
రిలయన్స్ జ్యూవెల్స్ ఆభర్ కలెక్షన్
హైదరాబాద్ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యూవెల్స్ 12వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఆభర్ పేరిట స్పెషల్ కలెక్షన్‌ను ఆఫర్ చేస్తోంది. దేశ జాతీయ పక్షి పీకాక్ స్ఫూర్తితో ఆభర్ కలెక్షన్‌ను తీర్చిదిద్దామని సంస్థ వెల్లడించింది.ఆభరణాల డిజైన్లు, రంగులు, ప్యాట్రన్స్ పీకాక్ స్ఫూర్తిగా రూపొందించి వాటికి ఆధునిక సొబగులు అద్దామని పేర్కొంది. 22 క్యారట్, 18 క్యారట్ గోల్డ్‌తో వినూత్న డిజైన్లతో ఇయర్ రింగ్స్ కలెక్షన్‌లో కొలువుతీరాయని పేర్కొంది. సెప్టెంబర్ 1 వరకూ గోల్డ్, డైమండ్ జ్యూవెలరీపై మేకింగ్ చార్జీలపై 24 శాతం ఆకర్షణీయ ఆఫర్ అందిస్తున్నట్టు తెలిపింది. 12 సంవత్సరాలుగా తమను ఆదరిస్తున్న కస్టమర్లకు విలువైన సేవలు అందించేందుకు ఆభర్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని రిలయన్స్ జ్యూవెల్స్ ప్రతినిధి పేర్కొన్నారు.