న్యూఢిల్లీ: విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చుల మీద 20 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధింపుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఒక ఏడాదిలో రూ. 7 లక్షల వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే వ్యయాలపై టీసీఎస్ విధించబోమని పేర్కొంది.
ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?
విదేశాల్లో క్రెడిట్ కార్డుతో చేసే వ్యయాలను కూడా కేంద్రం ఇటీవల రెమిటెన్స్ స్కీమ్–ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తెచ్చింది. దీంతో జూలై 1 నుంచి విదేశాల్లో క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలపై 20% పన్ను వర్తించనుంది. అయితే ఇది ట్యాక్స్ టెర్రరిజం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్థిక శాఖ తాజా ప్రకటన చేసింది.
చదవండి👉 ఫ్లాష్‌బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, అప్‌డేట్స్ కోసం చదవండి సాక్షి,బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment