రూ.2000 నోట్లను మార్చుకున్నారా? లేదంటే ఇప్పుడే ఆ పని చేయండి. ఎందుకంటే నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ విధించిన గడువు నేటితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. ఈ రోజు దాటితే మీ వద్ద ఉన్న 2వేల నోట్లు ఎందుకు పనికి రావు. ఆర్‌బీఐ సైతం నోట్ల ఎక్ఛేంజ్ గడుపు పెంచడం లేదని స్పష్టత ఇచ్చింది.
ఈ ఏడాది మే 19వ తేదీన భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు 2వేల నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే 23వ తేదీ నుండి 2వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది.ఈ నోట్ల మార్పిడికి చివరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చింది.
రూ.2,000 మార్పిడి.. ఆర్‌బీఐ స్పష్టత
ఆ గడువును ఆర్‌బీఐ మరింత పొడిగిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ తరుణంలో ఆర్‌బీఐ రూ.2,000 మార్పిడిపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2023లోగా మార్చుకోవాలని సూచించింది. నోట్ల ఎక్ఛేంజ్ కోసం గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపింది. కాబట్టే, మీ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే ఈ శనివారం లోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.
93 శాతం వరకు
రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మే నుంచి గత ఆగస్టు నెల వరకు మొత్తం 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమైనట్లు తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది.
రూ.2,000 ఎక్కడ మార్చుకోవచ్చు
ప్రజలు తమ రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖలు, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బ్యాంకు అకౌంట్ లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పిచ్చింది.
వినియోగంలోకి రూ.2,000 నోట్లు
ఆర్‌బీఐ రూ.2000 నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఆ సమయంలో చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment