sakthi kanth Das
-
6.5 శాతం వద్ద రెపో రేటు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు (ఆగస్టు 8) ప్రకటించారు. రెపో రేటు తొమ్మిదవ సారి కూడా మారలేదు. కాబట్టి రెపో రేటు 6.5 శాతం వద్ద ఉంది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన మూడవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని ఆగస్టు 6 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించింది.#WATCH | RBI Governor Shaktikanta Das says, "Real GDP growth for 2024-25 is projected at 7.2% with Q1 at 7.1%, Q2 at 7.2%, Q3 at 7.3%, and Q4 at 7.2%. Real GDP growth for Q1 of 2025-26 is projected at 7.2%."(Video source: RBI) pic.twitter.com/KCBKg11Qd0— ANI (@ANI) August 8, 2024రెపో రేటుఆర్బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.రివర్స్ రెపో రేటువాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి. -
ఆర్బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్ డిపాజిట్.. ఎలా చేయొచ్చంటే?
ముంబై : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్ డిపాజిట్ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పెరిగిపోతున్న యూపీఐ వినియోగం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్ దాస్.. గతంలో డెబిట్ కార్డ్ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. పీపీఐ లింక్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేటీఎంపై ఆర్బీఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించబోమని తెలిపారు. ఇటీవల ఆర్బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. యూజర్ల అకౌంట్లు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు,ఫాస్టాట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు చేయకూడాదని ఆర్బీఐ తెలిపింది. వినియోగదారుల భద్రతే ఆర్బీఐ లక్ష్యం ఈ ఆంక్షల నేపథ్యంలో ఫిబ్రవరి 12న (నేడు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో శక్తికాంత దాస్ సైతం పాల్గొన్నారు. అనంతరం ఆర్బీఐ సమావేశం గురించి శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియంత్రిత సంస్థలపై (పేటీఎంను ఉద్దేశిస్తూ) సెంట్రల్ బ్యాంక్ క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.ఆర్బీఐ ఫిన్‌టెక్ రంగానికి మద్దతు ఇస్తూనే, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే పేటీఎం ఆర్ధికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందా? లేదంటే ఫైనాన్షియల్ సిస్టమ్‌పై ఏవైనా చిక్కులు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ‘పేటీఎం అంశంపై తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. అంతేకాదు, ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని కోరారు. ఆర్బీఐ నిబంధనల్ని పేటీఎం పట్టించుకోలేదు గత వారం జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. ఆర్బీఐ ఏదైనా సంస్థను నియంత్రించాలంటే ముందుగా దిద్దుబాటు చర్యల వైపే మొగ్గచూపుతుంది. ఇందుకోసం సదరు సంస్థలకు తగినంత సమయం ఇస్తుంది. పేటీఎం విషయంలోనూ ఇదే జరిగింది. గత కొన్నేళ్లుగా పేటీఎం ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోలేదు. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ‘‘ఆర్బీఐ సంస్థలపై చర్యలు తీసుకునే ముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు తగింనంత సమయం ఇస్తాం. కొన్నిసార్లు ఇది తగినంత సమయం కంటే ఎక్కువగా ఉంటుంది. సంస్థల పట్ల మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. ఆర్బీఐ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. మాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది?’ అని శక్తికాంత దాస్ ప్రశ్నించారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే కాగా, సంస్థపై ఆంక్షలు విధించడంతో తలెత్తిన అనిశ్చితి నుంచి బయటపడేందుకు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఆర్బీఐతో సంప్రదింపులు జరిపారు. ఈ భేటీ తర్వాత ఆర్బీఐ తన నిర్ణయంపై సమీక్షించవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా శక్తికాంత దాస్ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందనేలా మాట్లాడడం ఫిన్ టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. -
యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం!
యూపీఐ ఖాతాదారులకు శుభర్తవార్త. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా యూపీఐ ద్వారా చేసే జరిపే కొన్ని ట్రాన్సాక్షన్లకు సంబంధించిన లావాదేవీల లిమిట్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. తాజాగా, జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో రోజుకు రూ.25,000 నుంచి రూ.1లక్ష వరకు చేసుకునే అవకాశం ఉంది. తాజాగా, యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్రాన్సాక్షన్లలో హాస్పిటల్స్ బిల్స్, ఎడ్యుకేషన్ ఫీజులు సైతం ఉన్నాయి. ‘‘యూపీఏ ద్వారా జరిపే వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు యూపీఐ రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచాలని ప్రతిపాదించాం. ఈ నిర్ణయం ఎవరైతే వినియోగదారులు హాస్పిటల్స్, కాలేజీల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది’’ అని శక్తికాంత్ అన్నారు. ఈ-మ్యాన్‌డేట్ తప్పని సరి బ్యాంక్ ఖాతాదారులు కేబుల్ బిల్స్, మొబైల్ బిల్స్, ఓటీటీ సబ్‌స్కిప్షన్, ఇతర నిత్యవసరాలకు చెల్లింపులు జరుపుతుంటారు. వాటినే రికరింగ్ ట్రాన్సాక్షన్ అంటారు. సాధారంగా బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా ఈ రికరింగ్ పేమెంట్స్ లిమిట్ గతంలో నెలకు రూ.15,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచాలని ఆర్బీఐ యోచిస్తుంది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ‘ఈ- మ్యాన్‌డేట్’ తప్పని చేసింది. ఈ-మ్యాన్‌డేట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఈ-మ్యాన్‌డేట్ ఫారమ్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు ఈ- మ్యాన్‌డేట్ ఆన్లైన్ ఎస్బీఐ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూపించిన వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఈ -మ్యాన్‌డేట్ కోసం తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ తప్పని సరి .ఈ విధానంలో బ్యాంక్ అడిగిన వివరాల్ని ఖాతాదారులు అందించాల్సి ఉంటుంది. అనంతరం, రికరింగ్ పేమెంట్స్‌ను రూ.1లక్ష వరకు చేసుకోవచ్చు. చదవండి👉 నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం -
4% దిగువన ద్రవ్యోల్బణం కట్టడే మా లక్ష్యం : ఆర్బీఐ గవర్నర్
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువకు తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ దృఢంగా దృష్టి సారించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం తెలిపారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ప్రధానమైన సరఫరాల సంబంధ అవరోధాలను అధిగమించడానికి విధానపరమైన చర్యలను చేపట్టేందుకూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్ఈ) డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ‘ఆర్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ మేకింగ్: ది ఇండియన్ కాంటెక్ట్స్’ అంశంపై శక్తికాంతదాస్ విశిష్ట ఉపన్యాసం చేశారు. ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే.. ►అధిక ప్రపంచ ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ద్రవ్య విధాన నిర్వహణకు సవాళ్లు. ►అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న స్వభావాలు, ఆర్థిక మార్కెట్లలో పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ రూపొందుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అంశాల ప్రాతిపదికన విస్తృత లక్ష్యాలతో స్వాతంత్య్రం వచ్చినప్పటి దేశ ద్రవ్య విధాన నిర్వహణ జరుగుతోంది. ►కోవిడ్ మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవటానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ పలు ద్రవ్య, పరపతి విధాన చర్యలు తీసుకుంటోంది.కోవిడ్ దశలో కూడా ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి మేము నిరంతరం చర్యలు తీసుకున్నాము. ►సుదీర్ఘ కాలం పాటు దాదాపు జీరో పాలసీ రేటు విధానం తర్వాత మారిన ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 2022లో వడ్డీ రేట్లను దూకుడుగా పెంచడం ప్రారంభించాయి. ఇది ఈ ఆర్థిక వ్యవస్థల్లోని కొన్ని బ్యాంకుల్లో ఒత్తిడికీ కారణమైంది. ►2022 మే తర్వాత భారత్‌లో కూడా సెంట్రల్ బ్యాంక్ 250 బేసిస్ పాయింట్ల రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)ను పెంచింది. అయితే ఎక్కడా ఆర్థిక స్థిరత్వం ఆందోళనలు తలెత్తకుండా జాగరూకతతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ►బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఇతర ఆర్థిక సంస్థల నియంత్రణ, పర్యవేక్షణకు రిజర్వ్ బ్యాంక్ వివేకవంతమైన విధానాన్ని అవలంబించింది. తగిన సమన్వయ చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనితో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ మూలధనం, రుణ నాణ్యత, లాభదాయకతలకు సంబంధించి చక్కటి బాటన పయనించింది. ►తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణం దీర్ఘకాల పొదుపులు– పెట్టుబడులకు ప్రణాళిక చేయడంలో గృహాలు, వ్యాపారాలకు సహాయపడుతుంది. ఇది చివరికి నూతన ఆవిష్కరణలు, ఉత్పాదకత స్థిరమైన వృద్ధిని పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, అధిక– అస్థిర ద్రవ్యోల్బణం ఉత్పాదకత, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తుంది. ద్రవ్యోల్బణం పేదలపై తీవ్ర భారాన్ని కూడా మోపుతుంది. ఇప్పటికి వడ్డీరేటు తగ్గింపు కష్టమే: నిపుణులు వాస్తవ పరిస్థితిలో చూస్తే, ఆహార ధరలు ఇటు రిటైల్‌గానూ, అటు టోకుగానూ ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్‌గా పరిగణించాల్సి ఉంటుంది. జూలై నెలలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. ఇక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఫుడ్ బాస్కెట్లో ధరల స్పీడ్ కూడా జూలైలో ఏకంగా 14.25 శాతం ఎగసింది (గత ఏడాది జూలై ధరలతో పోల్చి). వినియోగ ధరల సూచీ ప్రత్యేకించి ఆహార ధరల తీవ్రత ఇదే తీరున కొనసాగితే, ఆర్బీఐ సరళతర వడ్డీరేటు విధానంవైపు (రేట్ల తగ్గింపునకు అనుకూలం) ఇప్పట్లో తిరిగి చూడ్డం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఆగస్టునెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని ఆగస్టు నెలల్లో జరిగిన పాలసీ సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. ఆర్బీఐ రేటు తగ్గింపు ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని, ఏదైనా జరిగితే 2024 జూలై తరువాత ఈ మేరకు నిర్ణయం ఉంటుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వంటి సంస్థలు పేర్కొనడం గమనార్హం. వచ్చే కొద్ది నెలల్లో ధరలది ఎగువబాటే: ఎస్అండ్పీ ఇదిలావుండగా, భారతదేశంలో ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ– ఎస్అండ్పీ ఎకనామిస్ట్ (ఆసియా పసిఫిక్) విశ్రుత్ రాణా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధానాలు ధరలు తీవ్రం కాకుండా నిరోధిస్తాయని ఆయన అన్నారు. ‘ఆసియా–పసిఫిక్ క్రెడిట్ ఫోకస్’ వెబ్‌నార్‌లో రానా మాట్లాడుతూ, భారత్‌లో రుతుపవనాలు చాలా తక్కువగా ఉన్నాయని, మొత్తం వర్షపాతం సాధారణం కంటే 11 శాతం తక్కువగా ఉందని చెప్పారు. ఇది రాబోయే కొద్ది నెలల్లో భారతదేశంలో ధాన్యం ధరలను ప్రభావితం చేసే అంశంమని పేర్కొన్న ఆయన, ఇది ఒక తీవ్ర ఆందోళన కరమైన అంశంగా తెలిపారు. కొన్ని నిత్యావసరాల ధరలు నెలవారీగా ఒడిదుడుకులు చూస్తున్నప్పటికీ, ఈ ధరలను దేశంగా ప్రధానంగా ఇంధన ధరలే ప్రభావితం చేస్తాయని రాణా తెలిపారు. భారత్‌లో ధరల పెరుగుదల ‘తాత్కాలిక ధోరణి’ మాత్రమేనని, ప్రభుత్వం–ఆర్బీఐ ధరల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకుంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవలి తన నెలవారీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లోనూ రానున్న రోజుల్లో దేశీయ వినియోగం, పెట్టుబడుల డిమాండ్ పరిస్థితులు పటిష్టంగా ఉంటాయన్న విశ్వాసాన్ని రాణా వ్యక్తం చేశారు. -
ఎకానమీపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ చర్చ
ఇండోర్: దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పనితీరు, సవాళ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 603వ సమావేశం ఇక్కడ చర్చించింది. ఇండోర్‌లో జరిగిన ఈ సమావేశానికి గరవ్నర్ శక్తికాంతదాస్ నేతృత్వం వహించారు. స్థానిక బోర్డుల పనితీరు, ఎంపిక చేసిన కేంద్ర కార్యాలయ విభాగాల కార్యకలాపాలు సహా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యకలాపాలపై బోర్డు చర్చించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు– ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, ఆనంద్ గోపాల్ మహీంద్రా, పంకజ్ రామన్‌భాయ్ పటేల్, రవీంద్ర హెచ్ ధోలాకియా సమావేశానికి హాజరయ్యారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి కూడా సమావేశంలో పాల్గొన్నారు. -
మొండిబాకీల రికవరీపై మరింత దృష్టి పెట్టండి - ఆర్బీఐ గవర్నర్
ముంబై: వినూత్న అకౌంటింగ్ విధానాలతో మొండిపద్దుల వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చకుండా వాటిని రాబట్టడంపై మరింత తీవ్రంగా ప్రయత్నించాలని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు (యూసీబీ) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. రుణాల మంజూరు తర్వాత కూడా పద్దులను సమీక్షించడం, మొండిబాకీలు తలెత్తే అవకాశాలను సకాలంలో గుర్తించడం తదితర రుణ రిస్కుల నిర్వహణ విషయంలో బోర్డులు సైతం క్రియాశీలకంగా పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ముంబై జోన్ యూసీబీ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో దాస్ ఈ మేరకు సూచనలు చేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నివేదికలు పారదర్శకంగా, సమగ్రంగా ఉండేలా చూడటంలో డైరెక్టర్ల ప్రధాన పాత్ర పోషించాలని దాస్ చెప్పారు. అలాగే, బ్యాంకు స్థాయిలో ఐటీ, సైబర్‌సెక్యూరిటీ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిపుణుల నియామకంలోనూ కీలకంగా వ్యవహరించాలని సూచించారు. -
ఆర్బీఐ గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీస్ - కారణం ఏంటంటే?
Telangana High Court Notice to RBI Governor: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులు కోర్టుకు వెళ్లారు. దీనిపైన జస్టిస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి.. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో 2023 జులై 07 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ షేర్‌హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బ్యాంకు నిధులు దుర్వినియోగమయ్యాయని వెల్లడించింది. వినియోగదారుల రక్షణ కోసం బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని ఆర్బీఐని కోర్టు అప్పట్లోనే ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అధికారిని నియమించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఈ కారణంగానే శక్తికాంతదాస్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
రూ. 500 నోట్ల రద్దు.. నిజమేనా?
భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది. -
రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ(గురువారం) ప్రకటించారు. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా.. మునుపటి మాదిరిగానే అదే 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారాయన. ద్రవ్యోల్బణం తగ్గిన్నందువల్ల రెపో రేటుని పెంచలేదని, వడ్డీ రేట్లలో(గృహ, వాహన రుణగ్రహీతలకు ఊరటనిచ్చే అంశం) కూడా ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్బీఐ రెపో రేటుని స్థిరంగా ఉంచడం ఇది వరుసగా రెండవ సారి కావడం గమనార్హం. ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, సీఆర్ఆర్ రేటు 4.50 శాతంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. గత ఏప్రిల్ సమావేశంలో రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందనే భావనతోనే కీలక రేట్లలో ఆర్బీఐ మార్పులు చేయక పోవచ్చునని గతకొంత కాలంగా విశ్లేషణలు వెలువడుతున్న విషయం తెలిసిందే. Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor - June 08, 2023 https://t.co/R9mQDcr70D — ReserveBankOfIndia (@RBI) June 8, 2023 -
కేంద్రానికి ఆర్బీఐ రూ. 87 వేల కోట్ల డివిడెండ్ .. గతేడాది కంటే ట్రిపుల్
ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ. 87,416 కోట్ల మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించే ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన దానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు. 2021–22లో డివిడెండ్ కింద ఆర్బీఐ రూ. 30,307 కోట్లు చెల్లించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 602వ సమావేశంలో డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డు సమావేశంలో దేశీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను, సవాళ్లను కూడా సమీక్షించినట్లు పేర్కొంది. 2022–23లో ఆర్బీఐ పనితీరును చర్చించి, వార్షిక నివేదికను ఆమోదించారు. -
ఆర్బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా?
క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిటర్లు, లేదంటే లబ్ధిదారులు గుర్తించేందుకు గాను వెబ్‌పోర్టల్‌లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ వివరాల ప్రకారం.. ఇటీవల ఆర్బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో రూ. 35,012 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు బహుశా ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయి ఉంటాయి. ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు పేరుకుపోయాయని వాటిని ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. అన్ క్లయిమ్ డిపాజిట్ల కోసం వెబ్ పోర్ట్‌లలో డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా బ్యాంక్‌లు ఆ డేటా బేస్‌లో అన్ క్లయిమ్ డిపాజట్ల గురించి తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు. అన్‌క్లయిమ్ డిపాజిట్లపై పిల్ దాఖలు ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్, రచయిత సుచేతా దలాల్ తాజాగా అన్ క్లయిమ్ డిపాజిట్ల గురించి డేటా బేస్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి (పిల్‌కు) దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలుకు ఆర్థిక శాఖకు మరింత సమయం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్,జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
ఈ దఫా రేటు పెంపు పావు శాతమే!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశ కీలక నిర్ణయాలు బుధవారం వెలువడతాయి. అయితే ఈ దఫా రేటు పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెపె్టంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతానికి ఎగసింది. విశ్లేషకుల అంచనాలు నిజమైతే ఈ రేటు తాజా పాలసీ సమీక్ష సందర్భంగా 6.50 శాతానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ వరకూ గడచిన 10 నెలల్లో రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్లలో ఇది 6 శాతం దిగువకు చేరడం విశ్లేషకుల తాజా అంచనాల నేపథ్యం. -
ప్రస్తుత కీలక సమయంలో రేటు పెంపు ఆపితే కష్టం: దాస్
ముంబై: కఠిన ద్రవ్య విధాన బాటలో పయనిస్తున్న ప్రస్తుత కీలక సమయంలో.. రెపో రేటు పెంపును అపరిపక్వంగా నిలుపుచేయడం తీవ్ర విధానపరమైన లోపం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నెల 5 నుంచి 7 మధ్య జరిగిన ఆర్బీఐ పాలసీ సమీక్ష మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ఈ సమావేశంలో 35 బేసిస్ పాయింట్ల కీలక రెపో రేటు పెంపునకు కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 6.25 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఆర్బీఐ మే నుంచి రెపో రేటును ఐదు దఫాల్లో 2.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు, సామాన్యులపై మరింత భారం
కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయ తీసుకుంది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.50 శాతానికి పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ మే నెల నుంచి పెంచుతూ వచ్చింది. తాజాగా మరో సారి పెంచడంతో బ్యాంకులు రుణగ్రస్తులకు అందించే రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తద్వారా హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న లోన్లపై నెలవారీ చెల్లించే ఈఎంఐ మరింత పెరగనుంది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోరేట్లు అని అంటారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రెపోరేట్లను పెంచుతూ వస్తుంది. ఇలా మే నెలలో 0.40శాతం, జూన్, ఆగస్టులో 0.5శాతం, శుక్రవారం మరో 0.5శాతం పెంచాయి. కాగా, ఆర్బీఐ రెపో రేట్లను పెంచిన ప్రతిసారి.. బ్యాంకులు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచే విషయం తెలిసిందే. చదవండి👉 చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త -
ఫిన్‌టెక్ ఆపరేటర్లూ.. నిబంధనలను పాటించండి
ముంబై: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లెండింగ్ యాప్‌లు, వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వడ్డీ వసూళ్లు, రికవరీ ఏజెంట్ల ఆగడాల వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో ఆవిష్కరణలను అరికట్టడం లేదా డిజిటల్ యాప్‌లపై తీవ్ర జరిమానాలు విధించడం పట్ల ఆసక్తిలేదని పేర్కొన్న ఆర్బీఐ గవర్నర్, నిబంధనావళిని మాత్రం ఖచ్చితంగా పాటించేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.‘‘ట్రాఫిక్ రూల్స్’’ అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... పారదర్శకతతో స్థిరత్వం ► గత రెండు సంవత్సరాల నుండి రుణ యాప్‌లు, ఇందుకు సంబంధించిన ప్రతికూల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ రూల్ బుక్‌లో అనేక మార్పులను చేసింది. ► డిజిటల్ లెండింగ్‌కు సెంట్రల్ బ్యాంక్ వ్యతిరేకం కాదు. దీనికి ఆర్బీఐ నుంచి మద్దతు ఉంటుంది. ఆయా ఆవిష్కరణలను ఆహ్వానిస్తుంది. ► అయితే ఈ ఆవిష్కరణలు బాధ్యతాయుతంగా ఉండాలి. సమర్థతతో పనిచేయాలి. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు, వినియోగదారు ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడాలి. ఈ యాప్‌లు అమాయకులు, డబ్బు అవసరమైన సాధారణ ప్రజలను దోచుకోడానికి దోహదపడకూడదు. ► పారదర్శక విధానాలు, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఫిన్‌టెక్ సంస్థల దీర్ఘకాలిక స్థిరత్వం నెలకొంటుంది. నిబంధనలు కఠినతరం.. డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ ఇటీవలే కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ షాక్: 200 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటికి! -
ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రముఖులు ఏమంటున్నారంటే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రెపోరేటు ఎందుకు పెంచుతున్నామనే కారణాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. ►పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత, సప్లై చైన్‌లో సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ►భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎకానమీ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆయా అంశాల పట్ల జాగరూకత అవసరం. ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. ►ఈ రోజు రెపో రేటును పెంచాలనే నిర్ణయం మే 2020 తరువాత తొలి ‘యూ’ టర్న్‌గా పరిగణించవచ్చు. గత నెలలో మేము సరళతర ద్రవ్య విధానాన్ని క్రమంగా ఉపసంహరించుకునే వైఖరిని వ్యక్తపరిచాము. ఆ చర్యకు అనుగుణంగానే నేటి చర్యను చూడాలి. ►ద్రవ్య విధాన చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించడం, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోనికి తేవడం లక్ష్యంగా ఉందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి హానికరం. ►ఆగస్ట్ 2018 తర్వాత పాలసీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. ఇది కార్పొరేట్లకు, వ్యక్తులకు రుణ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. తాజా ఆశ్చర్యకరమైన పెంపు మే 2020నాటి కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకున్న పాలసీ చర్యకు (రేటును 4 శాతం కనిష్టానికి తగ్గించడం) భిన్నమైనది. ►ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి సరళతర ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూనే, అదే సమయంలో అవసరమైతే సరళతరం వైపు మొగ్గుచూపే అవకాశాలవైపు దృష్టి సారించడాన్ని ఆర్బీఐ కొనసాగిస్తుంది. ►దేశీయ సరఫరాల పరిస్థితి బాగున్నప్పటికీ, అంతర్జాతీయంగా గోధుమల కొరత.. దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది ద్రవ్యోల్బణం సవాళ్లను పెంచుతోంది. ►రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగవచ్చు. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి మంచి మార్కెట్ అవకాశాలను తెస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా, సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడుతోంది. ద్రవ్యోల్బణంపై సీరియస్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పాలసీ స్పష్టం చేస్తోంది. ద్రవ్యోల్బణం సమస్య వేళ్లూనుకునే పరిస్థితిని తలెత్తబోనీయమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నిర్ణయం ఎకానమీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు బలాన్నిస్తుంది. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ డిపాజిట్, రుణ రేట్లు క్రమంగా పెరుగుతాయి. – ఉదయ్ కోటక్, ప్రముఖ బ్యాంకర్ హౌసింగ్‌కు ప్రతికూలమే... రెపో రేటు దిగువ స్థాయిలో ఉంటే, రియల్టీకి అది మేలు చేస్తుంది. మహమ్మారి సమయంలో సరళతర విధానం హౌసింగ్ రంగానికి సానుకూలత అందించింది. తాజా ఆర్బీఐ నిర్ణయం రియల్టీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. హౌసింగ్ డిమాండ్‌కు ఇది ప్రతికూలమే. – హర్ష్ వర్దన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ బిజినెస్ సెంటిమెంట్‌కు దెబ్బ రెపో రేటు, సీఆర్ఆర్ పెంపు ఒకవైపు బిజినెస్ సెంటిమెంట్‌ను, మరోవైపు కొనుగోలుదారు వినియోగ శక్తిని దెబ్బతీస్తుం ది. కరోనా వైరస్ ప్రభావాల నుంచి ఇప్పటికీ తేరుకోని ఎకానమీపై తాజా ఆర్బీఐ నిర్ణయం ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్బీఐ ప్రకటన హర్షణీయం.–ప్రదీప్ ముల్తానీ, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ఆటోకు బ్రేకులు... ఆటోమొబైల్ రంగంలో రుణాలు వ్యయభరితం అవుతాయి. అధిక వెయిటింగ్ పిరియడ్ వల్ల పాసింజర్ వాహన విక్రయాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ద్విచక్ర వాహన రంగం మాత్రం రేటు పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అధిక ఇంధన ధరలకుతోడు తాజా రెపో రేటు పెంపు ప్రభావం చూపుతాయి – వికేశ్, గులాటి, ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ చదవండి👉నాలుగేళ్ల తర్వాత..ఆర్బీఐ భారీ షాక్!, సామాన్యులపై వడ్డీరేట్ల పిడుగు! -
నాలుగేళ్ల తర్వాత..సామాన్యులకు ఆర్బీఐ భారీ షాక్!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది దీంతో ఈ రేటు 4.4 శాతానికి చేరింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. ఈ ప్రభావంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈఎంఐలు భారం కానున్నాయి. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4%కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు కొనసాగుతోంది. గడచిన 11 పాలసీ సమావేశాల్లో రెపో రేటును 4% వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌సహా కమోడిటీ ధరల తీవ్రత, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితులు ఉత్పన్నం కావడం (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉండాలి), వ్యవస్థ నుంచి ఈజీ మనీ ఉపసంహరణలో భాగంగా అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వంటి పలు అంశాలు ఆర్బీఐ తాజా అనూహ్య, ఆకశ్మిక నిర్ణయానికి కార ణమయ్యాయి. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 2 నుంచి 4 వరకూ జరిపిన ద్వైమాసిక మధ్యంతర సమావేశంలో తాజా కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణం రెపో రేటు పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్, వ్యక్తిగత రుణ వ్యయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ తక్షణం ఈ దిశలో నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెపో రేటుగా పేర్కొంటారు. అర శాతం పెరిగి 4.5 శాతానికి సీఆర్ఆర్ రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.5 శాతానికి పెరిగింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని కట్టడి చేసి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రమెంట్ల ప్రధాన ఉద్దేశ్యం. సీఆర్ఆర్ పెంపు వల్ల వ్యవస్థ నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వ్యవస్థ నుంచి వెనక్కు మళ్లుతాయన్నది అంచనా. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3%, 5.8%, 5.4 శాతం, 5.1శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. కాగా, సీఆర్ఆర్ కొత్త రేటు మే 21వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 7 శాతానికి చేరుకుంది. వరుసగా మూడవ నెలలో ఆర్బీఐ లక్ష్యానికి మించి నమోదవడం గమనార్హం. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ఫెడ్ ఫండ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అంచనాలు ఆర్బీఐ తాజా అనూహ్య నిర్ణయానికి నేపథ్యం. జూన్‌లో మరో పావు శాతం పెంపు..! కాగా ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) ఆర్బీఐ పాలసీ కమిటీ రెండవ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమావేశం జూన్ 6వ తేదీ 8వ తేదీ మధ్య జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటును మరో పావుశాతం పెంచవచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి👉రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం ? -
గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కీలక సమావేశం!
ముంబై: గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) చిట్టచివరి, ఆరవ ద్వైమాసిక సమావేశం ఇది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022–23 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో సమర్పించిన నేపథ్యంలో జరుగుతున్న తాజా ఆర్బీఐ విధాన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ గురువారం మీడియాకు వెల్లడిస్తారు. నిజానికి ఈ సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత రత్న లతామంగేష్కర్ మృతి నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైంది. పరిశీలించే కీలక అంశాలు.. అంతర్జాతీయంగా ముడిచమురు రికార్డు స్థాయిలో బేరల్‌కు 93 డాలర్లకు చేరడం, దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిడులు, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరిణామాలు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ మార్చిలోనే ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25%) పెంచవచ్చంటూ వస్తున్న సంకేతాలు, రష్యా–ఉక్రేయిన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతల తీవ్రత వంటి అంశాలు సమావేశంలో కీలక చర్చనీయాంశాలుగా ఉండే వీలుందని నిపుణుల అంచనా. యథాతథమే..: రెపో రేటు (ప్రస్తుతం 4%)ను ‘వృద్ధే లక్ష్యంగా’ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. అయితే లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, బ్యాంకుల వద్ద అదనపు నిధులు ఉన్న పరిస్థితులు వంటి అంశాల నేపథ్యంలో రివర్స్ రెపో (ప్రస్తుతం 3.35 శాతం)ను 20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చన్న అభిప్రాయం ఉంది. -
వెలుగురేఖలు కనబడుతున్నాయ్... కొనసాగాలి!
న్యూఢిల్లీ: పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత మందగమన ధోరణిని ఎదుర్కొంటున్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కొంత పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో డిమాండ్ పునరుద్ధరణకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ తీవ్ర ఆందోళన సృష్టిస్తున్న చైనా కోవిడ్–19 (కరోనా) వైరస్‌ను పరిణామాలను ప్రతి ‘‘విధాన నిర్ణేత’’ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. తగిన తక్షణ చర్యలు తీసుకోడానికి ఇది అవసరం. అతి పెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థలో వైరెస్ సంక్షోభ ప్ర భావం ప్రపంచ వృద్ధిపై ప్రతికూలత చూపుతుంది. ♦ తాజా 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు, అలాగే కార్పొరేట్ పన్నుకోతసహా ఇటీవల కేంద్రం తీసుకున్న మరికొన్ని కీలక చర్యలు డిమాండ్, వినియోగం పునరుద్ధరణ దిశలో తగిన సానుకూల పరిస్థితులను సృష్టించాయి. అయితే మరిన్ని వ్యవస్థాగత చర్యలూ అవసరం. భూ, కార్మిక వ్యవహారాలకు సంబంధించి సంస్కరణలు, వ్యవసాయ మార్కెటింగ్ పటిష్టత, మానవ వనరుల విషయంలో నైపుణ్యత పెంపు వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ♦ 2019 మొదట్లోనే మందగమన ఛాయలను ఆర్బీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో ధరల కట్టడి పరిస్థితిని అదనుగా తీసుకుని బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను వరుసగా ఐదుసార్లు తగ్గించింది. ♦ అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పరిస్థితులు, దేశీయంగా డిమాండ్ మందగించడం, బ్యాంకింగ్ మొండి బకాయిల తీవ్రత ,కార్పొరేట్ రుణ భారాలు వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి ప్రధాన కారణాలు. అయితే ఇప్పుడు కొన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఆయా అంశాల ధోరణి ఎలా ఉండబోతోందన్న విషయం వేచిచూడాల్సి ఉంది. భారత్...ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2019లో బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించి భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని యూఎస్‌కు చెందిన విశ్లేషణా సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ఒకటి తెలిపింది. భారత్ జీడీపీ విలువను 2.94 ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. బ్రిటన్ ఎకానమీ పరిమాణాన్ని 2.83 ట్రిలియన్ డాలర్లుగా, ఫ్రాన్స్‌కు సంబంధించి ఈ విలువను 2.71 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొంది. -
మందగమనమే కానీ..!
ముంబై: ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన మాట వాస్తవమని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అంగీకరించారు. ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న మాటా వాస్తవమన్నారు. అయితే ప్రతిఒక్కరూ అవకాశాలు, ఆశావాదంపై దృష్టి పెట్టాలితప్ప నిరాశావాదంపై వద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అధికాదాయ వర్గాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై అధికపన్నులు సహా ఇటీవలి బడ్జెట్ చర్యల అనంతరం పలు కార్పొరేట్ వర్గాలు నరేంద్రమోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ తాజా ప్రకటన చేశారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం– విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఆగస్టు 1 నుంచి 16వతేదీ మధ్య రూ.10,416.25 కోట్ల ఈక్విటీ అమ్మకాలు జరిపారు. డెట్ విషయంలో ఈ విలువ రూ. 2,096.4 కోట్లుగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, ఆటోమొబైల్ అమ్మకాల వంటి అన్ని స్థూల గణాంకాలు నిరాశను మిగుల్చుతున్నాయి. ఆయా అంశాలతో 3.5 లక్షల ఉద్యోగాలు పోయినట్లు కూడా గణాంకాలు పేర్కొంటున్నాయి. గడచిన నాలుగు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షల్లో ఆర్బీఐ 110 బేసిస్ పాయింట్ల (1.1 శాతం) రెపో రేటును తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు తొమ్మిది సంవత్సరాల కనిష్టస్థాయి 5.4 శాతానికి చేరినా, ఇది వాస్తవ రూపంలో ఫలితం ఇవ్వడంలేదు. ఇక మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.8 శాతానికి పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో గవర్నర్ జాతీయ బ్యాంకింగ్ సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ ఆర్బీఐ నుంచి అందిన రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయింపు జరగాలి. రుణ రేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. తమ రుణాలు, డిపాజిట్ రేట్లను రెపోకు అనుసంధానించడానికి బ్యాంకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ నేను వార్తా పత్రికలు చదువుతున్నా, బిజినెస్ చానల్స్‌ను చూస్తున్నా, తగిన సానుకూల, ఆశావాద పరిస్థితి ప్రతిబింబించడంలేదు. ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు ఉన్న మాట నిజమే. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం నుంచి భారత్ ఒంటరిగా ఉండలేదు. ♦ అయితే మనం ప్రతికూల పరిస్థితులను చూస్తూ, ఉండిపోకూడదు. ఆశావహ పరిస్థితులు, అవకాశాలపైనా దృష్టి సారించాలి. సవాళ్ల మధ్య పలు అవకాశాలు ఉన్నాయన్న అంశాలన్ని గుర్తించాలి. ♦ సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని తట్టుకోగల పరిస్థితుల్లో మన బ్యాంకింగ్ రంగం ఉంది. అయితే బ్యాంకులు తమ మూలధనానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా, క్యాపిటల్ మార్కెట్‌వైపు దృష్టి సారించాలి. ♦ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల రుణ నాణ్యతను సమీక్షించబోవడంలేదు. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేట్ గవర్నెన్స్‌పై తక్షణం దృష్టి సారించాల్సిఉంది. ♦ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల అంతర్గత సంబంధాలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుంది. -
రేటు తగ్గింపు ఖాయం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష గురువారం జరగనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరగనున్న ఈ పరపతి కమిటీ సమావేశం సందర్భంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) 35 బేసిస్ పాయింట్లవరకూ తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. శక్తికాంత్ దాస్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటు అరశాతం తగ్గిన సంగతి తెలిసిందే. రేటు తగ్గింపు ఖాయమన్న అంచనాలకు ప్రధాన కారణాలను చూస్తే... ♦ అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత 4 శాతంలోపు కొనసాగుతోంది. ♦ మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణులు పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. ♦ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. ♦ ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు స్పీడ్‌కు రెపో రేటు తగ్గింపునకే అవకాశాలు ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల విశ్వాసం. -
ఓటు వేసిన బిజినెస్ టైకూన్లు
సాక్షి,ముంబై: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌లో బిజినెస్ టైకూన్లు, కార్పొరేట్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ , మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, ఎండీ పవన్ గోయంకా, ఆది గోద్రెజ్ తదితర దిగ్గజాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితోపాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ముంబైలో ఓటు వేశారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బీఎస్సీ సీఎండీ అశిష చౌహాన్, ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్, మోర్గాన్ స్టాన్లీ ఎంఈ రిధ్ దేశాయ్ ఈ రోజు వేసిన కార్పొరేట్ ప్రముఖుల్లో ఉన్నారు. దేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని, ఉద్యోగావకాశాలను లభిస్తాయని ఆనంద్ మహీంద్ర ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
కీలక వడ్డీరేట్లు పావు శాతం కోత
సాక్షి, ముంబై: ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ఆధ్వర్యంలో జరిగిన తొలి సమీక్ష సమావేశంలో యథాతథ నిర్ణయానికి బ్రేక్ వేసి రేట్ కట్కు నిర్ణయించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) తీర్మానించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంనుంచి 6.25శాతానికి దిగి వచ్చింది. అలాగే బ్యాంకు రేటు 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ అంచనాలను కూడా సవరించింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)లో నలుగురు రేటు కట్కు ఆమోదం తెలిపారని శక్తి కాంత దాస్ వెల్లడించారు. ఆరవ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు)ను 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో (వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.25శాతంనుంచి 6 శాతానికి తగ్గింది. దీంతోస్టాక్‌మార్కెట్లు పాజిటివ్ స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి. -
తక్షణమే బ్యాంకింగ్ రంగంపై దృష్టి - ఆర్బీఐ కొత్త గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 25వ గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత్ దాస్ నూతన గవర్నర్‌గా తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపిక కావడం గౌరవనీయమైన గొప్ప అవకాశమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ టీం తో కలిసి పనిచేస్తాం...భారతదేశ ఆర్థికవ్యవస్థ కోసం ప్రతిఒక్కరితో కలిసి పనిచేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. లిక్విడీటీ, ప్రధానంగా తాను బ్యాంకింగ్ రంగంపై దృష్టిపెట్టనున్నట్టు వివరించారు. ఆర్బీఐ విశ్వసనీయత, స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తామని, ఆర్బీఐ ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. జవాబుదారీతనానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థకవసరమయ్యే చర్యలను సమయానుసారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 14, శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం కానుందన్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణ ఆర్బీఐ తక్షణ కర్తవ్యమన్నారు శక్తికాంత్ దాస్. త్వరలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ముంబైలో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నా మన్నారు. అనంతరం ప్రయివేటు రంగ బ్యాంకులతో కూడా సమావేశం కానున్నట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విదాదాల్లోకి తాను వెళ్ల దలుచు కోలేదని అయితే ప్రతి సంస్థ దాని స్వయంప్రతిపత్తిని కొనసాగించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. మరోవైపు డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య పదవిలో ఉన్నారా అని ప్రశ్నించినపుడు.. కొద్దిసేపటిక్రితమే ఆయనతో టీ తాగాను. నాకు తెలిసినంతవరకు ఆయన పదవిలోనే ఉన్నారంటూ మీడియా ప్రతినిధులతో ఉత్సాహంగా, నవ్వుతూ చమత్కారంగా సమాధానాలిచ్చారు. కాగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఇటీవల రగిలిన వివాదాల నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన ఆయన తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో నూతన గవర్నర్‌గా శక్తికాంత్ దాస్‌ను అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినేట్ (ఏసీసీ) ఎంపిక చేసింది. మూడేళ్ల పాటు ఈ శక్తికాంత్ పదవిలో కొనసాగనున్నారు.1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శక్తికాంత దాస్ కేంద్ర కేబినేట్ సెక్రటరీ హోదాలో పలు శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో సహా కేంద్ర ప్రభుత్వంలోనూ పనిచేసిన అనుభవం ఉంది.