మందకొడిగా నిఫ్టీ రోలోవర్స్...
ఫిబ్రవరి నెల బుల్లిష్‌గా వుంటుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో కొరవడినట్లు తాజా డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. కొద్ది నెలలుగా ఎన్నడూ లేనేంత నిస్తేజంగా ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్‌కు నిఫ్టీ రోలోవర్స్ సాగాయి. జనవరి సిరీస్ గురువారం ముగియనుండగా, బుధవారం నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్ కాంట్రాక్టులో 18.62 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.42 కోట్ల షేర్లకు చేరింది. జనవరి సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు (డిసెంబర్ 24న) జనవరి ఫ్యూచర్లో ఓఐ 1.59 కోట్ల షేర్ల వరకూ వుంది.
అప్పుడు స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 70 పాయింట్లు వుండగా, ఇప్పుడు ఫిబ్రవరి ఫ్యూచర్ ప్రీమియం 34 పాయింట్లకు పరిమితమై వుంది. ఇక ఫిబ్రవరి ఆప్షన్లకు సంబంధించి 6,000 స్ట్రయిక్ వద్ద అధికంగా 39.46 లక్షల షేర్ల పుట్ బిల్డప్, 6,300 స్ట్రయిక్ వద్ద ఎక్కువగా 26.11 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వుంది. ఈ ఆప్షన్ బిల్డప్ ప్రకారం సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ రెండు స్థాయిలూ మద్దతు, నిరోధాలుగా పరిగణించవచ్చు.