ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు.
గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు.
ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.
పోల్కీ వజ్రాల చరిత్ర..
ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్‌లు, అద్భుతమైన నెక్లస్‌లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు.
(చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..)
Comments
Please login to add a commentAdd a comment