
సాక్షి, హైదరాబాద్ : పండగ సీజన్ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ అద్భుతమైన ఆభరణాల శ్రేణి ఉత్కల కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ సేకరణ ‘ఒడిశా’ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల నుండి ప్రేరణతో రూపొందిందని పేర్కొంది. చోకర్ సెట్ల నుండి చిన్న నెక్లెస్ మరియు పొడవైన పరిపూర్ణమైన మరియు సొగసైన నెక్లెస్ సెట్ల వరకు ఈ కలెక్షన్ ఆకట్టుకుంటుందని ఇవి వివిధ సందర్భాలు, బడ్జెట్లకు అనుగుణంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. 22 క్యారెట్ల బంగారంతో పురాతన, సున్నితమైన సాంప్రదాయ శైలి ఆభరణాలు ఈ కలెక్షన్‌లో అలరిస్తాయని రిలయన్స్ జ్యువెల్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన డైమండ్ సెట్లు పండుగ సందర్భానికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువల్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ధన్‌తేరస్ సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదంగా పరిగణిస్తారు..డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా తయారుచేసి నగిషీలు జోడించబడిన అందమైన సేకరణ ఉత్కలాను అందించడానికి సంతోషిస్తున్నామ’ని అన్నారు. ఉత్కల కలెక్షన్ అక్టోబర్ 17 నుండి దేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువల్స్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment