
రెండురోజుల్లో పెళ్లి.. ‘పైసల’ కోసం పాట్లు
గార్ల: రెండు రోజుల్లో పెళ్లి.. బట్టలు తీసుకోవాలి.. అవసరమైన సామాన్లు.. కూరగాయలు కొనాలి.. చేతి నిండా డబ్బులున్నా కొనలేని పరిస్థితి.. ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఆ కుటుంబం మొత్తం బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే ఆఖరికి పెళ్లి కూతురు కూడా బ్యాంకు దగ్గర కొత్త నోట్ల కోసం క్యూలో నిల్చొవాల్సి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మైసా ఐలేశ్ ఆవేదన ఇది.. ‘నా కూతురు శ్రావణి పెళ్లి రెండు రోజుల్లో ఉందని బ్యాంకు మేనేజర్‌ను వేడుకున్నా.. ఫలితం లేకుండా పోరుుంది. పెద్దనోట్ల రద్దుతో మా బిడ్డ పెళ్లి వారుుదా వేసుకోవాల్సి వస్తోంది. కనీసం పెళ్లిళ్లు, శుభ, అశుభ కార్యాలు నిర్వహించే వారిైకైనా నోట్ల మార్పిడి విషయంలో ప్రభుత్వం వెసులు బాటు కల్పించాలి’ అని కోరాడు.