బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఎకానమీ రికవరీకి భారీ రేటు పెంపు సరికాదని పేర్కొంది.
సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు ఒక లేఖ రాస్తూ, కొత్త రేటు పెంపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల శ్రేణిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అంతకు మించి పెంపు వద్దని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రిటైల్ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని, రాయితీ వడ్డీ రేటును అందించాలని తన సిఫారసుల్లో అసోచామ్ ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది.
చదవండి: 17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment