Monetary policy
-
వడ్డీరేట్ల తగ్గింపుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో జరగనున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు.‘ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నాం. వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉందని గణాంకాలు వెలువడ్డాయి. అయినప్పటికీ కీలక వడ్డీరేట్ల తగ్గింపు విషయంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. పాలసీ విధానకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరోనా కారణంగా తగ్గిపోయిన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుని వృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు కారణం’ అని దాస్ తెలిపారు.ఇదీ చదవండి: విమానం దారి మళ్లింపు.. కారణం..ఇదిలాఉండగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే 18 నెలలకు పైగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ సంవత్సరం చివరి త్రైమాసికం వరకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను మార్చబోదని అభిప్రాయపడుతున్నారు. అయితే పట్టణ ప్రజల వ్యయ సామర్థ్యం క్షీణిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా వడ్డీరేట్లు తగ్గించాలని కొందరు అంటున్నారు. ఇప్పటికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేట్లను 3.75 శాతానికి తగ్గించింది. ఈ నెల 17, 18న జరిగే ఫెడ్ సమావేశంలో అమెరికా సైతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనాలున్నాయి. -
బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!
బ్యాంకులు వినూత్న మార్గాల్లో డిపాజిట్లను సేకరించకపోతే ప్రమాదంలో పడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. దీని వల్ల బ్యాలెన్స్‌షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం(అసెట్ లయబిలిటీ డిఫరెన్స్) పెరుగుతుందన్నారు.ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో దాస్ మాట్లాడుతూ..‘బ్యాంకు కస్టమర్లు డిపాజిట్ల రూపంలో కాకుండా వివిధ మార్గాల్లో డబ్బు దాచుకుంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, భారీగా కార్పొరేట్ రుణాలు జారీ చేయాలన్నా డిపాజిట్లు పెరగాలి. లేదంటే బ్యాలెన్స్ షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం ఎక్కువవుతుంది. అది బ్యాంకులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వినూత్న మార్గాల్లో కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు భారీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాదంలో పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!ఇదిలాఉండగా, గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఊహించిందే జరిగింది.. ఆర్బీఐ సమావేశంలో ముఖ్యాంశాలు..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ సమావేశంలోని ముఖ్యాంశాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మానిటరీ పాలసీ సమావేశం(ఎంపీసీ)లో ద్రవ్యోల్బణం పోకడలు, ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనలపై చర్చలు జరిగాయి.ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరికొందరు 25 బేసిస్ పాయింట్లు కట్ చేయాలన్నారు.రెపో రేటును స్థిరంగా 6.50 శాతం వద్దే కొనసాగిస్తున్నాం.స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు: 6.25 శాతంమార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు: 6.75 శాతం2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ అంచనా 7.2%గా ఉంటుందని అంచనా. అది మొదటి త్రైమాసికంలో 7.3 శాతం నుంచి 7.2కి స్వల్పంగా తగ్గింది. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో వరుసగా 7.3 శాతం, 7.2 శాతం వద్ద ఉంటుంది. ద్రవ్యోల్బణం 4.5 శాతం నమోదవుతుంది.జూన్-ఆగస్టులో (ఆగస్టు 6 వరకు) 9.7 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిలువలు భారత్‌కు వచ్చాయి.ఇదీ చదవండి: 15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలిఏప్రిల్-మే 2024లో స్థూల ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా పెరిగాయి.భారతదేశం విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2,2024 నాటికి 675 బిలియన్ డాలర్లతో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనా ఆశించిన వర్షపాతం నమోదవుతుంది. దాంతో ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.అనధికార రుణదాతలను కట్టడి చేసేందుకు డిజిటల్ లెండింగ్ యాప్‌ల కోసం పబ్లిక్ రిపోజిటరీని రూపొందించాలి.యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్బీఐ పెంచింది.చెక్ క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
రేటు తగ్గించి.. వృద్ధికి ఊతమివాల్సిన సమయం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం 4 శాతానికి చేరుకోవడంతో ఇక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికన్నా (4 శాతం) అరశాతమే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ వెలువరిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇక పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదన్నారు. ‘‘తట్టుకోలేని అధిక ద్రవ్యోల్బణం సమస్య ముగుస్తోంది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో మనం ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలను చూస్తాము. ద్రవ్యోల్బణం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది’’ అని ఆయన అన్నారు. దీర్ఘకాలం వడ్డీరేటు అధికస్థాయిలో ఉండడం ఆర్ధికవృద్ధికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలోనూ ఇదే మాట... ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. కాగా, వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు ఆషిమా గోయల్‌తో పాటు జయంత్ వర్మ కూడా వీరిలో ఉండడం గమనార్హం. రెపో రేటును తగ్గించి వృద్ధి ఊతానికి తగిన నిర్ణయం తీసుకోవాలని జయంత్ వర్మ పాలసీ సమీక్షాలో ఓటువేశారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిస్కులను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం, అహ్మదాబాద్) ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఒక ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → 2023–24లో భారత్ వృద్ధి 8.2 శాతం. 2024–25లో అంతకన్నా 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వృద్ధి స్పీడ్ తగ్గవచ్చు. భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన సామర్థ్యం ఉంది. అధిక వడ్డీరేటు వ్యవస్థ వృద్ధి స్పీడ్‌కు అడ్డంకు కాకూడదు. → ఆర్థిక వృద్ధి రేటును 8 శాతానికి పెంచేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడులతో సహా అనేక విధానపరమైన చర్యలను చేపట్టింది.ద్రవ్యోల్బణ లక్ష్యం ఇదీ.. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. సగటుకన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. -
ఆర్బీఐ శుభవార్త : యూపీఐతో క్యాష్ డిపాజిట్.. ఎలా చేయొచ్చంటే?
ముంబై : బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు తమ క్యాష్ డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా బ్యాంకుల్లో ఉన్న ‘క్యాష్ డిపాజిట్ మెషీన్ల’(సీడీఎంఏ)లో నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పెరిగిపోతున్న యూపీఐ వినియోగం దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న యూపీఐ వినియోగంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లావాదేవీల్లో పలు మార్పులు చేస్తున్నామన్న శక్తికాంత్ దాస్.. గతంలో డెబిట్ కార్డ్ సాయంతో ఏటీంఎలో డబ్బుల్ని డ్రా చేసే వీలుండేది. యూపీఐ రాకతో ఏటీఎంలలో కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్లను సీడీఎంఏ మెషీన్లలలో యూపీఐ ద్వారా చేసుకోవచ్చని సూచించారు. త్వరలో అమలుకు సంబంధించిన సూచనలను ప్రకటిస్తామని అన్నారు. పీపీఐ లింక్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేసుకోవడానికి కూడా అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ యాప్స్ ద్వారా మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతోంది. కానీ ఈ సదుపాయం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) కు అందుబాటులో లేదు. పీపీఐలు యూపీఐ లావాదేవీలు చేయాలంటే, కచ్చితంగా పీపీఐ జారీచేసిన అప్లికేషన్లు మాత్రమే వాడాల్సి వస్తోంది. దీని వల్ల ఖాతాదారులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అందుకే పీపీఐ హోల్డర్లు కూడా బ్యాంక్ ఖాతాదారుల లాగా నేరుగా యూపీఐ చెల్లింపులు చేయడానికి అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
Interim Budget 2024: ప్చ్..నచ్చలే! సెన్సెక్స్ నష్టం 107 పాయింట్లు
ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఒడిదుడుకులు... సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది. ► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది. ► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్సీటీసీ 1.50%, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి. ► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది – యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్‌ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’ – బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
వడ్డీరేట్లపై తేల్చి చెప్పిన ఆర్బీఐ!
వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచనేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే రూమర్స్‌పై ఆయన స్పందించారు. ద్రవ్యోల్బణంను 4 శాతం దిగువకు తీసుకురావడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. రేట్ల తగ్గింపుపై చర్చ కూడా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్‌లో ద్రవ్యోల్బణం 7.8 శాతానికి పెరిగిందన్నారు. క్రమంగా దాన్ని తగ్గించేందుకు నిత్యం ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎలాగైనా ఇన్ఫ్లోషన్ను 4 శాతం దిగువకు తీసుకువచ్చేలా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5గా నమోదుకావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2024-25లో ద్రవ్యోల్బణం కొంత ఒడుదొడుకులకు లోనవుతుందని అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాదిలో (2024-25)లో 7 శాతం వృద్ధిరేటును నమోదుచేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదీ చదవండి: రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతికూల అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనదేశ వృద్ధి మెరుగ్గా ఉందని, స్థిరత్వం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. -
ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే
ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో డిసెంబర్ 6 నుండి 8 వరకూ జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యింది. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్ ఉద్ఘాటించారు. -
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్‌లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
ఆర్బీఐ పాలసీ వెల్లడికి ముందు లాభాలు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పాలసీ ప్రకటనకు ముందురోజు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడొచ్చనే ఆశలతో బుధవారం స్టాక్ సూచీలు ఆరునెలల గరిష్టంపై ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి బలోపేతం అంశాలు కలిసొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సెన్సెక్స్ 403 పాయింట్లు దూసుకెళ్లి 63,196 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 18,739 వద్ద గరిష్టాలను నమోదు చేశాయి. చివర్లో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 63,143 వద్ద స్థిరపడింది. ఆరు నెలల తర్వాత ఈ సూచి తొలి సారి 63 వేల స్థాయికి చేరుకుంది. అలాగే ఇందులోని 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 18,726 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకిది 6 నెలల గరిష్టం కావడం విశేషం. ముఖ్యంగా మెటల్, ఇంధన, ఎఫ్ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. -
