jewels
-
జ్యువెల్స్ షోలో నటీమణులు సందడి (ఫొటోలు)
-
భండార్ నుంచి స్ట్రాంగ్ రూంకు
పురీ: పురీ జగన్నాథుని ఆలయంలోని అమూల్య వస్తువులు, ఆభరణాల తరలింపు గురువారం పూర్తయింది. రత్న భండార్ లోపలి గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించారు. చెక్క, ఇనుప అల్మారాలు, భోషాణాలు తదితర ఏడింటిలో ఉన్న వీటిని స్ట్రాంగ్ రూంకు మార్చేందుకు ఏడు గంటలు పట్టిందని ఆలయ ప్రధాన అధికారి అరబింద చెప్పారు. అనంతరం రత్న భండార్తోపాటు స్ట్రాంగ్ రూంకు కూడా నిబంధనలను అనుసరించి తాళం, సీల్ వేసి తాళం చెవులను కలెక్టర్‌కు అందజేశామన్నారు.రత్న భండార్ లోపలి భాగంలోని అమూల్య సంపదను తాము పరిశీలించామని సూపర్వైజరీ కమిటీ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. రత్న భండార్‌కు అవసరమైన మరమ్మతులను భారత పురావస్తు శాఖ చేపట్టనుందని, ఆ తర్వాతే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అభరణాలు, ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరీ రాజవంశీకుడు దిబ్య సింఘ దేబ్ వివరించారు. లోపలి చాంబర్ కింద సొరంగం ఉన్నదీ లేదని సర్వేలోనే తేలుతుందన్నారు.అమూల్య వస్తువులు, నగల తరలింపు ప్రక్రియను వీడియోలో చిత్రించినట్టు పురీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు. ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉంటుందని ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాములు పట్టేవాళ్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. రత్నభండార్ లోపల రక్షణగా పాము ఉందన్న వార్తలపై స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు సువేందు మాలిక్ స్పందిస్తూ...అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. -
పూరీలో తెరుచుకున్న.. రత్నభండార్
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు. అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు. తరలింపు మరో రోజున‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది. -
ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో రూ.25 కోట్ల నగలు చోరీ..
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ జంగ్‌పురలోని ఉమ్రావ్ జ్యువెలరీ షాపులో భారీ స్థాయిలో చోరీ జరిగింది. దొంగలు నాల్గవ అంతస్తులో టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడిన దొంగలు నేరుగా లాకర్ రూముకు పెద్ద కన్నం వేసి సుమారు రూ.25 కోట్లు విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదట పకడ్బందీగా రెక్కీ నిర్వహించారని చాలా తెలివిగా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేసి చోరీకి పాల్పడ్డారని అన్నారు. సోమవారం నగల షోరూంకు సెలవని తెలుసుకుని అదేరోజు దొంగతనానికి పాల్పడ్డారన్నారు. దొంగలు నాలుగో అంతస్తు టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడి మొదట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూముకి చేరుకొని లాకర్‌కు పెద్ద రంధ్రం చేసి సుమారు రూ.20-25 కోట్లు విలువ చేసే నగలను దోచుకెళ్లారు. వీటితోపాటు డిస్ప్లేలో ఉంచిన నగలను కూడా ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. ఆదివారం రాత్రి షోరూంకు తాళాలు వేసి వెళ్ళిపోయిన యజమాని మంగళవారం షోరూం తెరిచి చూసే సరికి దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సీసీటీవీ కేబుల్ కట్ చేయక ముందు ఫుటేజీలో రికార్డయినంత వరకు పరిశీలిస్తూ దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు పోలీసులు. సోమవారం హర్యానాలో కూడా ఇదే తరహాలో ఒక దొంగతనం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో గోడకి కన్నం చేసి మొత్తం నగదును, నగలను దోచుకెళ్లారు. రెండు దొంగతనాలు ఒకే తీరుగా జరగడంతో దొంగతనం చేసింది ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. #WATCH | Delhi: "We closed the shop on Sunday and when we opened it on Tuesday after an off on Monday, we saw that there was dust in the whole shop and there was a hole in the wall of the strong room... We think they (thieves) have looted everything... There was jewellery worth… pic.twitter.com/75H9or8Wxe — ANI (@ANI) September 26, 2023 ఇది కూడా చదవండి: సుప్రీంలో కల్వకుంట్ల కవితకు ఊరట -
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్.. ఈ ట్రెండీ లుక్ వెనుక..
