
జూన్‌లో పీఎంఐ 58.4గా నమోదు
తయారీ రంగం జూన్‌లో బలమైన పనితీరు చూపించింది. ఈ రంగంలో పనితీరును తెలియజేసే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్ నెలలో 58.4 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఇది 57.6గా ఉంది. డిమాండ్ బలంగా ఉండడంతోపాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం ఉత్పత్తి విస్తరణకు, ఉపాధి కల్పనకు దారితీసినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.
ఇదీ చదవండి: 11 మంది టాప్ ఎక్స్‌పర్ట్‌లతో మెటా కొత్త ల్యాబ్
తయారీ రంగంలో విస్తరణ ఏడాది కాలంలోనే గరిష్టంగా ఉన్నట్టు చెప్పారు. కంపెనీల నిల్వలు తగ్గుతున్నట్టు పేర్కొన్నారు. మార్కెటింగ్ చర్యలకుతోడు, ఎగుమతులు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. బలమైన అమ్మకాలు తయారీ కంపెనీల్లో నియామకాల పెరుగుదలకు దారితీసినట్టు, రికార్డు స్థాయిలో ఉపాధి కల్పనకు దోహదపడినట్టు పేర్కొన్నారు. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగాను, ఆ దిగువన నమోదైతే తగ్గినట్టుగాను పరిగణిస్తారు.