ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించే ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన దానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు. 2021–22లో డివిడెండ్ కింద ఆర్‌బీఐ రూ. 30,307 కోట్లు చెల్లించింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 602వ సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు సమావేశంలో దేశీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను, సవాళ్లను కూడా సమీక్షించినట్లు పేర్కొంది. 2022–23లో ఆర్‌బీఐ పనితీరును చర్చించి, వార్షిక నివేదికను ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment