వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాల్ అదే
వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాల్ అదే
Published Wed, Feb 1 2017 11:40 AM | Last Updated on Fri, Aug 24 2018 4:48 PM
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగిస్తున్న జైట్లీ, ఎన్ని అడ్డంకులున్నా భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా వద్ధి చెందుతోందని పేర్కొన్నారు. చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి కూడా వర్థమాన దేశాలకు రెండో అతిపెద్ద సవాల్గా నిలవబోతుందని ఉద్ఘాటించారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్టంగా ఉన్న విధానాలకు స్వస్తి పలికామన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్మనీ హోల్డర్స్ భరతం పట్టడానికి నోట్లను రద్దు చేసినట్టు చెప్పారు. భారత్ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద తయారీదేశంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉందన్నారు. సీపీఐ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 2 శాతం నుంచి 6 శాతానికి మధ్యలోనే ఉందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. '' ఎఫ్ఐఐలు రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా లోటు 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. 2016లో 3.2 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు, 2017లో 3.4 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేస్తోంది. వర్థమాన దేశాల వద్ధి రేటు 4.1 శాతం-4.5 శాతం పెరుగుతున్నాయి'' అని జైట్లీ పేర్కొన్నారు.
Advertisement
Advertisement