పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.
ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్‌మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment