exchange notes
-
రూ.2,000 నోట్లు 98 శాతం వెనక్కి
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లు 98 శాతం బ్యాంకుల్లోకి తిరిగొచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటికీ రూ.6,970 కోట్ల విలువ చేసే నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్టు తెలిపింది. రూ.2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న ప్రకటించడం గమనార్హం. ‘‘అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా, 2024 అక్టోబర్ 31 నాటికి రూ.6,970 కోట్లకు తగ్గాయి. అంటే 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లతో 98.04% వెనక్కి వచ్చాయి’’అని ఆర్బీఐ తెలిపింది. అన్ని బ్యాంకు శాఖల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్‌కు, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించడం తెలిసిందే. 2023 అక్టోబర్ 7 వరకు ఇందుకు అనుమతించింది. ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసులలో రూ.2,000 నోట్ల మార్పిడి సదుపాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తమ బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు రూ.2,000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుకు ఇండియా పోస్ట్ ద్వారా పంపుకునేందుకు వీలుంది. హైదరాబాద్ ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులోనూ ఈ సదుపాయం ఉంది. -
రూ. 2,000 వేల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు!
రూ.2000 నోట్లను మార్చుకున్నారా? లేదంటే ఇప్పుడే ఆ పని చేయండి. ఎందుకంటే నోట్ల మార్పిడికి ఆర్బీఐ విధించిన గడువు నేటితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. ఈ రోజు దాటితే మీ వద్ద ఉన్న 2వేల నోట్లు ఎందుకు పనికి రావు. ఆర్బీఐ సైతం నోట్ల ఎక్ఛేంజ్ గడుపు పెంచడం లేదని స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది మే 19వ తేదీన భారతీయ కరెన్సీలో అతిపెద్ద నోటు 2వేల నోటును రద్దు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. మే 23వ తేదీ నుండి 2వేల నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది.ఈ నోట్ల మార్పిడికి చివరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చింది. రూ.2,000 మార్పిడి.. ఆర్బీఐ స్పష్టత ఆ గడువును ఆర్బీఐ మరింత పొడిగిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ తరుణంలో ఆర్బీఐ రూ.2,000 మార్పిడిపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2023లోగా మార్చుకోవాలని సూచించింది. నోట్ల ఎక్ఛేంజ్ కోసం గడువు పొడిగించే అవకాశం లేదని తెలిపింది. కాబట్టే, మీ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే ఈ శనివారం లోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. 93 శాతం వరకు రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మే నుంచి గత ఆగస్టు నెల వరకు మొత్తం 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమైనట్లు తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు. ఇంకా రూ.24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. రూ.2,000 ఎక్కడ మార్చుకోవచ్చు ప్రజలు తమ రూ.2,000 నోట్లను బ్యాంకు శాఖలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బ్యాంకు అకౌంట్ లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు రూ. 2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పిచ్చింది. వినియోగంలోకి రూ.2,000 నోట్లు ఆర్బీఐ రూ.2000 నోటును నవంబర్ 2016లో ప్రవేశపెట్టబడింది. ప్రాథమికంగా ఆ సమయంలో చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. -
చిరిగిన కరెన్సీ నోట్లను ఫ్రీగా మార్చుకోవడం ఎలా? ఆర్బీఐ రూల్స్ ఇలా..
సాధారణంగా మనం అప్పుడప్పుడు చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తూ ఉంటాము. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు. కానీ ఎలాంటి కమీషన్ ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా సులభంగా మార్చుకోవచ్చనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రూ. 5000 మించి ఉండకూడదు. ఒక పరిమితిలో (తక్కువ డ్యామేజ్) పాడైన నోట్లకు ఆ విలువకు సమానమైన డబ్బు లభిస్తుంది. డ్యామేజ్ ఎక్కువగా జరిగిన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా తిరిగి చెల్లిస్తుంది. ఒకవేళా మీ దగ్గర చిరిగిన నోట్లు ఎక్కువగా ఉంటే బ్యాంకు వెంటనే మార్పిడి చేయదు, మొదట ఆ నోట్లను స్వీకరించి.. తరువాత మీ ఖాతాలో జమ చేస్తుంది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! ఇవి తప్పనిసరి.. చిరిగిన కరెన్సీ నోట్ల మీద సీరియల్ నెంబర్, మహాత్మా గాంధీ మార్క్, గవర్నర్ సంతకం వంటి గుర్తులు ఉంటే వాటిని బ్యాంకులు మార్చడానికి అంగీకరిస్తాయి. ఎక్కడైతే మీ దగ్గరున్న చిరిగిన నోట్లను మార్చాలనుకుంటారో అక్కడ ఖచ్చితంగా అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకోవాలంటే దానికి సమానమైన మొత్తం లభించకపోవచ్చు. ఉదాహరణకు సుమారు 78 చదరపు సెం.మీ బాగున్న రూ. 500 నోటుకు దానికి సమానమైన డబ్బు ఇస్తారు. ఒకవేళా 39 చదరపు సెం.మీ పాడైపోయి ఉంటే దానికి కేవలం సగం డబ్బు లభిస్తుంది. ఇదే నియమం ఇతర నోట్లకు కూడా వర్తిస్తుంది. అయితే ఉద్దేశ్యపూర్వకంగా కట్ చేసిన నోట్లను బ్యాంక్ తీసుకునే అవకాశం ఉండదు. దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
2,000 నోట్లను ఇలా వాడేస్తున్నారట!
న్యూఢిల్లీ: కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన తర్వాత ప్రజలకు తమ రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకోడానికి- ఇంధనం, ఆభరణాలు, రోజువారీ కిరాణా వస్తువుల కొనుగోళ్లు మొదటి మూడు ప్రాధాన్యతలుగా ఉన్నట్లు లొకేషన్ బేస్డ్ సోషల్ నెట్వర్క్ పబ్లిక్ యాప్ నిర్వహించిన ఒక దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) 55 శాతం మంది ప్రజలు తమ కరెన్సీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, 23 శాతం మంది వాటిని ఖర్చు చేయడానికి, 22 శాతం మంది మార్చుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది. మే 19వ తేదీన వ్యవస్థలో ఉన్న రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ దాదాపు సగం పెద్ద నోట్లు వెనక్కు వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ గత వారం పాలసీ సమీక్ష నిర్ణయాల సందర్భంగా తెలిపారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఆయన తెలిపిన సమాచారం ప్రకారం 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్లు వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇందులో ఇప్పటికి రూ.1.80 లక్షల కోట్లు వెనక్కు వచ్చేశాయి. వీటిలో 85 శాతం డిపాజిట్ల ద్వారానే వెనక్కు వచ్చాయన్నారు. రూ.500 నోట్లు వెనక్కు తీసుకోవాలన్న యోచన లేదని, అలాగే కొత్తగా రూ.1,000 నోట్లు తీసుకుని రాబోమని గవర్నర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయా అంశాలపై 22 రాష్ట్రాల్లో లక్షకుపైగా ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రాతిపదికన తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ... ► తమ నోట్లను మార్చుకునేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారా? అని అడిగినప్పుడు 61 శాతం మంది ఈ ప్రక్రియలో తమకు ఎటు వంటి ఇబ్బందులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. మా ర్పిడి పక్రియ చాలా తేలిగ్గా ఉందని కేరళలో 75% మంది పేర్కొంటే, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం, తమిళనాడులో 50% మంది తెలిపారు. ► ప్రజల్లో రూ.2000 నోటు మార్చుకోడానికి మాత్రం ఇబ్బందులు ఎదరవుతున్నట్లు 42 శాతం మంది తెలిపారు. ► సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తమ రూ.2000 నోటును మార్చుకునేందుకు ప్రభుత్వం తమకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ► 2,000 నోట్ల మార్పిడి రూ.20,000 కంటే ఎక్కువగా ఉండాలని 44 శాతం మంది పేర్కొన్నారు. ప్రజలు రూ. 2,000 కరెన్సీ నోటును డిపాజిట్ చేయవచ్చు. లేదా తక్కువ విలువ కలిగిన కరెన్సీతో బ్యాంకులో మార్చుకోవచ్చు, అయితే ఒకేసారి రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవచ్చు. ► ఇక రూ. 2,000 నోట్లను ఉపసంహరణ ప్రకటన తర్వాత దేశీయంగా పసిడి, వెండిపై ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరి పే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యుయలర్లు మాత్రం 5–10 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నాయనీ వార్తలు వెలువడ్డాయి. ► రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. అంతకుముందు వీటివాటా కేవలం 10 శాతంగా ఉండేది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. ► 2016 నవంబర్‌లో అప్పటి పెద్ద నోట్ల రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసి కొత్త రూ.500, రూ.2,000 నోట్లను తీసుకువచ్చిన ఆర్బీఐ, ఈ నెల 19వ తేదీన రూ.2000 నోట్లను కూడా సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి 2018–19లోనే ఆర్బీఐ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం రూ.2000 నోట్లలో ఈ విలువ 37.3 శాతానికి సమానం. 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లు. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. ఇదీ చదవండి: MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ మరిన్ని బిజినెస్ అపడేట్స్, ఇంట్రస్టింగ్ వార్తల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఖాతా లేకున్నా రూ.2 వేల నోట్ల మార్పిడి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు రెండు వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదని, ఏ బ్యాంకులో అయినా రోజుకు రూ. 20 వేల వరకు మార్చుకోవచ్చని ఎల్డీఎం దుర్గాప్రసాద్ తెలిపారు. బ్యాంకుల్లో ఆధార్ వివరాలు నమోదు చేసుకుని రూ.2 వేల నోట్లకు బదులుగా ఇతర నోట్లు ఇస్తారన్నారు. బ్యాంకు ఖాతాలకు పాన్‌కార్డు లింక్ అయి ఈకేవైసీ చేసుకుని ఉంటే బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకునే వీలుందన్నారు. అలాగే ఈ నోట్ల మార్పిడికి మాత్రం రోజుకు 10 నోట్లు అంటే రూ.20 వేల వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. -
రూ.93 లక్షల కొత్త నోట్లు సీజ్
బెంగళూరులో ఏడుగురు మధ్యవర్తుల అరెస్ట్ సాక్షి, బెంగళూరు : రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను బెంగళూరులో అక్రమంగా కొత్త lనోట్లుగా మార్పిడి చేస్తున్న ముఠా గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రట్టు చేసింది. ఏడుగురు మధ్యవర్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రూ.93 లక్షల (అన్నీ రూ.2 వేల నోట్లే) విలువైన కొత్త నోట్లను సీజ్ చేసింది. అరెస్టయిన వారిలో ఓ ప్రభుత్వ అధికారి బంధువు ఉన్నారు. ఈడీ అధికారులు పాత నోట్లను మార్చుకునే వ్యక్తులుగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టి.. అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. జేడీఎస్ నేత వీరేంద్ర అరెస్ట్.. ఐటీ దాడుల్లో ఓ ఇంటి బాత్రూమ్లో రూ. 5.7 కోట్ల కొత్త కరెన్సీని సీజ్ చేసిన కేసులో జేడీఎస్ నేత, గోవాలోని కేసినో అధిపతి కేసీ వీరేంద్రను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 10న వీరేంద్రను హుబ్లీలో అరెస్ట్ చేసి.. బెంగళూరు తీసుకొచ్చామని, కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించిందన్నారు. ముంబైలో 33 లక్షలు సీజ్ ముంబై: ముంబై, థానేల్లో రెండు ఉదంతాల్లో రూ. 33 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వడోదరలో ఓ మద్యం వ్యాపారి ఇంట్లోంచి రూ. 19.67 లక్షల నగదును పట్టుకున్నారు. మరోపక్క.. థానేలో పోలీసులు రూ. కోటి విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. రూ. 1.20 కోట్ల పాత నోట్లు తీసుకుని రూ. కోటి కొత్త నోట్లు ఇచ్చేందుకు వెళ్తుండగా థానే సివిల్ ఆస్పత్రి సమీపంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. -
రెండురోజుల్లో పెళ్లి.. ‘పైసల’ కోసం పాట్లు
గార్ల: రెండు రోజుల్లో పెళ్లి.. బట్టలు తీసుకోవాలి.. అవసరమైన సామాన్లు.. కూరగాయలు కొనాలి.. చేతి నిండా డబ్బులున్నా కొనలేని పరిస్థితి.. ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఆ కుటుంబం మొత్తం బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే ఆఖరికి పెళ్లి కూతురు కూడా బ్యాంకు దగ్గర కొత్త నోట్ల కోసం క్యూలో నిల్చొవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మైసా ఐలేశ్ ఆవేదన ఇది.. ‘నా కూతురు శ్రావణి పెళ్లి రెండు రోజుల్లో ఉందని బ్యాంకు మేనేజర్‌ను వేడుకున్నా.. ఫలితం లేకుండా పోరుుంది. పెద్దనోట్ల రద్దుతో మా బిడ్డ పెళ్లి వారుుదా వేసుకోవాల్సి వస్తోంది. కనీసం పెళ్లిళ్లు, శుభ, అశుభ కార్యాలు నిర్వహించే వారిైకైనా నోట్ల మార్పిడి విషయంలో ప్రభుత్వం వెసులు బాటు కల్పించాలి’ అని కోరాడు. -
విజయవాడలో బ్యాంకుల వద్ద సందడి
-
బ్యాంకులు తెరవక ముందే భారీ క్యూలు