Woman Kite Surfs in Saree Goes, Viral on Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: నారూటే సెపరేటు..చీర కట్టులో సర్ఫింగ్‌!

Published Tue, Jul 18 2023 2:06 PM | Last Updated on Wed, Jul 19 2023 1:54 PM

Woman kite Surfs In Saree Goes Viral On Social Media - Sakshi

చీరతో కొన్ని రకాల సాహస క్రీడలు, ఫీట్‌లు చేయడం కాస్త కష్టం. అందులోనూ స్కూబా వంటివి అయితే అస్సలు కుదరదు. అలాంటిది ఓ మహిళ చీరతో ఆ సాహసానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

ఆ వీడియోలో ఓ మహిళ చీర కట్టులో గాలిపటల సర్ఫింగ్‌ చేసింది. ఆమె పేరు కాత్యా సైనీ. ఈ నెల ప్రారంభంలోనే లైసెన్స్‌ పొందిన స్కూబా డైవింగ్‌ శిక్షకురాలు ఆమె.  కాగా అందుకు సంబంధించిన వీడియో జూలై 10న నెట్టింట పోస్ట్‌ అవ్వడంతో తెగ వైరల్‌ అవ్వుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరూ మెచ్చుకోగా మరికొందరూ ఫైర్‌ అయ్యారు. ఒక నెటిన్‌ ఇది క్రాస్‌ కల్చర్‌ ఇలాంటిది నాకు చాలా ఇష్టం. నువ్వు ఓ అద్భతం అంటూ ఆ మహిళని ప్రసంశించాడు.

మరో వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సాహసం చేశారో తెలియదు. కొన్ని సాహస క్రీడలకు చీర నిషిద్ధం. అలాంటి ప్రమాదకరమైన ఫీట్‌లు చేస్తున్నప్పుడూ చీర ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి అంటూ ఫైర్‌ అయ్యారు. ఈ వీడియోకి లక్షలకు పైగా లైక్‌లు వ్యూస్‌ వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. 

(చదవండి: ఓ దేశానికి హాలిడే ట్రిప్‌గా వెళ్లితే.. ఆ దేశ అధ్యక్షుడి సడెన్ ఎంట్రీతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement