
ముంబై: వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వినియోగ డిమాండ్, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వృద్ది తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని..అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించాలంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్, స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ద్రవ్యోల్భణానికి కారణమయ్యే అంశాలను నిరంతరం సమీక్షించి పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్నారు. పాలసీల రూపకల్పనలో సర్వే, డాటాను విశ్లేషిస్తామని, అన్ని అంశాలను పరిశీలించి పాలసీల రూపకల్పన చేస్తామని అన్నారు.
చదవండి: ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్