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్య విధానంపై ఆర్బీఐ వైఖరి.., స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. మే తయారీ రంగ పీఎంఐ మెప్పించింది. తాజాగా అమెరికా ‘రుణ పరిమితి పెంపు’ చట్టంపై నెలకొన్న సందిగ్ధత సైతం తొలగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్న ఈ పరిణామాల ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువ స్థాయిలో 18,650 – 18,800 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయి 18,450–18,500 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ తెలిపారు. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లుకు ఎగువ సభ ఆమోదం తెలుపుతుందో లేదో అనే ఆందోళనల నడుమ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా గతవారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్లు చొప్పున స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు గురువారం (జూన్ 8న) వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం దిగిరావడం, మార్చి జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదవడం తదితర పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే మొగ్గుచూపొచ్చని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఊహించినట్లే ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోతే సూచీలు మరింత బలంగా ర్యాలీ చేయోచ్చంటున్నారు. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ఇవాళ భారత మే నెల సేవారంగ తయారీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే అమెరికా, యూరోజోన్, చైనా, పీఎఎంఐ డేటా సైతం ఇవాళ వెల్లడి కానుంది. బుధవారం మే నెల చైనా బ్యాలె న్స్ ఆఫ్ ట్రేడ్, గురువారం అమెరికా ఉద్యోగ గణాంకాలు, యూరోజోన్, జపాన్ క్యూ1 జీడీపీ వృద్ధి, శుక్రవారం చైనా మే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. శుక్రవారం జూన్ తొలి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఏప్రిల్ 28న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. నైరుతి రుతుపవనాల వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారత్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 9 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మే నెలలో రూ.43,838 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇది తొమ్మిది గరిష్టమని మార్కెట్ నిపుణులు తెలిపారు. బలమైన ఆర్థిక గణాంకాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఎఫ్‌పీఐలు 2022 ఆగస్టులో అత్యధికంగా రూ. 51,204 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలతో పాటు ప్రస్తుత నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి సానుకూలంగానే ఉన్నారు. జూన్ నెలలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,490 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ‘‘గతవారం విడుదలైన జీడీపీ వృద్ధి రేటు, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల మద్దతు ఉన్నందున ఈ నెలలోనూ ఎఫ్‌పీఐల ధోరణి అదే స్థాయిలో కొనసాగుతుంది’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ అన్నారు. -
రాష్ట్రంలో ప్రగతి పరుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం)ను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్లో భాగంగా ద్రవ్య విధానాన్ని మంత్రి వెల్లడించారు. ద్రవ్య విధాన వ్యూహపత్రాన్ని సభకు సమర్పించారు. ‘కోవిడ్ తరువాత పరిస్థితుల్లో రాష్ట్రం పురోగమనంలో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయ వనరులు 21.1 శాతం అద్భుత ప్రగతి కనబరుస్తున్నట్లు సవరించిన బడ్జెట్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోనూ పన్నుల వసూళ్లు ఆశించిన దానికంటే అధికంగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 5.06 శాతం పెరుగుతుంది. జీఎస్డీపీలో ద్రవ్యలోటు 4 శాతం ఉంటుందని 2022–23 బడ్జెట్లో అంచనా వేశాం. కానీ, ఆర్థిక ప్రగతి కారణంగా 3.21 శాతానికి తగ్గింది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ.. అనేక కొత్త పథకాలు, భారీ కమిట్మెంట్స్తో వ్యయం అధికంగా ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు రూ.2,980 కోట్లుగా ఉంటుంది. 2022–23 ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 25.9 శాతం ఉంటాయని అంచనా వేసినా. సవరించిన బడ్జెట్ అంచనాల్లో అది 24.33 శాతంగానే ఉండనుంది’అని హరీశ్ తెలిపారు. పన్నుల ఆదాయమే వెన్నుదన్ను ‘రాష్ట్రానికి పన్నుల ఆదాయమే వెన్నుదన్నుగా ఉంది. అందులో భాగంగా పన్ను వసూళ్లలో ఎలాంటి లోపాలు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, సామాన్యులపై భారం వేయకుండా ఎక్కడెక్కడ పన్నులు ఇంకా వసూలు అయ్యే అవకాశం ఉందో వాటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ఆదాయం మరింత పెంచుకుంటాం. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మార్కెట్ ధరల స్థిరీకరణ, స్టాంపు డ్యూటీ పెంపుతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడులు రూ.1.31 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశాం. పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఇక పన్నేతర ఆదాయ కూడా పెరుగుతోంది. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని విక్రయించడం వల్ల ఆదా యం పొందుతున్నాం..’అని మంత్రి వివరించారు. కేంద్రం కంటే బెస్ట్ ‘స్థిర, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కేంద్రంతో పోలిస్తే అభివృద్ధి అధికంగా ఉంది. 2020–21 కోవిడ్ సమయంలో అభివృద్ధి తిరోగమంలో ఉన్నా కేంద్రంతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఆ సంవత్సరం కేంద్రం 6.6 శాతం తిరోగమనంలో ఉంటే.. రాష్ట్రం 4.9 శాతం తిరోగమనంలో ఉంది. ఆ మరుసటి సంవత్సరం నుంచి ఆర్థిక పురోగతి సాధ్యమైంది. తిరోగమనం నుంచి పురోగతి వైపు మళ్లడమే కాకుండా ఏకంగా 10.9 శాతం పెరుగుదల సాధ్యమైంది. సెకండరీ సెక్టార్‌లోని ఉత్పత్తి, విద్యుత్, నీటి సరఫరా, నిర్మా ణం రంగం పురోగతిలో ఉంది. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, గనులు, క్వారీ కూడా ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాయి. నిరంతర విద్యుత్, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు వంటి పథకాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి’అని హరీశ్ తెలిపారు. -
ఆర్బీఐ.. రేట్ల పెంపుపై దూకుడు వద్దు
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఎకానమీ రికవరీకి భారీ రేటు పెంపు సరికాదని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు ఒక లేఖ రాస్తూ, కొత్త రేటు పెంపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల శ్రేణిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అంతకు మించి పెంపు వద్దని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రిటైల్ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని, రాయితీ వడ్డీ రేటును అందించాలని తన సిఫారసుల్లో అసోచామ్ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. చదవండి: 17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా! -
ద్రవ్యోల్బణంపై కేంద్రానికి ఆర్బీఐ నివేదిక!
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో 2022 జనవరి నుంచి విఫలం అవడానికి కారణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన కసరత్తు జరపనుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ యాక్ట్ 45జెఎన్ సెక్షన్ కింద కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటు తర్వాత ఈ తరహా వివరణను కేంద్రానికి ఆర్బీఐ సమర్పించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే గడచిన మూడు త్రైమాసికాల్లో ఇది ఆ స్థాయి పైనే కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎస్బీఐ, బీవోఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ రుణ రేట్ల పెంపు మొదలైంది. ఇటు ఆర్బీఐ అరశాతం రెపో పెంపు నిర్ణయం వెంటనే, అటు బ్యాంకింగ్ కూడా ఈ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్ తమ రుణ రేట్లను 0.5% పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులూ రేటు పెంపు బాటలో పయనించే అవకాశం ఉంది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ (ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు) 50 బేసిస్ పాయింట్లు పెరిగి 8.55 శాతానికి చేరింది. రెపో ఆధారిత ఆర్ఎల్ఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 8.15 శాతానికి ఎగసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రెపో ఆధారిత రేటును అరశాతం పెంచింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి ఎగసింది. ► ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు అరశాతం పెరిగి 9.60కి చేరింది. కొన్ని స్థిర డిపాజిట్ల రేట్లను కూడా మార్చుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ► హెచ్డీఎఫ్సీ తన రుణ రేటును అరశాతం పెంచింది. అక్టోబర్ 1 నుంచి పెంపు అమ ల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
రేటు పెంపు కొనసాగించక తప్పదు
కోల్‌కతా: ద్రవ్యోల్బణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత కఠిన ద్రవ్య పరపతి విధానం కొనసాగించక తప్పదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తిరిగి పుంజుకుంటే, రూపాయి బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు వచ్చే ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ 8 నుంచి 9 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్‌లో సమర్‌కాంతి పాల్ స్మారక ప్రసంగంలో రంగరాజన్ పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశం ఏడు శాతం వృద్ధి సాధిస్తే, అది హర్షణీయమైన అంశమే. ► ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (మే నుంచి 1.4 శాతం పెంపుతో ప్రస్తుతం 5.40 శాతం) పెంపు విధానాన్ని కొనసాగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నా. ► దేశం నుంచి పెట్టుబడులు తరలిపోవడం వల్లే డాలర్ మారకంలో రూపాయి విలువ 79 నుంచి 80 శ్రేణిలో పతనమైంది. ఇప్పుడు తిరిగి పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. దీనితో దేశీయ కరెన్సీ విలువ మళ్లీ బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. పలు నెలలపాటు ఎడతెగని అమ్మకాల తర్వాత, ఆగస్టు 2022లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ. 22,000 కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ► 27 నుంచి 28 శాతానికి పడిపోయిన పెట్టుబడులు రేటు 33 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులు కూడా భారీగా పెరగాలి. ► విద్యుత్, వ్యవసాయం, మార్కెటింగ్, కార్మిక వంటి కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగాలి. ఆర్థికాభివృద్ధిలో ఇది కీలకం. 1990లలో చేపట్టిన సంస్కరణ చర్యలు ‘మంచి సమన్వయంతో, విస్తృత ప్రాతిపదికన జరిగాయి. ► దేశం మరింత పురోగతి సాధించడానికి కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం. వృద్ధి ప్రక్రియలో రెండు వర్గాలూ భాగాస్వాములే. ► కొత్త టెక్నాలజీకి అనుగుణంగా సవాళ్లను, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం మంచిదే, కానీ... శిలాజ ఇంధన వినియోగం తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ప్రయోజనకరంగా ఉంటుందని రంగరాజన్ పేర్కొన్నారు. అయితే దేశం ఈవీల కోసం ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషించారు. దీనికితోడు ప్రస్తుత పరిస్థితులు, అంశాల ప్రాతిపదికన ఉపాధి రంగంపై ఈ తీవ్ర ప్రభావం వుండే వీలుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయడ్డారు. -
ద్రవ్యోల్బణం: అధికారులతో ఆర్బీఐ గవర్నర్ భేటీ.. కీలక అంశాలు ఇవే!
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆమోదనీయంకాని అధిక స్థాయిలో ఉందని ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) కట్టడికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచక తప్పదని ప్రతిపాదించారు. దీనికి గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ భేటీకి సంబంధించి శుక్రవారం వెడుదలైన మినిట్స్ ఈ వివరాలను తెలిపాయి. దీని ప్రకారం... ► ఆర్బీఐ గవర్నర్ వ్యక్తం చేసిన అభిప్రాయానికి మిగిలిన సభ్యులూ అంగీకరించారు. దీనితో రెపో రేటు 4.9 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది. ► విధాన చర్యల క్రమం, ద్రవ్య విధాన విశ్వసనీయతను బలోపేతం చేస్తుందని, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, ఎకానమీ క్రియాశీలత పురోగతి ధ్యేయంగా ఆర్బీఐ చర్యలు కొనసాగుతాయని గవర్నర్ ఈ భేటీలో పేర్కొన్నారు. ► 2022–23లో జీడీపీ 7.2 శాతంగా పాలసీ అంచనా వేసింది. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. ► ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4 శాతం, 5.8 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది.. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. పెంపు దిశగా తప్పని అడుగులు కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం ) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5వ తేదీన మరో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రస్తుతం ఈ రేటు 5.4 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలను షురూ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6 నుంచి 6.5 శాతం శ్రేణికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో 7.79 గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాతి మూడు నెలల్లో వరుసగా తగ్గుతూ రావడం కొంత హర్షణీయ పరిణామం. చదవండి: నాన్–రెసిడెంట్ కార్పొరేట్లకు ఊరట.. దానిపై పన్ను భారం తగ్గింది! -
ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్!
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్ మండే’’ నమోదైంది. వైరస్ కట్టడికి ఆయా దేశాల లాక్డౌన్ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు. సోమవారం సెషన్ సాగింది ఇలా..! ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్ సెషన్ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి. ► అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలివేయడతో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ (20%), ఫ్యూచర్ రిటైల్ (19.92%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (19.91%) షేర్లు రాణించి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ► ఇటీవల లిస్టయిన నైకా, కార్‌ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్ స్టాక్‌లు) ఎనిమిది శాతం క్షీణించాయి. నష్టాలకు నాలుగు కారణాలు... ► వణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్‌లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్డౌన్ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల పెరిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ► వడ్డీ రేట్ల పెంపు భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. దీంతో ఫలితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్ఐఐలు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్‌కు ముందు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లాక్డౌన్ విధించింది. పండుగ వేళ లాక్డౌన్లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్ దేశాల స్టాక్ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్‌లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డిస్కౌంట్లో శ్రీరాం ప్రాపర్టీస్ లిస్టింగ్ శ్రీరాం ప్రాపర్టీస్ షేర్లు లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్ 55,132కు పతనం ముగింపు 1190 పాయింట్లు డౌన్ 55,822 వద్ద క్లోజ్ -
ఆర్బీఐ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ద్రవ్య పాలసీపై ఆర్బీఐ నిర్ణయాలతో పాటు ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కదలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ సూచీల ఐదువారాల వరుస లాభాలకు గతవారం బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల పతనంతో ఆ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,283 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్లను కోల్పోయాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, మెటల్, ఆటో షేర్లలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ‘‘ఈ వారంలోనూ మార్కెట్ స్థిరీకరణ జరగవచ్చు. అమెరికా స్టాక్ మార్కెట్ సెపె్టంబర్ దిద్దుబాటు ప్రభావం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్రూడాయిల్, కమోడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం భయాలు తెరపైకి వచ్చాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు యోచనలు చేస్తున్నాయి. ఫెడ్ ట్యాపరింగ్, చైనాలో తాజాగా నెలకొన్న సంక్షోభాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అయితే దేశీయ కార్పొరేట్ల రెండో ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండొచ్చనే విశ్లేషకుల అంచనాలు కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జూలియస్ బేయర్ ఇండియా ఎండీ ఉన్మేష్ కులకర్ణి తెలిపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే... అందరి చూపు ఆర్బీఐ వైపు ... భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం బుధవారం(అక్టోబర్ 6న) ప్రారంభమవుతుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే క్రూడాయిల్ ధరలు పెరుగుదల, కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రావడం, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. 8న టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల బోణీ... కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెపె్టంబర్) ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే వారం 13న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే రోజున (అక్టోబర్ 13న) వెలువడతాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం... దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరుకు ఆరు మాసాల్లో తొలి రెండు మినహా మిగతా నాలుగు నెలల్లో సేవారంగం మెరుగైన పనితీరు కనబరించింది. ఈ వారాంతాన శుక్రవారం ఆర్బీఐ సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలతో పాటు అక్టోబర్ 1వ వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు. రెండో నెలలోనూ కొనుగోళ్లు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్ మాసంలో రూ.26,517 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,154 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,363 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనాలో అనిశి్చతుల ప్రభావంతో ఎఫ్ఐఐలు ఇటీవల భారత్‌తో పాటు ఇతర వర్థమాన దేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ‘‘కోవిడ్ తర్వాత దీర్ఘకాలపు ప్రయోజనాల దృష్ట్యా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదైతే ఎఫ్ఐఐలు తిరిగి దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా డెరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ ఓటు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో భాగంగా ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా అమలుకానుంది. ఇదేవిధంగా రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21)కల్లా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు అభిప్రాయపడింది. వ్యవసాయం, కన్జూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. కోవిడ్-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆగస్ట్ నెలలోనూ సీపీఐ 6.69 శాతానికి ఎగసింది. ముగ్గురు సభ్యుల ఎంపికలో ఆలస్యంకారణంగా గత నెలాఖరున వాయిదా పడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ముగిశాయి. ఇప్పటికే 2.5 శాతం కోత 2019 ఫిబ్రవరి మొదలు ఆర్బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం(250 బేసిస్ పాయింట్లు) కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్వహించిన సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ మొగ్గు చూపింది. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం చొప్పున అమలవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో అవసరమైతే కీలక రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా తగిన చర్యలు తీసుకునే వీలున్నట్లు పేర్కొంది. ఎంపీసీ ఇలా ఆరుగురు సభ్యులలో ముగ్గురుని కొత్తగా ఎంపిక చేయడంలో జరిగిన ఆలస్యంకారణంగా గత నెలలో జరగవలసిన ఎంపీసీ సమావేశాలు అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఆషిమా గోయల్, శశాంక బిడే, జయంత్ వర్మలను ఎంపీసీ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ఈక్విటీల్లో ర్యాలీ కొనసాగుతుంది: క్రిస్ వుడ్
కోవిడ్-19 రెండోదశ వ్యాధి వ్యాప్తి ఆందోళనలు కేవలం ముందస్తు భయాలేనని, రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగవచ్చని జెఫ్పారీస్ బ్రోకరేజ్ సంస్థ గ్లోబల్ హెడ్‌ఆఫ్‌ఈక్విటీ స్ట్రాటజీ క్రిస్టోఫర్ వుడ్ అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్లు కరోనా కేసుల రెండో దశ వ్యాప్తి ఆందోళనల కంటే... ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభంపైనే అధిక దృష్టిని సారించాయని స్పష్టమైంది. మొదటిసారి లాక్డౌన్లో భాగంగా ఇన్వెస్టర్లు సైక్లికల్స్, గ్రోత్ షేర్లకు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇప్పడు రెండోదశ కోవిడ్ కేసులు పెరగడంతో సైక్లికల్స్ షేర్ల కొనుగోళ్లను తగ్గించి వృద్ధి షేర్లను అధికంగా కొంటారు. అయితే వచ్చే త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల ద్రవ్యపాలసీ సరళంగా ఉండటం గ్రహించి మార్కెట్లు వీ-ఆకారపు రికవరీని అంచనా వేస్తూ తిరిగి సైక్లికల్ షేర్లను కొంటారు.’’ అని వుడ్ తన వీక్లీ నోట్ గ్రీడ్ అండ్ ఫియర్లో తెలిపారు. ఈక్విటీ ఇన్వెస్టర్లు వృద్ధి, వ్యాల్యూయేషన్ స్టాక్లను సొంతం చేసుకునేందుకు ‘‘బార్బెల్ వ్యూహాన్ని’’ అమలుపరచాలని వుడ్ సలహానిచ్చారు. కోవిడ్-19 రెండోదశ వ్యాప్తి భయాలు తెరపైకి రావడంతో గ్రోత్ స్టాక్‌లు ఆలస్యంగా ర్యాలీని ప్రారంభించాయి. అయితే మార్కెట్ వీ-ఆకారపు రికవరీ సెంటిమెంట్ బలపడటంతో ఫైనాన్షియల్, అటో, ఇంధన, మెటీరియల్(సైక్లికల్స్ స్టాక్స్) మరోసారి ర్యాలీ చేయవచ్చు అని తెలిపారు. అమెరికా, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ లాక్డౌన్ ఉండకపోవచ్చని వుడ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉండటంతో ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం మళ్లీ ఆర్థికవ్యవస్థను మూసివేయడానికి మొగ్గుచూపకపోవచ్చన్నారు. రాబోయే త్రైమాసికంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మార్కెట్లను ప్రభావితం చేయటం ప్రారంభిస్తుందని వుడ్ చెప్పారు. -
‘కోవిడ్-19 వెంటాడే ముప్పు’
ముంబై : కోవిడ్-19 భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థను వెంటాడే ముప్పు వంటిదేనని ఆర్బీఐ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావం నేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్ధూల ఆర్థిక పరిస్థితులను కరోనా మహమ్మారి తారుమారు చేసిందని పేర్కొంది. అంతర్జాతీయ ఉత్పాదకత, సరఫరా వ్యవస్థలు, వర్తకం, పర్యాటక రంగానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించిన ద్రవ్య విధాన నివేదికలో పేర్కొంది. కరోనా కట్టడికి విధించిన మూడు వారాల లాక్డౌన్ 16వ రోజులో అడుగుపెట్టిన క్రమంలో ఆర్బీఐ నివేదిక విడుదలైంది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ లాక్‌డౌన్‌తో మరింత దిగజారింది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు 2020-21లో వృద్ధిరేటు రికవరీ ఆశాజనకంగా ఉండగా మహమ్మారి ప్రభావంతో ఇది తారుమారైందని ఆర్బీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి, దాని తీవ్రతను అంచనా వేస్తున్నామని..లాక్డౌన్ల కారణంగా 2020లో ప్రపంచ ఉత్పాదకత పడిపోవడం వృద్ధి అంచనాలపై పెనుప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది. 2019-20లో భారత వృద్ధి రేటు 5 శాతం ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో తమ అంచనాలకు లోబడే ఉంటుందని పేర్కొంది. 2020 కేలండర్ సంవత్సరంలో కోవిడ్-19 ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది. చదవండి : మీ ఈఎంఐ కట్ చేయొద్దా.? -
‘శక్తి’మాన్.. బ్రహ్మాస్త్రం!
పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా... అసలే ఆర్థిక మందగమనంతో అతలాకుతలం అయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తాజాగా కరోనా కాటుకు గురవుతున్న నేపథ్యంలో... పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ మధ్య జరగాల్సిన 2020–21 మొదటి ద్రవ్య పరపతి విధాన సమీక్షను అర్ధంతరంగా మార్చి 27కు మార్చింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా కమిటీ సమావేశాన్ని సైతం వారం రోజులు ముందుకు తీసుకువచ్చిన అంశాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు ఇక చౌక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును భారీగా 75 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌సహా దాదాపు 43 సెంట్రల్ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి. 2019 ఫిబ్రవరి నుంచి (చివరిసారి రెండు సార్లు మినహా) వరుసగా ఐదుసార్లు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయం తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. దీనికి సంబంధించి మరింత లోతుకు వెళితే... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో రెపో రేటు 4.75 శాతానికి తగ్గింది. అటు తర్వాత అంతకంటే తక్కువ స్థాయికి ప్రస్తుతం రెపోరేటు దిగివచ్చింది. ఇక ప్రస్తుత 4.4 శాతం రెపో రేటు 2004 తర్వాత చూడ్డం ఇదే తొలిసారి. అంటే ప్రస్తుత రేటు దశాబ్దంన్నర కనిష్టస్థాయి అన్నమాట. రెపో రేటు తగ్గింపు వల్ల ఈ రేటుతో అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు దిగివస్తాయి. పరిశ్రమలకు కూడా వడ్డీరేట్ల భారం తగ్గుతుంది. బ్యాంకులు డిపాజిట్ చేస్తే వచ్చేది 4 శాతమే.. ఇక బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగులు నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి పొందే వడ్డీరేటు రివర్స్ రెపోను ఏకంగా 90 బేసిస్ పాయింట్లు ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. తమ ఫండ్స్‌ను ఆర్బీఐ వద్ద ఉంచడం వల్ల వచ్చే వడ్డీ మరీ తక్కువగా ఉండడం వల్ల, ఈ మేరకు నిర్ణయం విషయంలో బ్యాంకులను కొంత వెనక్కు తగ్గేలా చేసి, మార్కెట్లోనే వడ్డీకి ఇచ్చేలా వాటిని ప్రోత్సహించడం ఈ ఇన్స్ట్రుమెంట్ లక్ష్యం. ► అయితే ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మొండిబకాయిలు తీవ్రమైన పరిస్థితుల్లో నిధులను బయటకు వడ్డీకి ఇచ్చి ఇబ్బందులుపడే బదులు, వాటిని ఆర్బీఐ వద్దే ఉంచి స్వల్ప వడ్డీనైనా పొందడం మంచిదని బ్యాంకులు భావిస్తుంటాయని నిపుణుల విశ్లేషణ. సీఆర్ఆర్ ఏకంగా ఒకశాతం ఇక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఆర్బీఐ ఏకంగా ఒకశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3 శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొత్త మొత్తాన్ని తప్పనిసరిగా నగదు రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీనిపై ఆర్బీఐ ఎటువంటి వడ్డీ ఇవ్వదు. ఈ రేటు తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద అదనపు నిధుల లభ్యత ఉంటుంది. ఆర్బీఐ సీఆర్ఆర్ను తగ్గించడం ఏడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. వ్యవస్థలోకి నిధులు ఎలా..? ఇక ఆర్బీఐ తీసుకున్న పలు నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు రూ.3.74 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత– లిక్విడిటీ (2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 2 శాతం) అందుబాటులోకి రానుంది. ఇందులో రెపో ఆపరేషన్ వల్ల రూ. లక్ష కోట్లు వ్యవస్థలోకి వస్తాయి. సీఆర్ఆర్ ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్‌లోకి వచ్చే మొత్తం రూ.1.37 లక్షల కోట్లు. రుణాలపై 0.75% వడ్డీ కోత: ఎస్బీఐ ఆర్బీఐ విధాన ప్రకటన నేపథ్యంలో– బ్యాంకి ంగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 75 బేసిస్ పాయింట్ల రెపో కోతనూ కస్టమర్‌కు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ బదలాయించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ అనుసంధాన వార్షిక రుణ రేటు (ఈబీఆర్) ప్రస్తుత 7.8 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గుతుంది. ఇక రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగివస్తుంది. దీని ప్రకారం, 30 సంవత్సరాలకు సంబంధించి గృహ రుణ రేటు నెల ఈఎంఐపై లక్షకు రూ.52 తగ్గుతుందని ప్రకటన పేర్కొంది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)పై వచ్చే నెల్లో జరగనున్న బ్యాంక్ అసెట్ లయబిలిటీ కమిటీ (ఏఎల్‌సీఓ) ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. డిపాజిట్ రేట్లూ తగ్గింపు అన్ని కాలపరిమితుల రిటైల్, బల్క్ డిపాజిట్ రేట్లనూ 20 నుంచి 100 బేసిస్ పాయింట్ల శ్రేణిలో తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రిటైల్ డిపాజిట్‌పై రేటు 20 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గితే, బల్క్ డిపాజిట్‌పై రేటు 50 నుంచి 100 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఏయే రుణాలపై మారటోరియం... క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సహా టర్మ్ లోన్లపై (వ్యవసాయ, గృహ, విద్య, వ్యక్తిగత, వాహన) నెలవారీ చెల్లింపు(ఈఎంఐ)లకు సంబంధించి కస్టమర్లకు పెద్ద వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. ఈ రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం నిర్ణయం తీసుకోడానికి ఆర్థిక సంస్థలకు వెసులుబాటు ఇచ్చింది. మారటోరియం సమయాన్ని డిఫాల్ట్‌గా, మొండిబకాయిగా పరిగణించడానికి వీలు పడదు. ‘‘మార్చి నుంచి మే మధ్య అన్ని రుణ చెల్లింపులపై మారటోరియం అమల్లో ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బకాయిలు సహా రిటైల్, కార్పొరేట్ రుణాలకు సంబంధించి అన్ని విభాగాలకూ ఇది వర్తిస్తుంది. అసలు, వడ్డీ, మొత్తం బకాయి చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు అన్నింటికీ మారటోరియం వర్తిస్తుంది’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. మారటోరియం తర్వాత టర్మ్ లోన్లకు సంబంధించి రుణ చెల్లింపుల షెడ్యూల్ మూడు నెలలు పెరుగుతుంది. ఉదాహరణకు మీరు ఒక రుణానికి సంబంధించి 2022 మార్చి 31లోపు అన్ని ఈఎంఐలు చెల్లించాల్సి ఉందనుకుందాం. ఆ షెడ్యూల్ ఇప్పుడు 2022 జూన్ 30 వరకూ పొడిగించడం జరుగుతుంది. అన్ని కమర్షియల్ బ్యాంక్‌లు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులుసహా) సహకార బ్యాంకులు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ చెల్లింపులు అన్నింటికీ ఈ మారటోరియం వర్తిస్తుంది. ► వ్యాపార సంస్థలు తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ కాలానికి పోగుపడే వడ్డీని మారటోరియం పూర్తయ్యాక కట్టాల్సి ఉంటుంది. ► మారటోరియం విధివిధానాలపై బ్యాంకులే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ► ఒక రకంగా ఇది రుణాల చెల్లింపు కాస్త వాయిదా పడటమే తప్ప తర్వాతైనా కచ్చితంగా కట్టాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలు బట్టి ఈఎంఐ కాలవ్యవధి పెరగవచ్చు లేదా మారటోరియం వ్యవధిలో కట్టాల్సి వడ్డీని మిగిలిన టర్మ్‌లో కొద్ది కొద్దిగా కట్టేలా సర్దుబాటు చేయొచ్చు. దీనిపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బాకీల పరిస్థితేంటి... క్రెడిట్ కార్డు బాకీలు, ఈఎంఐలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. ఆ మేరకు బాకీలను మూడు నెలల తర్వాత కట్టవచ్చు. అయితే, ఈ మొత్తం సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు అసలు కట్టాల్సినది రూ. 10,000 అయితే, వాయిదాపడిన మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు. దీనికి పన్నులు అదనం. అలాగే, రెండో నెలలో అసలు, వడ్డీ మీద కలిపి అదనంగా వడ్డీ, పన్నులు ఉంటాయి. మూడో నెలా ఇదే రిపీట్ అవుతుంది. ఇక నాలుగో నెలలో మాత్రం (మారటోరియం తర్వాత) అప్పటిదాకా పేరుకుపోయిన బాకాయి మొత్తాన్ని వడ్డీ, పన్నులతో సహా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది. రేటు తగ్గిస్తే ఏంటి ప్రయోజనం... గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాంటి టర్మ్ లోన్స్ గ్రహీతలకు రేట్ల కోతతో ప్రయోజనం లభిస్తుంది. ఆర్బీఐ పాలసీకి అనుగుణంగా బ్యాంకులు కూడా రేటు తగ్గిస్తే .. రుణాలు చౌకగా మారతాయి. ఎలాగంటే.. ► రిజర్వ్ బ్యాంక్ 75 బేసిస్ పాయింట్లు (ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం) తగ్గించింది. దీనితో రెపో–రేటు అనుసంధానిత గృహ రుణం తీసుకున్నవారికి... గణనీయంగా వడ్డీ రేటు భారం తగ్గవచ్చు. ఉదాహరణకు 8 శాతం వార్షిక వడ్డీ రేటుపై రూ. 50 లక్షలు తీసుకున్న వారి ఈఎంఐ భారం దాదాపు రూ. 2,139 మేర తగ్గవచ్చు. అయితే, ఎస్బీఐ ఇప్పటికే 0.75 శాతం రుణ రేటు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులూ దీన్నే అనుసరించే చాన్స్ ఉంది. ► సాధారణంగా 2019 అక్టోబర్ 1 తర్వాత నుంచి రెపో రేటు ప్రాతిపదికనే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆర్బీఐ తగ్గించిన మేరకు ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బ్యాంకులు బదలాయించాల్సి ఉంటుంది. గతంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్(ఎంసీఎల్ఆర్) ఆధారిత వడ్డీ రేటుపై రుణాలు తీసుకున్న వారికి కూడా కొంత మేర తగ్గుతుంది. ఒక వేళ పూర్తి ప్రయోజనాలు దక్కని పక్షంలో.. కాస్త వన్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చినా.. రెపో రేటు ఆధారిత గృహ రుణాలకు మారడం శ్రేయస్కరం. బ్యాంకులు తగ్గిస్తాయి కాబట్టి... వాటితో పోటీ పడేందుకైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలూ(హెచ్ఎఫ్సీ) తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ మారటోరియం అంటే.. సంక్షోభ సమయంలో రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేందుకు ఉద్దేశించినది మారటోరియం. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ తాత్కాలికంగా ఈఎంఐల చెల్లింపు విషయంలో వ్యవధిపరంగా 3 నెలలు వెసులుబాటునిస్తూ మారటోరియం ప్రకటించింది. దీనితో మే నెల దాకా ఈఎంఐ కట్టకపోయినా.. బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుగా పరిగణించ బోదు. మీ క్రెడిట్ స్కోరుకు నష్టం లేదు. ఆర్థికం అనిశ్చితే... అయినా పటిష్టం.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుంది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 4.7 శాతంగా నమోదయ్యే వీలుంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే క్రూడ్ ఆయిల్ ధరల పతనం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చే అంశం. తీసుకుంటున్న ద్రవ్య పరపతి చర్యల సానుకూల ప్రభావం, కరోనా కట్టడి వంటి అంశాలు భవిష్యత్‌తో దేశాభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉంటాయి. రికార్డు స్థాయి ఆహార ఉత్పత్తుల వల్ల ఆహార ధరలు అదుపులోనే ఉంటాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌లపై ఎటువంటి అంచనాలనూ చెప్పలేం. అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణం. ఇక ఆర్బీఐ తీసుకునే అన్చి చర్యలకూ ఆర్థిక పటిష్టత, వృద్ధి పునరుద్ధరణే లక్ష్యం. భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితం. ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రం. బ్యాంకుల నుంచి భయాందోళనలతో కూడిన నిధుల ఉపసంహరణ (విత్‌డ్రాయెల్స్) అవసరం లేదు. 2008 ఫైనాన్షియల్ మార్కెట్ సంక్షోభ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుత భారత స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థకు రక్షణ ఆర్బీఐ చర్యలు కరోనావైరస్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయి. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు ఆర్బీఐ నిర్ణయాలు సహకరిస్తాయి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తక్షణ బదలాయింపు జరగాలి ఆర్బీఐ రెపోరేటు తగ్గింపు ద్వారా తమకు ఒనగూరిన ప్రయోజనాన్ని బ్యాంకులు తక్షణం కస్టమర్‌కు బదలాయించాలి. భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్ ప్రకటన హర్షణీయం. బకాయిల చెల్లింపుపై మారటోరియం పెద్ద ఊరట. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి మానవీయ దృక్పధం ఆర్థిక వ్యవస్థ రక్షణలో మానవీయ దృక్పధంతో కూడిన సాహసోపేత, హర్షణీయ నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ఎస్బీఐకి సంబంధించి రూ.60,000 కోట్ల వరకూ రుణ మారటోరియం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి: ఆర్బీఐ గవర్నర్
ముంబై: వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వినియోగ డిమాండ్, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వృద్ది తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని..అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించాలంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్, స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ద్రవ్యోల్భణానికి కారణమయ్యే అంశాలను నిరంతరం సమీక్షించి పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్నారు. పాలసీల రూపకల్పనలో సర్వే, డాటాను విశ్లేషిస్తామని, అన్ని అంశాలను పరిశీలించి పాలసీల రూపకల్పన చేస్తామని అన్నారు. చదవండి: ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్ -
ద్రవ్య లభ్యతపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి!
చెన్నై: బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) సహా ఫైనాన్షియల్ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం నేపథ్యంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తీవ్ర నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ 576వ సెంట్రల్‌బోర్డ్ సమవేశంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గత నెల్లో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఐ. శ్రీనివాస్ వ్యాఖ్యానించడమూ ఈ నిర్ణయానికి నేపథ్యం. ఆర్థిక పరిస్థితిపై చర్చ.. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, సవాళ్లతోపాటు వివిధ అంశాలకు సంబంధించి ఆర్బీఐ కార్యకలాపాలపైనా బోర్డ్ సమావేశంలో చర్చ జరిగింది. నగదు నిర్వహణ, ప్రభుత్వంతో ఆర్బీఐ మధ్య సంబంధాలు వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. డిప్యూటీ గవర్నర్లు ఎన్ఎస్ విశ్వనాథన్, విరాల్ వీ ఆచార్య, బీపీ కనూంగూ, మహేశ్ కుమార్ జైన్‌లతో పాటు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్లు భరత్ జోషి, సుధీర్ మాన్‌కంద్, మనీష్ సబర్వాల్, సతీష్ మరాథే, స్వామినాథన్ గురుమూర్తి, రేవతీ అయ్యర్, సచిన్ చతుర్వేదిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం తరఫున డైరెక్టర్లు, ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్, ఫైనాన్షియల్ సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కూడా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
ఆర్బీఐ సమీక్ష, గణాంకాలే కీలకం..!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక పరపతి సమీక్షను ఆర్బీఐ ఈ వారంలోనే నిర్వహించనుంది. శక్తికాంతదాస్‌అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈనెల 2 నుంచి 4 వరకూ(గురువారం) మూడు రోజులపాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. పావు శాతం రేట్ల కోత ప్రకటన ఉండవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు దిగివస్తే ప్రధాన సూచీలకు ఇది సానుకూల అంశంగా మారుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, కాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. అయితే, ముందుగానే అంచనా వేసిన తగ్గుదల కారణంగా ఆర్బీఐ ప్రకటన అనంతరం మార్కెట్లో లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదని అంచనాలు వెలువడతున్నాయి. ఇక ఈ ప్రధాన అంశానికి తోడు స్థూల ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ పరిణామాలు, సాధారణ ఎన్నికల ప్రభావం ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. ‘వరుస ఈవెంట్స్ ఉన్నందున ఆయా రంగాల షేర్లలో కదలికలు భారీగానే ఉండనున్నాయి.’ అని క్యాపిటల్‌ఎయిమ్ పరిశోధనా విభాగం హెడ్ దేబబ్రత భట్టాచార్య విశ్లేషించారు. ‘విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు, రాజకీయ స్థిరత్వం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న మార్కెట్లతో పోల్చితే దేశీ మార్కెట్ అవుట్పెర్ఫార్మ్ చేసేందుకు అవకాశం ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. స్థూల ఆర్థికాంశాలపై మార్కెట్ దృష్టి.. గతనెలకు సంబంధించిన నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మంగళవారం (ఏప్రిల్ 2న) విడుదలకానుండగా.. నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గురువారం వెల్లడికానుంది. మరోవైపు మార్చి ఆటో రంగ పరిశ్రమ అమ్మకాల గణంకాలు సోమవారం (ఏప్రిల్ 1న) సియామ్ ప్రకటించనుంది. అమెరికా ఉద్యోగ గణాంకాలు వెల్లడి.. యూఎస్ నాన్ ఫామ్ పేరోల్స్(వ్యవసాయేతర ఉద్యోగాలు) గణాంకాలు శుక్రవారం వెల్లడికానుండగా.. ఆదేశ ఫిబ్రవరి రిటైల్ అమ్మకాల డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ సోమవారం విడుదలకానున్నాయి. యూఎస్ నాన్–మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ బుధవారం రానుంది. ఇక అంతర్జాతీయ ప్రధాన ఆర్థిక అంశాల్లో.. చైనా మార్చినెల తయారీ గణాంకాలు సోమవారం విడుదలకానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, బ్రెగ్జిట్ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. 70 డాలర్ల దిగువనే క్రూడ్.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా ఒక శాతం పెరిగింది. చివరకు 67.60 డాలర్ల వద్ద ముగిసింది. ఉత్పత్తి తగ్గిన కారణంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ.. బ్యారెల్ ధర 70 డాలర్ల దిగువ ఉన్నంతకాలం మార్కెట్లపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ శ్రీయాష్ దేవాల్కర్ అన్నారు. గతవారంలో పెరిగిన క్రూడ్ ధరల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించినప్పటికీ.. ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో సోమవారం ప్రస్తుత స్థాయిల వద్దనే కొనసాగవచ్చని, సమీక్ష అనంతరం పూర్తి సంకేతాలు అందనున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు. చివరి రెండు నెలల్లో విదేశీ నిధుల వెల్లువ గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగింది. ఒక్క మార్చిలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు ఈక్విటీ మార్కెట్లో రూ.33,980 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.12,001 కోట్లు పెట్టుబడిపెట్టి.. నికరంగా గత నెలలో రూ.45,981 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరిలో మొత్తంగా రూ.11,182 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు తేలింది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరం(2018–19)లో రూ. 44,500 కోట్లను ఉపసంహరించుకున్నారు. -
పుంజుకోనున్న భారత్ ఆర్థిక వ్యవస్థ!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఎక్కువ. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. క్రూడ్ ధరలు తక్కువగా ఉండడం, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్ వృద్ధి పురోగతికి కారణంగా వివరించింది. ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ►ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. గతంతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువ. పలు దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి కారణం. పెరగనున్న రాష్ట్రాల ద్రవ్యలోటు: ఇండియా రేటింగ్స్ ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ఫిచ్ గ్రూప్ కంపెనీ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర స్కీమ్‌లు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. 28 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి వెల్లడించిన చైనా ఎన్బీఎస్ బీజింగ్: చైనా గత ఏడాది 6.6 శాతం వృద్ధిని సాధించింది. 1990 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) వెల్లడించింది. 2017లో 6.8 శాతంగా ఉన్న జీడీపీ 2018లో 6.6 శాతానికి తగ్గింది. ఇది 28 సంవత్సరాల కనిష్ట స్థాయి. అమెరికాతో ఉన్న వాణిజ్య సవాళ్లు దీనికి ప్రధాన కారణం. కార్పొ బ్రీఫ్స్... శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిస్టింగ్‌పై కసరత్తు.. విలీన స్కీమ్ ద్వారా ఎక్విప్మెంట్ ఫైనాన్స్ వ్యాపార విభాగాన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ హేమంత్ కనోడియా తెలిపారు. సిడ్బిలో వాటా విక్రయించనున్న కెనరా బ్యాంక్.. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి)లోని కోటి షేర్లను విక్రయించాలని కెనరా బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ అమ్మకానికి సంబంధించి.. ఒక్కో షేరు ఫ్లోర్ ప్రైస్ రూ.225 వద్ద నిర్ణయించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. మరోవైపు ఎన్ఎస్డీఎల్లోని 4 లక్షల షేర్లను రూ.850 ఫ్లోర్ ప్రైస్ వద్ద విక్రయించనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్లో నూతన సెల్లో ప్లాంట్ ప్రారంభం బీఐసీ సెల్లో ఇండియా రూ.300 కోట్ల వ్యయంతో గుజరాత్‌లోని వాపిలో ఏర్పాటుచేసిన అతిపెద్ద స్టేషనరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో 1,500 మంది ఉద్యోగులను నియమించుకోగా.. వీరిలో 70 శాతం మహిళలే ఉన్నట్లు తెలిపింది. టాటా టెలీ, ఎయిర్టెల్ విలీనానికి ఆమోదంనష్టాల్లో కూరుకుపోయిన టెలికం సంస్థ– టాటా టెలీసర్వీసెస్‌ను భారతీ ఎయిర్ టెల్లో విలీనం చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ విలీనానికి టెలికమ్యునికేషన్స్ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. అక్టోబర్ 2017లో విలీన ప్రకటన వెలువడింది. -
డీఆర్టీలో కేసు దాఖలుకు ‘పరిమితి’ రెట్టింపు
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ రుణ బకాయిలు రాబట్టుకునే విషయంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో కేసు దాఖలుకు అవసరమైన మొత్తాల పరిమితిని గురువారం కేంద్రం రూ. 20 లక్షలకు పెంచింది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ పరిమితి 10 లక్షలు. దీనివల్ల ఇకపై రూ.20 లక్షల పైబడిన బకాయిలను రాబట్టుకోడానికి మాత్రమే డీఆర్టీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆశ్రయించగలుగుతాయి. డీఆర్టీలో అధిక సంఖ్యలో కేసులు పేరుకుపోతుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో 39 డీఆర్టీలు ఉన్నాయి. -
భారత్ వృద్ధి బాట పటిష్టం!
న్యూయార్క్: భారత్ వృద్ధి తీరు పటిష్టంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2018–2019లో వృద్ధి 7.3 శాతమని అంచనావేయగా, 2019–2020 ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషించింది. పెట్టుబడులు స్థిరరీతిన పెరుగుతుండడం, ప్రైవేటు వినియోగంలో వృద్ధి దీనికి కారణమని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. నివేదికలో ముఖ్యాంశాలను చూస్తే... సమీప భవిష్యత్‌తో భారత్ స్థూల ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్ బాగుంది. ద్రవ్యోల్బణం 2018–19లో 5.2 శాతంగా ఉంటుంది. డిమాండ్ పరిస్థితులు పటిష్టంగా ఉండడం, రూపాయి విలువ క్షీణత, చమురు ధరలు, హౌసింగ్ రెంట్ అలవెన్స్‌ల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల పెంపు దీనికి కారణం. 2018–19కి సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్ అకౌంట్ లోటు 2.6%గా ఉంటుంది. చమురు ధరల పెరుగుదల, దిగుమతులకు డిమాండ్ దీనికి కారణం. భారత్ ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి తగిన చర్యలు ఉన్నాయి. బ్యాంకింగ్ రుణ వృద్ధి మెరుగుపడుతోంది. బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో చర్యలు ఉన్నాయి. రానున్న కొద్ది దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకపాత్ర పోషించనుందని ఐఎంఎఫ్ మిషన్ చీఫ్ (ఇండియా) రానిల్ సెల్గాడో పేర్కొన్నారు. ఈ విషయంలో గత చైనా పాత్రను ఇకపై భారత్ పోషించే వీలుందని అన్నారు. 2016 ద్వితీయార్ధంలో డీమోనిటైజేషన్, ఆ తర్వాత జీఎస్టీ అమలుపరమైన షాక్‌ల నుంచి భారత ఎకానమీ కోలుకుంటోంది. మెరుగైన స్థూలఆర్థిక విధానాలు, ఇటీవలి కాలంలో అమలు చేసిన కొన్ని కీలక సంస్కరణల ఊతంతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతోంది ఇటీవలి రేట్ల పెంపు సరైనదే. రాబోయే రోజుల్లోనూ పాలసీని క్రమంగా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
ఫెడ్ నిర్ణయం... ఉద్యోగ గణాంకాలు!
ముంబై/న్యూయార్క్: ఏప్రిల్ 30 నుంచి మే 4 మధ్య కాలంలో పసిడి కదలికలు అమెరికాకు సంబంధించి రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో మొదటిది బుధవారం జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన సమీక్షకాగా , రెండవది శుక్రవారం నాడు వెలువడే ఏప్రిల్ ఉపాధి కల్పనా గణాంకాలు. ఈ రెండు అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) పసిడి నాలుగు నెలల శ్రేణిని (1,300 డాలర్లు – 1,370 డాలర్లు) మారడానికి వీలు కల్పించే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ (గడచిన వారంలో 90.08 నుంచి 91.31కి పెరుగుదల) కదలికలు పసిడిని ప్రభావం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన వారంలో పసిడి 13 డాలర్లు నష్టపోయి 1,324 డాలర్ల వద్ద ముగిసింది. ఇది నెల కనిష్ట స్థాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సడలుతున్న సంఘర్షణాత్మక ధోరణి ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. కాగా డాలర్ బలోపేతం కొనసాగకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో పసిడి పెట్టుబడులకు మంచిదేనని వారు విశ్లేషిస్తున్నారు. 1,370 డాలర్ల నిరోధాన్ని దాటి పసిడి మరో 100 డాలర్లు దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందన్నది కొందరి విశ్లేషణ. రూపాయి విలువతో సర్దుబాటు... అంతర్జాతీయంగా పసిడి విలువ కదలికలు ఎలాఉన్నా... ఆ ప్రభావం దేశీయంగా విభిన్నంగా ఉంటుందన్నది దేశీయంగా నిపుణుల అభిప్రాయం. దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ మార్పులు పసిడి ధరను దేశీయంగా నిర్ణయిస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా డిమాండ్ పరిస్థితులూ దేశంలో ధరను నిర్ధేశిస్తాయని వారు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా గత వారంలో పసిడి గడచిన వారంలో 13 డాలర్లు తగ్గినా, ఇక్కడ మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో– ఎంసీఎక్స్‌లో పసిడి రూ.221 మాత్రమే నష్టపోయి 31,211కు చేరింది. రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగి వారాంతంలో 66.62 వద్ద ముగియడం (ఒక దశలో 67ను సైతం దాటింది) ఇక్కడ గమనార్హం. వెండి ధర ఎంసీఎస్‌లో కేజీకి రూ.39,004 వద్ద ముగిసింది. ఇక స్పాట్ మార్కెట్– ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వారంలో రూ.135 చొప్పన తగ్గి, వరుసగా 31,330, రూ.31,180 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ.890 పడి 39,270కి చేరింది. -
రక్షణాత్మక వాణిజ్యం వృద్ధికి విఘాతం
హాంకాంగ్: వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వృద్ధికి విఘాతంగా మారతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు విడనాడాలని హెచ్చరించారు. అమెరికా–చైనాల మధ్య ‘వాణిజ్య యుద్ధ’ భయాల నేపథ్యంలో ఆమె ఇక్కడ ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు... ► ప్రపంచ వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య విధానాలే సరైనవి. ఇందుకు విరుద్ధమైన బాటను దేశాలు విడనాడాలి. ఏ రూపంలోనూ వాణిజ్య రక్షణాత్మక విధానాలు అనుసరించకూడదు. ►తగిన వాణిజ్య విధానాలు లేనందువల్లే వాణిజ్య లోటు ఏర్పడ్డానికి కారణమన్న అభిప్రాయం తప్పు. (అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ఈ తరహా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ►ఒక విషయం గుర్తుంచుకోవాలి. బహుళ వాణిజ్య విధాన వ్యవస్థే ప్రపంచం మార్పునకు కారణం. అత్యంత పేదరికంలో జీవిస్తున్న ప్రజల పేదరికాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అధిక వేతనాలతో లక్షలాది ఉద్యోగాలను ప్రపంచవ్యాప్తంగా సృష్టించడానికి ఈ వ్యవస్థ దోహదపడింది. ►వ్యవస్థలో లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప, దీనిని మొత్తంగానే తప్పుపట్టడం తగదు. ►కొత్త సాంకేతికత, ఇందుకు సంబంధించి విద్య, శిక్షణల్లో పెట్టుబడుల పెంపుతో వృద్ధిని మరింత పెంపొందించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ►ప్రపంచ వాణిజ్య వృద్ధి పట్ల మేము పూర్తి ఆశావహంతో ఉన్నాము. 2018, 2019లో 3.9 శాతం వృద్ధి నమోదవుతుందన్నది జనవరిలో ఐఎంఎఫ్ వేసిన అంచనా. ►అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం తాజా వృద్ధి రికవరీ ధోరణి బాగుంది. చైనా, భారత్, జపాన్‌లో కూడా పటిష్ట వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. -
ఆర్బీఐ రేట్ల నిర్ణయం నేడు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెండు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ గురువారం ప్రధాన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. 2018–19లో ఆర్బీఐ మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలుచేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత, దేశంలో పెట్రో ధరల పెంపు, వర్షపాతం, పంట దిగుబడులపై అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు వారు కారణంగా చూపుతున్నారు. ఆగస్టు తర్వాత ఇప్పటివరకూ రెపోను ఆర్బీఐ తగ్గించలేదు. -
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ద్రవ్య విధానం సమావేశం ముగిసిన అనంతరం మార్కెట్ అంచనాలను అనుగుణంగానే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. తమ వడ్డీ రేట్లను ఎలంటి మార్పులలేకుండా యధాతథంగా ఉంచినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది బ్యాంక్ ఆఫ్ జపాన్ మంగళవారం మానిటరీపాలసీ విధానాన్ని ప్రకటించింది. రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత విడుదలైన ఒక ప్రకటనలో డిపాజిట్ రేట్లను -0.1శాతం వద్ద 10 సంవత్సరాల లక్ష్యాన్ని జీరో శాతంగాను నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నెలలోనే దీర్ఘకాల ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను స్వల్పంగా తగ్గించింది. కాగా ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ప్రపంచ కేంద్ర బ్యాంకుల అడుగుజాడలను అనుసరిస్తుందనే ఊహాగానాలొచ్చాయి. దీనికి అనుగుణంగానే బీఓజే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. వినియోగదారుల ధర సూచిక నవంబరులో సంవత్సరం ప్రాతిపదికన 0.9 శాతం పెరిగింది, వరుసగా 11 వ నెల పెరుగుదల నమోదయింది. కాగా మెట్రిక్ ఒక రాయిటర్స్ పోల్ ప్రకారం, డిసెంబర్ లో అదే స్థాయి పెరుగుతుందని అంచనా. డిసెంబర్ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఆహార, ఇంధనం ధరలను మినహాయించిన వినియోగదారుల ధరలు నవంబర్‌లో కేవలం 0.3 శాతం పెరిగాయి. -
ఆరుగురు సభ్యుల్లో.. కేవలం ఒక్కరు మాత్రమే
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా 6 శాతంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని తీసుకునే ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీలో, ఐదుగురూ యథాతథంగా కొనసాగించడానికే అంగీకారం తెలిపారు. కానీ ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే రేట్ల కోతకు ఓటు వేశారు. ఆయనే అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ రవీంద్ర దోలకియా. ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీల్లో ఈయన ఒకరు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు మానిటరీ పాలసీ ప్రకటనలో వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటిస్తారు. నేడు ప్రకటించిన ఈ పాలసీ ప్రకటనలో డాక్టర్. చేతన్ ఘటే, డాక్టర్. పామి దువా, డాక్టర్ వైరల్ వీ.ఆచార్య, మైఖెల్ పాత్ర, డాక్టర్ ఉర్జిత్ పటేల్, రవీంద్ర దోలకియా ఉన్నారు. కేవలం రవీంద్ర దోలకియా మాత్రమే 25 బేసిస్ పాయింట్ల వరకు రెపోను తగ్గించవచ్చని పేర్కొన్నారు. గత పాలసీలో కూడా ఆయన రేటు కోతకే మొగ్గుచూపారు. అంతేకాక 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆగస్టు సమావేశంలో కూడా 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ ఆర్బీఐ మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో, రెపోను యథాతథంగానే ఉంచుతూ వస్తోంది. వచ్చే రెండు క్వార్టర్లలో ద్రవ్యోల్బణం 4.2 శాతం నుంచి 4.6 శాతానికి పెరుగుతుందని, క్రూడ్ ఆయిల్ ధరలు, కూరగాయల ధరలు 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరుగుతాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
బీఓజే వడ్డీరేట్లు యధాతథం
టోక్యో: బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీలో తటస్థ వైఖరినే అవలంబించింది. శుక్రవారం చేపట్టిలో పాలసీ రివ్యూలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. ద్రవ్యోల్బణాన్ని పెంచే లక్ష్యంతో, జపాన్ బ్యాంకు శుక్రవారం విధాన మార్పులను కొనసాగించలేదు. ద్రవ్యోల్బణాన్ని ఎత్తివేసే లక్ష్యంతో ద్రవ్య ఉద్దీపన కొనసాగించింది. చాలామంది ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే జపనీస్ ప్రభుత్వ బాండ్ దిగుబడి లక్ష్యంతో 10 సం.రాల బాండ్ రేటు జీరోశాతం వద్ద, స్వల్పకాలిక బాండ్లను 0.1శాతంగాను నిర్ణయించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆరునెలల్లో మూడు సార్లు వడ్డీరేట్లు పెంచిన అనంతరం జపాన్ సెంట్రల్ బ్యాంక్ అల్ట్రా-ఈజీ వైఖరిని తీసుకుంది. -
వచ్చే 18నెలలూ వడ్డీరేట్లు యథాతథం!
న్యూఢిల్లీ : వడ్డీరేట్లపై ఆశలు పెంచుకుంటున్న మార్కెట్ వర్గాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిరాశపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పడికప్పుటి ద్వైపాక్షిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో సెకండరీ వడ్డీరేటును పెంచినప్పటికీ, నగదు లభ్యత ఎక్కువగా ఉందనే కారణంతో కీలక రెపో రేటులో ఎటువంటి మార్పు చేపట్టలేదు. ఇదే విధమైన పాలసీని ఆర్బీఐ వచ్చే 18 నెలల పాటు కొనసాగించనుందట. వచ్చే ఏడాది వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. 35 మందికి పైగా ఆర్థికవేత్తలపై ఏప్రిల్ 10-19 మధ్య జరిపిన పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. 2018 నాలుగో త్రైమాసికం వరకు ఆర్బీఐ రెపోరేటును 6.25 శాతంగానే ఉంచనున్నట్టు తెలిసింది. అంతేకాక రివర్స్ రెపో రేటు 6.00 శాతంగా ఉండనున్నట్టు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అనేది రిజర్వు బ్యాంకు అతిపెద్ద ఆందోళనకరమైన అంశంగా మారిందని, ప్రస్తుతం సులభతరమైన ద్రవ్యవిధానాన్ని ఇది హరిస్తుందని క్రిసిల్కు చెందిన ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ ధర్మకీర్తి జోషి చెప్పారు. గత నెల వార్షిక వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పెరిగిందని, 2016 అక్టోబర్ నుంచి ఈ నెలలోనే చాలా వేగవంతంగా పెరిగిందని పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతానికి దగ్గరగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5 శాతానికి వస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో వడ్డీరేట్ల కోత అంచనాలను వారు తగ్గిస్తున్నారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడానికే ఆర్బీఐ మొగ్గుచూపుతుందని పేర్కొంటున్నారు. -
వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాల్ అదే
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగిస్తున్న జైట్లీ, ఎన్ని అడ్డంకులున్నా భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా వద్ధి చెందుతోందని పేర్కొన్నారు. చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి కూడా వర్థమాన దేశాలకు రెండో అతిపెద్ద సవాల్‌గా నిలవబోతుందని ఉద్ఘాటించారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్టంగా ఉన్న విధానాలకు స్వస్తి పలికామన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్‌మనీ హోల్డర్స్ భరతం పట్టడానికి నోట్లను రద్దు చేసినట్టు చెప్పారు. భారత్ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద తయారీదేశంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉందన్నారు. సీపీఐ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 2 శాతం నుంచి 6 శాతానికి మధ్యలోనే ఉందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. '' ఎఫ్ఐఐలు రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా లోటు 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. 2016లో 3.2 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు, 2017లో 3.4 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేస్తోంది. వర్థమాన దేశాల వద్ధి రేటు 4.1 శాతం-4.5 శాతం పెరుగుతున్నాయి'' అని జైట్లీ పేర్కొన్నారు. -
నోట్ల రద్దు హడావుడి చర్య కాదు: పటేల్
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని.. పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాతే ఈ చర్యను తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు వల్ల తలెత్తే పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం వెలువడింది. తదనుగుణంగానే అత్యంత గోప్యతతో కూడిన ఈ ప్రక్రియ, ప్రణాళికను ఆచరణలోకి తీసుకొచ్చాం. సామా న్య ప్రజలకు తక్షణం కొన్ని ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం, ఆర్బీఐకి తెలుసు. వీటని అధిగమించేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. స్వల్పకాలికంగా ప్రతికూలతలు ఉన్నా.. చాలా పరిమితమే. రద్దు చేయని నోట్ల సరఫరాను పెంచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని పటేల్ వ్యాఖ్యానించారు. మరిన్ని కొత్త రూ.500, రూ.100 నోట్లను ముద్రించేందుకు గడిచిన రెండు వారాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లను సమాయత్తం చేశామని పటేల్ వెల్లడించారు. రూ. 2,000 నోట్ల ముద్రణ కూడా భారీగా పెరగనుందని, బ్యాంకులకు ఇవి సరఫరా అయితే ఇబ్బందులకు కొంత అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇక బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని.. అవసరాన్నిబట్టి దీనిలో మార్పులు చేస్తామని ఉర్జిత్ తెలిపారు. ఇక మళ్లీ కొత్త రూ.1,000 నోట్లను ప్రవేశపెట్టాలా వద్దా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... ప్రజల అవసరాలకు అనుగుణంగా రానున్న కాలంలో దీనిపై చర్యలు ఉంటాయన్నారు. రూ.11.85 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయ్... డీమోనిటైజేషన్ తర్వాత ఇప్పటివరకూ రూ.11.85 లక్షల కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు, మార్పిడి రూపంలో వెనక్కి వచ్చాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ పేర్కొన్నారు. కొత్త నోట్ల ప్రింటింగ్‌ను పూర్తి సామర్థ్యంతో జరిపేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయన్నారు. తాజా గణాంకాల ప్రకారం చలామణీలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.15.5 లక్షల కోట్లుగా అంచనా. ‘నోట్ల రద్దు తర్వాత నవంబర్ 10-డిసెంబర్ 5 మధ్య ఆర్బీఐ వివిధ డినామినేషన్లలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల విలువైన నోట్లను సరఫరా చేసింది. ఈ వ్యవధిలోనే దాదాపు 1910 కోట్ల తక్కువ డినామినేషన్ నోట్లను ఆర్బీఐ కౌంటర్లు, బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చాం. గడిచిన మూడేళ్లలో ఆర్బీఐ సరఫరా చేసిన మొత్తం నోట్ల కంటే ఇవి ఎక్కువ. నోట్ల లభ్యత విషయంలో ప్రజలు ఆందోళన చెందక్కర్లేదు’ అని గాంధీ పేర్కొన్నారు. -
ఆర్బీఐ పాలసీపైనే చూపు
♦ కొన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈ వారంలోనే ♦ ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం ♦ ఈ వారం మార్కెట్ గమనంపై అంచనాలు న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ వెలువరించే ద్రవ్య పరపతి విధానం, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి, పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ అంశాలన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు వర్షపాత విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం.. తదితర అంశాల ప్రభావమూ ఉంటుందని వారంటున్నారు. యథాతథంగానే రేట్లు... రెండు నెలలకొకసారి నిర్వహించే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష ఈ మంగళవారం(ఈ నెల 9న) జరగనున్నది. కాగా కీలక రేట్లలో యథాతథ స్థితిని ఆర్బీఐ కొనసాగించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఆర్బీఐ పాలసీ, కంపెనీల ఆర్థిక ఫలితాలపైననే అందరి చూపు ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడి దాదాపు పూర్తికావచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం కీలక గణాంకాలు.. ఈ వారంలో పలు కీలక కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12(శుక్రవారం) వెలువడనున్నాయి. అదే రోజు జూలై నెల వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, వివిధ దేశాల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. జూన్ నెల జర్మనీ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సోమవారం, ఇంగ్లండ్ జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాం కాలు మంగళవారం రోజున, జూలై నెల చైనా పారిశ్రామిక గణాంకాలు గురువారం వెలువడతాయి. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరు కొనసాగుతోంది. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఈ నెల మొదటివారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,290 కోట్లు పెట్టుబడులు పెట్టారు. -
భారత్ ద్రవ్య విధానానికి రుణాల అడ్డంకి!
♦ స్వేచ్ఛగా వ్యవహరించలేకుంటే ఇబ్బందులే ♦ మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక అంచనాలు న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవ్య విధానాన్ని మరింత సరళీకరించడానికి అధిక రుణాలే అడ్డంకిగా నిలుస్తాయని రేటింగ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. అయితే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవటం వల్ల ఆసియా పసిఫిక్ దేశాల రుణాలపై చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదని కూడా స్పష్టంచేసింది. ‘సార్వభౌమదేశాలు, బ్రెగ్జిట్, ఆసియా పసిఫిక్ దేశాలు; పరిమిత డెరైక్ట్ క్రెడిట్ ప్రభావం; కొన్ని దేశాల్లో మార్కెట్ హెచ్చుతగ్గులు’ అనే అంశాలను ప్రస్తావిస్తూ విడుదల చేసిన తాజా నివేదికలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఈ విషయాలు తెలియజేసింది. బ్రెగ్జిట్‌కు సంబంధించి వచ్చే ప్రకటనలతో రానున్న నెలల్లో ఫైనాన్షియల్ మార్కెట్లు ఆటుపోట్లకు గురికావచ్చని సంస్థ పేర్కొంది. ‘‘బ్రిటన్‌లో తక్కువ జీడీపీ వల్ల ఇతర ప్రపంచ దేశాల వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. కాకపోతే బ్రిటన్‌తో ఆసియా పసిఫిక్ దేశాలకున్న వాణిజ్య ఒప్పందాలు పరిమితమేనని గుర్తుంచుకోవాలి. ఇదేమీ లెక్కలు వేసి చెబుతున్నది కాదుగానీ... పోర్ట్‌ఫోలియో, బ్యాంకింగ్ నిధులు మళ్లింపు వల్ల ఆసియా పసిఫిక్ దేశాల్లో నిధులకు కటకట ఏర్పడి వృద్ధికి విఘాతం కలిగే అవకాశముంది’’ అని మూడీస్ నివేదిక వివరించింది. -
రేటు కోత ఉండకపోవచ్చు: ఎస్బీఐ చీఫ్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 2 తన పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేటును తగ్గించకపోవచ్చన్న అభిప్రాయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఆర్బీఐ తన కఠిన పరపతి విధానాన్ని విడనాడే అవకాశం ఉందని కూడా అంచనావేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ విధానంపై ‘బేస్ ఎఫెక్ట్’ అంశం ప్రభావితం చూపే అవకాశం ఉంటుందని అన్నారు. డీఅండ్‌బీ అంచనా ఇదీ... నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 1.8 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ)ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. తగిన పరిశీలన చేశాకే ఎంవోయూ కుదుర్చుకున్నాం అదానీ గ్రూప్ రుణంపై వివరణ అదానీ గ్రూప్‌నకు రుణమిచ్చేందుకు కేవలం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవో యూ) మాత్రమే కుదుర్చుకున్నామని, తగిన పరిశీలన చేశాకే నిధులను విడుదల చేస్తామని ఎస్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. ఆస్ట్రేలియాలోని కార్మైఖేల్ బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌నకు ఎస్బీఐ 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,200 కోట్లు) రుణంఇచేందుకు ఇటీవలే ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఈ అంశంపై ఇప్పటికే పలు విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎస్బీఐ వివర ణకు ప్రాధాన్యత ఏర్పడింది. చైర్పర్సన్ అరుంధతీ కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చారు. -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే...
ముంబై: ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయలేదు. దీనితో స్వల్పకాలిక రుణ రేటు రెపో(8 శాతం) సహా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్-4 శాతం), స్టాల్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్-22 శాతం) యథాయథంగా కొనసాగనున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులూ చేయకపోవడం ఇది వరుసగా నాల్గవసారి. ధరల పెరుగుదల భయాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంచనాల స్థాయికి ద్రవ్యోల్బణం దిగివచ్చేంతవరకూ రేట్ల కోత అవకాశం లేదని ఉద్ఘాటించింది. మొత్తంగా చూస్తే పండుగల సీజన్లో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అటు బ్యాంకర్లు, ఇటు పరిశ్రమలు కొంత నిరాశకు గురయ్యాయి. పండుగల సీజన్లో వడ్డీరేట్లు తగ్గవచ్చన్న అంచనాలు దీనితో ఆవిరయ్యాయి. సమీక్ష... ముఖ్యాంశాలు... పస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5%. 2015-16లో ఈ రేటు 6.3 శాతం ఉంటుందన్నది అంచనా. తొలి త్రైమాసికంలో(2014-15, ఏప్రిల్-జూన్) 5.7% వృద్ధి రేటు 3, 4 త్రైమాసికాల్లోనూ కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. అయితే క్యూ4లో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉండవచ్చు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతంగా ఉంటుందని అంచనా. 2016 నాటికి 6 శాతానికి తగ్గవచ్చు. చిన్న, పేమెంట్ బ్యాంకులపై మార్గదర్శకాలు నవంబర్ చివరి నాటికి వెలువడతాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై సానుకూలత. ‘నో యువర్ కస్టమర్’ నిబంధనల సరళీకరణ. బ్యాంక్ అకౌంట్ల ప్రారంభానికి సొంత ధ్రువీకరణ పత్రాలకు సైతం అనుమతి. ‘లో రిస్క్’ అకౌంట్ల విషయంలో కాలగుణంగా చిరునామా ధ్రువీకరణలకు సంబంధించి నిబంధనల సరళతరం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి నిర్వచనంలో మార్పు ప్రక్రియ. రుణ ఎగవేత కంపెనీల డెరైక్టర్లనూ ఈ పరిధిలోకి తెచ్చేలా మార్పులు. మోసాల నివారణకు సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఏర్పాటు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు వల్ల బ్యాంకింగ్‌కు సంబంధించి నెలకొన్న రుణ సమస్యలను ఎదుర్కొనే సత్తా, వెసులుబాటు వ్యవస్థలో ఉంది. బాండ్ మార్కెట్లో ట్రేడింగ్ మరింత పెరిగేందుకు చర్యలు. జన ధన యోజన వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ సేవలు మరింత విస్తృతం అవుతాయని భావిస్తున్నాం. ఇందుకు సంబంధించి నో యువర్ కస్టమర్ నిబంధనల సరళీకరణ వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండ వు. తదుపరి ద్వైమాసిక పరపతి సమీక్ష డిసెంబర్ 2న. బ్యాంకర్లు ఏమన్నారంటే... ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో రుణ, డిపాజిట్ రేట్లు సమీప భవిష్యత్తులో తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ... అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయన్నారు. అయితే మార్చితో పోల్చిచూస్తే, రేట్ల పెంపుకన్నా తగ్గింపువైపే పాలసీ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని మాత్రం ఆమె అన్నారు.ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ద్రవ్య లభ్యత(లిక్విడిటీ) పరిస్థితులు, రుణ వృద్ధి వంటి అంశాల ఆధారంగానే సమీప భవిష్యత్తులో తమ బ్యాంక్ రేట్లపై నిర్ణయాలు ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ చెప్పారు. -
రిజర్వు బ్యాంకు వెనక్కి తగ్గింది..ఎందుకంటే!
గత కొద్దికాలంగా అమెరికా డాలర్ కొనుగోలు చేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కితగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడమే అందుకు కారణమని ఆర్ధిక రంగ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్చి-జూలై నెలల మధ్యకాలంలో రిజర్వు బ్యాంక్ నిల్వలు 26 బిలియన్ల మేరకు పెరిగినట్టు తెలిసింది. జూలై మాసాంతానికి 317.80 డాలర్లకు చేరుకుందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. మెరుగైన కాపిటల్ అవుట్ ఫ్లో కోసం సాధారణంగా స్పాట్ మార్కెట్ లో డాలర్ ను కొనుగోలు చేసి.. ఫార్వర్డు మార్కెట్ కు రిజర్వు బ్యాంక్ మళ్లింపు చేస్తుంది. భవిష్యత్ లో తలెత్తే అసాధారణ పరిస్థుతులను తట్టుకునేందుకు ఫార్వర్డు మార్కెట్ నిధిని రిజర్వు బ్యాంకును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఫార్వర్డు మార్కెట్ నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో డాలర్ కొనుగోలును రిజర్వు బ్యాంక్ ఆపివేయడానికి కారణమైందని విశ్లేషకులు వెల్లడించారు. -
మందకొడిగా నిఫ్టీ రోలోవర్స్...
ఫిబ్రవరి నెల బుల్లిష్‌గా వుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో కొరవడినట్లు తాజా డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. కొద్ది నెలలుగా ఎన్నడూ లేనేంత నిస్తేజంగా ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్‌కు నిఫ్టీ రోలోవర్స్ సాగాయి. జనవరి సిరీస్ గురువారం ముగియనుండగా, బుధవారం నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్ కాంట్రాక్టులో 18.62 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.42 కోట్ల షేర్లకు చేరింది. జనవరి సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు (డిసెంబర్ 24న) జనవరి ఫ్యూచర్లో ఓఐ 1.59 కోట్ల షేర్ల వరకూ వుంది. అప్పుడు స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 70 పాయింట్లు వుండగా, ఇప్పుడు ఫిబ్రవరి ఫ్యూచర్ ప్రీమియం 34 పాయింట్లకు పరిమితమై వుంది. ఇక ఫిబ్రవరి ఆప్షన్లకు సంబంధించి 6,000 స్ట్రయిక్ వద్ద అధికంగా 39.46 లక్షల షేర్ల పుట్ బిల్డప్, 6,300 స్ట్రయిక్ వద్ద ఎక్కువగా 26.11 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వుంది. ఈ ఆప్షన్ బిల్డప్ ప్రకారం సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ రెండు స్థాయిలూ మద్దతు, నిరోధాలుగా పరిగణించవచ్చు. -
ధరల్ని తట్టుకునేదెలా?
శేఖర్‌ది ప్రైయివేటు ఉద్యోగం. జీతం నెలకు రూ. 25 వేలు. రెండేళ్ల కిందటైతే 22 వేలు. ఏడాదికి 5-6% చొప్పున మాత్రమే పెరిగింది. కానీ ఖర్చులో..? ఇంటద్దె ఒక్కటే ఈ రెండేళ్లలో రెండువేల వరకూ పెరిగింది. మిగిలిన ఖర్చుల సంగతి చెప్పాల్సిన పనేలేదు. వీటన్నిటినీ తట్టుకోవటానికి శేఖర్ సేవింగ్స్ మొత్తం హారతైపోయాయి. పెరుగుతున్న ఖర్చుల్ని ఎలా తట్టుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. ఒక్క శేఖర్‌దే కాదు. జీతంపై ఆధారపడేవారిలో అత్యధికులది ఇదే పరిస్థితి. పెరుగుతున్న ధరలు... అందరినీ ఇదే పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ధరల పెరుగుదలనే... సాంకేతికంగా ద్రవ్యోల్బణంగా పిలుస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటం ఎలా? దేన్లో పెట్టుబడులు పెట్టాలి? ఇదే ఈ వారం ప్రాఫిట్ కథనం... ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లు.. ధరల పెరుగుదల ఆధారంగా వీటిపై రాబడులు ఉంటాయి. నిర్దిష్ట కాలంలో నమోదైన ద్రవ్యోల్బణం కన్నా దాదాపు ఒకటిన్నర శాతం ఎక్కువ వడ్డీ వీటిపై లభిస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 10% ఉందనుకుంటే.. మీకు ఏడాదికి 11.5 శాతం మేర వడ్డీ లభిస్తుందన్న మాట. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ నేషనల్ సేవింగ్స్ సెక్యూరిటీస్ (ఐఐఎన్ఎస్ఎస్-సీ) పేరిట వీటిని అందిస్తోంది. వీటిలో పదేళ్ల కాలానికి కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇటీవలే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు గడువును మార్చి నెలాఖరుదాకా ఆర్బీఐ పొడిగించింది. వడ్డీ ఆర్నెల్లకోసారి జమవుతుంది. ఉదాహరణకు.. మీరో లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం 10 శాతంగా, వడ్డీ రేటు దానిపై 1.5% అధికంగా ఉందనుకుంటే.. ఏడాదికి మీకు రూ.11,500 రావాల్సి ఉంటుంది. అయితే, ఆర్నెల్లకోసారి వడ్డీ జమ అవుతుంది కనుక.. ఆ కాలంలో మీకు రూ. 5,750 వడ్డీ వస్తుంది. ఇది అసలుకు జమ అయి.. మొత్తం 1,05,750 అవుతుంది. ఒకవేళ, మిగతా ఆరు నెలల కాలంలో ద్రవ్యోల్బణం మరో అరశాతం పెరిగి 10.5 శాతానికి చేరిం దంటే.. మీకు 12 శాతం వడ్డీ వస్తుంది. అంటే..ఆ ఆరు నెలల కాలానికి రూ. 1,05,750 పైన సుమారు రూ. 6,345 దాకా లభిస్తుంది. ఈ విధంగా ఏడాది తిరిగేసరికి.. రూ. 1లక్ష ఇన్వెస్ట్మెంట్ కాస్తా రూ.. 1,12,095కి పెరుగుతుంది. ద్రవ్యోల్బణానికి ఉన్న లింకుతో వీటిపై వడ్డీ రేటు కూడా మారుతుంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గితే దానికి అనుగుణంగా వడ్డీ రేటూ తగ్గుతుంది. ద్రవ్యోల్బణం సున్నా స్థాయి కన్నా కిందికి (డిఫ్లేషన్) పడిపోతే కనీసం 1.5% వడ్డీ లభిస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ బాండ్ల విషయంలో నిర్దిష్ట గడువులోగా వైదొలగాలనుకుంటే కొంత పెనాల్టీ పడుతుంది. ఈ బాండ్లను తనఖా పెట్టి రుణాలూ తీసుకోవచ్చు. ఈ బాండ్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. పన్నుపరమైన ప్రయోజనాలను చూస్తే.. అధికాదాయ వర్గాల కన్నా సాధారణ ఆదాయ వర్గాలకు (10, 20% పన్ను పరిధిలోని వారు) ఇది ఉపయోగకరంగా ఉంటుందని ట్యాక్సేషన్ నిపుణుల మాట. ఇటీవలే ఎల్అండ్టీ వంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లను జారీ చేశాయి. షేర్లు..మ్యూచువల్ ఫండ్లు.. ద్రవ్యోల్బణం బారి నుంచి తప్పించుకునేందుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం కొంత ఉపకరిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లకు కొలమానమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ గడిచిన పదేళ్లలో సగటున 16 శాతం మేర రాబడులిచ్చింది. ఇక ద్రవ్యోల్బణం ఈ పదేళ్లలో సగటున 7 శాతం మేర పెరిగింది. ఈక్విటీల్లో కనీసం మూడేళ్లు అంతకన్నా ఎక్కువ కాలమే ఇన్వెస్ట్ చేయాల్సి రావొచ్చు. షేర్లలో పెట్టుబడులు పెట్టాలంటే వాటిపై కాస్తో కూస్తో అవగాహన తప్పనిసరి. మార్కెట్లు, ఆయా కంపెనీల పనితీరు, వాటిని ప్రభావితం చేసే అంశాల వంటివి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వద్దని భావించేవారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలోనూ నెలకింత చొప్పున పెట్టేలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ఎంచుకోవచ్చు. ఫండ్స్‌ను ఎంచుకునేటప్పుడు వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ స్కీములను ఎంచుకోవడం మంచిది. ప్రతికూల రిటర్న్‌లు..! బ్యాంకు డిపాజిట్లలో రిస్కనేది ఉండదు. చాలా సేఫ్. కానీ వీటిపై వచ్చే రాబడులు ద్రవ్యోల్బణం బారి నుంచి కాపాడలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ గరిష్టంగా 9% దాకా ఉండగా... ద్రవ్యోల్బణం 10 శాతాన్ని దాటుతోంది. మనకు 9 రూపాయలు వడ్డీ వస్తే ఇతరత్రా ధరల పెరుగుదల రూ.10 దాకా ఉందన్న మాట. మరో రూపాయి మన సేవింగ్స్ నుంచి పెట్టాలి. వీటికితోడు వడ్డీపై ఆదాయపు పన్ను కూడా ఉంటుంది. మరో ప్రధాన విషయమేంటంటే ఈ ద్రవ్యోల్బణంలో ఇంటద్దె, స్కూల్ ఫీజు వంటివి ఉండవు. వాటి పెరుగుదల ఈ ద్రవ్యోల్బణానికి రెట్టంపు ఉంటుందనటం అతిశయోక్తి కాదు. అందుకని కాస్తో కూస్తో రిస్కున్నా ఇతర సాధనాల వైపు చూడక తప్పదు. బంగారం.. రియల్టీ పెట్టుబడుల విషయంలో మన దగ్గర బంగారం, రియల్ ఎస్టేట్‌కి ఉన్నంత క్రేజ్ మరో సాధనానికి లేదనడం అతిశయోక్తి లేదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ఇవి కూడా మంచి సాధనాలే. అయితే, ఇతర సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో ఒక్కసారిగా పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో పసిడి, రియల్టీ ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో మీ పోర్ట్‌ఫోలియోలో ఈ రెండింటికీ ఒక మోస్తరు నిధులు కేటాయిస్తే మంచిదే. చివరిగా ఒక్క విషయం.. ఏ సాధనంలోనైనా అంతర్గతంగా కొన్ని రిస్కులుంటాయి. ఎందులోనైనా డబ్బు పెడితే ఒకోసారి వంద రెట్లు పైగా లాభాలూ రావొచ్చు.. కొన్ని సార్లు అసలు రాకపోనూవచ్చు. అధిక రాబడులు కోరుకున్న పక్షంలో అధిక రిస్కులూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. -
ఫెడ్ కోతతో ఇబ్బందిలేదు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల కోత(ట్యాపరింగ్)తో... దేశీ మార్కెట్లపై తీవ్ర ప్రభావమేమీ ఉండబోదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. భారత్ ఎగుమతులు పుంజుకుంటున్నాయని, అదేవిధంగా కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) సైతం మెరుగుపడుతోందన్నారు. సోమవారం ఇక్కడ విడుదల చేసిన అర్ధవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఈ విషయాలను పేర్కొన్నారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ట్యాపరింగ్ పరిణామాలను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీతో పోలిస్తే క్యాడ్ 3%లోపే ఉండొచ్చు’ అని రాజన్ చెప్పారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో క్యాడ్ 3.05 శాతానికి దిగొచ్చింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆశ్చర్యకరంగా 1.2 శాతానికి పరిమితం కావడం గమనార్హం. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది చరిత్రాత్మక గరిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏ) గడిచిన ఆరు నెలలుగా పెరుగుతూవస్తుండటం అత్యంత ఆందోళనకరంగా పరిణమించిందని రాజన్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి వ్యవస్థీకృత ముప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే... బ్యాంకుల స్థూల ఎన్పీఏలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 4.6 శాతానికి ఎగబాకవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరికి స్థూల ఎన్పీఏలు 4.2 శాతం(రూ.2.29 లక్షల కోట్లు)గా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ పరిమాణం రనూ.167 లక్షల కోట్లు. కాగా, మొత్తం రుణాల్లో పునర్వ్యవస్థీకరణ రుణాలు కూడా 2013-14 క్యూ2(జూలై-సెప్టెంబర్) నాటికి ఆల్‌టైమ్ గరిష్టానికి(రూ.4 లక్షల కోట్లు) దూసుకెళ్లడం గమనార్హం. క్రితం క్యూ2తో పోలిస్తే 10.2 శాతం ఎగబాకినట్లు నివేదిక వివరించింది. కాగా, 2015 మార్చినాటికి స్థూల ఎన్పీఏలు 4.4 శాతానికి మెరుగుపడొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అయితే, ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారితే ఇది 7 శాతానికి కూడా పెరిగే ముప్పు ఉందని నివేదిక హెచ్చరించింది. అన్నింటికంటే ప్రభుత్వరంగ బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు వడ్డీరేట్ల తగ్గింపు ఇతరత్రా పాలసీ సడలింపులపై దృష్టిపెట్టాలనుకున్నా.. అధిక ద్రవ్యోల్బణం కారణంగా సాధ్యంకావడం లేదని రాజన్ చెప్పారు. మంచి వర్షపాతంతో వ్యవసాయ దిగుబడులు పుంజుకోనున్నాయని, దీంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. స్థిరమైన సర్కారు రాకపోతే అంతే..! 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త రిస్క్‌లు పొంచిఉన్నాయని నివేదిక పేర్కొంది. ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోతే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుందన్నారు. స్థిరమైన సర్కారు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కూడా దీనికోసమే ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
రేట్ల పెంపుపై ఇప్పుడే చెప్పలేం: బ్యాంకర్లు
ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వివిధ విభాగాలపై వడ్డీరేట్ల పెంపు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఒక నిర్దిష్ట వైఖరిని బ్యాంకర్లు వెల్లడించలేదు. రేట్లలో మార్పు అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. అయితే ఆ మార్పులు ఏమిటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ అంశాన్ని అసెట్ లయబిలిటీ కమిటీ పరిశీలిస్తుందని మాత్రం అన్నారు. నిధుల లభ్యత భారం వంటి అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెడ్ ఆదిత్య పురి మాట్లాడుతూ, గత మూడు నెలల్లో నిధుల సమీకరణ వ్యయం భారంగా ఉందన్నారు. అన్ని విషయాలనూ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. పాలసీపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎండీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ కేఆర్ కామత్ మాట్లాడుతూ, ద్రవ్య లభ్యత పరిస్థితులు మెరుగుపరుచుకోడానికి డిపాజిట్ రేట్లను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే అది వడ్డీరేట్ల పెంపునకు సైతం దారితీసే అవకాశం ఉందని విశ్లేషించారు. కాగా ఎస్ఎంఎస్ అలర్ట్‌కు సంబంధించి ఏకమొత్తంగా ఒకే ఫీజు వడ్డించకుండా వాడకాన్ని బట్టే వసూలు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించడంపై భట్టాచార్య మాట్లాడుతూ, ఇలాంటి విధానం అమలు కొంత కష్టమేనన్న అభిప్రాయపడ్డారు. -
రూపాయి 46 పైసలు డౌన్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ గురువారం దేశీయ కరెన్సీకి బూస్ట్నిచ్చినప్పటికీ, శుక్రవారం పాలసీ సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ గాలి తీసేసింది. అనూహ్య రీతిలో రెపో రేటును పావు శాతంమేర పెంచడంతో డాలరుతో మారకంలో రూపాయి 46 పైసలు క్షీణించింది. 62.23 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే బాటలో కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటును 7.25% న ఉంచి 7.5%కు పెంచడంతో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 62.05 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై గరిష్టంగా 61.88ను, కనిష్టంగా 62.61ను తాకింది. చివరకు క్రితం ముగింపు 61.77తో పోలిస్తే 0.7% తగ్గి 62.23 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 161 పైసలు జంప్‌చేసి 61.77 వద్ద నిలిచిన విషయం విదితమే. -
యూఎస్ ఫెడ్, ఆర్ బీఐ నిర్ణయాలే మార్కెట్ కు కీలకం!
హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధానం, యూఎస్ ఫెడరల్ రిజర్వు సమావేశాలే మార్కెట్ కదలికలకు కీలకంగా మారే అవకాశం ఉందని ఆర్ధిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 17-18 తేదిన, రిజర్వుబ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష సెప్టెంబర్ 20 తేదిన జరుగనున్నాయి. ట్రెజరీలలో నెలసరి కోనుగోళ్లను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తగ్గించవచ్చని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నందున్న నిధులు తరలివెళ్లే అవకాశం ఉన్నందున భారత్ తోపాటు ఇతర మార్కెట్లపై స్వల్పకాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి క్షీణిస్తున్నందున మార్కెట్ లోకి నిధుల ప్రవాహంపై ఒత్తిడి పెరిగే సూచనలున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఫెడ్ రిజర్వు తీసుకోబోయే కీలక నిర్ణయాలపై రిజర్వు బ్యాంక్ నూతన గవర్నర్ రఘురాం రాజన్ దృష్టి సారించారు. ఫెడ్ రిజర్వు సమావేశం ఉన్నందున ద్రవ్య సమీక్ష సెప్టెంబర్ 18 తేది నుంచి సెప్టెంబర్ 20 తేదికి మార్చారు. అంతేకాక గవర్నర్ గా ఎన్నికైన తర్వాత రఘురాజన్ తొలి సమీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందర్ని దృష్టి ఆయనే మీదే ఉంది.