భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ సమావేశంలోని ముఖ్యాంశాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మానిటరీ పాలసీ సమావేశం(ఎంపీసీ)లో ద్రవ్యోల్బణం పోకడలు, ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనలపై చర్చలు జరిగాయి.
ఎంపీసీలోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరికొందరు 25 బేసిస్ పాయింట్లు కట్ చేయాలన్నారు.
రెపో రేటును స్థిరంగా 6.50 శాతం వద్దే కొనసాగిస్తున్నాం.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటు: 6.25 శాతం
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు: 6.75 శాతం
2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ అంచనా 7.2%గా ఉంటుందని అంచనా. అది మొదటి త్రైమాసికంలో 7.3 శాతం నుంచి 7.2కి స్వల్పంగా తగ్గింది. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడు, నాలుగో త్రైమాసికంలో వరుసగా 7.3 శాతం, 7.2 శాతం వద్ద ఉంటుంది. ద్రవ్యోల్బణం 4.5 శాతం నమోదవుతుంది.
జూన్-ఆగస్టులో (ఆగస్టు 6 వరకు) 9.7 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిలువలు భారత్‌కు వచ్చాయి.
ఇదీ చదవండి: 15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి
ఏప్రిల్-మే 2024లో స్థూల ఎఫ్‌డీఐలు 20 శాతానికి పైగా పెరిగాయి.
భారతదేశం విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2,2024 నాటికి 675 బిలియన్ డాలర్లతో చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనా ఆశించిన వర్షపాతం నమోదవుతుంది. దాంతో ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.
అనధికార రుణదాతలను కట్టడి చేసేందుకు డిజిటల్ లెండింగ్ యాప్‌ల కోసం పబ్లిక్ రిపోజిటరీని రూపొందించాలి.
యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు ఆర్‌బీఐ పెంచింది.
చెక్ క్లియరెన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థ ఉండాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment