ఉంగరం లేదా ఆభరణం వంటిది ధరించినప్పుడు... అది అనుకునే చోట కొందరిలో చర్మం రంగు మారుతుంది. ఒక్కోసారి అక్కడ నల్లబారుతుంది. ఇలా రంగు మారడానికి ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య కారణం కావచ్చు. ఉంగరాన్ని «ధరించే మనం స్నానం చేయడంతో ముఖం కడుక్కునే సమయంలో సబ్బు వాడటం వల్ల... దాని తాలూకు డిటెర్జెంట్ ఉపయోగిస్తుంటే దాని మిగిలిపోయిన భాగం (రెసిడ్యూ) ఉంగరం / ఆభరణం వెనక ఉండిపోతుంది. అది చర్మంపై చూపే ప్రతిచర్యతో చర్మం నల్లబారడం లేదా అలర్జీలా రావడం జరగవచ్చు. అంతేకాదు... ఉంగరం లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది.
ఇలా జరిగినప్పుడు చేయాల్సిన పనులు..
- ఉంగరాన్ని / ఆభరణాన్ని తీసి, శుభ్రపరచి మళ్లీ ధరించాలి. ఇలా తరచూ శుభ్రం చేసుకుని మళ్లీ తొడుగుతూ ఉండటం మేలు.
- చేతులు కడుక్కునే సమయంలో ఉంగరం వెనక ఎలాంటి సబ్బుగానీ లేదా రెసిడ్యూగానీ మిగలని విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. లేదా ఉంగరం తీసి కడుక్కుని... వేళ్లు పొడిగా మారాక తొడుక్కోవాలి. ఇతర ఆభరణాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవచ్చు.
- ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు.
- ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నలుపు తగ్గకపోతే... చర్మనిపుణులు సూచించిన మందుల్ని, వారు సూచించినంత కాలం వాడాలి. ఇలాంటి సందర్భాల్లో చర్మం నల్లగా మారిన చోట డాక్టర్ సలహా మేరకు హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాలు లేదా డాక్టర్ నిర్దేశించినంత కాలం వాడాల్సి రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment