
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్‌కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్‌బీఐ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌సీఎల్‌టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment