రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది.
కేంద్రం ట్రెజరీ బిల్లుల ద్వారా తన రుణాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ మొత్తం రూ .60,000 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆమొత్తాన్ని కేంద్రం ఆర్‌బీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సెంట్రల్ బ్యాంక్ .. కేంద్రానికి లక్షకోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది.
అయితే దీనిపై ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ దగ్గర ఎన్ని నగదు నిల్వలుంటే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అనిశ్చితి సమయాల్లో దేశ ఆర్ధిక వ్యవస్థకు అండగా ఉంటాయి. కానీ కేంద్రం ముక్కుపిండి వసూలు చేస్తున్న డివిడెండ్లు.. ప్రమాదం తెచ్చిపెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో తీసుకుంటున్న డివిడెండ్లు సరికాదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment