ఆర్‌బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్‌ డిపాజిట్‌.. ఎలా చేయొచ్చంటే? | Cash Deposit Facility In Banks Through Use Of Upi | Sakshi

ఆర్‌బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్‌ డిపాజిట్‌.. ఎలా చేయొచ్చంటే?

Apr 5 2024 3:15 PM | Updated on Apr 5 2024 4:06 PM

Cash Deposit Facility In Banks Through Use Of Upi - Sakshi

ముంబై : బ్యాంక్‌ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్‌ డిపాజిట్‌ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్‌ డిపాజిట్‌ చేసే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్‌ డిపాజిట్‌ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్‌ డిపాజిట్‌ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.   

పెరిగిపోతున్న యూపీఐ వినియోగం
దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్‌ దాస్‌.. గతంలో డెబిట్‌ కార్డ్‌ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్‌ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. 

పీపీఐ లింక్​
థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్స్​ (PPIs) లింక్​ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్​ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్​ పేమెంట్​ ఇన్​స్ట్రుమెంట్స్​ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్​ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్​బీఐ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement