట్టుకుంది. 

అంతేగాదు ఇది జాన్వీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ని, ఆమె  డ్రెస్‌ సెలక్షన్‌ వేరేలెవెల్‌ అని అనింపించేలా చేసింది. అలాగే ఆ చీరకు తగ్గట్టు బ్యాకెలెస్‌ బ్లౌజ్‌​ టై చేసి, పొట్టి చేతులతో కూడిన డిజైన్‌ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అంతకుమునుపు జాన్వీ ఇలాంటి బ్లూ కలర్‌ సీక్విన్స్‌తో డిజైన్‌ చేసిన మల్హోత్ర శారీని ధరించింది. దీనిక తగ్గట్టుగా స్లీవ్‌లెస్‌ కాలర్‌ బ్లౌజ్‌పై ట్రోఫీ చిత్రంతో కూడిన బటన్‌లు ఉన్నాయి. ఈ చీరలో జాన్వీ మరింత క్యూట్‌గా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో, పోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

 (చదవండి: కేన్స్‌ ఫెస్టివల్‌లో నిదర్శన గోవాని నవరత్న హారం! ఏకంగా 200 మంది కళాకారులు,1800 గంటలు..)
 

 

Advertisement
 
Advertisement
 
Advertisement