నిజంగానే ‘జ్యువెల్’ | Singapore's Jewel Changi Airport will boast largest indoor waterfall | Sakshi
Sakshi News home page

నిజంగానే ‘జ్యువెల్’

Published Thu, Dec 11 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

నిజంగానే ‘జ్యువెల్’

నిజంగానే ‘జ్యువెల్’

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా పేరుతెచ్చుకున్న సింగపూర్ చాంగీ విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ డిజైన్ ఇది. భవిష్యత్తు టెర్మినల్‌గా నిపుణులు అభివర్ణిస్తున్న ఈ ‘జ్యువెల్’ టెర్మినల్ నిర్మాణానికి రూ.7 వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. పది అంతస్తుల అద్దాల టెర్మినల్‌లో 5 అంతస్తులు భూగర్భంలో ఉంటాయి. మధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇండోర్ వాటర్‌ఫాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

దీని ఎత్తు 130 అడుగులు. రాత్రి సమయంలో ఇది రెయిన్‌బో తరహాలో రంగుల్లో మెరిసిపోతుందట.. ఇక లోపల ఏ మూల చూసినా ప్రకృతి పరుచుకున్నట్లు కనిపిస్తుంది. భారీ వృక్షాలు, మొక్కలతో అత్యద్భుతమైన పార్కును ఏర్పాటు చేస్తున్నారు. బస నిమిత్తం 130 గదుల హోటల్ కూడా ఉంది. ఇంకా అనేక అత్యాధునిక సదుపాయాలుంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. 2018లో ఈ టెర్మినల్ ప్రారంభమవుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement