debt default
-
మీనా జ్యుయలర్స్‌పై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్‌కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్బీఐ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్సీఎల్టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్బీఐ తెలిపింది. -
ఆర్బీఐని సర్కారు ఎందుకు ఆదేశించదు?
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను, ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొడుతున్నవారి పేర్లను బయటపెట్టాల్సిందిగా ఆర్బీఐని కేంద్రం ఆదేశించాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా కోరితే ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు 2015లోనే ఆర్బీఐని ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా సింఘ్వీ మాట్లాడుతూ ఎవరి పేర్లను దాచాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోందనీ, ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతోందని ప్రశ్నించారు. వివరాలు వెల్లడించాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున వెంటనే కేంద్రం ఆ పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
తనఖాల్లేకుండా వేల కోట్ల రుణాలా?
చెన్నై: కార్పొరేట్ కంపెనీల రుణ ఎగవేతల విషయంలో బ్యాంకుల ఉదాసీనతపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలను ఎలా మంజూరు చేశారంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను నిగ్గదీసింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు రూ.820 కోట్ల రుణాలను ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ రుణ ఎగవేత స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీచేసిన కనిష్క్ గోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ ఆదేశాలను కొట్టివేయాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన రుణ రికవరీ చర్యల్లో భాగంగా ఎస్బీఐ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. అధికారులెవరూ తప్పించుకోలేరు... కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్. మహదేవన్ బ్యాంకు తరఫు న్యాయవాదులను తూర్పారబట్టారు. ‘ఇదంతా ప్రజల సొమ్ము. ఒకపక్క ప్రజలేమో విద్య, వ్యవసాయ రుణాల కోసం తనఖాలు పెట్టికూడా బ్యాంకులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క బ్యాంకులు మాత్రం సరైన తనఖాల్లేకుండానే ఇష్టానుసారంగా కంపెనీలకు వేల కోట్ల రుణాలిచ్చేస్తున్నాయి. సర్ఫేసి చట్టం ప్రకారం అధికారులెవరూ తప్పించుకోలేరు. వారికి కొమ్ము కాయొద్దు. ఈ స్కామ్‌తో ప్రమేయం ఉన్న బ్యాంక్ ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేసేవిధంగా ఆదేశిస్తాం. ఈ కేసులో మేమిచ్చే తీర్పు దేశవ్యాప్తంగా ఒక గీటురాయిగా మారుతుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘అసలు ఈ సంస్థకు రుణాలిచ్చేముందు బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారా? మంజూరు చేసిన మొత్తం రుణం ఎంత? దీనికి ప్రతిగా కంపెనీ తనఖాగా పెట్టిన ఆస్తుల విలువ ఎంత? అంటూ జడ్జి ప్రశ్నలు సంధించారు. కాగా, ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అధికారుల వివరాలను సేకరించాలని, తగిన దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలంటూ ఈడీ న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇది ఎన్పీఏ కేసు మాత్రమే కాదు... కనిష్క్ గోల్డ్ తప్పుడు పత్రాలను సమర్పించి రుణాలను పొందిందని, అదేవిధంగా ఈ నిధులను పక్కదారి పట్టించారని కూడా ఈడీ తన కౌంటర్లో పేర్కొంది. మొత్తంమీద ఈ మోసంలో బ్యాంకులకు రూ.824 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అయితే, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న స్థిరాస్తుల విలువ రూ.158.65 కోట్లేనని కూడా ఈడీ వివరించింది. రుణం మంజూరు సమయంలో బ్యాంకు అధికారులు తగిన పరిశీలన జరపలేదని స్పష్టం చేసింది. ‘ఇది మొండిబకాయి(ఎన్పీఏ) కేసు మాత్రమే కాదు. రుణ గ్రహీత(కనిష్క్ గోల్డ్)తో పాటు బ్యాంకుల కన్సార్షియంకు చెందిన అధికారుల ప్రమేయంతో నేరపూరిత కుట్ర, మోసం కూడా ఇందులో ఉంది’ అని ఈడీ వాదించింది. ఈ స్కామ్‌కు సంబంధించి కనిష్క్ గోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన భూపేష్ కుమార్‌జైన్‌ను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఈడీ డైరెక్టర్ కూడా మనీలాండరింగ్ చట్టం కింద కనిష్క్ గోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశించారు. ప్రజల సొమ్ము రికవరీ ప్రయత్నాలకు ఈడీ ఆదేశాలు గండికొడతాయని, దీన్ని కొట్టేయాలంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. -
ఆగస్టు 27న కోర్టుకు రండి
ముంబై: ఆగస్టు 27వ తేదీన తమ ముందు హాజరుకావాలని మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిల ఎగవేత కేసులో ఈడీ విజ్ఞప్తి మేరకు.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద కోర్టు సమన్లు జారీ చేసింది. గడువు తేదీలోగా మాల్యా హాజరుకాకపోతే అతన్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో పాటు.. అతనికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇటీవల మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌తో పాటు.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ఈ నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న రుణ ఎగవేతదారులపై చర్యల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద ఒకరిపై చర్యలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. పరారీలోని వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. మాల్యాకు చెందిన రూ. 12,500 కోట్ల ఆస్తుల్ని తక్షణం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టును ఈడీ కోరింది. రెండు నాన్‌బెయిలబుల్ వారంట్లు రుణం ఎగవేత కేసుల్లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఇంతకుముందే కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, అతని కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ కలిపి ప్రస్తుతం రూ. 9,990.07 కోట్లకు చేరింది. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల విషయమై మాల్యా స్పందిస్తూ.. బ్యాంకు రుణం ఎగవేత ఘటనలకు తాను ప్రచారకర్తగా మారిపోయాననడం తెల్సిందే. తన వాదనను వివరిస్తూ 2016 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి లేఖ రాసినా స్పందించలేదని, ప్రభుత్వం అనుమతిస్తే ఆస్తుల్ని అమ్మి రుణాలు చెల్లిస్తానని చెప్పారు. మాల్యా రీట్వీట్‌పై బీజేపీ విమర్శలు న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ట్వీట్‌ను విజయ్ మాల్యా రీపోస్టు చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మహాకూటమికి మోసగా డు మద్దతు తెలిపాడంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో మాల్యా ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాడని, అతను చేసిన రీట్వీట్ దానిని ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందాడని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై మోదీ ప్రభుత్వ హామీల్ని తప్పుపడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ట్వీట్‌ను ఇటీవల మాల్యా రీట్వీట్ చేయడం గమనార్హం. -
అవినీతి ఉచ్చులో మరో బ్యాంకరు
పుణె: కార్పొరేట్ కంపెనీల రుణాల ఎగవేత కుంభకోణంలో ప్రభుత్వ రంగ బ్యాంకర్ల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా డీఎస్ కులకర్ణి గ్రూప్ డిఫాల్ట్ కేసుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎండీ, సీఈవో రవీంద్ర మరాఠేతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తాను పుణెలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) అరెస్ట్ చేసింది. బ్యాంకు మాజీ సీఎండీ సుశీల్ మునోత్‌ను కూడా అదుపులోకి తీసుకుంది. డీఎస్కే గ్రూప్‌తో కుమ్మక్కైన బీవోఎం అధికారులు మోసపూరిత లావాదేవీల ద్వారా రుణాలిచ్చారని ఆరోపణలున్నాయి. బ్యాంకు సిబ్బంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రుణాల కింద మంజూరు చేసిన నిధులు దారి మళ్లాయని ఈవోడబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 3,000 కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర తదితర అభియోగాలపై ఈవోడబ్ల్యూ అరెస్ట్ చేసింది. సుమారు రూ.2,892 కోట్ల బ్యాంకు రుణాల నిధులను మళ్లించడం, 4,000 మంది పైచిలుకు ఇన్వెస్టర్లను రూ. 1,154 కోట్ల మేర మోసగించడం తదితర ఆరోపణలపై బిల్డరు డీఎస్ కులకర్ణి, ఆయన భార్య హేమంతి ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత, మాజీ అధికారులతో పాటు డీఎస్కే గ్రూప్‌కి చెందిన మరో ఇద్దరిని కూడా ఈవోడబ్ల్యూ అదుపులోకి తీసుకుంది. ఇందులో చార్టర్డ్ అకౌంటెంట్ సునీల్ ఘట్పాండే, ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద్ దేశ్‌పాండే ఉన్నారు. ఇన్వెస్టర్లను మోసగించినందుకు కులకర్ణి, ఆయన భార్యతో పాటు డీఎస్కే గ్రూప్‌లోని ఇతర కీలక అధికారులకు చెందిన 124 ప్రాపర్టీలు, 276 బ్యాంకు ఖాతాలు, 46 వాహనాలు జప్తు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. -
‘గీతాంజలి’ భూములు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: రుణ ఎగవేతదారు నీరవ్ మోదీకి చెందిన సంస్థ గీతాంజలి జెమ్స్‌కు కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మొత్తంగా గీతాంజలి జెమ్స్‌కు 190 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో కట్టబెట్టారని, అందులో 95 ఎకరాలకు సేల్ డీడ్ అయిందని, మరో 95 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించని సంస్థల నుంచి 1,035 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఎంఎస్ ప్రభాకర్, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్రంలో 16 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నామని, ఇందులో ఇప్పటికే 8 వేల ఎకరాల సేకరణ పూర్తయిందని చెప్పారు. 2005–06 తర్వాత రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక పార్కు లు రాలేదని గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద జౌళి పార్కును సీఎం కేసీఆర్ చేతుల మీ దుగా ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, డ్రైపోర్టును ఎక్క డ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. చందన్వెల్లిలో టెక్స్టైల్స్ కంపె నీలు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రం నలువైపులా ఐటీని విస్తరించాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. రహేజా మైండ్ స్పేస్‌లోనే 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని పేర్కొ న్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. -
ఎగవేతదారులకు ‘బొమ్మ’ పడుద్ది..!
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు పెరుగుతుండటంతో వాటికి కళ్లెం వేసే దిశగా సంబంధిత ఖాతాదారుల ఫొటోలను పత్రికల్లో ప్రచురించడం ద్వారా దారికి వచ్చేలా చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘నేమ్ అండ్ షేమ్’ కార్యక్రమం కింద ఎగవేతదారుల ఫొటోలను ప్రచురించేందుకు బోర్డుల అనుమతి తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖలో సూచించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించి బోర్డు అనుమతి పొందాలని కోరింది. చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నప్పుటికీ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని ఖాతాల సంఖ్య గత డిసెంబర్ నాటికి 9,063కు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల మొత్తం రూ.1,10,050 కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఇటీవలే లోక్‌సభకు వెల్లడించారు. నీరవ్ మోదీ స్కామ్ నేపథ్యంలో రూ.50 కోట్లకు మించి రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్ట్ వివరాలను సమీకరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రం ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. పారదర్శక, బాధ్యతాయుత బ్యాంకింగ్ అన్నది తమ తదుపరి లక్ష్యమని, పాస్‌పోర్ట్ వివరాలు తీసుకోవడం ద్వారా మోసం బయటపడితే సత్వరమే చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఈ చర్య వెనుక ఉద్దేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. -
భవిష్యత్తు కార్యాచరణపై బ్యాంకర్లు భేటీ
12 కేసుల్లో చర్యలపై సమాలోచనలు ముంబై: ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా 12 భారీ రుణ ఎగవేత సంస్థలపై చర్యల విషయంలో అనుసరించాల్సిన కార్యాచరణను ఖరారు చేసేందుకు బ్యాంకులు సోమవారం సమావేశమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ అధికార వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఆర్బీఐ గుర్తించిన 12 ఖాతాల్లో కొన్నింటిపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించడానికి ముందు కార్యాచరణను ఖరారు చేసేందుకు బ్యాంకులు సమావేశం నిర్వహించాయి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలకు ఆర్బీఐ గుర్తించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నాయి. వీటిలో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ఎస్సార్ స్టీల్, ల్యాంకో ఇన్ఫ్రా తదితర కేసుల్లో భవిష్యత్తు కార్యాచరణపై ఈ రోజు బ్యాంకులు చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంస్థలపై నెలలోపు ఎన్సీఎల్టీలో కేసులు దాఖలు చేయాలని ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. -
మాల్యా అరెస్టు కోసం కోర్టుకు ఎస్బీఐ
బెంగళూరు:కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత వివాదంలో దాని ప్రమోటరు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా అరెస్టుకు ఆదేశించాలంటూ ఎస్బీఐ శుక్రవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. కుటుంబంతో పాటు బ్రిటన్‌కు వెడుతున్నట్లు మాల్యా ఇటీవలే చేసిన ప్రకటన ప్రాతిపదికగా, ఆయన పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని పిటీషన్లో పేర్కొన్నట్లు ఎస్బీఐ తరఫు న్యాయవాది వివరించారు. దీంతో మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో (కేఎఫ్ఏ) పాటు మరో 9 మంది ప్రతివాదులకు నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశించింది. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు కేఎఫ్ఏ రూ.7,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. రిలయన్సే పెద్ద డిఫాల్టరు .. మరోవైపు, మాల్యా అరెస్టు కోరుతూ ఎస్బీఐ వేసిన నాలుగు పిటీషన్లలో ఒకదానిపై విచారణ చేపట్టిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ).. ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. రిలయన్స్ వంటి భారీ ఎగవేతదారులతో పోలిస్తే మాల్యా చిన్న డిఫాల్టరేనని డీఆర్టీ ముందు ఆయన తరఫు న్యాయవాది ఉదయ్ హోలా వాదించారు. మాల్యా రాజ్యసభ సభ్యుడు అయినందువల్ల ఆయన్ను అరెస్టు చేస్తే పెద్దల సభ ప్రతిష్టను దెబ్బతీసినట్లే అవుతుందని పేర్కొన్నారు. -
మాల్యాను అరెస్ట్ చేయాలి
డీఆర్టీకి ఎస్బీఐ పిటిషన్ ముంబై: రుణాల ఎగవేతకు గాను వ్యాపారవేత్త, యూబీ గ్రూప్ ప్రమోటరు విజయ్ మాల్యా అరెస్టును కోరుతూ ఎస్బీఐ.. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను (డీఆర్టీ) ఆశ్రయించింది. అలాగే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని, డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని కోరింది. ఈ మేరకు బెంగళూరులోని డీఆర్టీకి ఎస్బీఐ 4 పిటిషన్లు సమర్పించినట్లు ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటరు మాల్యా.. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 7,800 కోట్లు బకాయిపడటం తెలిసిందే. యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినందుకు డియాజియో నుంచి 75 మిలియన్ డాలర్లు పొంది, లండన్‌లో స్థిరపడాలని మాల్యా నిర్ణయించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.