
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను, ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొడుతున్నవారి పేర్లను బయటపెట్టాల్సిందిగా ఆర్‌బీఐని కేంద్రం ఆదేశించాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా కోరితే ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు 2015లోనే ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా సింఘ్వీ మాట్లాడుతూ ఎవరి పేర్లను దాచాలని ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందనీ, ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతోందని ప్రశ్నించారు. వివరాలు వెల్లడించాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున వెంటనే కేంద్రం ఆ పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment