ఇండోర్: దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పనితీరు, సవాళ్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 603వ సమావేశం ఇక్కడ చర్చించింది. ఇండోర్‌లో జరిగిన ఈ సమావేశానికి గరవ్నర్ శక్తికాంతదాస్ నేతృత్వం వహించారు. స్థానిక బోర్డుల పనితీరు, ఎంపిక చేసిన కేంద్ర కార్యాలయ విభాగాల కార్యకలాపాలు సహా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యకలాపాలపై బోర్డు చర్చించిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు– ఎస్ గురుమూర్తి, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, ఆనంద్ గోపాల్ మహీంద్రా, పంకజ్ రామన్‌భాయ్ పటేల్, రవీంద్ర హెచ్ ధోలాకియా సమావేశానికి హాజరయ్యారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్‌తో పాటు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment