jewelers
-
బంగారం ఎక్కడ కొన్నా ఒకే రేటు..
దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్’ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ప్రకటించింది. ‘‘మేము ఒకే ధర వద్ద బంగారం దిగుమతి చేసుకుంటాము, కానీ దేశీయ రిటైల్ ధరలు ఒక నగరం నుండి మరొక నగరానికి భిన్నంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము’’ అని జీజేసీ సెక్రటరీ మితేష్ ధోర్డా పేర్కొన్నారు.మండలి సభ్యులతో ఇప్పటికే ఈ విషయంపై 50కుపైగా సమావేశాలను నిర్వహించడం జరిగిందని, తమ ప్రతిపాదనకు ఇప్పటికే దాదాపు 8,000 జ్యూవెలర్స్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారని వివరించారు. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న వార్షిక గోల్డ్ ఫెస్టివల్ ‘లక్కీ లక్ష్మీ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.ఈ లక్కీ లక్ష్మీ ఉత్సవంలో 1,500 మంది రిటైలర్లు అలాగే 9 వరకూ చైన్ స్టోర్స్ పాల్గొననున్నాయి. కొనుగోళ్లకు సంబంధించి రూ. 10 కోట్ల విలువైన బహుమతులను అందజేయడం జరుగుతుంది. బంగారంపై రూ. 25,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు పండుగ కాలంలో ఖచ్చితమైన బహుమతులు అందుకుంటారు. బాలీవుడ్ నటి ముగ్దా గాడ్సే సీనియర్ జీజేసీ సభ్యులతో కలిసి ఈ ఉత్సమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. -
కేన్స్ ఫెస్టివల్లో హైలెట్‌గా 'కృష్ణ గువా నవరత్న హారం'!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లు, గౌన్లు, వెస్ట్రన్ డ్రెస్‌లతో మెరిశారు. వారిలో అస్సాంకి చెందిన నటి మాత్రం భారతీయ సంప్రదాయ చీరలో మెరిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదే కోవలోకి ప్రస్తుతం వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త నిదర్శన గోవాని గావిన్ మిగ్యుల్ చేరిపోయారు. గోవాని కూడా అస్సాం నటి మాదిరి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై జర్జోజీ ఎంబ్రాయిడరీ చీరతో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె ధరించిన చీరను వందమంది చేనేత వాళ్ళు తమ కళా నైపుణ్యంతో గ్లామరస్‌గా రూపొందించారు. అయితే ఈ వేడుకలో ఆమె చీర కంటే..గోవాని ధరించిన హారమే హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరూ తమదైన స్టైల్‌తో ఆకట్టుకోగా, గోవాని మాత్రం అత్యంత అరుదైన లగ్జరీయస్ జ్యువెలరీతో చూపురుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించి జ్యువెలరీని కృష్ణ గువా నవరత్న హారం అని అంటారు. ఇది వందేళ్ల నాటి పురాతన నగ. దీన్ని మీనా జాదౌ జ్యువెలరీ వ్యాపారి ఘనాసింగ్ బిట్రూ రూపొందించారు. ఈ నెక్లెస్‌ని తయారు చేయడానికి సుమారు 200 మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో 1800 గంటలు శ్రమకు ఓర్చి మరీ రూపొందించారు. నిజానికి ఈ నగలో వజ్రాన్ని పాశ్చాత్య కట్టింగ్ పద్ధుతును పక్కన పెట్టి పురాతన కటింగ్ పద్ధతిలో పోల్కీ వజ్రాలతో రూపొందించారు.పోల్కీ వజ్రాల చరిత్ర..ఇవి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఉద్భవించాయి. ఈ వజ్రాలను నాటికాలంలో మహారాజులు బాకులు, ప్లేట్లు, చెస్ సెట్లు, అద్భుతమైన నెక్లస్లలో ఈ పోల్కీ వజ్రాలను ఉపయోగించేవారు. View this post on Instagram A post shared by Nidarshana Gowani (@nidarshana_gowani) (చదవండి: ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..) -
నంద్లాల్ షోరూమ్‌లో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)
-
మీనా జ్యువెలర్స్ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు
-
ఎట్టకేలకు గరికపాటి క్షమాపణ
భీమవరం(ప్రకాశం చౌక్): తన వ్యాఖ్యలతో స్వర్ణకారులు బాధపడుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెబుతున్నానని ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రవచనాలు చేయడానికి విచ్చేసిన ఆయన స్థానిక హోటల్లో బస చేశారు. తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భీమవరానికి చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీంతో స్వర్ణకారుల సంఘం నుంచి పలువురు నాయకులు అలాగే కొందరు పెద్దల సమక్షంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2006 సంవత్సరంలో ఓ చానల్లో హాస్యం అనే కార్యక్రమంలో స్వర్ణకారుల గురించి తాను వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా స్వర్ణకారులకు ఆయన క్షమాపణ చెప్పారు. -
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. వివరాలను వెల్లడించాల్సిందే.. ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు. ‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్ఎల్ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది. -
మీనా జ్యుయలర్స్‌పై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్‌కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్బీఐ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్సీఎల్టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్బీఐ తెలిపింది. -
రిలయన్స్ జ్యూవెల్స్ ఆభర్ కలెక్షన్
హైదరాబాద్ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యూవెల్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఆభర్ పేరిట స్పెషల్ కలెక్షన్‌ను ఆఫర్ చేస్తోంది. దేశ జాతీయ పక్షి పీకాక్ స్ఫూర్తితో ఆభర్ కలెక్షన్‌ను తీర్చిదిద్దామని సంస్థ వెల్లడించింది.ఆభరణాల డిజైన్లు, రంగులు, ప్యాట్రన్స్ పీకాక్ స్ఫూర్తిగా రూపొందించి వాటికి ఆధునిక సొబగులు అద్దామని పేర్కొంది. 22 క్యారట్, 18 క్యారట్ గోల్డ్‌తో వినూత్న డిజైన్లతో ఇయర్ రింగ్స్ కలెక్షన్లో కొలువుతీరాయని పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకూ గోల్డ్, డైమండ్ జ్యూవెలరీపై మేకింగ్ చార్జీలపై 24 శాతం ఆకర్షణీయ ఆఫర్ అందిస్తున్నట్టు తెలిపింది. 12 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు విలువైన సేవలు అందించేందుకు ఆభర్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రిలయన్స్ జ్యూవెల్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ముంబై : అక్షయ తృతీయ దగ్గర పడుతున్న తరుణంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైకి, కిందకి పచార్లు కొడుతూ ఉన్నాయి. శనివారం మార్కెట్లో బంగారం ధరలు పైకి ఎగియగా.. సోమవారం నాటి మార్కెట్లో మాత్రం మళ్లీ కిందకి పడిపోయాయి. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా ట్రెడ్ ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్లో వంద రూపాయలు తగ్గి, 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు కూడా వంద రూపాయలు తగ్గి కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తుండటమే కాకుండా.. జువెల్లర్స్ కొనుగోళ్లు తక్కువ చేపడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ కిందకి పడిపోయాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా ఉంది. సిల్వర్ 0.36 శాతం తగ్గి 16.57 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 100 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.32వేలుగా, రూ.31,850గా రికార్డయ్యాయి. శనివారం ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా రూ.300 మేర చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే. -
ఖాకీల క్రౌర్యం..!
చేతిలో అధికారం ఉంది కదా అని పోలీసులు విచక్షణ మరచి ప్రవర్తించారు.అనుమానం పేరుతో ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. ఆపై తప్పు తెలుసుకునిఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం గుట్టుచప్పుడుకాకుండా బాధితుడ్ని నందిగామ నుంచి రాయచోటికి తరలించి చేతులుదులుపుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి అర్బన్ : దొంగ బంగారం, వెండిని కొని విక్రయిస్తున్నాడనే నెపంతో కృష్ణా జిల్లా నంది గామ పోలీసులు రాయచోటికి చెందిన స్వర్ణకారుడు పఠాన్ జమాల్‌ఖాన్(30)పై క్రౌర్యాన్ని ప్రదర్శించారు. అర్ధరాత్రి ఇం టిపై దాడిచేసి రాయచోటి పట్టణ శివారు ప్రాంతానికి తరలించి దారుణంగా హిం సించారు. కాళ్లు చేతులు విరగొట్టి పైశాచికంగా ప్రవర్తించారు. ఆపై తమ బం డారం బయటపడుతుందన్న భయంతో విజయవాడకు తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి.. గుట్టుచప్పుడు కాకుండా బాధితుడిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణ పేరుతో విచక్షణ రహితంగా కొట్టి... రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతంలో కరీమియా మసీదుకు సమీపంలో జమాల్‌ఖాన్ నివశిస్తున్నారు. బంగారు, వెండి నగలు తయారు చేసి, వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక దొంగ నుంచి వెండిని కొనుగోలు చేశాడన్న నెపంతో జమాల్‌ఖాన్ ఇంటిపై ఈనెల 12వ తేదీ తెల్లవారు జామున కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకెళ్లారు. విచారణ పేరుతో రాయచోటి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెలతో విచక్షణా రహితంగా కొడుతూ, దారుణంగా హింసించారు. నాలుగు రోజుల అనంతరం అప్పగింత.. పోలీసుల దెబ్బలకు జమాల్‌ఖాన్ కుడి కాలు మోకాలు, కుడి, ఎడమ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎముకలు విరి గాయి. దీంతో హుటాహుటిన కడపకు తరలించి ఓ ఆర్థోపెడిక్ క్లీని క్కు తీసుకెళ్లి.. జీపు నుంచి కింద పడి గాయపడ్డాడని అక్కడి డాక్టరుకు చెప్పి ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి కృష్ణాజిల్లా నందిగామకు తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న జమాల్ఖాన్ను విజయవాడలోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలిం చి ఆపరేషన్ చేయించి, కట్టు కట్టించారు. నా లుగు రోజుల అనంతరం 16వ తేదీ కుటుంబ సభ్యులను నందిగా మకు పిలిపిం చుకుని జమాల్ఖాన్ను వారికి అప్పగించారు. పోలీసుల వైఖరిపై స్వర్ణకారుల నిరసన దెబ్బలతో విజయవాడ నుంచి 17వ తేదీ రాయచోటికి చేరుకున్న జమాల్‌ఖాన్, అతని కుటుంబ సభ్యులు భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయారు. నోరువిప్పితే మరిన్ని కేసులు నమోదు చేస్తారేమోనని భయాందోళన మధ్య కాలం గడిపారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటికి పొక్కింది. దీంతో ప్రజాసంఘాల నేతలు టి.ఈశ్వర్, రామాంజనేయులు, తాతయ్య తదితరులు బాధితుడి ఇంటికెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. జమాల్ఖాన్ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. పోలీసుల తనను కొట్టిన విధానాన్ని వైద్యులకు జమాల్ వివరించారు. వైద్యులు ఇదే విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. జమాల్‌ఖాన్ ఉదంతం తెలుసుకున్న పట్టణానికి చెందిన పలువురు స్వర్ణకారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసుల దౌర్జన్యంపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులే ఇలా హింసిస్తే మేమెలా బతకాలి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దారుణంగా హింసించి, ఆసుపత్రి పాలు చేస్తే తామెలా బతకాలని జమాల్‌ఖాన్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జమాల్ భార్య నౌజియా, అత్త రమీదా, తండ్రి చాన్ఖాన్ తదితరులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్వర్ణకారుడిగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 12వ తేదీ తీసుకెళ్లి 16వ తేదీ అప్పగించారని.. పోలీసుల దెబ్బలకు జమాల్ మరో 10 నెలల వరకు కోలుకోలేడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని తమ కుటుంబాన్ని అప్పటి వరకు ఎలా పోషించుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. జమాల్‌ను చిత్రహింసలకు గురిచేసిన నందిగామ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్వర్ణకారుల దుకాణాల బంద్
బంగారం వృత్తి వ్యాపారంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం విధించినందుకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా జోగిపేటలో స్వర్ణకారుల దుకాణాలు మూసివేశారు. బంగారంపై సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ కిష్టయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు దుకాణాలను మూసివేత కొనసాగించనున్నట్లు తెలిపారు.