మేఘా ఆకాశ్... ‘లై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటికి సోషల్ మీడియాలోనూ తెగ క్రేజ్ ఉంది. సందర్భానికి తగ్గట్టు ట్రెండీ, ట్రెడిషనల్ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాషన్ వరల్డ్‌లో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్‌కి సిగ్నేచర్ అయిన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. మ్యాడర్ మచ్ మ్యాడర్ మచ్ స్థాపకురాలు.. అనితా చంద్రమోహన్. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లోని చేనేత కలెక్షన్స్‌లో ‘మ్యాడర్ మచ్’ డిజైన్స్ ఉండాలన్నది ఆమె లక్ష్యం. సహజ రంగులను ఉపయోగించి, స్థానిక అద్దకం, చేనేత కళాకారులతోనే ఇక్కడి ప్రతి డిజైన్ రూపుదిద్దుకుంటుంది. గులాబీ, ఎరుపు రంగు అద్దకం కోసం ఎక్కువగా ఉపయోగించే మంజిష్ఠ (చెక్క) ఈ బ్రాండ్ ప్రధాన వస్తువు. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఇండియన్ మ్యాడర్ అని పిలుస్తారు. అందుకే, ఈ బ్రాండ్‌కు ‘మ్యాడర్ మచ్’ అని పేరు పెట్టారు. ఇక వీటి డిజైన్, నాణ్యత ఫస్ట్‌క్లాస్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Instagram వి విబితా ఎడ్వర్డ్, విజేతా ఎడ్వర్డ్.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. బటన్ మేకర్స్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే వారికి బటన్ మేకింగ్‌లోని సూక్ష్మ విషయాలు సహా అన్నీ తెలుసు. చెల్లెలు విబితా.. తయారీ లోపంతో తిరస్కరించిన బటన్స్‌తో ఫ్యాషన్ ఉపకరణాలను చేసేది. ఆమె ఆలోచనకు అక్క విజేతా తోడైంది. వెంటనే, 2018లో ‘వి’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. 85 శాతం రీసైక్లింగ్‌కు వచ్చిన బటన్స్నే వాడతారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్, పాలియస్టర్ బటన్స్‌ను ఉపయోగించరు. ఇక వీటి ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఈ జ్యూయెలరినీ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మ్యాడర్ మచ్ ధర: రూ. 35,580 జ్యూయెలరీ బ్రాండ్: వి ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. అందుకే, నా దుస్తుల్లో ఎక్కువగా క్యాజువల్ వేర్స్ ఉంటాయి. నా స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది. – మేఘా ఆకాశ్. ∙దీపిక కొండి -
ఉంగరం ఒంటికి ఆనే చోట చర్మం నల్లగా అవుతోందా?
ఉంగరం లేదా ఆభరణం వంటిది ధరించినప్పుడు... అది అనుకునే చోట కొందరిలో చర్మం రంగు మారుతుంది. ఒక్కోసారి అక్కడ నల్లబారుతుంది. ఇలా రంగు మారడానికి ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య కారణం కావచ్చు. ఉంగరాన్ని «ధరించే మనం స్నానం చేయడంతో ముఖం కడుక్కునే సమయంలో సబ్బు వాడటం వల్ల... దాని తాలూకు డిటెర్జెంట్ ఉపయోగిస్తుంటే దాని మిగిలిపోయిన భాగం (రెసిడ్యూ) ఉంగరం / ఆభరణం వెనక ఉండిపోతుంది. అది చర్మంపై చూపే ప్రతిచర్యతో చర్మం నల్లబారడం లేదా అలర్జీలా రావడం జరగవచ్చు. అంతేకాదు... ఉంగరం లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు చేయాల్సిన పనులు.. ఉంగరాన్ని / ఆభరణాన్ని తీసి, శుభ్రపరచి మళ్లీ ధరించాలి. ఇలా తరచూ శుభ్రం చేసుకుని మళ్లీ తొడుగుతూ ఉండటం మేలు. చేతులు కడుక్కునే సమయంలో ఉంగరం వెనక ఎలాంటి సబ్బుగానీ లేదా రెసిడ్యూగానీ మిగలని విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. లేదా ఉంగరం తీసి కడుక్కుని... వేళ్లు పొడిగా మారాక తొడుక్కోవాలి. ఇతర ఆభరణాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవచ్చు. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నలుపు తగ్గకపోతే... చర్మనిపుణులు సూచించిన మందుల్ని, వారు సూచించినంత కాలం వాడాలి. ఇలాంటి సందర్భాల్లో చర్మం నల్లగా మారిన చోట డాక్టర్ సలహా మేరకు హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాలు లేదా డాక్టర్ నిర్దేశించినంత కాలం వాడాల్సి రావచ్చు. -
నగ మెరిసేనా!
సాక్షి, సిటీబ్యూరో: నిజాం నగలు మన ముంగిటకు రానున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రదర్శిస్తున్న ఆభరణాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అనువైన స్థలం, రక్షణ కల్పిస్తే భాగ్యనగరానికి నగలు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిజాం నగల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు(ఆల్‌టైం) భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం 2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా నిజాం ఆస్తుల లెక్కను తేల్చారు. రూ.218 కోట్లకు కేంద్రం కొనుగోలు ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది, 1967లో ఉస్మాన్ అలీఖాన్ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 465 ముత్యాలు పొందుపర్చిన సత్లాడ.. 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, ఆర్మ్ బ్యాండ్లు, కంకణాలు, గంటలు, బటన్లు, కఫ్ లింక్‌లు, చీలమండలు, వాచ్ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. 184.75 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వజ్రం జాకబ్ డైమండ్ విలువైన వస్తువులలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. ఆభరణాలను తిలకించే సమయంలోనూ కేవలం 50 మందినే అనుమతిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది. నిజాం నగలను హైదరాబాద్‌కు తెప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గతంలో ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. తాజాగా నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నిజాం నగలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన నేపథ్యంలో వీటి తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాటి ప్రదర్శనకు అనువైన స్థలం, భద్రత ఏర్పాట్లను కల్పిస్తే.. నగల తరలింపునకు చొరవ చూపుతామని కిషన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ జ్యువెల్స్ ఉత్కల కలెక్షన్
సాక్షి, హైదరాబాద్ : పండగ సీజన్ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ అద్భుతమైన ఆభరణాల శ్రేణి ఉత్కల కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ సేకరణ ‘ఒడిశా’ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాల నుండి ప్రేరణతో రూపొందిందని పేర్కొంది. చోకర్ సెట్ల నుండి చిన్న నెక్లెస్ మరియు పొడవైన పరిపూర్ణమైన మరియు సొగసైన నెక్లెస్ సెట్ల వరకు ఈ కలెక్షన్ ఆకట్టుకుంటుందని ఇవి వివిధ సందర్భాలు, బడ్జెట్లకు అనుగుణంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. 22 క్యారెట్ల బంగారంతో పురాతన, సున్నితమైన సాంప్రదాయ శైలి ఆభరణాలు ఈ కలెక్షన్లో అలరిస్తాయని రిలయన్స్ జ్యువెల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన డైమండ్ సెట్లు పండుగ సందర్భానికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయని పేర్కొంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువల్స్ ప్రతినిధి మాట్లాడుతూ, “భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ధన్తేరస్ సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదంగా పరిగణిస్తారు..డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా తయారుచేసి నగిషీలు జోడించబడిన అందమైన సేకరణ ఉత్కలాను అందించడానికి సంతోషిస్తున్నామ’ని అన్నారు. ఉత్కల కలెక్షన్ అక్టోబర్ 17 నుండి దేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువల్స్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. -
నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు
సాక్షి, బెంగళూరు: వేలాది కోట్ల రూపాయల మేర డిపాజిటర్లకు ఎగనామం పెట్టి పరారీ అయిన బెంగళూరులోని ఐఎంఏ జువెలర్స్ గ్రూప్ అధినేత మహమ్మద్ మన్సూర్ ఖాన్ ఆదివారం ఒక సంచలనాత్మక వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని చెబుతూ ఐఎంఏ కుంభకోణంలో కొందరు రాజకీయ నేతల హస్తం కూడా ఉందని వారి పేర్లను బయటపెట్టడంతో ఈ కేసు మరింత క్లిష్టమయ్యేలా ఉంది. దుబాయ్ నుం చి వీడియో విడుదల చేసినట్లు భావిస్తున్నారు. తన సంస్థను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు రాజకీయ నేతలు, వ్యాపారులకు కృతజ్ఞతలు అని వ్యంగ్యంగా అన్నారు. రాజ్యసభ మాజీ ఎంపీ రహమాన్ ఖాన్, మహమ్మద్ ఉబేదుల్లా షరీఫ్, పాస్‌బన్ పత్రిక ఎడిటర్ షరీఫ్, ముక్తార్ అహ్మద్, జేడీఎస్ ఎమ్మెల్సీ శరవణ, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఫైరోజ్ అబ్దుల్లా, ప్రెస్టీజ్ గ్రూప్ ఇర్ఫాన్‌లు కలసి తనను ముగించేందుకు పక్కా ప్రణాళికలు వేశారని, అలాగే ఐఎంఏను ముగించే విషయంలో వీరంతా సఫలీకృతులయ్యారని ఆరోపించారు. ఐఎంఏ కంపెనీ ఎవరినీ మోసం చేయలేదని, 13 ఏళ్లలో ఐఎంఏ 12 వేల కోట్ల రూపాయల లాభాలను పెట్టుబడిదారులకు అందించినట్లు తెలిపాడు. సాయం చేయండి కమిషనర్ రాజకీయ నేతలు, పెట్టుబడిదారులు తన మెడపై వచ్చి కూర్చొన్నారని, ఇలాంటి సమయంలో కుటుంబాన్ని వదిలేసి పరారీ కావాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నెల 24న బెంగళూరుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నానని, కానీ తన పాస్‌పోర్టు, టికెట్‌ను అధికారులు సీజ్ చేశారన్నారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఐఎంఏ స్కామ్‌లో అసలు నిజాలను తాను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, భారత్‌కు వచ్చేందుకు అలోక్ కుమార్ సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాణహాని ఉంది తాను భారతదేశానికి రావాలంటే భయంగా ఉందని, తనకు ప్రాణహాని ఉందని, పోలీసు కస్టడీలోనే తనను అంతమొందించేందుకు కొందరు ప్లాన్లు వేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబాన్ని, బెంగళూరును వదిలి వచ్చినట్లు తెలిపాడు. ఒకవేళ ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించినా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను తప్పు చేశానని అంటే తన వెనుక అనేక మంది ఉన్నారని, వారికి కూడా శిక్ష పడాలని చెప్పారు. తాను ఇండియా వస్తే అంతమొందించే ప్రమాదముందని అన్నారు. ఆ మాటల్ని అంగీకరించలేం: సిట్ మన్సూర్ ఖాన్ విడుదల చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకోలేమని సిట్ అధికారి ఎస్. గిరీశ్ తెలిపారు. వీడియో గురించి ఆయన మీడియాతో స్పందిస్తూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నిందితుడు చెప్పిన విషయాలను అంగీకరించేది లేదని అన్నారు. నిందితుడు ఎవరెవరి మీద ఆరోపణలు చేసినా, వాస్తవాలు విచారణలో మాత్రమే తెలుస్తాయని చెప్పారు. మన్సూర్ఖాన్ ఐఎంఏ కేసులో ప్రధాన నిందితుడని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, అంతేకాకుండా రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఆయన స్వదేశానికి వస్తే రక్షణ కల్పిస్తామని గిరీశ్ తెలిపారు. -
తూతూమంత్రంగా శ్రీవారి ఆభరణాల తనిఖీ
-
తిరుమలేశుని ఆభరణాల లెక్కింపు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆభరణాలు టీటీడీ లెక్కింపు ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. ప్రతియేటా రెండుమార్లు తిరుమలేశుని ఆభరణ సంపత్తిని లెక్కించటం సంప్రదాయం. ఇందులో భాగంగా మూలమూర్తి అలంకరణకు వాడే 120 రకాల ఆభరణాలు, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారి అలంకరణకు వాడే 350 రకాల ఆభరణాలు పరిశీలించారు. గతంలోశ్రీవారి ఆభరణాల భద్రత విషయంలో వచ్చిన ఆరోపణలతో టీటీడీలోని 19 తిరువాభరణాల జాబితాలోని అన్ని ఆభరణాలను డిజిటలైజేషన్ చేసి, ప్రత్యేకంగా ఆర్ఎఫ్ఐడీ ట్యాగులు వేశారు. ఆమేరకు టీటీడీలోని అధికారుల బృందం వారం రోజులుగా ఆలయంలోని వైకుంఠ ద్వారం ఉన్న జెమాలజీ ల్యాబ్‌లో ఆభరణాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆభరణాల లెక్కింపు ప్రక్రియను శనివా రం ముగించారు. జాబితా ప్రకారం అన్ని ఉన్నట్టు తేల్చారు. -
రాఖీ కట్టించుకుందామని పక్క ఊరెళ్లే సరికి..
నిజామాబాద్: రాఖీ కట్టించుకుందామని యజమాని తన కుటుంబసభ్యులతో కలిసి పక్క ఊరిలో ఉన్న బంధువుల దగ్గరికెళ్లి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి చోరీ చోటుచేసుకుంది. సంతోష్ కుమార్ రాఖీ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఆదివారం మధ్యాహ్నం వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూసేసరికి.. కిటికీలు తొలగించి ఇంట్లో ఉన్న 3.7 తులాల బంగారం, రూ.6000 నగదును దుండగులు దోచుకెళ్లారని గమనించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గాజుల కలెక్షన్స్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జుయెల్స్
-
నిజంగానే ‘జ్యువెల్’
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న సింగపూర్ చాంగీ విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ డిజైన్ ఇది. భవిష్యత్తు టెర్మినల్‌గా నిపుణులు అభివర్ణిస్తున్న ఈ ‘జ్యువెల్’ టెర్మినల్ నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. పది అంతస్తుల అద్దాల టెర్మినల్‌లో 5 అంతస్తులు భూగర్భంలో ఉంటాయి. మధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ వాటర్‌ఫాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ఎత్తు 130 అడుగులు. రాత్రి సమయంలో ఇది రెయిన్బో తరహాలో రంగుల్లో మెరిసిపోతుందట.. ఇక లోపల ఏ మూల చూసినా ప్రకృతి పరుచుకున్నట్లు కనిపిస్తుంది. భారీ వృక్షాలు, మొక్కలతో అత్యద్భుతమైన పార్కును ఏర్పాటు చేస్తున్నారు. బస నిమిత్తం 130 గదుల హోటల్ కూడా ఉంది. ఇంకా అనేక అత్యాధునిక సదుపాయాలుంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. 2018లో ఈ టెర్మినల్ ప్రారంభమవుతుంది. -
పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం. గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా... పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..! వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి. గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు. దుస్తులకు తగిన ఎంపిక: డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి. సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి లాకెట్లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది. తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్. తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి. తీగ చివరల్లో రౌండ్నోస్ ప్లైర్తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి. ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు. ఎప్పటికీ...: సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే... ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు. సుధా రెడ్డి ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్ www.facebook.com/jewelpatterns మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల -
దోపిడీ దొంగల బీభత్సం
55 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.20 వేల నగదు, సెల్ఫోన్లు చోరీ చివ్వెంల, న్యూస్‌లైన్: దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఇంట్లో మగవారిని బంధించి, తాము నక్సలైట్లమని బెదిరించి 55 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ. 20వేల నగదు అపహరించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధి దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేటలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామ శివారులో నివాసం ఉంటున్న ఎండీ ఖాజాఆప్‌ఖాన్ ఎఫ్‌సీఐలో యూడీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం అతడి పెద్ద కూతురు ఫర్హీన్ జన్మదిన వేడు కలు జరిగాయి. తర్వాత బంధువులు హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు ఇంటి గడియ వేసి నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి ఐదుగురు దుండగులు బండరాయితో తలుపులు పగులగొట్టి ఇంట్లో జొరబడ్డారు. సెల్ఫోన్లు లాక్కు న్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఉండగా, మరో ముగ్గురు తమ దుస్తులను నడుముకు చుట్టుకుని వాటిల్లో చెప్పులు, కత్తులు, సెల్ఫోన్లు ఉంచారు. ఖాజాఆప్‌ఖాన్, అల్లుడు మజీద్ చేతులను నిర్బంధించారు. చోరీకి సహకరిస్తే ఎవరిని ఏమీ చేయకుండా వెళ్తామని, లేదంటే అందరినీ చంపేస్తామని మహిళలను బెదిరించి ఖాజా భార్య మైరున్నీసావద్ద ఉన్న తాళాలు లాక్కొని బీరువా తెరిచారు. అందులో 55 తులాల బంగారం, 40తులాల వెండి ఆభరణాలున్న బాక్సును, బయట ఉన్న రూ. 20వేల నగదు, ఐదు సెల్ఫోన్లు తీసుకుని వెళ్లారు. కాగా, దొంగలు వెళ్లిపోయిన అరగంట తర్వాత ఇంట్లోని వారంతా అద్దెకు ఉంటున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వారి సెల్‌ఫోన్ నుంచి బంధువులకు సమాచారమివ్వగా, గ్రామస్తులు, పోలీసులతో కలసి ఘటనాస్థలికి చేరుకున్నారు. దొంగలు సగం తెలుగు, సగం తమిళం మాట్లాడుతున్నారని, అంతా నలుపు రంగులో ఉన్నారని బాధితులు తెలిపారు. దోపిడీ జరిగిన ఇంటిని మంగళవారం ఎస్పీ టి.ప్రభాకర్‌రావు సందర్శించి పరిశీలించారు.