union-budget-2017
-
తప్పిదాలకు ప్రతిబింబం
రెండో మాట బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు. ‘2017–2018 కేంద్ర బడ్జెట్ అసంఘటిత రంగంలోని కోట్లాదిమంది కార్మికులకు సహాయంగా, వెన్నుదన్నుగా నిలబడడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ఆకస్మికంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో వీరు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడి వాటాలను తెగనమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైగా విదేశీ పెట్టుబడుల నియంత్రణ బోర్డును రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మరింత విస్మయం కలిగించింది. అన్నింటికీ మించి కార్మిక చట్టాలను సవరించే ప్రతిపాదన కోసం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఇది మరింత అసమంజస చర్య. పైగా ఏ దేశ ప్రజలంతా నోట్ల రద్దు చర్యను సమర్థించారని ప్రభుత్వం చెబుతోందో, ఆ పేదలే ఆ కార్మికవర్గాలే నోట్ల రద్దు భారాన్నీ, బాధలనీ అనుభవించాల్సి వచ్చిందని మరువరాదు.’- విరజేశ్ ఉపాధ్యాయ (ఆరెస్సెస్–బీజేపీ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి, 4–2–2017) వివాదాస్పద ప్రకటనలకు, అధికారంలో ఉన్నా లేకున్నా పెక్కుసార్లు సమాజంలో అశాంతి పరిస్థితులకు కేంద్రంగా ఉండే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నుంచి వెలువడిన ప్రకటన ఇది. దీనిని ప్రజలు నమ్మవచ్చా? కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థలు కూడా గతంలోనూ ఇప్పుడూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రకటనలు గుప్పించడం, వాటితో ప్రమేయం లేనట్టు యథా ప్రకారం పార్టీ ఎన్నికల హామీలను చెత్తబుట్టలోకి విసరడమూ ప్రజాబాహుళ్యానికి అనుభవమే. పాలకపక్షాలకు అనుబంధ సంస్థలుగా వర్ధిల్లుతున్న కుహనా ‘కార్మిక, కిసాన్’ సంఘాల లక్ష్యం కూడా రాజకీయ పార్టీల, వాటి నాయకుల ఉనికిని కాపాడేందుకే. అంతేతప్ప, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన త్యాగాలను గౌరవించడానికి, వలస దోపిడీ అవలక్షణాలను తుడిచిపెట్టగల సామాజిక వ్యవస్థను పాదుకొల్పడానికి మాత్రం కాదు. మన పాలకులు కూడా వలస పాలన అవశేషాలను వీడి ప్రజానుకూలమైన పాలనా వ్యవస్థను ఆశ్రయించడానికి సిద్ధపడలేక ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు. తప్పు వెంట తప్పు ఈ పరిణామక్రమంలోనే తమ పాలకపక్షాన్ని రక్షించుకునేందుకు బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి హోదాలో విరజేశ్ ఉపాధ్యాయ ఇలాంటి ప్రకటన చేయక తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు, కార్మికులకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన అపకారాన్ని గుర్తు చేయక తప్పలేదు కూడా. కాబట్టి నోట్ల రద్దును ప్రజలంతా స్వాగతించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం అంటే, ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పది తప్పులు చేయడమే. నోట్ల రద్దును విదేశీయులు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పి, మోదీ తప్పు మీద తప్పు చేశారు. ఈ చర్య తరువాత బ్యాంకులు, ఏటీఎంల దగ్గర బారులు తీరిన జనాల ఇక్కట్లను, సంభవించిన దుర్మరణాలను ఇంకా ఎవరూ మరచిపోలేదు. అయితే ఇలాంటి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పే సంస్కారాన్ని కూడా ప్రభుత్వం ప్రదర్శించలేకపోయింది. అంతేకాదు, నోట్ల రద్దు కర్మకాండ తరువాత ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో కూడా అధికారంలోకి వచ్చే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను బీజేపీ పక్కన పెట్టింది. మోదీ, ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనను తూర్పార పడుతూ చేసిన ప్రకటనలు కూడా రూటు మార్చుకున్నాయి. ఆధార్ ప్రక్రియను పౌర సేవలకు వినియోగించడానికి వీలులేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా బీజేపీ ప్రభుత్వం గౌరవించలేదు. పైగా ఆ ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. ఇలాంటి అవకతవక నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. బడ్జెట్ కూడా ఇందుకు ఒక ఉదాహరణ. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పనిని నెలరోజులు ముందుకు తెచ్చింది. ఫిబ్రవరి–మార్చిలోగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నందున బడ్జెట్ ప్రతిపాదనల ప్రభావాన్ని తమకు సానుకూలంగా మలుచుకునేందుకే, ఓటర్లను ప్రభావితం చేసేందుకే బీజేపీ ఈ చర్యకు ఉపక్రమించింది. ఎప్పుడూ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం కూడా ఇందుకే. బడ్జెట్ ప్రతిపాదనలకు అవసరమైన ఆదాయ వనరుల లోటు, ద్రవ్య వనరుల లోటు ముమ్మరిస్తున్నందునే ఈ సాకు వెనుక దాగవలసి వచ్చింది. ప్రత్యక్ష పన్నుల మీద రాయితీ ప్రకటించి, ప్రజా బాహుళ్యం మీద విధించే పరోక్ష పన్నులు పెంచే పద్ధతిని ఆలోచించారు. ఇందుకు ఫెడరల్ వ్యవస్థ స్వభావాన్ని మార్చి, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా రాష్ట్రాల అధికారాలను కుంచింప చేశారు. పన్నులు పెంచడానికి కూడా వెసులుబాటు కల్పించుకున్నారు. ఉన్నంతలో తక్కువ సాలుసరి ఆదాయం పొందేవారికి రూ. 5 లక్షల లోపు ఆదాయం మీద ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించడమొక్కటే బీజేపీ సర్కారు చేసిన మేలు. త్రిశంకు స్వర్గంలో ఉన్న టెక్ నిపుణులు ఇక కార్పొరేట్లు, బడా కంపెనీలు గంప గుత్తగా సాధించే లాభాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కూ, మన పాలకులకూ పెద్ద తేడాలేదు. భారత ఐటీ కంపెనీల ఉనికి పూర్తిగా అమెరికా పాలకుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉన్నందున ప్రస్తుత వాతావరణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారో, అవి ఎలాంటి ఏర్పాట్లో తెలియని అయోమయ స్థితిలో మన టెక్ నిపుణులు తేలియాడుతున్నారు. వీటి మీద ఇప్పటిదాకా ఆశలు పెట్టుకుని ఉన్న మన నిపుణులు అక్షరాలా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. కానీ ఈ అంశం మీద పాలకులకు విధాన నిర్ణయమేదీ లేదన్నది వాస్తవం. మోదీ ఒక పక్క నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజామోదం ఉందన్నారు. మరోసారి ఈ నిర్ణయం తరువాత తనను చంపినా చంపవచ్చునంటూ మాట్లాడారు. దేశంలో అవినీతినీ, నల్లధనాన్నీ రూపుమాపేందుకు సంకల్పించిన తనను చంపే అవకాశం ఉందని ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రకటించిన మోదీ, నోట్ల రద్దు ద్వారా అవినీతి, నల్లధనం ఏ మేరకు అదుపులోనికి వచ్చాయో మాత్రం వెల్లడించలేదు. రిజర్వు బ్యాంకు కూడా అంతే. స్విస్ బ్యాంకులలోను, పనామా పత్రాల వెల్లడితోనూ బయటపడిన రూ. 24 లక్షల కోట్ల గుప్తధనాన్ని ఇంతవరకు ఎందుకు వెనక్కి రప్పించలేకపోయారో కూడా ప్రభుత్వం చెప్పలేదు. నిరుపేద కుటుంబాల కోసమని మోదీ ఆదిలో తెరిపించిన జన్‌ధన్ ఖాతాల ప్రస్తుత పరిస్థితి ఏమిటో కూడా తెలియదు. ఇంతకీ ఎన్నికల కోసమని ప్రకటించిన నల్లధనం మీద దండోరా ఫలితం– దొంగచాటుగా బ్యాంకు ఖాతాలలో జమపడిన డబ్బు, జన్‌ధన్ ఖాతాలలోకే చేరినందున అదంతా పేదలదేనని నాయకులు ఉచిత ప్రకటనలు చేయడమే. అయితే ఈ ఉచిత ప్రకటనలు కూడా మోసమే. బ్యాంకులకు చేరినవన్నీ రద్దయిన నోట్లనీ, అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని నాయకులే చెప్పిన మాటలు వాస్తవాలని ప్రజలకు క్రమంగా గాని తెలిసిరాదు. ఈలోగా, ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైన కనీస ఆదాయాన్ని ప్రతి పౌరుడికీ కల్పించడం అవసరమని బీజేపీ పాలకులు తమ ఆదర్శంగా ప్రకటన అయితే చేశారు. ఇంకేముంది? ఫ్రెంచ్ వాడు ప్రతిపాదించిన ఈ ప్రచార చొరవను పేదసాదలకు, రైతులకు, వృత్తి పనివారికి ఉద్దేశించిన సబ్సిడీలను ప్రపంచ బ్యాంక్ సంస్కరణల పుణ్యమా అని రద్దు చేసేందుకు వర్ధమాన దేశాల పాలకులు అవకాశంగా మలుచుకున్నారు. కనుకనే కాంగ్రెస్ పాలకులతో ప్రారంభమైన పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు, సబ్సిడీల కోత వయా వాజ్‌పేయి హయాం మీదుగా మోదీ దాకా కొనసాగుతున్నాయి. యూబీఐ పగటి కల సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (యూబీఐ) ఒక కొత్త కల. వర్ధమాన దేశాలు ఎదిగేవరకు వర్తింప చేయవలసిన సబ్సిడీలను క్రమంగా తొలగించడానికి ఉద్దేశించినదే ఈ పగటి కల. మోదీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం దృష్టిలో యూబీఐ ‘విప్లవాత్మక ఆలోచన’ కావడం కూడా ఇందుకే. దారిద్య్ర నిర్మూలను అవసరమైన సబ్సిడీకి యూబీఐ సరైన ప్రత్యామ్నాయం కూడా అయిపోయింది. కానీ ఆర్థిక నిపుణుల దృష్టిలో ఈ యూబీఐ ప్రకారం పేదలలో ప్రతి వ్యక్తికి ఏడాదికి బేసిక్ ఆదాయ వనరుగా రూ. 14,000 సమకూర్చే హామీ ఇవ్వాలంటే (లేదా నెలకు రూ. 1,200 ఏర్పాటు కావాలంటే) జనాభాలో నాలుగో వంతు పేదలకు మాత్రమే ఆ మేరకు అవకాశం వస్తుంది. ఈ లెక్కన సార్వత్రిక ప్రాథమిక ఆదాయ వనరు పేద జనాభాకు అందించాలంటే ఏడాదికి మొత్తం రూ. 6,93,000 వేలు అవసరమవుతుంది. అంటే 2017–18 సంవత్సరపు వ్యయం కాగల బడ్జెట్లో ఈ మొత్తం 35 శాతంగా ఉండాలి. అయితే బడ్జెట్లో ఎక్కువ వాటా బడా కార్పొరేట్లను సాకడానికి వ్యయ మవుతున్నందున పేదలకు బడ్జెట్ ద్వారా అందేది నామమాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మభ్యపరిచే రాజకీయాలు మనకు వద్దు. బడా కోటీశ్వరుల నుంచి బ్యాంకులకు చేరవలసిన లక్షల కోట్ల బకాయిలు వసూళ్లు కావు. అయితే ఈ నెపాన్ని పాలకులు బ్యాంకర్ల మీదకి నెడుతున్నారు. బ్యాంకర్లు అవినీతిపరులైన రాజకీయనాయకుల మీదకూ, పాలనా వ్యవస్థ మీదకూ నెడుతున్నారు. దేశంలో దారిద్య్రాన్ని, పేదలను గుర్తించడానికి పంచవర్ష ప్రణాళికలు చాలడం లేదు. అందుకేనేమో, అసలు ప్రణాళికా విధానానికే స్వస్తి చెప్పి, ముక్కూ మొహం లేని నీతి ఆయోగ్ అనే నిర్వీర్యపు వ్యవస్థను ఆవిష్కరించారు బీజేపీ పాలకులు. చివరకు ప్రణాళికా వ్యవస్థ ద్వారా కార్మికులు, వ్యవసాయ కార్మికులకు ఉద్దేశించిన చట్టాలను కూడా చాప చుట్టేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా – దేశంలోనే ఉత్పత్తి జరగాలన్న నినాదం, శ్రమయేవ జయతే నినాదంతో పాటు శ్రమ సువిధ పేరిట వెబ్‌ను పెట్టారే గాని, ఆచరణ మాత్రం పక్కదారి పట్టింది. పరిశ్రమలలో తనిఖీ పద్ధతి ఎత్తివేసి యాజమాన్యాలే ఆన్లైన్ లావాదేవీల ద్వారా తమకు తామే స్వయంగా కితాబులు ఇచ్చుకునే అవకాశాన్ని కూడా మోదీ పాలన కల్పించింది. స్వయం ఉపాధి అంటే ఇదేనేమో! అందుకే పేదరికం బాధను అనుభవించి పలవరించిన యువకవి అలిసెట్టి అన్నాడు, ‘‘అన్నం మెతుకునీ/ ఆగర్భ శ్రీమంతుణ్ణి / వేరు చేస్తే శ్రమ విలువేదో తెలిసిపోదూ!’ అని. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రెండో ఇంటికి రూ.2 లక్షలే
‘పన్ను’ మినహాయింపుపై కేంద్రం న్యూఢిల్లీ: రుణంపై రెండో ఇల్లు కొని, దానికి కడుతున్న వడ్డీ, వస్తున్న అద్దెల మధ్య వ్యత్యాసం (నష్టం)పై పొందుతున్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2 లక్షలకు పరిమితం చేస్తూ తెచ్చిన నిబంధనను వెనక్కు తీసుకునే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొందరు రుణంపై రెండో ఇల్లు కొన్నాక దానిని అద్దెకు ఇస్తుంటారు. బ్యాంకులకు కడుతున్న వడ్డీ కన్నా వస్తున్న అద్దె తక్కుగా ఉన్నట్లు చూపించి వాటి వ్యత్యాసాన్ని నష్టంగా పేర్కొంటారు. ఇలా ఎంత మొత్తం నష్టం వచ్చిందో అంత మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఇక నుంచి నష్టంగా పేర్కొన్న మొత్తంలో గరిష్టంగా రూ.2 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు ఇస్తారు. -
మీరు కట్టాల్సిన పన్ను ఎంత?
ఈ సారి బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి పెద్ద మార్పులేవీ చేయకపోయినా... దిగువ మధ్య తరగతి వారికి కొంత ఊరటనివ్వటం.... ఏడాదికి రూ.50 లక్షల పైబడి సంపాదించేవారిపై కొంత సర్‌చార్జీ వేయటం వంటివి జరిగాయి. ఈ మార్పుల వలన ఎవరికెంత పన్ను భారం పడుతుంది? ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది? పన్నును తగ్గించుకోవటానికి ఉన్న మినహాయింపులేంటి? ఆ మినహాయింపుల కోసం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం... సెక్షన్ 80సీ.. ఇంకా మరిన్ని ఆదాయపు పన్ను మినహాయింపులన్నిటిలోకీ అన్నివర్గాలకూ ఎక్కువ మినహాయిం పునిస్తున్నది సెక్షన్ 80సీ మాత్రమేనని చెప్పాలి. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షలను మినహాయించుకునే అవకాశముంది. ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే మినహాయింపులేంటంటే... ప్రావిడెంట్ ఫండ్‌కు చెల్లించిన మొత్తం ∙మీరు తీసుకున్న గృహ రుణంపై అసలు (ప్రిన్సిపల్) కింద చెల్లించిన మొత్తం ∙పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (పీపీఎఫ్) చేసే ఇన్వెస్ట్మెంట్. ఇది ఏడాదికి రూ.500 నుంచి 1.5 లక్షల వరకూ చేయొచ్చు. ∙మీ పిల్లల స్కూలు ఫీజు. దీన్లో ట్యూషన్ ఫీజుగా పేర్కొనే మొత్తాన్నే మినహాయిస్తారు. అదీ ఇద్దరు పిల్లల వరకే. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే బీమా ప్రీమియం లు. ∙మీ పేరిట, భార్య, పిల్లల పేరిట చెల్లించే యూలిప్ ప్రీమియంలు. ∙పోస్టాఫీసుల్లో ఎన్ఎస్సీ సర్టిఫికెట్ల కొనుగోలుకు వెచ్చించే మొత్తం. ∙బ్యాంకుల్లో గానీ, పో స్టాఫీసుల్లో గానీ ఐదేళ్ల కాలానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ∙గమనించాల్సిందేంటంటే ఈ మొత్తం అంశాల్లో దేన్లో ఎంత ఇన్వెస్ట్ చేసినా గరిష్ఠంగా ఒక ఏడాదికి రూ.1.50 లక్షలు మాత్రమే పన్ను మినహాయింపునకు క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. పన్ను మినహాయింపునిచ్చే ఇతర పొదుపు పథకాలు న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్): ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని గతంలో సెక్షన్ 80సీలో భాగంగానే చూసేవారు. కానీ గడిచిన ఏడాది నుంచీ ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తంలో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీకి అదనంగా చూపించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం చట్టంలో 80 సీసీడీ పేరిట కొత్త సబ్‌సెక్షన్ తెచ్చారు. గృహ రుణంపై వడ్డీ: మీరు గృహ రుణం తీసుకుని... అదే ఇంట్లో గనుక ఉంటే, మీరు చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా ఏడాదికి రూ.2 లక్షల వరకూ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. విద్యా రుణంపై చెల్లిస్తున్న వడ్డీ: దీనికి పరిమితేమీ లేదు. ఎంత వడ్డీ చెల్లిస్తే అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం: మీతో పాటు మీ భార్య, పిల్లల వైద్య బీమాకు చెల్లించే ప్రీమియంలో రూ.25,000 వరకూ మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు. మీరు గనుక 60 ఏళ్లు దాటినవారైతే ఈ మినహాయింపు 30,000 దాకా ఉంటుంది. మీ తల్లిదండ్రులకు గనుక బీమా చేయిస్తే అదనంగా మరో రూ.25,000 క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. విరాళాలు: నోటిఫైడ్ సంస్థలు, రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో ఆయా సంస్థల్ని బట్టి పూర్తిగా గానీ, 50 శాతం మొత్తాన్ని గానీ మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశముంది. తాజా బడ్జెట్ ప్రకారం ఇలాంటి విరాళాలు చెక్కు, లేదా డిజిటల్ రూపంలో చెల్లించాలి. రూ.2,000 వరకూ మాత్రమే నగదు రూపంలో చెల్లించవచ్చు. వ్యాధుల ఖర్చు: ఎయిడ్స్, కొన్ని రకాల కేన్సర్ల వంటి వ్యాధుల చిక్సిత కోసం అసెసీ సొంతంగా కానీ, తనపై ఆధారపడ్డ వారికిగానీ పెట్టే ఖర్చులో రూ.40,000 వరకూ క్లెయిమ్ చేయొచ్చు. ఈ మినహాయింపు పరిమితి రోగి వయసు 60 ఏళ్లు దాటితే రూ.60,000గా, 80 ఏళ్లు దా టితే రూ.80,000గా ఉంది. వైకల్యం ఖర్చు: అసెసీ లేదా తనపై ఆధారపడ్డవారు అంగవైకల్యం బారిన పడితే వారి వైద్య ఖర్చులు, శిక్షణ కోసం చెల్లించే మొత్తంలో రూ.75,000 వరకూ మినహాయింపు లభిస్తుంది. తీవ్ర అంగవైకల్యమైతే ఇది రూ.1.25 లక్షల వరకూ ఉంది. ఇవండీ మినహాయింపులు: ఇవి కాక మీకు వచ్చే హెచ్ఆర్ఏ గానీ, మీరు చెల్లించే ఇంటద్దె గానీ, ఆఫీసు మీకు చెల్లించే కొన్ని రకాల అలవెన్సులుగానీ... ఇవన్నీ మినహాయింపుల పరిధిలోవే. మీ మొత్తం జీతంలో వీటన్నిటినీ మినహాయించాక మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. అందులో బేసిక్ లిమిట్‌ను తీసేసి... మిగిలిన మొత్తంపై ఆయా శ్లాబుల్ని అనుసరించి పన్ను విధిస్తారు. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే ? మీకు జీతం రూపంలో వచ్చేది మీ ఆదాయం మాత్రమే. అదంతా పన్ను చెల్లించాల్సిన ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) మాత్రం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలో వివిధ సెక్షన్ల కింద వివిధ రకాల మినహాయింపులున్నాయి. మనం చేసే పొదుపు నుంచి, మనం కట్టే ఇంటద్దె వరకూ చాలా ఖర్చుల్ని మినహాయించుకునే వీలుంది. ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. దాటితే రూ.5 లక్షల వరకు 5 శాతం, 5–10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షలు దాటినవారికి ఈ బడ్జెట్లో కొత్తగా 10 శాతం సర్‌చార్జి విధించారు. రూ.కోటి ఆదాయం దాటినవారికి గతేడాది బడ్జెట్లోనే 15 శాతం సర్‌చార్జి వడ్డించారు. -
కాంగ్రెస్‌కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదు
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సంస్కరణలు అమ లుచేసే దిశలో కేంద్ర బడ్జెట్ ఉందని బీజే ఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనరంజకమైన ఈ బడ్జెట్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలకు కాంగ్రెస్ నాయకులు సహకరించాలని లేదా ఏమీ మాట్లాడకుండా ఉండాలన్నారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
విజయవాడ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఇది బడ్జెట్‌లా గాక బిజినెస్ మోడల్లా ఉందని విమర్శించారు. గురువారం విజయవాడలో పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరుణ్ జైట్లీ తీవ్ర నిరాశ కలిగించారని అన్నారు. బడ్జెట్ బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోన్ల ప్రస్తావన లేదని, అమరావతికి రైల్వే కనెక్షన్ ఏదని నిలదీశారు. ఏపీ ప్రజలకు న్యాయం జరగకపోయినా చంద్రబాబు, టీడీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారని విమర్శించారు. యువత జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలకు భ్రమలు కల్పించడం మానుకోవాలని పార్థసారథి హితవు పలికారు. -
'ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ప్రస్తావన లేదు'
-
వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే: సీపీఐ నారాయణ
పెద్దనోట్ల రద్దు, బడ్జెట్ తదితర అంశాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల నాటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని విమర్శించారు. మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య లాంటి ఇద్దరు గొర్రెలు దొరికారని, నోట్లరద్దుపై 50 రోజులు ఓపిక పడితే ప్రజల జీవితాన్ని మార్చేస్తానంటే నమ్మారని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నల్లడబ్బు ఉన్నవారంతా తెల్లదొరలుగా మారారని ఎద్దేవా చేశారు. జంతర్ మంతర్ జైట్లీ బడ్జెట్ ఫెయిల్ అయిందని, ట్రంప్ ఏ చర్యలు తీసుకున్నా తామున్నామనే హామీని జైట్లీ తన బడ్జెట్లో ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆయన కేవలం హరికథా కాలక్షేపంతో బతికేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే రాజకీయంగా ఫెయిల్ కావడం వల్లే మతసామరస్యాలను రెచ్చగొడుతోందని, ఆ పార్టీకి తమిళులు జల్లికట్టు ఉద్యమంతో బుద్ధి చెప్పారని అన్నారు. యూపీలో ప్రస్తుతం బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని, ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అమరావతి రైతులకి క్యాపిటల్ గెయిన్స్ రద్దు చేసినట్లే, పోలవరం రైతులకు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చేతనైతే పోరాడాలి, లేకుంటే ఊరుకోవాలని అన్నారు. ప్రజల్ని మోసం చేయడంలో వెంకయ్య, చంద్రబాబులను మించినవారు దేశంలో లేరని విమర్శించారు. ముందుగా బీజేపి నాయకుల ఆస్తులు, అకౌంట్లు ప్రకటించాలని, ఆ తర్వాత పార్టీల విరాళాల గురించి మాట్లాడాలని సూచించారు. -
ఏపీకి రిక్తహస్తం
-
‘పన్ను’లూడేది ఉద్యోగులకేనా?
-
బడ్జెట్లో కానరాని తెలంగాణ
-
రైతులకు ఆర్థిక మంత్రి జైట్లీ వరాలు
-
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
-
హోం శాఖకు రూ.83 వేల కోట్లు
గత ఏడాది కన్నా 11 శాతం ఎక్కువ సీఆర్పీఎఫ్కు అత్యధికంగా రూ.17,868 కోట్లు న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు భారీగా కేటాయింపులు చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడంపై దృష్టిపెట్టి ఈసారి రూ.83 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఇచ్చిన దానికంటే ఇది ఈసారి 11.24 శాతం ఎక్కువ. గత ఏడాది రూ.75,355.48 కోట్లు ఇవ్వగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.83,823.30 కోట్లు కేటాయించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు రూ.1,577.07 కోట్లు కేటాయింపులు చేశారు. తాజా బడ్జెట్లో హోంశాఖ అధీనంలోని ఏడు పారామిలిటరీ దళాలకు 54,985.11 కోట్లు ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో రూ.52,443 కోట్లుగా ఉంది. అంతర్గత భద్రతకు, మావోయిస్టులు, మిలిటెంట్ల ఆపరేషన్లు నిర్వహించే సీఆర్పీఎఫ్కు అత్యధికంగా రూ.17,868.53 కోట్లు దక్కింది. భారత్–పాక్, భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులోని బీఎస్ఎఫ్కు రూ.15,569.11 కోట్లు ఇచ్చారు. సీఐఎస్ఎఫ్కు రూ.6,686.25 కోట్లు కేటాయించారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ)కి రూ.4,824.31 కోట్లు, అస్సాం రైఫిల్స్‌కు రూ.4,801.84 కోట్లు కేటాయించారు. సశస్త్రసీమా బల్ (ఎస్ఎస్బీ)కు రూ.4,320.67 కోట్లు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాలుపంచుకునే జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ)కి రూ.816.10 కోట్లు కేటాయించారు. కేంద్ర హోంశాఖ అధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీస్‌కు బడ్జెట్లో రూ.5,910.28 కోట్లు ఇచ్చారు. పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్లకంచె ఏర్పాటుకు, రోడ్ల నిర్మాణానికి, నిఘా పరికరాల ఏర్పాటుకు బడ్జెట్లో రూ.2,355.68 కోట్లు ఇచ్చారు. సీఏపీఎఫ్, కేంద్ర పోలీసు సంస్థల భవనాల ప్రాజెక్టులకు గత ఏడాది కంటే 33 శాతం అధికంగా రూ.4,008,06 కోట్లు, ఎస్పీజీకి రూ.389.25 కోట్లు, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌కు రూ.45.57 కోట్లు, ఐవీఆర్ఎఫ్టీకు రూ.66 కోట్లు, హోం శాఖలో పరిశోధనల ప్రోత్సాహకాలకు రూ.2,983 కోట్లు, మహిళల భద్రతకు ఉద్దేశించిన నిర్భయ నిధికి రూ.50 కోట్లు కేటాయించారు. -
‘రక్షణ’కు 2.74 లక్షల కోట్లు
మొత్తం బడ్జెట్లో ఇది 12.77% 2016–17తో పోల్చుకుంటే 6.2% పెరుగుదల పింఛన్లకు అదనంగా రూ.85,737 కోట్లు ఆధునికీకరణ కార్యక్రమాలకు పెద్దపీట న్యూఢిల్లీ: రక్షణ రంగానికి 2017–18 బడ్జెట్లో రూ.2.74 లక్షల కోట్లు కేటాయిం చారు. మొత్తం బడ్జెట్లో ఇది 12.77%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చు కుంటే ఇది 6.2% ఎక్కువ. త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆధునీకరణ ప్రక్రియలో ముందుకుసాగు తున్న సమయంలో అందుకనుగుణంగానే వాటికి మూలధన కేటాయింపులో 10.05 పెరుగుదల చోటు చేసుకుంది. కొత్త పరికరాలు, ఆయుధాలు, ఎయిర్ క్రాప్ట్‌లు, యుద్ధనౌకలు తదితర సైనిక వాహనాల కొనుగోలు వంటి ఆధునీ కరణ కార్యక్రమాల నిమిత్తం మూడు దళాలకు కలిపి రూ.86,488 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.78,586 కోట్లుగా ఉంది. ప్రస్తుత సంవత్సరానికి సవరించిన మూలధన కేటాయింపు రూ.71,700 కోట్లని బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మిగతా రూ.6,886 కోట్ల బడ్జెట్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ ఖర్చు పెట్టలేకపోయిందా? లేక పొదుపు ఏమైనా చేశారా? అనేది తెలియడం లేదు. ఇలావుండగా రక్షణ రంగ పింఛన్ల నిమిత్తం రూ.85,737 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సవరించిన అంచనాల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల బడ్జెట్ రూ.85,624 కోట్లకు చేరింది. మూలధన కేటాయింపు రూ.86,488 కోట్లతో కలిపి రక్షణ రంగానికి రూ.2,74,114 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు జైట్లీ బుధవారం లోక్ సభకు తెలిపారు. ఇందులో పింఛన్ల మొత్తం లేదన్నారు. రక్షణ సిబ్బంది సులభమైన ప్రయా ణానికి వీలుగా కేంద్రీకృత రక్షణ యాన విధా నాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానంలో సైనికులు, అధికారులు తమ ప్రయాణ టిక్కె ట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని జైట్లీ తెలిపారు. రక్షణ రంగానికి చెందిన పింఛనుదారుల కోసం సమగ్ర వెబ్ ఆధారిత పింఛను పంపిణీ (ఇంటరాక్టివ్) విధానాన్ని నెలకొల్పనున్నట్లు కూడా జైట్లీ వెల్లడించారు. రక్షణ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమయ్యింది. బడ్జెట్‌ను స్వాగతించిన రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రే.. మూలధన కేటాయింపులో 9.3% పెరుగుదల చోటు చేసుకుం దంటూ ట్వీట్ చేశారు. మూలధన కేటాయింపు పెంపును రక్షణ పరిశ్రమ కూడా స్వాగ తించింది. స్వదేశీకరణపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తోందని శామ్‌టెల్ ఏవి యోనిక్స్ ఎమ్డీ పునీత్ కౌరా అన్నారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు ఇది ఊతం ఇస్తుందన్నారు. ఆధునీకరణ అవసరాలకు ఈ పెంపు సరిపోదని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్) వైస్ ప్రెసిడెంట్ అంకుర్ గుప్తా పేర్కొన్నారు. -
సబ్సిడీల్లో 3% పెంపు
పెరిగిన ఆహారం.. తగ్గిన పెట్రోలియం ∙ఎరువుల సబ్సిడీలో మార్పులేదు న్యూఢిల్లీ: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ అంచనా రూ. 2,40,338 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే 3% పెరుగుదల కనిపించింది. ఇందులో ఆహార సబ్సిడీ రూ.1,45,338 కోట్లు. నవంబర్ 2016 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతుండటంతో (80 కోట్ల మందికి పైగా ఆహార సబ్సిడీ అందుతోంది) ఈ అంచనా పెరగొచ్చు. కాగా, ఎరువుల సబ్సిడీలో ఏ మార్పూ లేదు. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారీ రూ.70 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వనుంది. ఇందులో రూ.49,768 కోట్లు యూరియాకు, రూ.20,232 కోట్లు ఫాస్పారిక్, పొటాసిక్ ఎరువులకు ఇవ్వనున్నారు. అయితే పెట్రోలియం సబ్సిడీని తగ్గించారు. గతేడాది రూ. 27,531.71 కోట్ల సబ్సిడీ ఉండగా.. ఈ ఏడాది దీన్ని రూ. 25వేల కోట్లకు తగ్గించారు. ఇందులో ఎల్పీజీకి రూ.16,076.13 కోట్లు, మిగిలింది కిరోసిన్‌కు వర్తిస్తుంది. చక్కెరపై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం చక్కెరపై సబ్సిడీలకు కేంద్రం చెల్లుచీటి రాసింది. కిలోపై ఇప్పటిదాకా రాష్ట్రాలకు ఇస్తున్న రూ. 18.50 సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్పరం నుంచి ఉండదు. జైట్లీ బుధవారం బడ్జెట్లో చక్కెర సబ్సిడీల బకాయిల చెల్లింపు నిమిత్తం రూ. 200 కోట్లే ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయింపులేమీ చేయలేదు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ఏటా 27 లక్షల టన్నుల చక్కెరను 40 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే చక్కెరను ఓపెన్ మార్కెట్లో రాష్ట్రాలు సేకరిస్తున్నాయి. ఇలా సేకరించే చక్కెరపై కేంద్రం కిలోకు రూ.18.50 సబ్సిడీ ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెల్ల కార్డులపై ఒక్కో కుటుంబానికి అరకేజి చక్కెరను సబ్సిడీపై అందిస్తున్నారు. ఈసారి కేటాయింపులు లేవు కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రాలే ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అధికారుల శిక్షణకు 180 కోట్లు న్యూఢిల్లీ: తాజా బడ్జెట్ కేటాయింపుల్లో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 180 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని అధికారులకు శిక్షణనిచ్చేందుకు వినియోగి స్తారు. ఇందులో రూ.60.61 కోట్లు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్కు, ముస్సోరీలోని లాల్‌బహదూర్ నేషనల్ అకా డమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ)లలో నిర్మాణ ఖర్చులకు వినియో గించనున్నారు. మిగిలిన రూ.119.37 కోట్లు ఎల్బీఎస్ఎన్ఏఏలో అధికారుల శిక్షణ తదితరాలకు కేటాయించారు. గతేడాది ఇందుకోసం 179.17 కోట్లను కేటాయించారు. కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్బీ)లకోసం రూ.25.42 కోట్లు కేటాయిం చారు. గతేడాది ఈ కేటాయింపులు రూ. 28 కోట్లు. దీనికి తోడు సీఐసీకి నూతన భవన నిర్మాణానికి రూ.25.47 కోట్లు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)కు రూ.105.81 కోట్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)కు రూ. 197.32 కోట్ల కేటాయింపులు జరిగాయి. -
శాస్త్ర, సాంకేతికానికి.. నామమాత్రమే!
ఈ రంగాలకు కేటాయింపులు రూ.37,435 కోట్లు న్యూఢిల్లీ: శాస్త్రసాంకేతిక రంగాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.37,435 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో అంతరిక్ష పరిశోధన విభాగాని(డీఓఎస్)కి అదనంగా రూ.1,000 కోట్ల కేటాయింపులు జరిపినట్టు జైట్లీ తెలిపారు. గతేడాది డీఓఎస్– అణు శక్తి (డీఏఈ), శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖలు రెండింటికీ కలిపి కేటాయించిన మొత్తం రూ.32,030.72 కోట్లు. ► డీఓఎస్‌కు ప్రకటించిన రూ.9,093 కోట్లలో 4,155 కోట్లు మూలధన వ్యయం కింద కేటాయింపులు జరిగాయి. ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ –2 వంటి ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు. గతేడాది (2016–17) బడ్జెట్లో డీఓఎస్‌కు రూ.8,045 కోట్లు, 2015–16లో రూ.6,920 కోట్లు ఇచ్చారు. ► అదేవిధంగా డీఏఈకి రూ.124.61 కోట్లు కేటాయించారు. ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్)తో పాటు రాజస్తాన్ అణు విద్యుత్ ప్రాజెక్టు (ఆర్ఏపీఎస్ 7, 8), కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు (3, 4 యూనిట్లు) తదితర ప్రాజెక్టుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు. ► అలాగే డీఏఈ పరిధిలోని బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీసీఏఆర్), రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్లకు రూ.3,062 కోట్లు (గతేడాదితో పోలిస్తే రూ.814.42 కోట్లు అదనం) కేటాయించారు. ► శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు రూ.4,446 కోట్లు (గతేడాది రూ.4,062 కోట్లు) ఇచ్చారు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ విభాగాలకు వరుసగా రూ.4,817.27, రూ.2,222.11 కోట్ల కేటాయింపులు జరిగాయి. ► భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.1,719.48 కోట్లు (గతేడాది రూ.1,576.14 కోట్లు) ఇచ్చారు. కనీసం ఒక శాతం నిధులుంటేనే.. భారత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు కేటా యింపులు నామమాత్రమే అన్నది గత బడ్జెట్లను చూస్తే స్పష్టమవుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీఎస్పీ)లో కనీసం ఒక శాతం నిధులు కేటాయి స్తేనే దేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఈ రంగాలకు కేటాయింపులు గరిష్టంగా జీఎస్పీలో 0.88 శాతమే ఉండటం గమనార్హం. దక్షిణ కొరియా, అమెరికా, చైనాలు ఈ రంగాలకు భారీగా నిధులిస్తుండడంతో ఆ దేశాల నుంచి కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నాయి. వారు తీసుకుంటున్న పేటెంట్లను చూస్తే ఇది తెలు స్తుంది. దక్షిణ కొరియాలో ప్రతి పది లక్షల జనాభా కు దాదాపు 4,451 పేటెంట్లు నమోదవుతోంటే.. భారత్‌లో ఈ సంఖ్య 17 మాత్రమే! -
రూ.3 లక్షలు మించొద్దు
అంతకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం నల్లధనం కట్టడికి సిట్ చేసిన సిఫార్సుకు ఆమోదం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన ఎవరైనా రూ. 3 లక్షలకు మించి తీసుకుంటే జరిమానా బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై కొరడా ఝుళిపించింది. ఇందులోభాగంగా నగదు లావాదేవీలపై పరిమితి విధించింది. అన్ని రకాల లావాదేవీల్లో నగదు రూ.3 లక్షలకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. నగదు లావాదేవీలపై పరిమితి విధించాలంటూ నల్లధనంపై సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నిర్ణయం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు పూర్తిగా నిషిద్ధం’ అని జైట్లీ ప్రకటించారు. సిట్ సిఫార్సును ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అవినీతి, పన్ను ఎగవేత నియంత్రణకు ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. – న్యూఢిల్లీ పరిమితి మించితే పరేషాన్.. నల్లధనం చలామణిని నియంత్రించి స్వల్ప నగదు ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు ఉద్దేశించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సెక్షన్ 269ఎస్టీని ఆదాయ పన్ను చట్టంలో పొందుపరచాలని జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనిప్రకారం ఏ వ్యక్తి కూడా నగదు రూపంలో రూ. 3 లక్షలు, అంతకుమించి తీసుకోకూడదు. పరిమితులు ఎలాగంటే.. ఎ) ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఏక మొత్తంలో తీసుకోకూడదు; బి) ఒక లావాదేవీలో తీసుకోకూడదు; సి) ఒక వ్యక్తికి సంబంధించిన ఒక ఈవెంట్ లావాదేవీల్లో తీసుకోకూడదు. ఈ ప్రతిపాదిత పరిమితులు ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీలకు, పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్‌లకు వర్తించవు. ఎవరైనా వ్యక్తి మూడు లక్షల రూపాయలకు మించి ఎవరి నుంచైనా తీసుకుంటే అతడికి జరిమానా విధించాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు. నిర్దేశిత లావాదేవీ ఎంత మొత్తంలో జరిపితే ఆ విలువకు సమాన మొత్తంలో జరిమానా వేయాలని పేర్కొన్నారు. ఇలాంటి జరిమానాలను విధించే అధికారం ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఉంటుందని చెప్పారు. భారీగా లెక్కల్లో చూపని సంపద నల్లధనం కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అత్యున్నత కమిటీ అయిన సిట్ తన ఐదో నివేదికను గత జూలైలో సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. దేశంలో లెక్కల్లో చూపని సంపద, నగదు భారీగా పోగుబడి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ‘నగదు లావాదేవీలపై ప్రస్తుతం వివిధ దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలు, వివిధ నివేదికలు, కోర్టులు చెప్పిన అంశాలను పరిశీలించాక నగదు లావాదేవీలపై గరిష్ట పరిమితి విధించాల్సిన అవసరం ఉందని సిట్ భావించింది’అని అందులో చెప్పింది. అందువల్ల రూ. 3 లక్షలు, అంతకుమించి జరిపే నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని, ఈదిశగా చట్టం చేసి ఆమేరకు అలాంటి లావాదేవీలను అక్రమంగా ప్రకటించాలని సిఫార్సు చేసింది. చట్టప్రకారం వాటిపై శిక్ష విధించాలని పేర్కొంది. నిషేధం మంచిదే: సిట్ నగదు లావాదేవీలపై రూ. 3 లక్షలు మించకుండా నిషేధం విధించాలంటూ తమ సిఫార్సును బడ్జెట్లో ప్రకటించడంపై సిట్ హర్షం వ్యక్తంచేసింది. దీనిపై సిట్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా మాట్లాడుతూ.. ‘ఇది (రూ.3 లక్షల నగదు లావాదేవీలపై నిషేధం) చాలా అవసరం. మంచి నిర్ణయం కూడా. ఇది చాలా దేశాల్లో అమల్లో ఉందన్న విషయాన్ని గతంలో సమర్పించిన మా నివేదికలో చెప్పాం. గత ఏడాదే దీనిపై మేము సిఫార్సు చేశాం. ఆమోదం పొందడానికి చాలా కాలం పట్టింది’అని అన్నారు. అయితే ఒక్కో వ్యక్తి వద్ద నగదు రూ. 15 లక్షలకు మించకుండా పరిమితులు విధించాలంటూ తాము చేసిన మరో సిఫార్సు కూడా అవినీతి కట్టడికి బాగా ఉపకరిస్తుందని చెప్పింది. ఈ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించకపోవడంపై బాధగా ఉందా అన్న ప్రశ్నకు.. తమ సిఫార్సులను అమలుచేయడం, చేయకపోవడమనేది ప్రభుత్వ ఇష్టమన్నారు. అక్రమ, లెక్కల్లో చూపని సంపదను నియంత్రించడానికి మరిన్ని కఠిన చర్యలు అవసరమన్నారు. ఆర్థిక నేరస్తుల ఆస్తుల జప్తు దేశం విడిచి వెళ్లినవారి ఆస్తుల జప్తునకు ప్రత్యేక చట్టం: జైట్లీ న్యూఢిల్లీ: లిక్కర్ టైకూన్ విజయ్‌మాల్యా బ్యాంకు లకు చెల్లించాల్సిన బకాయిల వసూలుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో మాల్యా లాంటి దేశం విడిచి వెళ్లిన ఆర్థిక నేరస్తుల ఆస్తు లను జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ‘‘చట్టాన్ని తప్పించుకుని కొందరు ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు తరలి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వారి ఆస్తులను జప్తు చేసే కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తోంది’’అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన వెల్లడించారు. ట్రిబ్యునల్స్ కుదింపు గత కొన్నేళ్లుగా అనేక ట్రిబ్యునల్స్ పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందువల్ల వాటి సంఖ్యను హేతుబద్ధీకరించాలని నిర్ణయిం చామని, అవకాశం ఉన్న ట్రిబ్యునల్స్‌ను విలీనం చేయాలని భావిస్తున్నామని జైట్లీ చెప్పారు. -
‘పార్టీ’ టైమ్ కాదులెండి బాబూ!!
పార్టీల ఖాతాల్లో కోట్లకు కోట్లు పడతాయి. కానీ లెక్కలుండవు. ఎవరిచ్చారండీ... అని చూస్తే రూ.20వేలకన్నా ఎక్కువ ఇచ్చిన వారి పేర్లే నమోదవుతాయి. చాలామంది అంతకన్నా తక్కువే ఇస్తారు. ఈ రహస్యాన్ని జైట్లీ ‘హ్యాక్’ చేసినట్టున్నారు. లిమిట్‌ను ఏకంగా రూ.2,000కు తగ్గించేశారు. అంతకు మించి ఎవరిచ్చినా... చెక్కో, డిజిటలో!! కాకుంటే ఆర్బీఐ బాండ్లు కూడా కొని పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చట. దీనర్థం... రూ.2,000కు మించి ఎవరెంత ఇచ్చినా ఊరూ పేరూ ఉంటుంది మరి!!. కాకపోతే మనది అనంతకోటి ఉపాయాల భారతం. రూ.2000 చొప్పున లక్షల మంది ‘క్యాష్ కరో’ అనేసినా ఆశ్చర్యంలేదు. దేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు : 1,703 (2015 ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం) -
చిన్న, మధ్యతరహా కంపెనీలకూ ఊరట
వీటి కార్పొరేట్ ట్యాక్స్ 30 నుంచి 25 శాతానికి తగ్గింపు పద్దులు రాయని చిన్న సంస్థలు 6 శాతం లాభం లెక్కిస్తే చాలు బడా కార్పొరేట్లకు ఏమాత్రం ఊరటనివ్వని కేంద్ర బడ్జెట్ సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి పెద్ద కంపెనీలకు పూర్తిగా నిరాశ మిగిల్చినా... చిన్న, మధ్య స్థాయి కంపెనీలపై బాగానే ప్రేమ చూపించారు. గతేడాది బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్‌ను దశలవారీగా 30% (సెస్‌లతో కలిపి 34.6 శాతం) నుంచి 25 శాతానికి తీసుకు వస్తానని ప్రకటించిన జైట్లీ... ఈసారి బడ్జెట్లో ఒకేసారి 25 శాతానికి తగ్గించేశారు. సెస్‌లతో కలిపి ఇది 28.84 శాతం అవుతుంది. కాకపోతే దీన్ని కేవలం మధ్య, చిన్నతరహా (ఎంఎఎస్‌ఎంఈ) పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో 96 శాతం కంపెనీలు ఈ కేటగిరీలోనే ఉండటంతో తాజా నిర్ణయం చాలా కంపెనీలకు లాభదాయకమని అంచనా వేస్తున్నారు. కంపెనీలకు నాలుగు డబ్బులు మిగిలితే వారు మరింత మంది ఉద్యోగుల్ని తీసుకోవటానికి, ఆ లాభాన్ని కస్టమర్లకు బదిలీ చేయటానికి ప్రయ త్నాలు చేస్తారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం... ► రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్నుని 30% నుంచి 25% తగ్గిస్తున్నట్లు ప్రక టించారు. మొత్తం పన్ను చెల్లిస్తున్న కంపెనీల్లో ఈ కేటగిరీలోనివే 96% ఉన్నాయి. దీంతో 96% కంపె నీలకు లాభం కలుగుతుందని జైట్లీ చెప్పారు. ► 2015–16లో 6.94 లక్షల కంపెనీలు రిటర్నులు దాఖలు చేయగా రూ.50 కోట్ల టర్నోవర్ పరిధిలో 6.67 లక్షల కంపెనీలున్నాయని, ఈ నిర్ణయం వల్ల కేంద్రం రూ.7,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని జైట్లీ చెప్పారు. ► రూ.2 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎలాంటి పద్దులూ నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు తమ టర్నోవర్‌లో 8 శాతాన్ని లాభంగా ఊహించుకుని దానిపై పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తగ్గించారు. ఇలా ఖాతాలూ నిర్వహించకుండా ఉండే రూ.2 కోట్ల లోపు టర్నోవర్ కంపె నీలు ఇకపై తమ లాభాన్ని 6% ఊహించుకుని దానిపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయా న్ని అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. ► దీనివల్ల ఏం జరుగుతుందంటే.. ఉదాహరణకు ఇదివరకు ఓ సంస్థ గనక తన టర్నోవర్ రూ.1.5 కోట్లుంటుందని భావించి, దానిపై 8 శాతం... అంటే 12 లక్షలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇపుడు అది రూ.9 కోట్లపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ► స్టార్టప్ కంపెనీలు మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (మ్యాట్) తొలగించాలని కోరినా ఆర్థిక మంత్రి అంగీకరించలేదు. కానీ మ్యాట్ క్రెడిట్‌ను 15 ఏళ్ల వరకు చూపించుకోవడానికి అనుమతించారు. ఇది ఇప్పటి వరకు 10 ఏళ్లుగా ఉండేది. అదే విధంగా స్టార్టప్స్ నష్టాలను భవిష్యత్తు లెక్కల్లో చూపించుకోవడానికి ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఓటింగ్ రైట్స్ 51 శాతం ఉంటేనే నష్టాలను మిగిలిన సంవత్సరాల్లో కూడా చూపించుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ప్రమోటర్‌కు వాటా ఉంటే చాలు తప్ప 51 శాతం వాటా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలకూ కార్పొరేట్ ట్యాక్స్ కనీసం ఒక శాతమైనా తగ్గిస్తారని అంతా ఊహించారు. దీనికి భిన్నంగా ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఈ తగ్గింపును పరిమితం చేయడంతో పెద్ద కంపెనీలు నిరాశ వ్యక్తం చేశాయి. -
పర్యావరణానికి 19% పెంపు
కేటాయింపులపై పెదవి విరిచిన పర్యావరణ సంస్థలు న్యూఢిల్లీ: ఇటీవల వివాదాస్పదంగా మారిన పర్యావరణ అంశంపైనా కేంద్రం దృష్టి పెట్టింది. 2017–18 బడ్జెట్లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లను కేటాయించింది. ఇది గతేడాదికన్నా సుమారు 19 శాతం ఎక్కువ. ఇక పులుల సంతతిని సంరక్షించేందుకు చేపట్టిన ‘ది ప్రాజెక్ట్ టైగర్’కార్యక్రమానికి గతేడాదికన్నా రూ.30 కోట్లు తక్కువగా రూ.345 కోట్లు కేటాయించారు. ఇక ఏనుగుల సంరక్షణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు కూడా గతేడాదికన్నా రెండున్నర కోట్లు ఎక్కువగా రూ.27.5 కోట్లు ఇచ్చారు. తాజా బడ్జెట్లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.74.3 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిపై పర్యావరణ సంస్థలు మండిపడ్డాయి. ‘‘దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం సమస్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవు. దీనిని బట్టి ప్రభుత్వం పర్యావరణ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతోంది..’’అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్థ్యం పెంపు వంటి లక్ష్యాలను అడ్డుకునేదిగా తాజా బడ్జెట్ ఉందని ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టెరి) సంస్థ వ్యాఖ్యానించింది. పర్యావరణ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొంది. -
భవితకు భరోసా!
ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నా ఆర్భాటం చూపని ఆర్థికమంత్రి మూడు నెలల కిందట అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు.. మరో 4 నెలల్లో అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను.. అత్యంత కీలకమైన రెండు భారీ ఆర్థిక సంస్కరణల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతేకాదు.. 92 ఏళ్లుగా వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌ను కూడా కలిపేయడం, బడ్జెట్ తేదీలను నెల రోజులు ముందుకు జరిపి ప్రవేశపెట్టడం ఈ సాధారణ బడ్జెట్‌ను చరిత్రాత్మకం చేస్తోంది. మరో నెల రోజుల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ప్రతిష్టాత్మకమైనది. అంతేకాదు.. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు అనంతరం చేపడుతున్న బడ్జెట్ కనుక.. అంచనాలూ భారీగా పెరిగాయి. అయితే.. 21,46,735 కోట్ల రూపాయలతో 2017–18 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో నిజాయితీపరులైన వారికి ప్రోత్సాహకం అంటూ.. వేతన జీవులకు కింది స్లాబు పన్ను రేటును సగానికి తగ్గించి ఊరట కల్పించారు. చిన్న కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును ఐదు శాతం తగ్గించడం ద్వారా చేయూతనిచ్చారు. న్యూఢిల్లీ : వసంత పంచమి రోజున తాను బడ్జెట్ ప్రవేశపెడుతున్నానంటూ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రసంగం ప్రారంభించిన అరుణ్ జైట్లీ... దేశంలో ‘పాలనా విధానంలో మార్పు’తీసుకురావడం కోసం తమ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా చేసిన కృషిని వివరించారు. ఆ క్రమంలో ‘గత’ప్రభుత్వాలపై పరోక్ష విమర్శలూ గుప్పించారు. వివక్షా పూరిత పరిపాలన నుంచి విధాన ఆధారిత పరిపాలనకు, ఆశ్రిత పక్షపాతం నుంచి పారదర్శకతకు, లోపభూయిష్ట పథకాల నుండి లక్షిత అమలుకు, అనధికార ఆర్థికవ్యవస్థ నుంచి క్రమబద్ధమైన ఆర్థికవ్యవస్థకు పయనించినట్లు చెప్పారు. రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించామని, మందకొడిగా ఉన్న వృద్ధిని అధిక వృద్ధితో భర్తీచేశామని పేర్కొన్నారు. నల్లధనంపై భారీ యుద్ధం ప్రారంభించామని.. ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజా ధనానికి నమ్మకమైన కాపలాదారుగా చూస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలు రైతులు, కార్మికులు, పేదలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, మహిళలతో పాటు సమాజంలోని అణగారిన వర్గాలకు అందేలా చూడటానికి తాము ఇంకా మరిన్ని చర్యలను చేపట్టడం కొనసాగిస్తామని జైట్లీ చెప్పారు. అభివృద్ధి, ఉపాధి ఫలాలను అందుకునేలా యువతను శక్తివంతం చేయడంపై తమ దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. సవాళ్లున్నా ఉజ్వలమే... ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు మెరుగుపడుతుందన్న అంచనాలు.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశావహంగా ఉంటుందనేందుకు సానుకూల సంకేతాలన్నారు. అయితే.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మూడు సవాళ్లున్నాయన్నారు. మొదటిది– అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత ద్రవ్య విధానం కారణంగా పెట్టుబడుల రాక తగ్గడం, పోక పెరగడం జరగవచ్చని చెప్పారు. రెండోది– నిత్యావసరాల ధరల, ప్రత్యేకించి ముడి చమురు ధర అనిశ్చితి ద్రవ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుందన్నారు. మూడోది– ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్వీయ రక్షణ కోసం ఒత్తిళ్లు పెరగడంతో.. వస్తువులు, సేవలు, ప్రజల ప్రపంచీకరణ నుంచి వెనుదిరగడం పెరుగుతోందని పరోక్షంగా అమెరికాలో ట్రంప్ విధానాల గురించి ప్రస్తావించారు. ఇది ఎగుమతులపై ప్రభావం చూప గలదన్నారు. వీటన్నిటి మధ్యా భారత దేశం ప్రపంచ ఆర్థిక వేదికపై ఉజ్వలంగా నిలుస్తోందంటూ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక తదితర అంతర్జాతీయ సంస్థల నివేదికలను ఉటంకించారు. ఇంతకుముందు తయారీ దేశాల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకిందని చెప్పారు. అంతర్జాతీయ వృద్ధికి భారత్‌ను చోదక శక్తిగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో దీర్ఘకాల ప్రయోజనాలు.. తమ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణల కొనసాగింపుగా పెద్ద నోట్ల రద్దు చేపట్టడం జరిగిందన్నారు. ‘అది సాహసోపేతమైన, నిర్ణయాత్మక చర్య’అని అభివర్ణించారు. పన్ను ఎగవేత అనేది దశాబ్దాలుగా చాలా మందికి జీవన విధానంగా మారిందని.. దీనివల్ల విస్తృత ప్రజాప్రయోజనాలపై రాజీ పడాల్సివస్తోందని పేర్కొన్నారు. అది సమాంతర ఆర్థికవ్యవస్థను పెంచిపోషించిందన్నారు. జీడీపీ మరింత అధికంగా, స్వచ్ఛంగా, వాస్తవికంగా ఉండేందుకు పెద్ద నోట్ల రద్దు దోహదం చేస్తుందని చెప్పారు. అన్ని సంస్కరణల తరహాలోనే ఈ చర్య కూడా అవాంతరాలను కలిగించేదేనన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్కెట్లోకి సరఫరా చేసే కాలంలో ఆర్థిక లావాదేవీలు తగ్గడం.. ఆర్థిక వ్యవస్థపై కేవలం తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. ‘ఒక సరైన కారణం ఎన్నడూ విఫలం కాదు’అంటూ మహాత్మా గాంధీ సూక్తిని ఉటంకిస్తూ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా.. అవినీతి తగ్గుముఖం, ఆర్థిక వ్యవస్థ డిజిటైజేషన్ పెరగడం, ఆర్థిక పొదుపుల ప్రవాహం పెరగడం, ఆర్థిక వ్యవస్థ మరింతగా క్రమబద్ధం కావడం వంటి దీర్ఘ కాల ప్రయోజనాలు లభిస్తాయని.. వీటన్నిటివల్లా జీడీపీ వృద్ధి, పన్ను ఆదాయాలు అధికమవుతాయని వివరించారు. మౌలికం, గ్రామీణానికి ప్రాధాన్యం... ఇక దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ బాట పట్టించేందుకు పలు చర్యలు ప్రకటించిన జైట్లీ.. మౌలికవసతుల పథకాలకు రికార్డు స్థాయిలో రూ. 3,96,135 కోట్లు కేటాయించారు. ఈ భారీ పెట్టుబ డులు.. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆర్థిక కార్యక లాపాలను సృష్టిస్తాయని, మరిన్ని ఉద్యోగ అవకా శాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. రైల్వేలకు రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయం, జాతీయ రహదారులకు మరో రూ. 64,000 కోట్లు ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రైతులకు రికార్డు స్థాయిలో రూ. 10 లక్షల కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను రూ. 48,000 కోట్లకు పెంచారు. కోటి కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పించాలని లక్ష్యంగా ప్రకటించారు. 2019 నాటికి ఇళ్లులేని వారికి కోటి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,87, 223 కోట్లు కేటాయింపులు చేశారు. ఇది ప్రస్తుత ఏడాది కన్నా 24 శాతం అధికం. ఇక రక్షణ రంగానికి, పెన్షన్లను మినహాయించి రూ. 2,74,114 కోట్లు కేటాయించారు. అందులో రూ. 89,488 కోట్లు పెట్టుబడిగా పేర్కొన్నారు. అలాగే.. ప్రభుత్వ బ్యాం కులకు రూ. 10,000 కోట్లు పెట్టుబడులుగా అందిం చనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000 కోట్లు ఇలా అందించారు. జైట్లీ బడ్జెట్ షాయరీలివీ.. బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల పాటు ప్రసంగించిన జైట్లీ.. మధ్యలో సందర్భానుసారం షాయరీలతో సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. ‘ఇస్ మోడ్ పర్ న ఘబ్రా కర్ థమ్ జాయియే ఆప్.. జో బాత్ నయీ హై ఉసే అప్నాయియే ఆప్.. (ఈ మలుపులో మీరు ఆందోళన చెంది ఆగిపోవద్దు.. ఏది కొత్త విషయమో దానిని మీరు స్వీకరించండి)’ ‘డర్తే హై నయీ రాహ్ పే క్యూ చల్నే సె.. హమ్ ఆగే ఆగే చల్తే హై ఆయియే ఆప్... (కొత్త దారిలో నడవడానికి మీకెందుకు భయం.. నేను ముందు నడుస్తా మీరు నా వెంట రండి) ‘నయీ దునియా హై.. నయా దౌర్ హై.. నయీ హై ఉమంగ్.. కుచ్ థే పెహలే కే తరీకే.. తొ కుచ్ హై ఆజ్ కె రంగ్ ధంగ్.. (కొత్త ప్రపంచం.. కొత్త ప్రయాణం.. కొత్త ఆశలు.. కొన్ని పాతవే.. మరికొన్ని ఈనాటివి)’ ‘రోష్నీ జో యె నికల్ ఆయీ హై.. కాలే ధన్ కో భీ బదల్నా పడా ఆజ్ అప్నా రంగ్.. (దూసుకొచ్చిన ఈ వెలుగు వల్ల.. నల్ల ధనం కూడా తన రంగు మార్చుకోవాల్సి వచ్చింది)’ జీడీపీ పెరుగుతుంది... నల్లధనాన్ని నిర్మూలించి, స్వచ్ఛ లావాదేవీలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు అనంతరం.. కొత్త నోట్ల విడుదల వేగం పుంజుకుందని, త్వరలో సౌకర్యవంతమైన స్థాయికి చేరుకుంటుందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి విస్తరించదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరిన అదనపు ద్రవ్య నిల్వల వల్ల.. వడ్డీ భారం తగ్గుతుందని, రుణాల అందుబాటు పెరుగుతుందని వివరించారు. నోట్ల రద్దు కాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం.. పన్ను పరిధిని విస్తరించడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుకల్పిస్తుందన్నారు. అలాగే.. రూ. 3 లక్షలకు మించిన మొత్తంలో నగదు లావాదేవీలను ఈ బడ్జెట్లో నిషేధించారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత పెంపు లక్ష్యంగా.. పార్టీలు ఒక్కో దాత నుంచి నగదు రూపంలో స్వీకరించగల విరాళం మొత్తాన్ని రూ. 20,000 నుంచి ఏకంగా రూ. 2,000 కు తగ్గించారు. ఇటు కోత.. అటు మోత.. వేతనజీవులకు ఊరటనిస్తూ.. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుపై ఆదాయ పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన జైట్లీ.. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్ చార్జ్ విధించారు. కోటి రూపాయలు దాటిన ఆదాయంపై 15 శాతం సర్‌చార్జీని కొనసాగించారు. అలాగే.. టర్నోవర్ రూ. 50 కోట్లకు తక్కువగా ఉన్న కంపెనీలపై కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) త్వరలో అమలులోకి వస్తున్నందున.. పరోక్ష పన్నులను పెద్దగా కదిలించలేదు. అయితే.. పొగాకు ఉత్పత్తులు, సోలార్ ప్యానెళ్లు, మొబైల్ ఫోన్లలో వాడే సర్క్యూట్లపై సుంకాలను కొద్దిగా పెంచారు. పెరిగిన ద్రవ్యలోటు.. తగ్గిన రెవెన్యూ లోటు బడ్జెట్ కేటాయింపులను ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా వేరుచేయడాన్ని విడనాడడం ద్వారా.. ఇప్పుడు పెట్టుబడి, రెవెన్యూ వ్యయాలపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఏడాది కన్నా తాజా బడ్జెట్లో పెట్టుబడి వ్యయాన్ని 25.4 శాతం పెంచానని, ఇది అధిక వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 3.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. అయితే.. 2019 మార్చి నాటికి ఇది 3 శాతానికి తగ్గుతుందని చెప్పారు. అలాగే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 2.3 శాతంగా ఉన్న రెవెన్యూ లోటు.. సవరించిన అంచనాల్లో 2.1 శాతానికి తగ్గిందని జైట్లీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ లోటు 1.9 శాతంగా ఉంటుందన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
దళితులకు 35 శాతం పెంపు ∙గిరిజన సంక్షేమానికి 31,920 కోట్లు న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఈ బడ్జెట్లోనూ కేంద్రం పెద్దపీట వేసింది. దళితుల సంక్షేమానికి 2016–17లో కేటాయించిన రూ.38,833 కోట్లను ఈసారి రూ.52,393కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. గతంతో పోలిస్తే ఇది 35 శాతం అదనం. తాజా బడ్జెట్లో గిరిజన సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.5,329 కోట్లు (10 శాతం అదనం) కేటాయించారు. 2016–17 బడ్జెట్ లో ఈ శాఖకు రూ. 24,005కోట్లు కేటాయించగా.. ఈసారి దీన్ని రూ.31, 920 కోట్లకు పెంచారు. ఈ విభాగాల్లో సరైన ఫలితాలు వచ్చేందుకు నీతి ఆయోగ్ ద్వారా వ్యయ సమీక్ష జరపాలని కేంద్రం భావిస్తోంది. మైనారిటీల కోటాకు 10 శాతం అదనం ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలను విస్మరిస్తోం దంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలనుంచి తప్పించుకునేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు కేంద్రం గతేడాదికన్నా దాదాపు 10 శాతం నిధులను అదనంగా ఇచ్చింది. తాజా బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.4,195 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2,053.54 కోట్లు మైనారిటీల్లో విద్యా సాధికారత పెంచేందుకు, రూ.1200 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, రూ.634.95 కోట్లను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత మైనారిటీల బడ్జెట్ రూ.368 కోట్లు పెరిగింది. ఇది మైనారిటీల సాధికారితకు బాటలు వేస్తుంది’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ‘తోలు’కు చేయూత న్యూఢిల్లీ: జౌళి, చేనేత రంగానికి అమలు చేస్తున్న తరహాలోనే తోలు, పాదరక్షల పరిశ్రమ కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడతా మని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే తోళ్ల శుద్ధికి వాడే వెజిటబుల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 7.5 నుంచి 2.5కు తగ్గించారు. జూన్, 2016లో చేనేత, జౌళి రంగానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. మూడేళ్లలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపు రూ. 74,800 కోట్ల పెట్టుబడుల్ని ఆక్షరించడం పథకం ప్రధాన లక్ష్యం. అలాగే రూ.2,04,000 కోట్ల ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి పథకమే తోలు, పాదరక్షల పరిశ్రమకు వర్తింపచేస్తే... రూ.కోటి పెట్టుబ డికి 250 మంది ఉపాధి పొందుతారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా 30లక్షల మంది ఆధారపడుతున్నారు. ప్రస్తుతము న్న రూ. 47,600 కోట్ల పెట్టుబడుల్ని కూడా 2020 నాటికి రూ.1,02,000 కోట్లకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పన్నుల రద్దుతో చేనేతకు సాయం: స్మృతి ఇరానీ బడ్జెట్లో చేనేత రంగానికి సంబంధించి రూ. 1,555 కోట్ల మేర రాష్ట్ర పన్నుల రద్దు వస్త్ర రంగంలో ఎగుమతులకు ఎంతో ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. చేనేత, జౌళి శాఖకు రూ.6,226.50 కోట్లు కేటాయించినందుకు ట్వీటర్ లో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా ప్రధానమంత్రి పరిధాన్ రోజ్‌గార్ యోజన కింద వస్త్ర రంగంలో ఉపాధి కల్పనకు రూ. 200 కోట్ల కేటాయించారంటూ ట్వీట్ చేశారు. వృద్ధులకు గుడ్డిలో మెల్ల... దేశంలో వృద్ధులు : 10.39 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) మార్కెట్లో ఎన్ని యాప్‌లున్నా... మన మొబైల్లో మెమొరీ ఉండాలి కదా!! పెట్టుబడికి ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ పథకాలున్నా రాబడికి గ్యారంటీ ఉండాలి కదా!! పైపెచ్చు ఉద్యోగం చేసినన్నాళ్లూ దాచుకున్న సేవింగ్స్‌పై తగిన వడ్డీ వస్తేనే జీవితం సాఫీగా వెళుతుంది. ఎందుకంటే మన దగ్గర పెన్షన్‌గానీ, సామాజిక భద్రతగానీ లేని వృద్ధులే మెజారిటీ. అందుకే 8 శాతం రాబడి తప్పనిసరిగా వచ్చేలా వారికి ఎల్ఐసీ ద్వారా ప్రత్యేక పథకం తెస్తానన్నారు. ఇది పెద్దలందరికీ సంతోషకరమే!! వృద్ధులకు ఆరోగ్య వివరాలన్నీ నమోదు చేసిన ఆధార్ ఆధారిత స్మార్ట్ కార్డులిస్తామని కూడా హామీనిచ్చారు జైట్లీ. కార్డులు సరే!! సరైన వైద్యం అందాలి కదా? -
లక్ష్యం బాటలోనే ద్రవ్యలోటు...
2017–18లో లక్ష్యం 3.2% అటు తర్వాతి ఏడాది 3 శాతానికి కట్టడి ప్రభుత్వ ఆదాయం–వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు లక్ష్యాల బాటకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2017–18 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కట్టడి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దీనిని 3 శాతంగా కొనసాగిస్తామనీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వ్యయాల విషయంలో రాజీపడకుండానే ఈ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం 3.5 శాతం. రెవెన్యూ లోటు ఇలా... ఇక రెవెన్యూ లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం 2.3 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గితే, దీనిని 2017–18లో 1.9 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. ఎఫ్ఆర్బీఎం ప్యానల్ చెప్పిందేమిటి? వచ్చే మూడేళ్లలో 3 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఉండాలని మాజీ రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వంలోని ఎఫ్ఆర్బీఎం సమీక్షా సంఘం సూచించింది. రెవెన్యూలోటు విషయంలో ఈ లక్ష్యం 2 శాతంగా ఉంది. మార్కెట్ రుణ సమీకరణ విధమిది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర మార్కెట్ రుణ సమీకరణలు రూ. 4.25 లక్షల కోట్లుకాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దీనిని రూ. 3.48 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు రూ.75,000 తక్కువ. ఇక స్థూల రుణ సమీకరణల విషయానికి వస్తే– ఈ మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 6 లక్షల కోట్ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5.8 లక్షల కోట్లకు బడ్జెట్ తగ్గించింది. స్థూల రుణాల పద్దులో గత రుణాల పునఃచెల్లింపులు, వడ్డీలు కూడా కలిసి ఉంటాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత రుణాలపై రీపేమెంట్లను రూ.1.5 లక్షలుగా బడ్జెట్ నిర్ణయించింది. మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్ఎస్) పథకం కింద ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1.01 లక్షల కోట్ల బాండ్లను జారీ చేస్తే... ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి లక్ష కోట్లుగా బడ్జెట్ నిర్దేశించింది. ఎంఎస్ఎస్ ఫ్లోటింగ్ బాండ్ల రుణాన్ని మార్కెట్లో ద్రవ్యలభ్యత నిర్వహణకు వినియోగిస్తారు. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లుగానే అంచనావేయడం జరిగింది. అయితే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మార్కెట్లో అదనపు లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)ని పెంపొందించడానికి ఈ పరిమితిని రూ.1.01 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచింది. -
కేటాయింపులు 26% పెంపు
మహిళా శిశు సంక్షేమం గర్భిణులకు రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ గతేడాది రూ.17,640 కోట్లు ఈ ఏడాది రూ.22,095 కోట్లు న్యూఢిల్లీ: 2017–18 బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు 26శాతం నిధులు పెంచారు. గతేడాది రూ.17,640 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.22,095 కోట్లకు పెంచారు. ఇందిరా గాంధీ మంత్రిత్వ సహయోగ్ యోజనకు 2016–17 లో రూ.634 కోట్ల నిధులుండగా, ఈసారి నాలుగు రెట్లు పెంచి రూ.2,700 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద కాన్పు, టీకాల ఖర్చుల నిమిత్తం గర్భిణులకు రూ.6వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తారు. ఇదివరకున్న ప్రసూతి లబ్ధి పథకం స్థానంలో కొత్తగా ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ పథకం గతంలో దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. కొత్తగా గ్రామీణ స్థాయిలో ‘మహిళా శక్తి కేంద్రాలు’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలకు రూ.500 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ మానస పుత్రిక ‘బేటీ బచావో–బేటీ పఢావో’ పథకానికి ఈ బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. నిర్భయ నిధికి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.500 కోట్లు ఇచ్చారు. 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌కు ఇప్పటిదాకా రూ.3 వేల కోట్లు మంజూరయ్యాయి. శిశు సంరక్షణ పథకానికి గతేడాది రూ.400 కోట్లుండగా, ఈసారి సమగ్ర శిశు వికాస పథకం కింద ఈ కార్యక్రమాన్ని కలిపేసి మొత్తంగా రూ.648 కోట్లు కేటాయించారు. అన్ని మంత్రిత్వ శాఖలలో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 2016–17లో రూ.1,56,528 కోట్లుగా ఉన్న నిధులను 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.1,84,632 కోట్లకు పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. -
మహిళా శక్తి... మాటలకేనా?
ఈ ఫేస్బుక్, వాట్సాప్ యుగంలో మెజారిటీ జనం సూక్తులు చెప్పేవారే!!. సమాజ వికాసం ఆడపిల్లలతోను, మహిళలతోనే మొదలవుతుందని జైట్లీ కూడా చెప్పారు. మరి వారికోసం ఏం చేశారు? 14 లక్షల ఐసీడీఎస్ అంగన్వాడీలలో మహిళా శక్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ దానికి రూ.500 కోట్లిచ్చారు. ఒకో కేంద్రానికి రూ.4వేలకన్నా తక్కువే. దీంతో మహిళల సాధికారత, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అన్నీ సాధ్యమవుతాయట!! గర్భిణీ స్త్రీలకు రూ.6 వేలిచ్చే పథకానికి అధికారిక ట్యాగ్ వేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 48 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం ఇపుడు 55కు చేరిందట. దీన్ని పురోగతిగా అనొచ్చా? దేశంలో మహిళలు : 58.6 కోట్లు (2011జనాభా లెక్కల ప్రకారం) -
బడ్జెట్ తయారీ ఇలా...
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!! సెప్టెంబర్ చివర్లో.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్ చివర్లో.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్.. ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. జనవరి.. పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధు లు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ.. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. అందరిపై నిఘా ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా ‘ప్రత్యేకం’ బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగం సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. ముందస్తుగా.. సాధారణంగా ఫిబ్రవరి చివర్లో పెట్టే బడ్జెట్‌ను ఈసారి 1వ తేదీనే ప్రవేశ పెట్టారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్ గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. -
స్పెషల్ వైద్యం
వైద్య రంగానికి రూ. 47,352 కోట్లు న్యూఢిల్లీ: దేశంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను గణనీయంగా పెంచాలని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ తెలిపారు. ద్వితీయ, తృతీయ స్థాయిల్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు తగినంత మంది స్పెషలిస్టు వైద్యుల అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఏటా అదనంగా 5 వేల పీజీ సీట్లను సృష్టించనున్నట్లు తెలిపారు. 2017–18లో మొత్తంగా వైద్య రంగానికి రూ. 47,352.51 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2016–17లో ఈ రంగానికి కేటాయించిన రూ. 37,061.55 కోట్లకన్నా తాజా కేటాయింపు 27.76 శాతం అధికమన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఆయుష్ మంత్రిత్వశాఖకు రూ. 1,428.65 కోట్లు, వైద్య పరిశోధన విభాగానికి రూ. 1,500 కోట్లు (గతేడాది కేటాయింపులు రూ. 1,144.80 కోట్లు) కేటాయిస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులు... పెద్ద జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులను ప్రవేశపెడతామని, ఎంపిక చేసిన ఈఎస్ఐ, మున్సిపల్ కార్పొరేషన్ ఆస్పత్రుల్లో పీజీ బోధనను బలోపేతం చేస్తామని, పేరుగాంచిన ప్రైవేటు ఆస్పత్రులు డీఎన్బీ కోర్సులు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. సరసమైన ధరల్లో మందులు... దేశంలో జెనరిక్ మందులను ప్రోత్సహించేందుకు, ఔషధాలన్నీ సరసమైన ధరల్లో ఉండేలా చూసేందుకు ఔషధాలు, సౌందర్య సాధనాల నిబంధనలను సవరిస్తామని జైట్లీ తెలిపారు. వైద్య పరికరాల నియంత్రణకు కొత్త నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ఏడాదిలోగా బోదకాలు వ్యాధి నిర్మూలన దేశం నుంచి కాలా–అజర్, బోదకాలు, కుష్టు, తట్టు వ్యాధులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. 2017కల్లా కాలా–అజర్, బోదకాలు వ్యాధులను, 2018కల్లా కుష్టు, 2020కల్లా తట్టును, అలాగే 2025 నాటికి క్షయను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్ల చెప్పారు. శిశు, బాలింత మరణాల తగ్గుదలకు ప్రణాళిక 2014లో ప్రతి వెయ్యి జననాలకు 39గా ఉన్న శిశు మరణాల రేటును 2019కల్లా 28కి తగ్గించేందుకు, 2011–13 కాలానికి ప్రతి లక్ష శిశు జననాలకు 167గా నమోదైన బాలింతల మరణాల రేటును 2018–20కల్లా 100కు తగ్గించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని జైట్లీ చెప్పారు. ఆరోగ్య ఉప కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మారుస్తామన్నారు. -
ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం డిజిటల్ లైబ్రరీ నాణ్యమైన విద్యతోనే యువత సాధికారత సాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెప్పారు. దేశంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు తెరతీసే చర్యలను ఆయన బుధవారం బడ్జెట్లో ప్రకటించారు. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైంది.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు స్వయం ప్రతిపత్తి గల ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ఏర్పాటు. ఈ ఏజెన్సీ రాకతో సీబీఎస్ఈ, ఏఐసీటీఈ వంటి సంస్థలకు పరీక్ష నిర్వహణ బాధ్యతల నుంచి వెసులుబాటు కలుగుతుందని జైట్లీ చెప్పారు. బడ్జెట్లో పాఠశాల విద్య, అక్షరాస్యతకు రూ.46,356 కోట్లు, ఉన్నత విద్యకు రూ.33,329 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. – న్యూఢిల్లీ ‘స్వయం’ ద్వారా 350 ఆన్లైన్ కోర్సులు మన దేశంలో పాఠశాలలు సాధిస్తున్న వార్షిక ఫలితాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉందని జైట్లీ చెప్పారు. శాస్త్రీయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా సరళమైన కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు, మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యనందించేందుకు ‘ఇన్నోవేటివ్ ఫండ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో విద్యాపరంగా వెనుకబడ్డ 3,479 ప్రాంతాలపై ఇకపై మరింత దృష్టి పెడతామన్నారు. ఐసీటీ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘స్వయం’వేదిక ద్వారా అత్యుత్తమ నాణ్యతతో కూడిన 350 ఆన్లైన్ కోర్సులను అందిస్తామన్నారు. డీటీహెచ్ చానళ్లలోనూ ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. యూజీసీలో సంస్కరణలకు శ్రీకారం చుడతామని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్, ర్యాంకింగ్‌ల ఆధారంగా విద్యాసంస్థలకు గుర్తింపు, స్వయం పాలిత(అటానమస్) హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు. 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు జార్ఖండ్, గుజరాత్‌లోఎయిమ్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. మెడికల్ సైన్సెస్‌లో పీజీ సీట్లను పెంచుతామన్నారు. దేశవ్యాప్తంగా 600కుపైగా జిల్లాల్లో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలను విస్తరింపజేస్తామని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగోరే యువతకు సహకరించేందుకు 110 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. వొకేషనల్ విద్యకు రూ.2,200 కోట్లు కేటాయించారు. రూ.4,000 కోట్లతో స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తోలు, పాదరక్షల పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలు జాతీయస్థాయిలో డిజిటల్ లైబ్రరీని అభివృద్ధిపర్చాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యామిషన్‌లో భాగంగా ఐసీటీ కింద ఈ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, పరిశోధకులకు ఇది కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ హిమాలయన్ స్టడీస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో 10 ప్రపంచస్థాయి విద్యాసంస్థలను నెలకొల్పనున్నారు. పరిశోధనలు చేసే ప్రొఫెసర్ల కోసం ప్రత్యేక కేటాయింపులు చేశారు. బడ్జెట్ హైలైట్స్ ► ‘టెక్ (టీఈసీ–ట్రాన్స్ఫామ్, ఎనరై్జస్,క్లీన్ ఇండియా)’ఎజెండాతో బడ్జెట్ ► రూ.2.5 లక్షలు–రూ.5 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు ► రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయంపై 10 శాతం సర్‌చార్జీ విధింపు ► ఎల్ఎన్జీపై కస్టమ్స్ పన్ను 2.5 శాతానికి తగ్గింపు ► రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు పైబడిన నగదు విరాళాలపై నిషేధం. కేవలం చెక్కులు, ఇతర డిజిటల్ రూపాల్లోనే స్వీకరించాలి ► ఆర్బీఐ ఆధ్వర్యంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ ► వయోవృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు, కనీసం 8 శాతం రాబడినిచ్చే పథకం ► ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు ‘ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)’ రద్దు ► రైల్వే అనుబంధ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్‌సీఓఎన్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ► డిజిటల్ పేమెంట్ల పర్యవేక్షణకు ‘పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు’ ఏర్పాటు ► ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రతా నిధి ఏర్పాటు. ► రైల్వేల్లో అభివృద్ధి పనులకు రూ.1.31 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర నుంచి రూ.55 వేల కోట్లు. ► స్థిరాస్తులపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను గడువు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు ► ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.72,000 కోట్లు.. డిజిటల్ పేమెంట్లకు ప్రోత్సాహమిచ్చేలా పీవోఎస్ యంత్రాలు, ఐరిస్ రీడర్లపై పన్ను మినహాయింపు ► వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.8 శాతం, పరోక్ష పన్నుల వసూళ్లు 8.3 శాతం పెరుగుతాయని అంచనా. ► మౌలిక సదుపాయాలపై పెట్టుబడి రూ.3.96 లక్షల కోట్లకు పెంపు.. రూ.2 వేల కోట్ల కార్ఫస్ ఫండ్‌తో డెయిరీ ప్రాసెసింగ్ ఫండ్ ఏర్పాటు ► మహిళా, శిశు సంక్షేమ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు.. గ్రామీణ, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.87 లక్షల కోట్లు ► పేదలకు 2019 నాటికి కోటి గృహాల నిర్మాణం ► ఎస్టీలకు రూ.31,920 కోట్లు, మైనారిటీ వ్యవహారాలకు రూ.4,195 కోట్లు ► రైలు, రోడ్డు, నౌకాయాన రంగాలకు రూ.2.41 లక్షల కోట్లు ► దేశంలో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ విస్తృతి కోసం ‘భారత్ నెట్’ప్రాజెక్టుకు రూ.10,000 కోట్లు -
అడ్డగోలు విరాళాలకు ‘చెక్’
రాజకీయ పార్టీల విరాళాలపై కఠిన ఆంక్షలు రూ.2 వేలు దాటితే చెక్కు లేదా డిజిటల్ రూపంలో ఇవ్వాల్సిందే రిటర్న్స్ పత్రాల దాఖలు తప్పనిసరి తెరపైకి కొత్తగా ఎలక్టోరల్ బాండ్లు దాతలు బ్యాంకుల ద్వారా వాటిని కొనుగోలు చేసి.. పార్టీలకు ఇవ్వొచ్చు పార్టీకి, దాతకు ఐటీ నుంచి మినహాయింపు.. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే: జైట్లీ న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇకపై ఇష్టారాజ్యంగా విరాళాలు తీసుకోవడం కుదరదు! రూ.2 వేలు దాటిన ప్రతి విరాళం ఇక ‘లెక్క’లోకి రానుంది. అంతకుమించితే కచ్చితంగా చెక్కు, డిజిటల్ రూపంలో లేదా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇవ్వా ల్సి ఉంటుంది. అలాగే ప్రతి పార్టీ ట్యాక్స్ రిటర్న్స్ పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్లో ప్రకటించారు. పార్టీ విరాళాల్లో పారదర్శకత, నల్లధనం నిరోధానికి ఆయన ఈ చర్యలను ప్రతిపాదించారు. కొత్తగా ‘ఎలక్టోరల్ బాండ్స్’ను తెరపైకి తెచ్చారు. బ్యాంకుల ద్వారా బాండ్లు ‘‘ప్రస్తుతం ఒక వ్యక్తి రూ.20 వేల వరకు పార్టీకి విరాళంగా ఇవ్వొచ్చు. అయితే దీన్ని రూ.2 వేలకే పరిమితం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. రూ.2 వేలకు మించితే దాతలు ఇకపై కచ్చితంగా చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది’’ అని జైట్లీ వివరించారు. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసేందుకు కొత్త పథకం తెస్తామని, ఇందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి సవరణలు చేస్తామని తెలిపారు. ‘‘పార్టీలకు విరాళం ఇవ్వాలనుకునే దాతలు చెక్కు లేదా డిజిటల్ రూపంలో బ్యాంకుకు సొమ్మును చెల్లించి ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుక్కోవాలి. ఈ సమయంలో వారిచ్చే సొమ్ము వైట్‌మనీ, క్లీన్‌మనీ అవుతుంది. ర్వాత వారు ఆ బాండ్లను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చుకోవచ్చు. నిర్దిష్ట సమయంలోగా పార్టీలు వాటిని బ్యాంకులకు సమర్పించి తమ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేసుకోవచ్చు’’ అని జైట్లీ వివరించారు. ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చామనే వివరాలు బయటకి పొక్కితే లేనిపోని తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తమ వివరాలు గోప్యంగా ఉంచుకోవాలనుకునే వారికి ఈ బాండ్లు ఒక ఉపకరణంగా ఉపయోగపడతాయి. తమ వివరాలు బయటకు తెలిసినా నష్టం లేదనుకునేవారు నేరుగా చెక్కు, డిజిటల్ పేమెంట్ల రూపంలో పార్టీలకు విరాళాలు చెల్లించవచ్చు. ‘‘ఎలక్టోరల్ బాండ్లపై దాత పేరు ఉండదు. విరాళం పొందిన పార్టీతోపాటు దాతకూ మినహాయింపు వర్తిస్తుంది. టాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఈ మినహాయింపును పొందవచ్చు. పార్టీలు తమకు బాండ్లు ఎవరిచ్చారు? ఎన్ని బాండ్లు వచ్చాయన్న వివరాలను ఆ పత్రాల్లో పొందుపరచాలి. అప్పుడే పన్ను మినహాయింపు వర్తిస్తుంది’’ అని జైట్లీ స్పష్టంచేశారు. కొత్త విధానంతో ‘క్లీన్’ మనీ ఈ కొత్త విధానంతో రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని, బ్లాక్‌మనీ నిరోధానికి కూడా తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు. ఇప్పటిదాకా పార్టీలకు నగదు రూపంలోనే విరాళాలు అందుతున్నాయని, అందులో పారదర్శకత లోపించిందని చెప్పారు. తాజా విధానంలో దాతలు ఇచ్చే సొమ్ము, పార్టీలకు అందే సొమ్ము క్లీన్‌గా ఉంటుందన్నారు. లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరుగుతాయి కాబట్టి అవన్నీ పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. -
మోదీ గ్రామీన మంత్రం !
నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)తో అల్లాడిన పల్లెవాసులను ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్లో కనికరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడం కోసం మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. కీలకమైన ‘ఫ్లాగ్షిప్’ పథకాలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి ఇదివరకెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నిధులను కేటాయించడం నోట్ల రద్దు ప్రభావం గ్రామీణ భారతావనిపై తీవ్రంగా ఉందన్న వాస్తవాన్ని తేటతెల్లం చేసింది. ఇక మోదీ ప్రతిష్టాత్మక పథకం.. స్వచ్ఛభారత్‌పై మరింత దృష్టిసారించారు. గ్రామీణ విద్యుదీకరణను వేగవంతం చేయడం... కోటి పక్కా ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం... రోడ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించడం... వంటి చర్యల ద్వారా పల్లె వాసులను నోట్ల రద్దు ప్రభావం నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి జైట్లీ తీవ్రంగానే ప్రయత్నించారు. మొత్తంమీద 2019 నాటికి కోటి కుటుంబాలను దారిద్య్రరేఖ నుంచి పైకి తీసుకురావడం, 50,000 గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చేయడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖకు మొత్తం కేటాయింపులు 2016–17లో రూ.97,760 కోట్ల నుంచి వచ్చే ఏడాదికిగాను రూ.1,07,758 కోట్లకు పెంచారు. 25 శాతం పెంపు ఉపాధికి ‘ధీమా’.. 2017–18 కేటాయింపులు 48,000 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 38,500 (రూ. కోట్లలో) యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కీలక పథకానికి మోదీ సర్కారు ఈ సారి నిధుల వర్షాన్ని కురిపించింది. 2016–17లో కేటాయించిన మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేయడమే కాకుండా.. 2017–18 ఏడాదికి ఏకంగా 25 శాతం కేటాయిపులు పెంచి... రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లకు చేర్చారు. నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్న పేదలకు ఇది కచ్చితంగా వరదాయకమే. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2008 నుంచి దేశంలోని అన్ని జిల్లాల్లో ఇది అమలవుతోంది. గ్రామాల్లో మౌలిక వసతుల పెంపునకు ఈ పథకాన్ని మరింత సమర్ధంగా వినియోగించుకునే దిశగా క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివాటిని కూడా మోదీ ప్రభుత్వం దీనిలోకి చేర్చింది. ♦ ఈ స్కీమ్ ద్వారా వర్షాలపైనే ఆధారపడిన ప్రాంతాల్లో 5 లక్షల వ్యవసాయ చెరువులు, బావుల తవ్వకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ కోసం 10 లక్షల కంపోస్టు గుంతలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలను మోదీ∙సర్కారు నిర్దేశించింది. ♦ అయితే, మార్చి 2017 నాటికి 10 లక్షల చెరువులను పూర్తిచేయనున్నామని.. 2017–18లో మరో 5 లక్షల వ్యవసాయ చెరువుల తవ్వకాన్ని చేపట్టనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ♦ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 48 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి చేరిందని చెప్పారు. ‘స్వచ్ఛ భారత్’కు దన్ను.. 55 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 13,948 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 9,000 (రూ. కోట్లలో) భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ 2014 అక్టోబర్ 2న ఈ స్వచ్ఛ భారత్ అభియాన్(ఏబీఏ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం నిధులను సమకూర్చేందుకుగాను అర శాతం స్వచ్ఛ భారత్ సెస్‌తో పాటు... క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్‌ను కూడా వసూలు చేస్తున్నారు. ఈ పథకానికి కేటాయింపులు ఈసారీ 55 శాతం పెరిగాయి. ఇందులో రూ.1,395 కోట్లను ఈశాన్య రాష్ట్రాలు–సిక్కింలకు, రూ.3,069 కోట్లను దళితులకు(ఎస్సీ), రూ.1,395 కోట్లను గిరిజనులకు(ఎస్టీ)లకు కేటాయించనున్నారు. ♦ 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. ♦ దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం. ♦ 2016–17లో 1.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2016 డిసెంబర్ నాటికి 1.12 కోట్లు నిర్మితమయ్యాయి. రూ.6,917 కోట్లను ఖర్చు చేశారు. ♦ డిసెంబర్ నాటికి 66 జిల్లా, 702 బ్లాకులు, 56,769 గ్రామ పంచాయతీలు, 1,26,900 పల్లెల్లోని కుటుంబాలన్నీ సెప్టిక్ లెట్రిన్లనే ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ♦ గ్రామీణ భారత్‌లో పారిశుధ్య కవరేజీ 2014 అక్టోబర్‌లో 42 శాతంకాగా.. ఇప్పుడిది 60 శాతానికి పెరిగినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన 2017–18 కేటాయింపులు 10,635 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 8,500 (రూ. కోట్లలో) విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలో ఇంకా 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం మోదీ సర్కారు లెక్కగట్టింది. 2018 మే 1 నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ ప్రకటించారు. తాజా బడ్జెట్లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,814 కోట్లు... ఉచిత విద్యుత్ కనెక్షన్లు, ఫీడర్లను వేరుచేయడం వంటి స్కీమ్స్(ఐపీడీఎస్)కు రూ.5,821 కోట్లు చొప్పున కేటాయించారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) 2017–18 కేటాయింపులు 6,050 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 5,000 (రూ. కోట్లలో) భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్‌లో భాగమైన ఈ పథకానికి మోదీ ప్రభుత్వం నిధులను అంతకంతకూ పెంచుతోంది. దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని(హ్యాండ్ పంపులు, పైపులు ఇతరత్రా మార్గాల్లో) అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. కాగా, నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై). 53.3 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 23,000 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 15,000 (రూ. కోట్లలో) 2022 కల్లా దేశంలో అందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ బడ్జెట్లో చౌక గృహనిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 నాటికి ఇళ్లులేనివాళ్లు, పూరిళ్లలో ఉంటున్న వారికి ఒక కోటి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబా లు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారి టీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. మైదాన ప్రాంతాల్లో పేదలకు ఒక్కో ఇంటికి రూ.1.2 లక్షలు..., కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.1.3 లక్షల చొప్పున సాయాన్ని ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ సెప్టిక్ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. పీఎంఏవై కిందకు రాని గ్రామీణ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం, ఆధునీకరణకు తీసుకునే రుణాల్లో రూ.2 లక్షల వరకూ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) 2017–18 కేటాయింపులు 19,000 (రూ. కోట్లలో) పెంపు లేదు 2016–17 కేటాయింపులు 19,000 (రూ. కోట్లలో) ♦ గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి వాజ్‌పేయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పథకం ఇది. ♦ 2011–14 మధ్య రోజుకు సగటు రోడ్డు నిర్మాణం 73 కిలోమీటర్లు కాగా, 2016–17లో ఇది 133 కిలోమీటర్లకు జోరందుకుందని జైట్లీ పేర్కొన్నారు. ♦ 2021 నాటికి మిగిలిన 65,000 అర్హత గల గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రోడ్లతో అనుసంధానించేందుకు దాదాపు 2.3 లక్షల కి.మీ. మేర రోడ్లను నిర్మించాలన్నదే లక్ష్యం దీన్ని 2019 నాటికే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ♦ 2105–16; 16–17లో 10,894 రోడ్లను, 723 బ్రిడ్జ్‌లను(మొత్తం 44,947 కి.మీ) మంజూరు చేశారు. దీనికి అంచనా వ్యయం రూ.26,421 కోట్లు. ♦ ప్రస్తుతం 56,943 గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఎంపిక చేయగా.. 12,599 ప్రాంతాలకు ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉంది. 44,344 ప్రాంతాలకు నిధులు మంజూరయ్యాయి.. అనుసంధాన పక్రియ కొనసాగుతోంది. మొత్తం లక్ష్యంలో ఇంకా 1,77,523 కి.మీ. రోడ్లను నిర్మించాల్సి ఉంది. ♦ అయితే, తాజా బడ్జెట్లో దీనికి నిధుల కేటాయింపులను పెంచలేదు. అయితే, రాష్ట్రాల వాటాతో కలిపితే మొత్తం నిధులు రూ.27,000 కోట్లుగా జైట్లీ పేర్కొన్నారు. గ్రామీణ టెలిఫోనీ.. ♦ భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ (జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్–ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్స్ వినియోగాన్ని పెంచడం. 2017 నాటికి టెలీ డెన్సిటీని 70 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. ♦ టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. ♦ ఈ ఏడాది ఒక్క భారత్ నెట్ కోసమే రూ.10,000 కోట్లను కేటాయించడం గమనార్హం. ♦ 2017–18 చివరినాటికి 1.5లక్షల గ్రామ పంచాయతీలకు ఓఎఫ్ఎన్ కింద హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని జైట్లీ పేర్కొన్నారు. ♦ డిజిటల్ టెక్నాలజీ ద్వారా టెలీ మెడిసిన్, విద్య, నైపుణ్యాల కల్పన కోసం ‘డిజిగావ్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డిజిటల్ సేవల కోసం తక్కువ టారిఫ్‌లతో వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. 322 శాతం పెంపు 2017–18 కేటాయింపులు 11,636 (రూ. కోట్లలో) 2016–17 కేటాయింపులు 2,755 (రూ. కోట్లలో) గ్రామీణాభివృద్ధికి జోష్! న్యూఢిల్లీ దేశంలోని కోటి కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లో గ్రామీణ రంగానికి కేంద్రం పెద్ద పీట వేసింది. 2019 నాటికి దేశంలోని 50 వేల గ్రామ పంచాయతీలను పేదరిక రహితంగా మార్చుతామని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యతను పెంచడమనేది రాజీ లేని ఎజెండా అని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ రంగానికి గణనీయ స్థాయిలో నిధులు పెంచడంతోపాటు వ్యవసాయం, ఉపాధి హామీ, గ్రామీణ రహదారులు, ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు, కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారీగా నిధుల కేటాయింపు 2017–18 బడ్జెట్లో మొత్తంగా గ్రామీణ రంగానికి రూ.1,87,200 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికం కావడం గమనార్హం. దేశ చరిత్రలో గ్రామీణ రంగానికి ఇదే అత్యధిక కేటాయింపు కూడా. ఇందులో ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖకే రూ. 1,07,758 కోట్లు ఇచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రికార్డు స్థాయిలో రూ.48,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పనులతో ఉత్పత్తికి తోడ్పడే ఆస్తుల కల్పన జరగాలని.. వ్యవసాయ ఉత్ప త్తులు, రైతుల ఆదాయం పెరగడానికి అది తోడ్పడాలని జైట్లీ పేర్కొన్నారు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.23 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించి.. 65 వేల నివాస ప్రాంతాలను అనుసంధానిస్తామని ప్రకటించారు. గ్రామీణ మహిళల్లో సాధికారతను పెంపొందించడానికి మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పేదల కోసం 2019 నాటికి కోటి ఇళ్లను నిర్మిస్తామని జైట్లీ తెలిపారు. పీఎంఏవై ఇళ్ల పథకానికి కేటాయింపులను రూ.15 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్లకు పెంచడంతోపాటు.. దీని కింద ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపు గడువును 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్, ఫ్లోరైడ్ బాధిత 28 వేల నివాస ప్రాంతాలకు వచ్చే నాలుగేళ్లలో సురక్షిత మంచినీటిని అందజేస్తామని వెల్లడించారు. 2022 నాటికి ఐదు లక్షల మందికి తాపీ పనిలో శిక్షణ ఇస్తామని అందులో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 20 వేల మందికి శిక్షణ ఇస్తామని జైట్లీ ప్రకటించారు. -
దండిగా వ్యవ'సాయం'
రైతులకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వరాలు అన్నదాతా... ఐదేళ్లాగాలా? ఏదైనా ఓకే! తిండిని డౌన్లోడ్ చెయ్యలేం కదా!! దాన్ని రైతు పండించాల్సిందే!! ఇది తెలిసే రైతు వాలెట్లో రెట్టింపు ఆదాయం వేస్తానన్నారు జైట్లీ. దానికి ఐదేళ్ళు కావాలన్నారు. మరి తొలి ఏడాదేం చేశారు? రుణాల లక్ష్యం 9 నుంచి 10 లక్షల కోట్లకు పెంచారు. కానీ ఇవ్వాల్సింది బ్యాంకులు కదా? సహకార సంఘాల నుంచి తీసుకునే రుణాలకు 60 రోజుల వడ్డీ రాయితీని అధికారికం చేశారు. ఇది ఏమాత్రం సరిపోతుందన్నది ప్రశ్నే. పంటల బీమా కింద కవరేజీ పెంచినా... బీమా సొమ్ము సకాలంలో అందుతుందా? భూసార పరీక్షలకు మినీ ల్యాబ్‌లు, సాగు నిధి, మైక్రో ఇరిగేషన్ నిధి... ఇవన్నీ అంది రైతు లాభపడాలంటే ఐదేళ్లు ఆగాల్సిందేనా? దేశంలోని రైతులు: 1 1.88 కోట్లు (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 లెక్కల ప్రకారం) రైతులకు రూ.10 లక్షల కోట్ల రుణాలు వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ.58,663 కోట్లు ప్రధాని పంటల బీమా పథకానికి రూ.9 వేల కోట్లు సూక్ష్మ సేద్యానికి రూ.5,000 కోట్లు ఐదేళ్లలో అన్నదాతల ఆదాయం రెట్టింపు వ్యవసాయ రంగం వృద్ధిరేటు 4.1 శాతంగా అంచనా న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకు 2017–18లో అన్నదాతలకు రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 2016–17 బడ్జెట్‌తో పోలిస్తే వ్యవసాయ రుణాలను రూ.లక్ష కోట్ల మేర పెంచినట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ, అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.58,663 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. 2016–17లో ఇది రూ.52,821 కోట్లుగా ఉంది. వ్యవసాయ రుణాల్లో వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక చర్యలు చేపడతామని జైట్లీ పేర్కొన్నారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురవడంతో దేశంలో వ్యవసాయం పరిస్థితి ఆశాజనకంగానే ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్, రబీలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సాగుకు ఇంకేం ఇచ్చారంటే.. ► కిందటేడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించారు. 2016–17లో ఈ పథకానికి రూ.13,240 కోట్లు కేటాయించడం గమనార్హం. పథకం పరిధిలోకి 2016–17లో 40% పంట భూములను, 2017–18కల్లా 50 శాతం పంట భూములను తెస్తామని జైట్లీ ప్రకటించారు ► రైతులకు సబ్సిడీ వడ్డీపై అందించే స్వల్పకాలిక రుణాలకు రూ.15 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు ► సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డులో రూ.5 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు. నాబార్డులో ఇప్పటికే ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ 20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంపు ► పాడి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్పారు. డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు వచ్చే మూడేళ్లకుగాను రూ.8 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ► చిన్న, సన్నకారు రైతులు తేలిగ్గా రుణాలు పొందేందుకు వీలుగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ)కోర్ బ్యాకింగ్ వ్యవస్థతో అను సంధానిస్తామని జైట్లీ తెలిపారు. ఇందుకు మూడేళ్లలో రూ.1,900 కోట్లు వెచ్చించనున్నారు ► ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్) వ్యవస్థ ప్రస్తుతం 250 మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీన్ని 585 మార్కెట్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జైట్లీ చెప్పారు. వీటిల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్కో మార్కెట్‌కు రూ.75 లక్షల సాయం అందజేస్తామన్నారు. ► భూసార పరీక్షల కోసం దేశంలోని 648 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో మినీ ల్యాబ్‌ల ఏర్పాటు. వీటికి అదనంగా.. స్థానికంగా ఉండే నిపుణులతో మరో వెయ్యి మినీ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు ► పళ్లు, కూరగాయల సాగులో ‘కాంట్రాక్ట్ వ్యవసాయం’పై నమూ నా చట్టం తెస్తామని చెప్పారు. దీనిపై రాష్ట్రాల అభిప్రాయం కోరతామన్నారు ► ధరల స్థిరీకరణ నిధి(పీఎస్ఎఫ్)కి రూ.3,500 కోట్లు ► పంటలకు గిట్టుబాటు ధర దక్కని సమయంలో మార్కెట్ ధరల్లో జోక్యం చేసుకునేందుకు ఉద్దేశించిన పథకానికి రూ.200 కోట్లు ► విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి దేశీయ ఆహార పరిశ్రమను కాపాడేందుకు.. జీడిపప్పు(రోస్టెడ్ అండ్ సాల్ట్) దిగుమతిపై 30 శాతం ఉన్న కస్టమ్ డ్యూటీని 45 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు గ్రామీణం, వ్యవసాయ రంగంపై బడ్జెట్లో ఫోకస్ పెరిగింది. ఇది మంచి పరిణామం. డిజిటైజేషన్, కొత్త సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ లక్ష్యాన్ని సాధించేందుకు సూక్ష్మ సేద్యానికి రూ.5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించారు. మరింత భూమిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు ఇది తోడ్పడుతుంది. – హర్ష కుమార్ భన్వాలా, నాబార్డ్ చైర్మన్ బడ్జెట్ స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక. మూలధన బడ్జెట్ మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. క్యాపిటల్ పద్దు (ప్రణాళికా వ్యయం) ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి. రెవెన్యూ పద్దు (ప్రణాళికేతర వ్యయం) ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటకం, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి. సంచిత నిధి అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు–రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు–మూలధన వ్యయం. ప్రభుత్వ ఖాతా సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. రెవెన్యూ వసూళ్లు పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూ లు చేసే చార్జీలు వీటి కిందకే వస్తాయి. రెవెన్యూ వ్యయం ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు. రెవెన్యూ లోటు (REVENUE DEFICIT) రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా. ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ ట్యాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. పరోక్ష పన్నులు (REVENUE DEFICIT): మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్,ఎక్సైజ్, సర్వీస్ టాక్స్‌లన్నీ దీని పరిధిలోకే వస్తాయి. స్వల్పంగా పెరిగిన సీబీఐ బడ్జెట్ న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 695.62 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే 8.31 శాతం పెంచింది. గత బడ్జెట్లో రూ. 727.75 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో దానిని రూ. 642.24 కోట్లకు తగ్గించింది. ఈ మొత్తానికి మరో రూ. 53.38 కోట్లు ఎక్కువగా ఈసారి బడ్జెట్లో అరుణ్ జైట్లీ కేటాయించారు. -
తెలంగాణపై బడ్జెట్ ఎఫెక్ట్...
‘ఉపాధి’కి ఊతం ‘ఉపాధి’వేతన చెల్లింపులకు రూ.3,500 కోట్లు మంజూరయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి కేంద్రం తాజా బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్రంలో ఉపాధి పనులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. గతేడాది కన్నా రూ.10 వేల కోట్లు అధికంగా కేటాయించడం పట్ల గ్రామీణాభివృద్ధి శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజా కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని ఆ శాఖ సిబ్బంది చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీల వేతనాలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, వచ్చే ఏడాది రూ.3 వేల కోట్ల నుంచి రూ3,500 కోట్ల దాకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధి పనులను అధికంగా చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉన్నందున కేటాయింపులు అధికంగా రావొచ్చని చెబుతున్నారు. పనిదినాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పనుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించడం గమనార్హం. నీటి సంరక్షణపైనే ఫోకస్! వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటి సంరక్షణపై ప్రధానంగా దృష్టి సారించి ఉపాధి హామీ పనులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వ్యవసాయ కుంటలు, కాంటూర్ ట్యాంక్స్, చెరువుల పూడికతీత.. తదితర నీటి సంరక్షణ చర్యలు చేపట్టనుంది. శాశ్వత ఆస్తుల కల్పనలో భాగంగా అంగన్ వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంట్‌రోడ్డు, పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. – బి.సైదులు, జాయింట్ కమిషనర్ (ఉపాధిహామీ) సాగు ప్రాజెక్టుల రుణాలకు వెసులుబాటు కార్పస్ ఫండ్ పెంపుతో తగిన స్థాయిలో రుణాలు అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాగునీటి ప్రాజెక్టులకు చేయూత నిచ్చేలా ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్‌ను రూ.20 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచనుండడంతో ఆ మేరకు రాష్ట్రాలకు రుణ వెసులుబాటు కలుగుతుందని పేర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్రం గుర్తించిన 11 తెలంగాణ ప్రాజెక్టుల కోసం తగినన్ని రుణాలు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నాయి. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం కోసం కేంద్రం గతేడాదే దీర్ఘకాలిక సాగునీటి నిధి (ఎల్‌టీఐఎఫ్) కింద రూ.20 వేల కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కానీ దేవాదుల, రాజీవ్ భీమా, ఎస్ఆర్ఎస్పీ రెండోదశ, నీల్వాయి, ర్యాలివాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కొమ్రం భీమ్, జగన్నాథపూర్, పెద్దవాగు, గొల్లవాగు, వరద కాలువలకు ఎలాంటి రుణాలూ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను కాళేశ్వరం కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్పొరేషన్ కు ఎఫ్ఆర్బీఎం పరిమితితో సంబంధం లేకుండా రూ.7,900 కోట్లు రుణాలు ఇవ్వాలని కోరగా.. నాబార్డు అంగీకరించింది కూడా. తాజాగా కార్పస్ ఫండ్‌ను పెంచడంతో కాళేశ్వరం కార్పొరేషన్ కింద రుణాలు తీసుకునే వెసులుబాటు దొరకనుంది. పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడిగా ఉండటం సైతం రాష్ట్రానికి కలిసిరానుంది. హైదరాబాద్ ఐఐటీకి 75 కోట్లు గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఐఐటీకి ఎంప్లాయి అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద రూ. 75 కోట్లు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించింది. విభజన చట్టం హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ట్రైబల్ యూనివర్సిటీ కోసం రూ. 10 కోట్లు కేటాయించింది. ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్‌లకు (ఈబీబీ) కేటాయించే ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని 317 ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎ్ టీఏ) ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కూడా జేఈఈ మెయిన్ పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే నిర్వహించనున్నారు. గర్భిణులకు రూ.15 వేల ప్రోత్సాహకం రాష్ట్ర ప్రభుత్వం యోచన.. కేంద్ర బడ్జెట్లో రూ.6 వేలు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సా హకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు రూపొందిస్తున్నాయి. బుధవారం కేంద్రం తన బడ్జెట్లో గర్భిణులకు రూ. 6 వేలు కేటాయించింది. అంటే కేంద్రం నుంచి రూ.6వేలు వస్తే... రాష్ట్రం రూ.9 వేలు కేటాయిస్తే సరిపోతుంది. గర్భిణులకు ఇంత భారీగా ప్రోత్సాహకం అందించే రాష్ట్రం మనదే కానుండటం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గర్భిణులకు రూ. వెయ్యి ప్రోత్సాహకంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా 347 డెలివరీ పాయింట్లు... రాష్ట్రంలో గుర్తించిన 347 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ప్రత్యేకంగా కాన్పు కోసం డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని 24 గంటలూ పనిచేసే ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతారు. ముగ్గురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ప్రత్యేక డెలివరీ గదులను అందుబాటులోకి తీసుకొస్తారు. తద్వారా గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు. ఉపకారానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి నిధులు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్డెట్లో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పాఠశాల (ప్రీమెట్రిక్) విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు అందనున్నాయి. మోదీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా 2017–18 వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసింది. ఉపకార వేతనాల కింద మైనార్టీ సంక్షేమానికి రూ.1500 కోట్లు, ఎస్సీ సంక్షేమం కింద రూ.3,397 కోట్లు, బీసీ విద్యార్థుల కోసం 1,027 కోట్లు, గిరిజన సంక్షేమం కింద రూ.1,612.07 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో బీసీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు దక్కనున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఏదీ?
కేంద్ర బడ్జెట్‌పై వైఎస్ఆర్సీపీ నేత కొలుసు పార్థసారథి మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2017–18 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థ సారథి విమర్శించారు. జార్ఖండ్, బిహార్ గురించి మాట్లాడిన జైట్లీ.. హోదా కోసం ఉద్యమించిన ఏపీ ప్రస్తావన తేకపోవడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. అమరావతికి రైల్వే లైన్ల విషయం కూడా లేదన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పావలా వడ్డీకే రుణా లు ఇస్తామని చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా, రాష్ట్రంలో ఈ పథకం దుర్వినియోగం అవుతోందన్నారు. అంకెల గారడీ..: మోదీ ప్రధాని అయ్యే నాటికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 183.5గా ఉంటే నవంబర్ 2016 నాటికి 181.2కు పడిపోయిందని పార్థసారథి వివరించారు. 2015–16లో రూ.35.41 లక్షల కోట్లు ఉన్న గ్రాస్ ఫిక్స్డ్ కేపిటల్ ఫార్మేషన్ 2016–17లో రూ.35.30 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడీపీ 7.1 శాతం నమోదు అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది కేవలం అంకెల గారడీగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారన్నా రు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావ డం వల్ల 17 శాతం రెవెన్యూ పెరిగిందే తప్ప అది ప్రభుత్వ గొప్పదనం కాదని చెప్పారు. బడ్జెట్ బాగుందని బల్లలు చరిచిన టీడీపీ నేతలకు ఏం కనిపించిందో అర్థం కావడం లేదన్నారు. వీరి వల్లే ప్రత్యేక హాదాకు బ్రేక్ పడిందన్నారు. -
దేశాన్ని నవ్యపథంలో నడిపిస్తుంది
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన ఏపీ సీఎం సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ దేశాన్ని నవ్య పథంలో నడిపిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణలని, అవి దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాయని చెప్పారు. దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను ఆయన అభినందించారు. బుధవారం రాత్రి విజయవాడలోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ విధానంలో 35 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు రెండేళ్లపాటు కేపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపును ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీతోనే ప్రయోజనం ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని.. అందుకే స్వాగతించానని చెప్పారు. కొందరు ప్రత్యేక హోదా వల్ల ఏదో ఒనగూరుతుందని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించేలా మంత్రివర్గంలో తీర్మానం చేసి, విభాగాల వారీగా జీవోలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో బ్రిటిషు వాళ్లు వేగంగా రైల్వే మార్గాలు వేస్తే.. ఇండియన్ రైల్వే నినాదాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పార్టీలను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు.. దేశంలో కొన్ని రాజకీయపార్టీలను పార్టీ ఫండ్ల కోసమే ఏర్పాటు చేశారని.. వాటిని అడ్డంపెట్టుకుని దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యత్వాల ద్వారా నిధులు సేకరిస్తుందన్నారు. పోలవరానికి ప్రత్యేకంగా నిధులివ్వలేదు కేంద్ర బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని, అయితే నాబార్డు ద్వారా ఇప్పటికే రూ.1,981 కోట్ల రుణం మంజూరు చేశారన్నారు. -
బడ్జెట్లో క్రీడలకు రూ. 1,943 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలకు కాస్త ప్రాధాన్యతను పెంచింది. బుధవారం ప్రకటించిన బడ్జెట్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి క్రీడల అభివృద్ధి కోసం రూ. 1,943 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ. 350 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ఇందులో జాతీయ స్థాయి శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ. 481 కోట్లు, క్రీడా సమాఖ్యలకు రూ. 302 కోట్లు ఇస్తారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి కూడా భారీగా రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే మరికొన్ని కీలక అంశాలకు ప్రభుత్వం చాలా తక్కువ మొత్తం కేటాయించింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ క్రీడల అభివృద్ధి పథకానికి నిధులను రూ. 5 కోట్ల నుంచి తగ్గించి రూ. 2 కోట్లే ఇవ్వగా... దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు అధమంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇవ్వనుంది. -
ఏపీకి రిక్త హస్తమే!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం విభజనచట్టంలోని హామీల ప్రస్తావనేదీ? రాజధాని నిర్మాణానికి నిధులు సున్నా బడ్జెట్ ప్రసంగాన్ని బల్లలు చరిచి స్వాగతించిన టీడీపీ ఎంపీలు సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలాంటి ఊరట కలిగించలేదు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల ప్రస్తావన అసలే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడం, రెవెన్యూ లోటు భర్తీ వంటి ముఖ్యమైన హామీలను సైతం ఈ బడ్జెట్లో విస్మరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఏర్పాటుకు నిర్దిష్ట కేటాయింపులు జరపలేదు. మిగిలిన మెట్రోల్లో కలిపి కేటాయింపులు చూపారు. బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా అధికార టీడీపీ ఎంపీలు ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాలు లేవు. పైపెచ్చు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ బల్లలు చరచడం పట్ల వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్త సంస్థలేవీ? కనీసం అప్పులు చేసేందుకు కూడా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం(ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను సడలించలేదు. అలాగే 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రూ.16,000 కోట్ల రెవెన్యూ లోటులో ఇప్పటివరకు కేవలం రూ.4,000 కోట్ల మాత్రమే కేంద్రం భర్తీ చేసింది. మిగతా రూ.12 వేల కోట్ల లోటు భర్తీపై కేంద్ర బడ్జెట్లో ప్రస్తావిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొత్తగా సంస్థలను, ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల పరిధిని పెంచాలన్న డిమాండ్‌పై బడ్జెట్లో పరిష్కారం చూపలేదు. జాతీయస్థాయి విద్యాసంస్థల నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉన్నప్పటికీ అరకొరగా నిధులు విదిల్చారు. ప్రత్యేక హోదాకు మంగళం! కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. పదేళ్లు కావాల్సిందేనని బీజేపీ నేతలు, పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము వస్తే అలా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ప్రత్యేక హోదా మాత్రం పత్తా లేకుండా పోయింది. హోదా సాధన కోసం రాష్ట్రంలో ప్రజా పోరాటాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో దాని గురించి ఏదైనా ప్రకటన చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. అయినా టీడీపీ నాయకులు నోరుమెదపక పోవడం గమనార్హం. ఏపీకి హోదా కంటే ప్యాకేజీ మేలన్న చంద్రబాబు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో కేంద్రం దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కనిపించని ‘ప్రత్యేక ప్యాకేజీ’ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిధులు మాత్రం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఈ బడ్జెట్లో రాజధాని నిర్మాణం ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్ ఊసూ లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే కనిపించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటా నిధుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. -
ఒకింత మోదం.. మరింత ఖేదం
అరుణ్ జైట్లీ ఆశల బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు ఒకింత మోదం.. మరింత ఖేదం మిగిల్చింది. బుధవారం నాటి కేంద్ర బడ్జెట్ వేతనజీవుల అంచనాలను పూర్తిగా నిజం చేయలేకపోయింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్‌తో మహానగరంలో ఇక విందు, వినోదం, విమానయానం భారంగా పరిణమించనుంది. స్మార్ట్ ఫోన్లు, కార్లు, బైకుల ధరలు పెరిగే అవకాశం ఉండడంకుర్రకారుతోపాటు మధ్యతరగతికి ఇబ్బందిగా మారింది. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారీ సిగరెట్లు, పాన్‌మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. ఐటీ రంగంతోపాటు..స్టార్టప్‌లు..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పలు రాయితీలు ప్రకటించడంతో ఆయా సంస్థలు సిటీకి వెల్లువెత్తనున్నాయి. ఎన్నో ఆశించిన నగరవాసిని అరుణ్‌జైట్లీ బడ్జెట్ నిరాశ పరిచింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. మూడు నుంచి ఐదు లక్షల మధ్య ఆదాయం ఉండే వారికి కేవలం ఐదుశాతం పన్నుతో సరిపెట్టడం గుడ్డిలో మెల్ల. కాస్మొపాలిటన్ నగరంగా మారిన మహానగరంలో తాజా బడ్జెట్‌తో విందు, వినోదం, విమానయానం భారం కానుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్ఫోన్ల ధరలు ప్రియం కానుండడం యువత జేబులకు చిల్లులు పడడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. కార్లు, బైక్‌ల ధరలు పెరగడం మధ్యతరగతి వర్గానికి చేదువార్త. ఔషధాలు, మెడికల్ ఉపకరణాల ధరలు తగ్గడంతో అందరికీ వైద్యం అందుబాటులోకి రానుండడం ఆనందిచదగ్గ విషయం. సిగరెట్లు, పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పొగ, మందుబాబుల జేబుకు చిల్లు తప్పదు. ఐటీరంగంతో పాటు.. స్టార్టప్‌లు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడంతో కొత్త పరిశ్రమలకు గ్రేటర్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. సీసీటీవీల ధరలు దిగిరానుండడంతో నగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయం ఆవరణలో నిఘాకు మార్గం సుగమమైంది. ఇక కుర్రకారు అమితంగా ఇష్టపడే వై–ఫై సేవలందించే రూటర్ల ధరలు తగ్గే అవకాశాలుండడంతో ఆన్లైన్, ఇంటర్నెట్, సోషల్ మాధ్యమాలు వినియోగించేవారిలో జోష్ పెంచింది. మరోవైపు బ్రాండెడ్ దుస్తులు, కాస్మోటిక్స్ ధరలు పెరగడం మింగుడు పడని అంశం. చిన్న గృహాలకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించడం వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరో ► జైట్లీ బడ్జెట్ నగరవాసి ఆశలపై నీళ్లు ► కార్లు, బైక్‌లు, ఫోన్లు ప్రియం ► విందు వినోదం భారం ► దిగిరానున్న ఔషధ ధరలు -
వ్యవ‘సాయం’ అంతంతే
- వేరుశనగకు వర్తించని ఫసల్‌బీమా.. రైతుల్లో నిరాశ – కంప్యూటరీకరణతో సొసైటీల్లో పారదర్శక సేవలు – కేవీకేలో ల్యాబ్‌ల ద్వారా మట్టి, నీటి పరీక్షలు మేలు – 60 రోజుల్లో రుణాలు చెల్లించడం జిల్లాలో కష్టసాధ్యమే – జిల్లాకు సూక్ష్మసాగు విస్తరణ అవసరమంటున్న రైతులు ---------------------------- అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి కలిగే మేలు అంతంత మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఫసల్‌బీమా యోజనను 30 నుంచి 40 శాతానికి పెంచినప్పటికీ దీనివల్ల జిల్లాకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. జిల్లాలో వేరుశనగకు వర్తింపజేయకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో ఏటా 6 నుంచి 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతోంది. ఖరీఫ్‌లో 90 శాతం విస్తీర్ణం కేవలం వేరుశనగ వేస్తున్నారు. ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట 80 నుంచి 90 శాతం తుడిచిపెట్టుకుపోతోంది. పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. జిల్లా రైతులు వేరుశనగ సాగువల్ల రూ.3 వేల నుంచి రూ.3,500 కోట్ల వరకు నష్టపోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామం యూనిట్‌గా అమలు చేసిన పంటల బీమా పథకం ద్వారా రైతులకు ప్రయోజనం కలిగింది. పంట నష్టం జరిగిన ప్రతీ సంవత్సరం పారదర్శకంగా నష్టపరిహారం అందినట్లు నివేదికలు చెబుతున్నాయి. కేవలం 2008 ఖరీఫ్‌కు సంబంధించి పంట దారుణంగా నష్టపోగా... రూ.640 కోట్ల వరకు పంట నష్ట పరిహారం ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగింది. అయితే త్రెష్హోల్ట్ఈల్డ్, ఇండెమ్నిటీ అనే నిబంధనలు పరిహారానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని 2011లో గ్రాయం యూనిట్‌గా అమలు చేస్తున్న పంటల బీమా పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా వర్షాధార వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చారు. 2011 నుంచి ఏటా పంట దారుణంగా నష్టపోతున్నా ఒక్క సంవత్సరం కూడా రైతులకు న్యాయం జరగలేదు. అడ్డగోలు నిబంధనలు, సవాలక్ష షరతుల వల్ల వాతావరణ బీమా ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2016 ఖరీఫ్ నుంచి కొత్తగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనాను అమలులోకి తెచ్చింది. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్న వేరుశనగ పంటకు వర్తింపజేయలేదు. ఈ క్రమంలో ఫసల్‌బీమా ద్వారా జిల్లాలో కనీసం వేయి మంది రైతులకు కూడా ప్రయోజనం దక్కడం లేదు. ఈ ఏడాదైనా ఫసల్‌బీమా వర్తింపజేస్తారని ఆశించినా కేంద్ర ఆర్థిక మంత్రి అడియాసలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ------------------ డెయిరీపై ఆశలు లేనట్లే! రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఏపీ డెయిరీ)పై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేయడంతో జిల్లాలో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్య దశకు చేరుకుని నష్టాల్లో పయనిస్తోంది. అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నా... ఇపుడు రోజుకు 30 నుంచి 32 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. 2013, 2014 సంవత్సరం జనవరి నెలల్లో ప్రభుత్వ డెయిరీ రోజు వారీ 65 వేల లీటర్ల వరకు పాలు సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత పాల సేకరణ తగ్గింది. 20 వేల మంది రైతుల సంఖ్య ప్రస్తుతం 9 వేల మందికి పడిపోయింది. గతంలో ప్రతి 15 రోజులకోసారి క్రమం తప్పకుండా రూ.3 కోట్లకు పైగా పాల బట్వాడా చేస్తుండగా ఇపుడు నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ------- 60 రోజుల్లో రుణాల చెల్లింపు కష్టమే ‘అనంత’లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి 60 రోజుల్లోపు చెల్లించి వడ్డీ రాయితీ పొందడం అనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతింటూ అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించడమే భారంగా పరిణమిస్తోంది. కనీసం వడ్డీ కూడా చెల్లించలేక, రుణాలను రెన్యువల్ కూడా చేసుకోలేని దయనీయ పరిస్థితి. బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక వాటిని వేలాలకు వదిలేస్తున్నారు. కేవలం 60 రోజుల్లో చెల్లించడం అనేది ‘అనంత’ రైతులకు తలకు మించిన భారమే. కనీసం ఆరు నెలల గడువు ఇచ్చినా కొందరికైనా కొంత ప్రయోజనం కలిగేఽది. ------ పంట రుణాల పెంపుతో కొంత లబ్ధి పంట రుణాల పంపిణీకి పెద్దపీట వేసినట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో కరువు జిల్లా రైతులకు కొంత ఊరట కలిగే అంశం. సన్న, చిన్న కారు రైతుల్లో 40 శాతం మందికి రుణాలు అందడం గగనంగా మారింది. ఈ ఖరీఫ్‌లో 5.70 లక్షల మంది రైతులకు రూ.4,404 కోట్లు పంట రుణాలు పంపిణీ చేశారు. రబీలో 1.05 లక్షల మందికి రూ.750 కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సివుండగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.200 కోట్లుకు మించి ఇవ్వలేదు. చాలా మంది చిన్న సన్న కారు రైతులకు రుణాలు అందకపోవడం, వారు బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు ఎక్కువ తీసుకుంటున్న నేపథ్యంలో... పంట రుణాలకు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత వరకు న్యాయం జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ----------------------- కేవీకేల్లో మినీల్యాబ్‌లు లాభం జిల్లా కేంద్రంలో ఒకటి, పెనుకొండ, ధర్మవరం లలో రెండు మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉండడంతో మట్టి, నీటి పరీక్షలు చేయించుకోవడం లక్షలాది మంది రైతులకు కష్టంగా మారింది. కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే)లో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొనడం రైతులకు లాభించే అంశఽం. జిల్లాలో బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి, కళ్యాణదుర్గంలో ఉన్న కేవీకేలలో మినీల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగం ------------------- కంప్యూటరీకరణతో సొసైటీల్లో సత్వర సేవలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటరీకరణ చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటించడంతో జిల్లాలో కొంత మెరుగైన సేవలు అందవచ్చు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో 104 సొసైటీలు ఉండగా... మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో 16 సీడెడ్ సొసైటీలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో కణేకల్లు, కనగానపల్లి, మడకశిర, రుద్రంపేట సొసైటీల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అందజేస్తున్న కంప్యూటరీకరణ సేవలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు డీసీసీబీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ------------------- సూక్ష్మసాగు విస్తరణ అత్యవసరం వర్షాభావ పరిస్థితులు, భూగర్భాజలాలు అడుగంటి రుబావులు ఎండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా పట్టు, పండ్లతోటలతో పాటు వ్యవసాయ పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి. చీనీ, మామిడి, దానిమ్మ, సపోటా, ద్రాక్ష లాంటి దీర్ఘకాలిక పండ్లతోటలు ఉండటంతో భూగర్భజలాలు అడుగంటిపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. డ్రిప్, స్ప్రింక్లర్లు సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూక్ష్మసాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో కొంత ప్రయోజనం కలిగే పరిస్థితి నెలకొంది. -
మొదటిసారి మనకు కేపిటల్ గెయిన్స్ ఇచ్చారు
-
బడ్జెట్ పై బాలీవుడ్ ఏమంది?
ముంబై: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్ పై బాలీవుడ్ నెగిటివ్ గా స్పందించింది. ప్రస్తుత ఆర్థిక బడ్జెట్ లో ఎలాంటి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా, భారీ ఉద్యోగాల కల్పించే కీలకరంగంగా ఉన్న బాలీవుడ్ ను పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్ పై స్పందించిన బీ టౌన్ ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ నుంచి బాలీవుడ్ ను పక్కన పెట్టినట్టుగా భావించారు. తమ రంగానికి ఎలాంటి సహాయం. భారీ పన్నులనుంచి సడలింపు లేకుండానే ముగిసిందని వ్యాఖ్యానించారు ముఖ్యంగా ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ గురించి కనీస ప్రస్తావనకూడా లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పైరసీ భూతంపై మాట్లాడకపోవడం తమను బాధించిందన్నారు. మరో నిర్మాత కునాల్ కోహ్లీ ముఖేష్ కు మద్దతుగా నిలిచారు. బడ్జెట్ లో చలన చిత్ర రంగాన్ని చేర్చకపోవడం విచారంగా ఉందన్నారు. అంగీకరించారు.పార్లమెంటు లో సభ్యులుగా సినీరంగ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు లోను ప్రభుత్వంలోను తమకు ప్రతినిధులుగా ఉన్న సభ్యులు దీనిపై మాట్లాడాలన్నారు. చిత్రపరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ, ఉద్యోగాల కల్పనలో ను కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తు చేశారు. వినోద పన్నువిధింపులో రాష్ట్నానికి మధ్య రాష్ట్రానికి మధ్య తేడాలున్నాయనీ, మొత్తం చలన చిత్రపరిశ్రమకు యూనిఫారం టాక్స్ సిస్టం ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాగే మిగిలిన దేశాలు ఇస్తున్నట్టుగా విదేశాల్లో షూటింగ్ నిమిత్తం కేంద్రం కూడా సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి సబ్సిడీ ఇస్తోందని తన ట్విట్ లో పేర్కొన్నారు. మరోవైపు గాయకుడు, సంగీత దర్వకుడు విశాల్ దొడ్లాని బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ చర్య ఆకట్టుకుందన్నారు. వరుస ట్వీట్లను చేసిన ఆయన ఎగువ మధ్య తరగతి పన్ను మినహాయింపులేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇదేం బడ్జెట్!
-
బడ్జెట్‌పై వామపక్షాలు గరంగరం
-
బడ్జెట్‌పై శివసేన స్పందన
ముంబై: 2017-18 ఆర్థిక బడ్జెట్ పై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ పై స్పందించిన బీజేపీ సోదర సంస్థ శివసేన అధినేత ఉధ్దవ్ థాకరే మరోసారి మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ ఆర్థిక బడ్జెట్ లో ప్రజల ఆకాంక్షలను కేంద్రం అందుకోలేకపోయిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు అచ్ఛే దిన్ తీసుకొస్తామని వాగ్దానం చేశారని.. కానీ. ఎక్కడ ఆ అచ్ఛే దిన్ అని థాకరే ప్రశ్నించారు. చ్ఛే దిన్ గురించి ప్రభుత్వం ఇపుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజలకు అనేక కష్టాలనెదుర్కొన్నారని థాకరే మండిపడ్డారు. డీమానిటైజేషన్ తరువాత ఉగ్రదాడులు తగ్గుముఖం పడతాయని కేంద్రం చెప్పిందనీ, అయితే టెర్రరిస్టుల దాడులు తగ్గకపోగా ..మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రి మనోహరి పారికర్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించిన థాకరే వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలన్నారు. ఏ రుజువు లేకుండా ఎవరూ అలాంటి విషయాలను చెప్పరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. -
‘రైల్వేలో మనకు మంచి వాటా దక్కింది’
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్లో రైల్వేలకు చేసిన కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకు వాటాలు పెరిగాయని జీఎం వినోద్ కుమార్ చెప్పారు. పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వివరాలు తెలియజేస్తూ 2017-18దక్షిణ మధ్య రైల్వే-తెలంగాణ బడ్జెట్ రూ.1,729 కోట్లు అని, అలాగే, ఏపీ బడ్జెట్ రూ.3,406కోట్లు అని తెలిపారు. బల్లార్షా-కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. యాత్రికులు, పర్యాటకులకోసం ప్రత్యేక రైళ్లు ఉంటాయని చెప్పారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణలతో దక్షిణ మధ్య రైల్వే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లు మరింత ఆధునీకరిస్తామని చెప్పారు. 20 స్టేషన్లలో 34 లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్లో కోచ్ మిత్ర సదుపాయాలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చెత్త శుద్ధి కేంద్రం పెడతామన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2ను 2018కల్లా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి నుంచి జమ్ము వరకు హమ్ సఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉంటుందని, విశాఖ నుంచి విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ నడుస్తాయని చెప్పారు. వెయిట్ లిస్టింగ్ ప్యాసింజర్ల కోసం వికల్ప్ సదుపాయం ఉంటుందన్నారు. సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య నడిచే మూడు రైళ్లకు వికల్ప్ సదుపాయం, సికింద్రాబాద్ స్టేషన్లో ఎస్ఎంఎస్ చేస్తే కోచ్ పరిశుభ్రం చేసే సౌకర్యం ఏర్పడనుందని తెలిపారు. -
ఆ విషయంలో మోదీ, ట్రంప్ ఒక్కటే..
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అహ్మద్ మరణించినందుకు సంతాప సూచకంగా పార్లమెంట్ సమావేశాలను రేపటికి వాయిదా వేయకుండా, బుధవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని తప్పుపడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోల్చారు. ప్రధాని మోదీని ఇండియన్ ట్రంప్‌గా అభివర్ణిస్తూ, ఇద్దరూ సమస్యలను సృషిస్తారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ట్రంప్ నియంతృత్వ విధానాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడాన్ని లాలు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారు? దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపింది? వంటి విషయాలను బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని లాలు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో అస్వస్థతకు గురైన ఎంపీ అహ్మద్ బుధవారం మరణించారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు మరణిస్తే సభను ఒకరోజు వాయిదా వేస్తారని, మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కాలరాసిందని లాలు విమర్శించారు. సభను రేపటికి వాయిదా వేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని, మోదీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని లాలు మండిపడ్డారు. -
జనరల్ బడ్జెట్లో తానొవ్వక, నొప్పించక..
న్యూఢిల్లీ: ‘నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అన్న చందంగా ఉంది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్. ఏ రంగానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ రంగాన్ని పూర్తిగా విస్మరించకుండా, ఏ రంగంపైనా అధిక పన్నుల భారం మోపకుండా. అన్ని రంగాలకు అంతో ఇంతో అందుబాటులో ఉన్న నిధులను సర్దుబాటు చేస్తూ వచ్చారు అరుణ్ జైట్లీ. పెద్ద నోట్ల రద్దుతో పోయిన నరేంద్ర మోదీ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు, మరో పక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి బడ్జెట్లో భారీ రాయితీలు ఉంటాయని అన్ని వర్గాల ప్రజలు భావించారు. మధ్యతరగతివారు ముఖ్యంగా వేతన జీవులు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదులక్షల రూపాయల వరకు పెంచుతారని ఆశించారు. అయితే అరుణ్ జైట్లీ పరిమితిని పెంచకుండా ఈ స్లాబ్‌లో ఉండే పది శాతం ఆదాయం పన్నును ఐదు శాతానికి తగ్గించి కొంత ఊరట కల్పించారు. ఆ మేరకు పడే ఆర్థిక భారాన్ని 50 లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించేవారిపై పది శాతం సర్‌చార్జి విధించడం ద్వారా భర్తీ చేసుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వం శిలాఫలకంగా చరిత్రలో మిగిలిపోతుందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించినప్పటికీ ఆ పథకానికే ఆర్థిక మంత్రి మున్నెన్నడు లేనివిధంగా 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతమిస్తున్నామని చెప్పిన జైట్లీ ఉపాధి హామీకి ఇన్ని రేట్లు కేటాయించిన కారణంగా తమకు వ్యవసాయ కూలీలు దొరక్క నష్టపోతామని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో మౌలిక సౌకర్యాలకు కాస్త కేటాయింపులు పెంచడం కార్పొరేట్ రంగానికి ఊతమివ్వడానికే. ఆ మేరకు కార్లపై మౌలిక సౌకర్యాల సెస్‌ను విధించడం వల్ల రాబడుతోంది. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, అవినీతిపై ఆయుధమని ప్రశంసించినా అరుణ్ జైట్లీ పెద్ద నోట్ల రద్దు ఫలితాలేమిటో వివరించలేక పోయారు. అవినీతిపై పోరులో భాగంగా మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావా దేవీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నారు. రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలలో నల్లడబ్బును అరికట్టేందుకు 20 వేల లోపు విరాళాలకు దాతల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదన్న పరిమితిని రెండువేల రూపాయలకు కుదించినట్లు వెల్లడించారు. 20 వేల నిబంధన ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీల్లోకి నల్ల డబ్బు ప్రవాహాన్ని అరికట్టలేని ప్రభుత్వాలు ఇప్పుడు అరికడతాయనుకుంటే అత్యాశే అవుతోంది. ఓటర్ల జాబితాల్లో ఉన్న పేర్లు, చిరునామాలనుబట్టి విరాళాల దాతల పేర్లు రాసుకునే రాజకీయ పార్టీలు తమ రంగును మార్చుకుంటాయా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో భారత ఐటీ కంపెనీలు కుదేలవుతున్న పరిస్థితుల్లో వాటిని ఆదుకునేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం శోచనీయం. ఎప్పటిలాగే ఈసారి కూడా బడ్జెట్లో ప్రాథమిక విద్యారంగానికి ప్రభుత్వం అన్యాయమే చేసింది. ఉన్నత విద్యారంగానికి అంతో ఇంతో ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరిస్తూనే ఉంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే ఎదురులేని యువ శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత్ అంచనావేస్తోంది. ఆ యువతే ఇప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తోంది. ప్రాథమిక విద్యలో చేరిన విద్యార్థుల్లో 20 శాతం మంది విద్యార్థులు మాధ్యమిక విద్యలోకి, వారిలో 34 శాతం మంది ఉన్నత విద్యలో ప్రవేశించడం లేదు. సరైన సౌకర్యాలు, ప్రోత్సాహం లేకపోవడమే అందుకు కారణం. ద్రవ్యోల్బణాన్ని మూడుశాతానికి మించకుండా చూస్తానని సవాల్ చేసిన అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్లో దాన్ని 3.2గా సవరించుకున్నారు. వచ్చే ఏడాది మాత్రం మూడు శాతానికి మించికుండా చూస్తానని హామీ ఇచ్చారు. స్థూల జాతీయ వద్ధి రేటును రెండేళ్లలో 8 నుంచి 10 శాతానికి తీసుకెళతామని తొలి బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం వద్ధి రేటు అంచనాలను కూడా ఏడు శాతానికి తీసుకెళ్లే స్థితిలో లేదు. పెద్ద నోట్ల రద్దుతో వచ్చే ఏడాది వద్ధి రేటు ఎంత తగ్గుతుందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఆర్థిక వనరులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సర్ది చూపించారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! -
మోదీని కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నా లాభం లేదు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుల ఆశలు తీర్చటంలో కేంద్ర బడ్జెట్ విఫలమయిందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులు, పేదలు, సామాన్యులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయే తప్ప ఆదాయం ఏమాత్రం పెరగలేదని విమర్శించారు. నోట్ల రద్దును సమర్ధిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నా, కేంద్రం మాత్రం బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. -
బడ్జెట్లో మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించేలా భారీ సంస్కరణ చేపట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు. విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు(ఎఫ్ఐపిబి) నుండి అనుమతులు పొందడానికి, నిబంధనలు సైతం ఉల్లంఘించి డైరెక్ట్ పెట్టుబడులను సాధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను సరళీకరిస్తామని ఆయన చెప్పారు. ఎఫ్ఐపీబీ మార్గదర్శకాలు రాబోయే సంవత్సరంలో మరింత సరళంగా ఉండనున్నట్టు చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడులను భారీగా ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఏడాది భారతదేశం పౌరవిమానయాన నుండి ఫార్మాస్యూటికల్స్ వరకు రంగాల్లో విదేశీ పెట్టుబడును మరింత సులభతరం చేశారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారతదేశం లో కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఆటోమేటిక్ ఎఫ్ఐపిబి ద్వారా అనుమతి లభించేది. ప్రభుత్వం లేదా భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 100శాతం విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా సొంతదారు కావడానికి అనుమతి ఉంది. ఉదాహరణకు దేశంలో యాపిల్ ఫోన్ల తయారీలో రూ.5వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్ఐపిబి అనుతినిచ్చింది. దీనిపై వివాదం నెలకొన్న సంగతి విదితమే. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముఖ్యంగా బ్యాంకింగ్, రక్షణ మరియు పౌర విమానయాన రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. కాగా 1990ల కాలంలో ఆర్థిక సరళీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసింది. పీఎంవో కింద పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే 2013 లో ఆర్థిక శాఖకు దీన్ని బదిలీ చేశారు. -
'బడ్జెట్.. చేదుమాత్రకు షుగర్ కోటింగ్'
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. చేదు మాత్రకు చక్కెర పూతలా కేటాయింపులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతు రుణాలు మాఫీ అవుతాయన్న ఆశలు నెరవేరలేదని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పలేదని ఆరోపించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు రైతు రుణాలు గతంలో సగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పూర్తిగా సమర్ధిస్తున్న సీఎం కేసీఆర్ విభజన హామీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్ వాస్తవ విరుద్దమని కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
-
లోక్‌సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..?
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత దీనిపై అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల వారు, ఇతర ప్రముఖులు స్పందించారు. కొంతమంది సానూకూలంగా మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ ఇది పేదరికాన్ని మరింత తగ్గించే ఉత్తమమైన బడ్జెట్. ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రికి నా అభినందనలు. మేం రైతులపైన, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపైన దృష్టిసారించాం. అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్లేటర్లాగా పనిచేస్తుంది. అన్ని రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టింది. జీవన నాణ్యత మరింత పెంపొందుతుంది. 2022నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం. రైల్వే సేఫ్టీపై కూడా మేం దృష్టిని సారించాం. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో ఎవ్వరూ కేటాయించనన్ని నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ఉద్యోగాలకు, ఉద్యోగాల కల్పనకు తెరతీస్తుంది. సీ రంగరాజన్(ఆర్బీఐ మాజీ గవర్నర్) ఇది ఫెయిర్లీ రొటీన్ బడ్జెట్. రెవెన్యూ విభాగంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య లోటు 3.2శాతం మేరకు కొనసాగించగలగడాన్ని నేను ఆనందంగా భావిస్తున్నాను. ద్రవ్యలోటును 3కు తగ్గించాలని లక్ష్యంగా ఉంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పగా బడ్జెట్ ముగించారని రాహుల్ అంటున్నారు. కానీ, వాస్తవానికి రాహుల్ అసలు బడ్జెట్ ప్రసంగం వినలేదు. ఒక వేళ ఆయనకు ఈ వివరాలు ఎవరు చెప్పారో బహుషా వారు కూడా ఈ బడ్జెట్ వినలేదనుకుంట. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ చాలా మంచింది. గ్రామాలకు కూడా ఇక అన్ని సౌకర్యాలు వస్తాయి. బ్యాంకింగ్, హౌసింగ్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థను, పన్ను ఆదాయాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ స్టార్టప్స్‌కు సహాయం చేస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నదానికి ఆర్థికశాఖ సరిగ్గా స్పందించింది. ఇది చాలా సానుకూలమైన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కమల్‌నాథ్ ఈ బడ్జెట్లో రైతులకు, నిరుద్యోగులకు ఏమీ లేదు. ఇది ప్రజలను గందరగోళ పరిచే చర్య మాత్రమే. రాజకీయ విరాళాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగింది. (ఇకపై పొలిటికల్ ఫండింగ్ చేయాలనుకునే వారు రూ.2000పైన అయితే, కచ్చితంగా బాండ్లతో ఇవ్వాలి. ఆ బాండ్లను కూడా చెక్లతోగానీ, కార్డులతోగానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎవరు ఎంతిచ్చారో తెలిసిపోతుంది. తాజా బడ్జెట్లో ఈ నిబంధన పెట్టారు) రణదీప్ ఎస్ సుర్జీవాలా(కాంగ్రెస్ అధికార ప్రతినిధి) ఈ బడ్జెట్ ఉద్యోగాల సృష్టి శూన్యం, తయారీ రంగానికి శూన్యం, వ్యవసాయంలో అభివృద్ధికి శూన్యం, విద్య, వైద్యంలో శూన్యం, సామాజిక రంగానికి శూన్యం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది వివాదాస్పద బడ్జెట్. ఆధారాలు లేనిది, ఉపయోగం లేనిది, మిషన్లెస్, యాక్షన్ లెస్ బడ్జెట్ ఇది. భవిష్యత్‌కోసం ఈ బడ్జెట్లో రోడ్‌మ్యాప్ లేదు. బడ్జెట్కున్న క్రెడిట్ మొత్తం పోయింది. పన్ను చెల్లిస్తున్నవారు నగదు ఉపసంహరణకోసం ఇప్పటికీ పరిమితులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అన్ని పరిమితులు ఉపసంహరించండి. సంబంధిత వార్తలకై చదవండి.. (పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..) 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
బడ్జెట్ ప్రసంగంలో మాల్యా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం వెలికి తీతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న జైట్లీ బిగ్ టైం అఫెండర్స్ ఆస్తులను జప్తు చేయాలనే ప్రతిపాదను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు పరోక్షంగా గట్టి హెచ్చరికనే చేశారు. ఆర్థిక నేరస్తులకు శిక్ష తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు వారి ఆస్థులను స్వాధీనంకోసం కొత్త చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. భారతదేశం విదేశాల్లో వున్న అక్రమ ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అనేక క్షమాభిక్ష పథకాలు అమలు చేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆర్థిక నేరస్థులపై మరింత ఒత్తిడి పెంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్విట్జర్లాండ్, సింగపూర్ బ్యాంకుల్లో దాగి వున్న అప్రకటిత ఆదాయం, ఆభరణాల, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులపై పెట్టుబడుల ద్వారా పన్ను ఎగవేస్తున్నవారిపై విమర్శకులు, నిపుణులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా రూ.6,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన సంగతి విదితమే. మరో వైపు సీబీఐ కూడా మాల్యా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని స్వదేశం రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడీబీఐ లోన్ డిఫాల్ట్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు, ఐడీబీఐ అధికారులను, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అఫిడవిల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీంతో మంగళవారం మాల్యా మరోసారి నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను నిరాశ పరిచిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోవాలన్న ఉద్దేశం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు. రైతుల చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలని సూచించారు. రైల్వే జోన్, అమరావతి కనెక్టవిటీ గురించి ప్రస్తావన లేదని, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. -
పన్నులలో మరికొన్ని మినహాయింపులు ఇలా..
-
ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!
-
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
-
రాజకీయ విరాళాలకు బ్రేక్
-
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
-
మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలలోని ఉన్నత విద్యాసంస్థలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు లభించాయి. ఇంకా ఏర్పాటు కావల్సిన వాటికి కూడా ఎంగిలి మెతుకులు మాత్రమే విదిల్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాల వారు ఉచితంగా ఇచ్చిన భవనంలో కొనసాగుతున్న ఎన్ఐటీకి ఇంకా శాశ్వత భవనం ఏర్పాటుచేయాల్సి ఉండగా.. దానికి వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి ఈ పది కోట్లు ప్రహరీ నిర్మాణానికి కూడా సరిపోవు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా శాశ్వత భవన నిర్మాణం ఎప్పుడు చేస్తారో, అప్పటివరకు ఎన్ని సంవత్సరాలలో ఈ నిధులు ఇస్తారో తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ విద్యా సంస్థలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి.. సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ -10 కోట్లు ఏపీ, తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీలు - 20 కోట్లు ఐఐటీ, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు ఐఐటీ హైదరాబాద్ - 75 కోట్లు ఐఐఎం, ఆంధ్రప్రదేశ్ - 40 కోట్లు ఎన్ఐటీ, ఆంధ్రప్రదేశ్ - 10 కోట్లు ఐఐఎస్ఈఆర్, ఆంధ్రప్రదేశ్ - 50 కోట్లు ఐఐఐటీ, ఆంధ్రప్రదేశ్ - 30 కోట్లు (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
తగ్గేవి.. పెరిగేవి..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు తన ప్రతిపాదనలతో ఖజానాకు ఎటువంటి నష్టం లేదా లాభం రాదని చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జీఎస్ టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ లో స్వల్ప మార్పుల కారణగా ధరలు పెరిగేవి, తగ్గేవి ఈ విధంగా ఉన్నాయి. తగ్గేవి ఎల్ ఈడీ దీపాలు సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్) మైక్రో ఎటీఎంలు ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు రైల్వే టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్ ఎల్ఎన్జి(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఫ్యూయల్ సెల్ బేస్డ్ జనరేటర్లు లెదర్ ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల ఉత్పత్తులు రక్షణ రంగంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు పెరిగేవి సెల్ ఫోన్లు, వెండి నాణేలు, సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు అల్యూమినియం ఉత్పత్తులు పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు, వాటర్ ఫిల్టర్స్ పరికరాలు, జీడిపప్పు ప్రియం కానున్నాయి -
లోక్‌సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లను ప్రకటించనందుకు నిరసనగా లోక్‌సభ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్ చేసింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఏడాదికిగాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రకటించనందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశలను కేంద్ర ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. కేపిటల్ గెయిన్స్ పన్ను రద్దు వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ట్యాక్స్ గెయిన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
భారత్‌లో ఏకైక ప్రైవేట్ రైల్వే ‘శకుంతల’
మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ సంస్కృత నాటకం గురించి, అందులోని శకుంతల పాత్ర గురించి బహూశ భారతీయులందరికీ తెలిసే ఉంటుంది. కానీ శకుంతల పేరిట ఓ రైల్వే లైనుందని, అది భారతీయ రైల్వేలో భాగం కాదని, ఆ రైల్వే లైన్‌పై శకుంతల ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పటికీ నడుస్తోందని, అది ఓ బ్రిటిష్ కంపెనీకి సొంతమని ఎంతమందికి తెలుసో తెలియదు. బ్రిటిష్ పాలకుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని బ్రేక్ చేసి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ శకుంతల రైల్వేలైన్‌ను కూడా భారతీయ రైల్వేలో కలిపేందుకు చర్యలు తీసుకుంటే బాగుండేదేమో. మహారాష్ట్రలోని ముర్తాజాపూర్, యవత్మల్ మధ్య 190 కిలోమీటరు దూరం మధ్య శకుంతల ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ నడుస్తోంది. ఈ రైలు గ్రామీణ ప్రాంతాలకు జీవనాధారం. కిల్లిక్ నిక్సన్ అనే బ్రిటిష్ కంపెనీ భారత్‌లోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో కలసి 1910లో ‘సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే లైన్ కంపెనీ’ (సీపీఆర్ఎల్)ని ఏర్పాటు చేసి విదర్భ నుంచి పత్తిని రవాణా చేసేందుకు శకుంతల రైల్వే లైన్‌ను ఏర్పాటుచేసింది. 1916 నుంచి ఈ లైన్‌పై పత్తి రవాణాకు రైళ్లు నడిచాయి. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లు నడిచాయి. ఆ తర్వాత భారతీయ రైల్వే లైన్‌కు ఈ లైన్ అనుసంధానమైంది. దీంతో అప్పటి సెంట్రల్ ఇండియా ఆధ్వర్యంలోని గ్రేట్ ఇండియాలోని పెనిన్సులార్ రైల్వే (జీఐపీఆర్)కు చెందిన పలు రైళ్లు కూడా ఈ రైల్వేలైన్ మీదుగా నడిచేవి. దేశ స్వాతంత్య్రం అనంతరం 1952లో భారత ప్రభుత్వం జీఐపీఆర్ సహా దేశంలోని అన్ని రైల్వేలైన్లను జాతీయం చేసింది. ఒక్క కిల్లిక్ నిక్సన్ కంపెనీ ఆధ్వర్యంలోని సీపీఆర్ మాత్రం అలా కాలేదు. ఈ కంపెనీని జాతీయం చేయకుండా ఎందుకు భారత ప్రభుత్వం మరచిపోయిందో తెలియదు. ఆ తర్వాత కిల్లిక్ నిక్సన్ కంపెనీ బ్రిటన్ నుంచి భారత్‌కు తరలివచ్చినా దానినుంచి శకుంతల రైల్వేలైన్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఎందుకు ప్రయత్నించలేదో కూడా అర్థం కాదు. భారతీయ రైల్వే ఈ ప్రైవేటు శకుంతల రైల్వే లైన్‌ను వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లిస్తూ వస్తోంది. పదేళ్లకోసారి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తోంది. అలా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆరుసార్లు ఒప్పందాన్ని పునరుద్ధరించింది. ఈ లైన్‌పై 1921లో మాంచెస్టర్‌లో తయారైన ఇంజన్‌తో శకుంతల ఎక్స్‌ప్రెస్ నడిచేది. దీన్ని 1994, ఏప్రిల్ 15వ తేదీన పాత ఇంజన్‌ను తీసేసి డీజిల్ ఇంజన్‌ను ఏర్పాటుచేశారు. న్యారోలైన్పై నడిచే ఈ రైలు ప్రయాణికులు ఎక్కడుంటే అక్కడ ఆగి వారిని ఎక్కించుకుంటుంది. టిక్కెట్ ధర కూడా భారతీయ రైళ్లకన్నా ఎంతో చౌక. అందుకని ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు ఈ రైలు ఎక్కేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఈ న్యారో రైల్వేలైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చాలని గత బడ్జెట్లోనే రైల్వేశాఖ ప్రతిపాదించింది. అది పూర్తయితే శకుంతల ఎక్స్‌ప్రెస్ కూడా బ్రాడ్‌గేజ్‌కు మారుతుందా, ఈ లోగా భారతీయ రైల్వేలో విలీనం అవుతుందా.. చూడాలి! -
దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్‌లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్‌డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్‌ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం 2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను. మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు. పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్‌ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు -
మోతెక్కనున్న కార్ల ధరలు
దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ఇటు కాలుష్యంతో పాటు అటు ట్రాఫిక్ సమస్య పెరగడం కూడా పలు నగరాల్లో కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని గమనించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వాహనాల ధరలు పెరిగేలా కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఒకదాన్ని విధించారు. చిన్న పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ కార్ల మీద ఒక శాతం, డీజిల్ కార్ల మీద 2.5 శాతం విధించారు. ఇక ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన వాహనాలు, ఎస్‌యూవీల మీద అయితే 4 శాతం వరకు ఈ సెస్ విధించారు. దాంతో ఆ మేరకు వాహనాల ధరలు కచ్చితంగా పెరుగుతాయి. -
సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ
ముంబై: 2016-17 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభ లో ప్రవేశపెట్టారు. డీమానిటైజేషన్, అయిదు రాష్ట్రాల ఎన్నికలు నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ యూనియన్ బడ్జెట్ లో అనేక మెరుపులు, వరాలు కురిపించారు ఆర్ధికమంత్రి. గ్రామీణ యువత, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వెనుకబడిన వర్గాలపై అనేక వరాలు గుప్పించారు. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో సెల్ ఫోన్లు,సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ అంచనాలకనుగుణంగానే సిగరెట్లపై పన్ను మోత మోగింది. అటు కనీసం 10 శాతం పెంపును అంచనావేసిన ట్రేడర్లు దీంతో సిగరెట్ తయారీ కంపెనీల కౌంటర్లలో మదుపర్లు దృష్టిసారించారు. అలాగే సెల్ ఫోన్ కూడా కస్టమ్స్ లెవీ కారణంగా 1శాతం ధరలు పెరగనున్నాయి. సెల్ ఫోన్ విడిభాగాల పై విధించిన పన్నుకారణంగా ఈ ధరలు పెరగనున్నాయి. పెరిగిన పన్ను వివరాలు వెయ్యి సిగరెట్లపై పన్ను రూ.215 నుంచి 311కు పెంపు పాన్ మసాలాపై 6నుంచి 9 శాతం దిగుమతి చేసుకున్న అల్యూమినియంపై 30 శాతం పన్ను సెల్ ఫోన్లలో వాడే సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ) లపై 2 శాతం మరోవైపు తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధిని సాధించగలదని వేసిన అంచనాతో ఎఫ్ఎంసీజీ రంగం బాగా పుంజుకోనుంది. గ్రామీణాభివృద్ధి, పేదలకు కనీస ఆదాయ కల్పన, నీటిపారుదల సౌకర్యాలకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా ఇందుకు తోడ్పడతాయని నిపుణులు పేర్కొన్నారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’
-
రాజకీయ విరాళాలకు బ్రేక్
వరుసపెట్టి ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. వివిద రాజకీయ పార్టీలు ఇంతకుముందు ఎడా పెడా విరాళాలు తీసుకునేవి. అయితే ఇక మీదట నగదు రూపంలో కేవలం 2వేలకు మించి ఎవరి వద్దా విరాళాలు తీసుకోడానికి వీల్లేదని జైట్లీ స్పష్టం చేశారు. 2వేల రూపాయలకు మించి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే అందుకు బాండ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. వాటిని కూడా చెక్కులు లేదా డెబిట్/క్రెడిట్ కార్డులతో కొనాల్సి ఉంటుంది. ఆయా బాండ్లను కేవలం రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు మాత్రమే నగదుగా మార్చుకోడానికి వీలుంటుంది. దీన్నిబట్టి.. రాజకీయ విరాళాలు ఇచ్చేవారు ఎవరన్న విషయం కూడా స్పష్టంగా తేలిపోతుంది. తద్వారా పార్టీల నిధుల విషయంలో కొంతవరకు పారదర్శకత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రకటన చేయడానికి ముందు.. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వినాలంటూ జైట్లీ ఒకింత చెప్పి మరీ ప్రకటన చేశారు. -
‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’
-
తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ
బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండు మూడు సందర్భాలలో కొంత తడబడి తప్పులు చదివారు. ఒకటి రెండు సందర్భాల్లో వేరే సభ్యులు, స్పీకర్ వాటిని సవరించినా ఒకటి రెండు మాత్రం అలాగే దొర్లిపోయాయి. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్యను చెప్పేటప్పుడు 1.71 లక్షల మంది అనడానికి 1.71 లక్షల రూపాయలు అని చదివారు. అలాగే భరించదగ్గ గృహనిర్మాణ పథకం విషయంలో 30 చదరపు మీటర్లు అనడానికి బదులు 30 చదరపు కిలోమీటర్లుగా చెప్పారు. మరో సందర్భంలో కూడా జైట్లీ ఇలాగే తడబడ్డారు గానీ, దాన్ని స్పీకర్ సరిచేయడంతో ఆయన మళ్లీ సవరించుకున్నారు. ఇలా దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో జైట్లీ తడబడ్డారు. మొదటి నుంచి కూర్చునే.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని అరుణ్ జైట్లీ కూర్చునే చదివారు. గతంలో రెండు సందర్భాల్లో ఆయన తొలుత నిలబడి ప్రసంగం ప్రారంభించి, కాసేపటి తర్వాత కూర్చునేవారు. నడుం నొప్పితో బాధపడుతున్న జైట్లీకి.. కూర్చుని చదివే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కల్పించారు. ఈసారి మొత్తం మొదటినుంచి చివరి వరకు ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
నాన్నది ఫ్రెండ్లీ బడ్జెట్: సోనాలి జైట్లీ
న్యూఢిల్లీ: దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. అధికార బీజేపీ సభ్యులు సహజంగానే ‘ఆహా.. ఓహో.. ’అంటుండగా, విపక్షాలు మాత్రం ‘ఇందులో ఏమీ లేదు’అని పెదవి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూతురి స్పందనపై ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రకటన ముగిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన సోనాలీ జైట్లీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ‘ఇది చాలా మంచి బడ్జెట్. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఆడపడుచుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. ఇది మహిళా అనుకూల బడ్జెట్ కూడా’ అని సోనాలి అన్నారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా బుధవారం పార్లమెంట్‌కు వచ్చిన జైట్లీ కుటుంబసభ్యులు విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ను ఆసక్తిగా విన్నారు. -
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
-
‘ఈ బడ్జెట్ మన భవిష్యత్తు’
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉత్తమ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పేదల అభ్యున్నతిని మెరుగు పరిచేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. గత రెండున్నరేళ్లుగా తాము తీసుకున్న చర్యలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధి బడ్జెట్ లో కనిపిస్తోందన్నారు. రైతులు, గ్రామీణులు బలహీన వర్గాల కోసం బడ్జెట్ లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అసంఘటిత కార్మికులను సంఘటిత రంగంవైపు మళ్లించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. వ్యక్తిగత ట్యాక్స్ ను తగ్గించే నిర్ణయం సాహసోపేతమైందన్నారు. అవినీతి, నల్లధనం నిర్మూలనపై తాము చేపట్టిన చర్యలు బడ్జెట్ లో ప్రతిఫలించాయని చెప్పారు. ఈ బడ్జెట్ మన భవిష్యత్తు అని పేర్కొన్నారు. సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడంతో రవాణా రంగం ఊపంచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పన్నులలో మరికొన్ని మినహాయింపులు ఇలా..
సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రేటును కొంతవరకు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్ని రకాల మినహాయింపులను కూడా ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి... 5 లక్షల రూపాయల వార్షికాదాయం దాటని వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. 2వేలు మాత్రమే ఉండగా, దాన్ని ఇప్పుడు 5 వేలకు పెంచారు. దాంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున ఊరట లభిస్తుంది. సొంత ఇళ్లు ఉన్నవారికి గృహరుణాల మీద చెల్లించే అసలు, వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ సొంత ఇళ్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండేవారికి వారు ఏడాదికి చెల్లించే అద్దె మీద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80జిజి కింద ఇప్పటివరకు ఏడాదికి 24 వేల రూపాయల వరకు కట్టే అద్దె మీద పన్ను మినహాయించేవారు. ఈ పరిమితిని ఇప్పుడు రూ. 60 వేలకు పెంచారు. ఇప్పటివరకు కోటి రూపాయల వార్షిక టర్నోవర్ దాటని చిన్న, మధ్యతరహా నాన్ కార్పొరేట్ వ్యాపారులకు సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 33 లక్షల మంది చిన్న వ్యాపారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే, వాళ్లు ఖాతా పుస్తకాలను వివరంగా నిర్వహించాల్సి రావడం, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టర్నోవర్ పరిమితిని ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు పెంచారు. దాంతో మరింతమంది వ్యాపారులు ఎంఎస్ఎంఈ విభాగంలోకి వస్తారు. 50 లక్షల రూపాయల వరకు స్థూల ఆదాయం వచ్చే వృత్తి నిపుణులకు కూడా ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీంను అందుబాటులోకి తెచ్చారు. -
ఒక్కసారిగా పైకి జంప్ చేసిన మార్కెట్లు
ముంబై : కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చేసింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రవేశపెట్టారు. రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగ నేపథ్యంలో స్వల్పంగా లాభపడుతూ వచ్చిన మార్కెట్లు, కొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ముగుస్తుందనగా ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి.. సెన్సెక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 255.58 పాయింట్ల లాభంలో 27,911 వద్ద, నిఫ్టీ 66.10 పాయింట్ల లాభంలో 8,627 వద్ద ట్రేడవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నాయి. ఎస్టీటీ, ఇతర పన్నులను ఆయన టచ్ చేయలేదు. ప్రస్తుతం లిస్టెడ్ సెక్యూరిటీ విక్రయాలకు సంబంధించిన 'దీర్ఘకాలిక మూలధన లాభాలు' (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నాయి. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం వాటాలను తమ పరిధిలో ఉంచుకొని ఆ తరువాత విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను ఇంత కాలం ఎల్‌టీసీజీగా పరిగణిస్తూ వస్తున్నారు. మరోవైపు 12 నెలల కంటే తక్కువ కాలంలోనే విక్రయించే స్టాక్ లాభాలపై 15 శాతం వరకు పన్నును విధిస్తూ వస్తున్నారు. దీనిని 'స్వల్పకాలిక మూలధన లాభాలు' (ఎస్టీసీజీ)గా పరిగణిస్తున్నారు. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకురావడంతో బీఎస్ఈలో రియాల్టీ ఇండెక్స్ దూసుకెళ్తోంది. 3.33 శాతం మేర ఈ సూచీ జంప్ చేసింది. బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లుగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీలున్నాయి. -
‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అధికార బీజేపీ నాయకులు ప్రశంసించగా, చప్పగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం లోక్ సభలో జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 సాధారణ బడ్జెట్ పై అధికార, విపక్ష నాయకులు భిన్నంగా స్పందించారు. కేంద్ర మంత్రులు... సురేశ్ ప్రభు: మూసధోరణిని బద్దలుకొట్టిన బడ్జెట్. దీంతో కొత్త యుగం ఆరంభమవుతుంది అనంతకుమార్: విప్లవాత్మక, రూపాంతరీకరణ బడ్జెట్. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ: రైతు, పేదలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది కాంగ్రెస్ నాయకులు... మనీష్ తివారి: ఆడంబర బడ్జెట్, ఉపాధి కల్పన గురించి పెద్దగా పట్టించుకోలేదు. రైల్వేకు ఒరిగిందేం లేదు. మల్లిఖార్జున్ ఖర్గే: కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంది -
పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..
న్యూఢిల్లీ: ‘రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో జనం చనిపోతున్నారు. గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలో ఇన్ని సమస్యలతొ కొట్టుమిట్టాడుతుండగా వీటిలో కనీసం ఒకదానిగురించైనా నేటి బడ్జెట్లో మాట్లాడారా?’అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. బడ్జెట్ ప్రసంగం పూర్తైన తర్వాత పార్లమెంట్ వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు కీలకమైన సమస్యలను గాలికొదిలేసి, చలోక్తులు, చతురులతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. ‘ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సహచరులు కొంతకాలంగా మాట్లాడిన మాటలు వింటే, బడ్జెట్ లో అద్భుతాలు ఉంటాయని, పార్లమెంట్‌లోనే టపాసులు పేలతాయని అనుకున్నాం. కానీ పేలని బాంబులాగా తుస్సుమనిపించారు. మోదీ గొప్పగా చెప్పుకున్న బుల్లెట్ రైళ్ల ప్రస్తావన బడ్జెట్లో రానేలేదు. రైతాంగ సమస్యలకు పరిష్కారాలు చూపలేదు’అని రాహుల్ అన్నారు. తమ పథకాలతో నిరుద్యోగ సమస్య తీరుదుందని గొప్పలు చెప్పుకున్న మోదీ సర్కారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందని, ఇందుకు ప్రధాని సిగ్గుపడాలని రాహుల్ విమర్శించారు. రక్షణ రంగం ఊసేది?: రేణుకా చౌదరి కీలకమైన రక్షణ రంగానికి సంబంధించిన అంశాలేవీ బడ్జెట్లో పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాజకీయ పార్టీలకు రూ.2 వేలకు మించిన విరాళాలు ఇకపై డిజిటల్ రూపంలో జరగాలన్న బడ్జెట్ ప్రతిపాదనపైనా ఆమె మాట్లాడారు. ‘యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడతారు? డొనేషన్లను చెక్కుల రూపంలో తీసుకుంటారా? లేక డిజిటల్ రూపంలో తీసుకుంటారా? అని వ్యగ్యధోరణిలో విమర్శించారు. -
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
-
2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్య అంశాలు : మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ.21 లక్షల 47వేల కోట్లు ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం, రెవెన్యూ లోటు 2.1 శాతం వేతన జీవులకు పన్ను చెల్లింపులో ఊరట 2.5-5 లక్షల వరకు 5 శాతం పన్నురేటు మాత్రమే వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి ఎలాంటి పన్నులేదు రూ.50 లక్షల నుంచి కోటి ఉంటే టాక్స్ 10 శాతం రూ.కోటి మించి ఆదాయం ఉంటే టాక్స్ 15 శాతం రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో ఆంక్షలు నగదులో కేవలం రూ.2వేలు వరకే రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వొచ్చు చెక్ లేదా డిజిటల్ రూపంలో ఎంతైనా రాజకీయ విరాళం అపార్ట్మెంట్ నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ కు శుభవార్త బిల్డప్ ఏరియా స్థానంలో ఇకపై కార్పెట్ ఏరియా విలువకే రిజిస్ట్రేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత నుంచి పన్ను మొదలు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు ఆర్థిక వ్యవస్థ నుంచి బ్లాక్ మనీని తొలగిస్తాం సహేతుకంగా పన్నుల వ్యవస్థ నోట్ల రద్దు వల్ల వ్యక్తిగత ఆదాయ వివరాలు వెల్లడించారు ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపుల శాతం 34.85కు చేరింది బ్లాక్ మనీ వెలికితీతకు సిట్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నాం రూ.3 లక్షలకు మించితే నగదు చెల్లింపులు ఉండవు అమరావతి రైతులకు శుభవార్త, క్యాపిటల్ గెయిన్స్ రద్దు రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు పన్ను ఎగవేతదారులపై చర్యలు కోసం కఠిన చట్టం ఆర్థిక నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక చట్టం రక్షణ రంగానికి రూ.2లక్షల 74వేల 114 కోట్లు ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుల నిష్పత్తి సామాజిక న్యాయం చేసేదిగా లేదు 6లక్షల కంపెనీలు మాత్రమే రిటర్న్ సమర్పించాయి మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ ప్లాంట్లకు ప్రోత్సహకాలు మొబైల్ పరిశ్రమ మౌలిక సదుపాయాలకు రూ.745కోట్లు చండీఘడ్ సహా హర్యానాలోని 8 జిల్లాలు ఇక కిరోసిన్ రహిత జిల్లాలు ఢిల్లీ, జైపూర్ లలో 5 మురుగు శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3,96,134 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు రూ.20వేల కోట్లు గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి జాతీయ రహదారుల నిర్వహణ, కొత్తరోడ్ల నిర్మాణానికి రూ.64వేల కోట్లు చిన్న నగరాల్లో పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎయిర్ పోర్టుల నిర్మాణం లక్షన్నర గ్రామ పంచాయితీలకు స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఆధార్ ఆధారిత పేమెంట్లు త్వరలో ప్రారంభం మొబైల్, డెబిట్ కార్డులు లేకున్నా ఆధార్‌తోనే పేమెంట్ చేయవచ్చు సెప్టెంబర్ 2017 నాటికి 20 లక్షల ఆధార్ బేస్డ్ చెల్లింపు కేంద్రాలు వచ్చే ఏడాది రెండున్నర వేల కోట్ల నగదు రహిత లావాదేవీల లక్ష్యం భీమ్ యాప్ ను 125 లక్షలమంది డౌన్ లోడ్ చేసుకున్నారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్ఐపీబీ విధానం రద్దు సామాన్యులకు డిజిటల్ లావాదేవీల వల్ల మేలు బ్యాంకులు 10 లక్షల పీఓఎస్‌లను సమకూరుస్తాయి పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు జారీ సీనియర్ సిటిజన్ల హెల్త్ రికార్డు ఆథార్ తో అనుసందానం లక్షన్నర ఆరోగ్య కేంద్రాలు వెల్నెస్ సెంటర్లుగా మార్పు ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల పెట్టుబడులతో 250 ప్రతిపాదనలు మౌలిక రంగానికి రూ.3 లక్షల 96 వేలకోట్లు కేటాయింపు ఆర్థిక రంగంలో సంస్కరణల అజెండా కొనసాగుతుంది కొత్తగా ఎఫ్‌డీఐ పాలసీ సవరింపు టెలికం ఫైబర్ యాక్టీవిటీ కనెక్టివిటీ కోసం రూ.5వేలకోట్లు 2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్ 7వేల రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ఏర్పాటు కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రూ.52 వేల 393 కోట్లు రూ.500 కోట్లతో గ్రామాల్లో మహిళ శక్తి కేంద్రాలు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి రంగాలకు రూ.లక్షా 87 వేల కోట్లు జార్ఖండ్, గుజరాత్ లో రెండు ఎయిమ్స్ ల ఏర్పాటు విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్లైన్ క్లాసులు ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యం ఈ బడ్జెట్ లో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాం రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడం చారిత్రాత్మకం ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయంపై స్పష్టత ఇచ్చాం ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలు, పేదరిక నిర్మూలనకు పెద్దపీట మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత బ్లాక్ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారు పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించాం గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారు రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చింది ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటాం వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాం పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా పని చేస్తున్నాం నల్లధనంపై యుద్ధం ప్రకటించాం, పెద్దనోట్లను రద్దు చేశాం వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం పరోక్ష పన్నులపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసింది నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయి వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
ఎంట్రెన్స్ పరీక్షలపై కీలక ప్రతిపాదన
-
ఐటీ రిటర్నులు.. అంతంతే
-
నగదు లావాదేవీలపై సంచలన నిర్ణయం!
రూ. మూడు లక్షలకు మించి అనుమతించబోం బడ్జెట్లో తేల్చిచెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రూ. మూడు లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో నల్లధనాన్ని అణచివేసేందుకు రూ. 3 లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించరాదని సిట్ కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారసును కేంద్రం ఆమోదించినట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించారు. దేశంలో నల్లధనం అణచివేతకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నల్లధనం అణచివేతపై కేంద్రానికి తన నివేదిక అందజేసిన సిట్.. రూ. మూడు లక్షలకు మంచి నగదు లావాదేవీలను అనుమతించరాదని, వ్యక్తులు లేదా పరిశ్రమలు రూ. 15 లక్షలకు మించి నగదును తమ వద్ద కలిగి ఉండకుండా ఆంక్షలు విధించాలని సిఫారసు చేసింది. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను, డిజిటలైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ పార్టీలకు ఒకే సోర్స్ నుంచి రూ. 2000 మించి నగదు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధించినట్టు జైట్లీ స్పష్టం చేశారు. గతంలో ఇది రూ. 20వేల వరకు ఉండేది. -
బడ్జెట్: ఏపీ ‘రాజధాని’పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన వారికి ఆదాయపన్నులో మినహాయింపు ఇస్తున్నాం. మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇస్తున్నాం’ అని జైట్లీ ప్రకటించగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు హర్షధ్వానాలు చేశారు. ఈ మినహాయింపులు రాష్ట్రం ఏర్పడిన తేదీ అంటే 2014, జూన్ 2 తర్వాతి నుంచి చోటుచేసుకున్న క్రయవిక్రయాలన్నింటికీ వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. సంబంధిత కథనాలు... 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
ఆ కంపెనీలకు పన్ను తగ్గిందోచ్!
చిన్న సంస్థలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఊరటనిచ్చారు. వారిపై వేసే పన్నుపై 5 శాతం తగ్గించారు. రూ.50 కోట్ల టర్నోవర్ వరకున్న కంపెనీలకు వేసే ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. నల్లధనం నిర్మూలించడానికి పెద్దనోట్లను రద్దు చేయడంతో ఆర్థికవ్యవస్థ మందగించింది. డిమాండ్‌లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్యతరహా సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. డిమాండ్‌పై పడిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు బడ్జెట్లో పలు పన్ను ప్రోత్సహకాలను ప్రవేశపెడతారని పలు రేటింగ్ సంస్థలు అంచనావేశాయి. ఈ మేరకు జైట్లీ ప్రకటన వెలువరిచారు. చిన్న సంస్థలపై విధించే ఆదాయపు పన్నును దశల వారీగా 25 శాతానికి తగ్గిస్తామని తెలిపారు. చిన్న కంపెనీలపై తగ్గించిన పన్నుతో ప్రభుత్వానికి రూ.7200 కోట్ల రెవెన్యూ నష్టం నెలకొననుంది. -
ఆదాయపన్ను రేట్లు ఇలా..
పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలలో భాగంగా వేతన జీవులకు ఆదాయపన్ను విషయంలో మంచి ఊరట లభించింది. ఆదాయపన్ను రేటును అరుణ్ జైట్లీ స్వల్పంగా సవరించారు. 2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని యథాతథంగానే ఉంచినా, 2.5 లక్షల నుంచి 5లక్షల వరకు 5% పన్ను మాత్రమే విధిస్తామన్నారు. ఇంతకుముందు ఇది 10 శాతంగా ఉండేది. అయితే, ఆదాయం 5 లక్షలు దాటిన తర్వాతి పన్ను వివరాలను మాత్రం ప్రకటించలేదు. దాంతో అధికాదాయ వర్గాలకు ఆదాయపన్ను యథాతథంగా ఉండొచ్చని భావిస్తున్నారు. 50 లక్షల నుంచి 1 కోటి ఆదాయం ఉన్నవారికి పన్నుపై 10 శాతం సర్ చార్జి విధిస్తామని మాత్రం జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆదాయపన్ను వార్షికాదాయం పన్ను 2.5 లక్షల వరకు లేదు 2.5-5 లక్షల వరకు 5% 2016 నాటి ఆదాయపన్ను శ్లాబ్‌లు.. వార్షికాదాయం పన్ను 2.5 లక్షల వరకు లేదు 2.5-5 లక్షల వరకు 10% 5-10 లక్షల వరకు 20% 10 లక్షల పైన 30% (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
ఐటీ రిటర్నులు.. అంతంతే
న్యూఢిల్లీ: మన దేశంలో పన్ను- జీడీపీ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2017-18 కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. 4.2 కోట్ల మంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నా, కేవలం 1.74 కోట్ల మంది మాత్రమే రిటర్నులు వేస్తున్నారని వెల్లడించారు. 5 కోట్ల మంది వ్యాపారాల్లో ఉన్నా వాళ్లలో 1.81 కోట్లమంది మాత్రమే రిటర్నులు వేస్తున్నారని తెలిపారు. చాలా కంపెనీలు నష్టాలు లేదా సున్నా ఆదాయం చూపిస్తున్నట్లు చెబుతున్నాయని, కేవలం 7781 కంపెనీలు మాత్రమే 10 కోట్ల కంటే ఎక్కువ లాభాలు వచ్చినట్లు చెప్పాయని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ** 2015-16లో 3.7 కోట్ల మంది వ్యక్తులు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వాళ్లలో 99 లక్షల మంది 5 లక్షల లోపు ఆదాయం చూపారు. ** 1.9 కోట్ల మంది 2.5-5 లక్షల లోపు, 52 లక్షల మంది 5-10 లక్షలు, కేవలం 24 లక్షల మంది మాత్రమే 10 లక్షల పైన ఆదాయం చూపారు ** 76 లక్షల మంది వ్యక్తులు 5 లక్షల పైన ఆదాయం చూపించగా, వాళ్లలో 54 లక్షల మంది ఉద్యోగులే ఉన్నారు ** 50 లక్షల పైన ఆదాయం చూపించినవాళ్లు 1.72 లక్షల మంది మాత్రమే ** కానీ గత ఐదేళ్లలో 1.2 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి, విదేశాల్లో ప్రయాణించిన వాళ్లు 2 కోట్ల మంది ఉన్నారు ** వీటన్నింటిని బట్టి చూస్తే.. పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది ** ఎక్కువ మంది ఇలా ఎగ్గొడితే.. నిజాయితీపరులైన ఉద్యోగుల మీద ఎక్కువగా భారం పడుతోంది. ** పెద్దనోట్ల రద్దు తర్వాత.. పాత కరెన్సీ డిపాజిట్లు 8 నవంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు 2 లక్షల నుంచి 80 లక్షల లోపు 1.09 కోట్ల ఖాతాల్లో వచ్చాయి. సగటున 5.03 లక్షల డిపాజిట్లు. ** 80 లక్షలకు పైగా 1.48 లక్షల ఖాతాల్లో పడ్డాయి, సగటు డిపాజిట్లు 3.31 కోట్ల రూపాయలు. ** పన్ను విస్తృతిని పెంచి, ఆదాయాన్ని కూడాపెంచుకోవాలని చూస్తున్నాం. ఇది కూడా పెద్ద నోట్ల రద్దు లక్ష్యాల్లో ఒకటి. ** నల్లధనాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి తీసేయాలన్నది మా ఉద్దేశం ** నెట్ టాక్స్ రెవెన్యూ 2013-14లో 11.38 లక్షల కోట్లు ** 14-15లో ఇది 9.4 శాతం పెరిగింది, 15-16లో 17 శాతం పెరిగింది. 16-17లో కూడా 17 శాతం పెరిగింది. ** వ్యక్తులు చెల్లించే అడ్వాన్స్డ్ టాక్స్ 34.8 శాతం పెరిగింది. ఇది ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు సంబంధిత కథనాలు... 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
ఎంట్రెన్స్ పరీక్షలపై బడ్జెట్లో సంచలన ప్రతిపాదన
దేశమంతటా పరీక్షల నిర్వహణకు ఎన్టీఎస్ ఏర్పాటు దేశమంతటా ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఎన్టీఎస్)ను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను సీబీఎస్ఈ, ఐఐటీలు, ఏఐసీటీఈ వంటి విభిన్న సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఎస్ పేరిట ఏర్పాటుచేస్తున్న నోడల్ ఏజెన్సీకి ఇక నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల బాధ్యతలను అప్పగించనున్నారు. సీబీఎస్ఈ, ఐఐటీలు,ఐఐఎంలు, ఏఐసీటీఈ వంటి సంస్థలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న క్యాట్, జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్డ్), గేట్, సీఎంఏటీ, నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షలకు 40లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక విద్యాసంస్థలకు మరింత స్వతంత్రత (అటానమీ) ఇచ్చేందుకు యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ)ని పునర్వ్యవస్థీకరిస్తామని బడ్జెట్ లో జైట్లీ స్పష్టం చేశారు. దీనివల్ల ఎంచుకున్న కాలేజీలకు అటానమీ హోదా లభించనుంది. అదేవిధంగా ఫలితాల ఆధారంగా విద్యాసంస్థలకు అక్రిడిటేషన్ (గుర్తింపు) ఇవ్వబోతున్నామని జైట్లీ వెల్లడించారు. విద్యారంగం అంశాన్ని ప్రస్తావిస్తూ.. స్వామి వివేకానంద సూక్తిని ఉటంకించిన జైట్లీ.. ‘నాణ్యమైన విద్యే యువతకు శక్తిని ఇస్తుందని’ పేర్కొన్నారు. -
గృహ రంగానికి గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఇక గృహ రుణాలు చౌకగా లభ్యం కానున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది. దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్‌ను కల్పించారు. -
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!
-
బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ ను ఎత్తివేశారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. కాలుష్యం తగ్గించేందుకు రైలు బోగీల్లో బయో టాయ్‌లెట్స్ పెట్టనున్నారు. 2017-18 రైల్వే బడ్జెట్ రూ.1,31,000 కోట్లు ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో రైల్వే భద్రత నిధి ఏర్పాటు వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్లు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్ ట్యాక్స్ లేదు రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్ 7 వేల రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ఏర్పాటు కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు 2020 నాటికి మానవ రహిత రైల్వే క్రాసింగులు కొత్తగా 3500 కిలోమీటర్ల రైల్వే లైన్ల ఏర్పాటు ఆధ్యాత్మిక, పర్యాటకానికి ప్రత్యేకంగా రైళ్లు కొత్తగా మెట్రో రైలు పాలసీ ప్రకటించనున్న కేంద్రం ఐఆర్ సీఓఎన్, ఐఆర్ సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ కు రూ. 2.41 కోట్ల కేటాయింపు భారత్ నెట్ ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల నిధులు -
ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు
-
పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు!
న్యూఢిల్లీ: తాను ఈసారి ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో పేదలకు, గ్రామీణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు పేర్కొన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో పేదలకు పలు వరాలు ప్రకటించారు. పేదలు, అణగారిన వర్గాల బలోపేతానికి సామాజిక భద్రత కల్పిస్తామని, ఆరోగ్య సంరక్షణతోపాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 15వేల కోట్ల నుంచి రూ. 23వేల కోట్లకు బడ్జెట్లో నిధులు పెంచుతున్నట్టు చెప్పారు. 2019నాటికి ఇళ్లులేనివారు, దుర్బలమైన (కచ్ఛా) ఇళ్లలో ఉంటున్నవారి కోసం కోటి పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. 2018 మే 1 నాటికి 100శాతం గ్రామాలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయ, గ్రామీణ, దాని అనుబంధ రంగాలకు ఈసారి బడ్జెట్లో రూ. 1,87,223 కోట్లు కేటాయించామని, ఇది గత ఏడాది బడ్జెట్ కంటే 24శాతం అధికమని జైట్లీ స్పష్టం చేశారు. -
పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్లో జైట్లీ కామెంట్!
-
ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు
సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర బడ్జెట్లో కలిసిన రైల్వే బడ్జెట్లో 2017-18 సంవత్సరానికి గాను రూ. 1.31 లక్షల కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. ఇందులో 58వేల కోట్లను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ ఎత్తేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ''ప్రయాణికుల భద్రతకు రైల్ సంరక్షా కోశ్ నిధులను ఐదేళ్లలో 1 లక్షల కోట్లను కేటాయిస్తాం. 2020 నాటికి అన్ మ్యాన్డ్ రైల్వే గేట్లను పూర్తిగా తొలగిస్తాం. 5500 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేస్తాం. పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లు వేస్తాం. 25 స్టేషన్లకు 2017-18లో అవార్డులు ఇస్తాం. 500 స్టేషన్లలో వికలాంగుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేస్తాం. 7000 స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెడతాం. పరిశుభ్రత కోసం క్లీన్ మై కోచ్ అనే ఎస్ఎంఎస్ సర్వీస్ చేశాం. కోచ్ సంబంధిత సేవలన్నింటి కోసం ఒకే సర్వీసు ఉంటుంది. బయో టాయిలెట్లు ఏర్పాటుచేయిస్తాం. రైల్వేలకు ఇతర ప్రయాణ మార్గాల నుంచి గట్టి పోటీ ఉంది. అందుకోసం రైల్వేలను ముందుకు తీసుకెళ్లాలంటే మార్పు తప్పనిసరి. ఎండ్ టు ఎండ్ సేవలు అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక సేవలు అందించేలా చూస్తాం. కాంపిటీటివ్ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తాం. ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకుకునే టికెట్ల మీద సర్వీసు టాక్స్ తీసేస్తున్నాం. మెట్రో రైలు విధానాన్ని ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఇందుకోసం మెట్రోరైలు చట్టాన్ని తెచ్చి, అందులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతాం'' అన్నారు. -
మేం ముందు వెళ్తాం మీరు వెనక రండి
-
బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. వసంతపంచమి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రెండంకెల ద్రవ్యోల్భణం అదుపుతోకి వచ్చిందన్నారు. వివక్షాపూరితమైన విధానాలకు పూర్తిగా ముగింపు పలికామని జైట్లీ అన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్లో ప్రధానంగా దృష్టిపెట్టిన పది అంశాలను ఆయన వివరించారు. బడ్జెట్లో దృష్టిపెట్టిన పది అంశాలు 1. రైతులు 2. గ్రామీణాభివృద్ధి 3.యువత 4. పేదల ఆరోగ్యం 5. మౌలిక సదుపాయాలు 6. పారిశ్రామిక వృద్ధికి ఆర్థిక చేయూత 7. వేగవంతమైన జవాబుదారీతనం 8. ప్రజా సర్వీసులు 9. సమర్థమైన ఆర్థిక విధానం 10. నిజాయతీ పరులకు సరళీకృతమైన పన్ను విధానం (సంబంధిత వార్తలు..) బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు -
అప్పుడు విడిపోయింది.. ఇప్పుడు కలిసింది
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండు కలిసిపోయాయి. 92 ఏళ్ల వేరుకుంపటికి స్వస్తి పలికాయి. ఒకేరోజు కలిసి వస్తామంటూ పార్లమెంట్ ముందుకు వచ్చేశాయి. అయితే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఎప్పుడు విడిపోయాయో తెలుసా? సరిగ్గా తొంభై రెండేళ్ల క్రితం బ్రిటీష్ వారు భారత్‌ను పరిపాలించే సమయంలో 1924లో ఈ రెండు వేరు కుంపటి పెట్టాయి. ఆ సమయంలో రైల్వే దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంపద. బడ్జెట్లో వీటికి 75 నుంచి 85 శాతం కేటాయింపులుండేవి. జనరల్ బడ్జెట్లోరైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంటుండంతో, దీన్ని వేరుగా తీసుకురావాలని బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. 10 మంది సభ్యులు అక్వర్త్ కమిటీ 192-21లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. అనంతరం 1924లో దీన్ని సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. దీని ద్వారా మంచి విధాన రూపకల్పన, అమలు చేయొచ్చని భావించారు. అప్పటినుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సాధారణ బడ్జెట్లో రైల్వేలు కలిగి ఉంది కేవలం 4 శాతం మాత్రమే. దీంతో పాటు రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వేను సాధారణ బడ్జెట్ లో కలుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బడ్జెట్ లను కలిపి పార్లమెంట్‌లోకి తీసుకొచ్చింది. 70 ఏళ్ల క్రితం అంటే 1994 మార్చి 24న రైల్వే బడ్జెట్‌ను తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలి రైల్వే మంత్రి జాన్ మతాయి. మొదటి మహిళా రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిచేశారు. -
స్వయం ప్లాట్‌ఫాం, సంకల్ప్ శిక్షణ కేంద్రాలు
నాణ్యమైన విద్యతోనే యువతకు మేలు జరుగుతుందని అరుణ్ జైట్లీ అన్నారు. దానికోసం ఇన్నోవేషన్ ఫండ్ ను సృష్టిస్తామని, దీంతో లోకల్ ఇన్నోవేషన్ మొదలవుతుందని అన్నారు. ప్రధానంగా 3479 విద్యాపరంగా వెనకబడిన బ్లాకులపై దృష్టిపెడతామన్నారు. ఐటీ కోసం 'స్వయం' ప్లాట్‌ఫాం ఏర్పాటుచేస్తామని విద్యార్థులు వర్చువల్ క్లాసుల ద్వారా నేర్చుకోవచ్చని, ఆన్లైన్ టెస్టులలో పాల్గొనవచ్చని, డీటీహెచ్ చానళ్ల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రవేశపరీక్షల నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేస్తామన్నారు. స్కిల్ ఇండియా మిషన్‌ను గతంలో ఏర్పాటుచేశామని ఇప్పుడు దేశంలో 600 కేంద్రాల్లో దీన్ని అమలుచేస్తామని తెలిపారు. వీటిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, విదేశీ భాషల్లో శిక్షణ కూడా ఇస్తారని, వీటివల్ల విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. వీటి కోసం రూ. 4వేల కోట్లతో సంకల్ప్ కేంద్రాలు పెడతామని అన్నారు. 500 కోట్లతో మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని, దీనివల్ల గ్రామీణ మహిళలు ఉపాధి అవకాశాలను పెంచుకుంటారని చెప్పారు. మహిళాభివృద్ధికి నిధుల కేటాయింపును 1,56,528 కోట్ల నుంచి 1,84,632 కోట్లకు పెంచుతున్నామన్నారు. -
పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్లో జైట్లీ కామెంట్!
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో పెద్దనోట్ల రద్దు గురించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ‘ఏ రైట్ కాజ్ నెవర్ ఫెయిల్స్’ (ఒక మంచి పని ఎప్పుడూ విఫలం కాదు) అంటూ జాతిపిత మహాత్మాగాంధీ సూక్తిని ఉటంకించిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనేది సాహసోపేతమైన చర్య అని, దీనివల్ల జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) పెరగడమే కాకుండా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు (డిమానేటైజేషన్) ప్రభావం రానున్న ఆర్థిక సంవత్సరంపై ఉండబోదని భావిస్తున్నట్టు చెప్పారు. రీమానేటైజేషన్ (కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే) ప్రక్రియ ఇప్పటికే వేగం అందుకున్నదని, త్వరలోనే సంతృప్తికర స్థాయికి ఇది చేరుకుంటుందని ఆయన చెప్పారు. గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. రూ. వెయ్యి, రూ. 500 నోట్లు రద్దు చేయడంతో ప్రజలు పాతనగదును మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త కరెన్సీ అందుబాటులోకి రావడంతో బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు, సామాన్యులకు కేంద్ర బడ్జెట్లో మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తారని అందరూ ఆశిస్తున్నారు. -
వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాల్ అదే
అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడం వర్థమాన దేశాలకు అతిపెద్ద సవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగిస్తున్న జైట్లీ, ఎన్ని అడ్డంకులున్నా భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా వద్ధి చెందుతోందని పేర్కొన్నారు. చమురు ధరల్లో నెలకొన్న అనిశ్చితి కూడా వర్థమాన దేశాలకు రెండో అతిపెద్ద సవాల్‌గా నిలవబోతుందని ఉద్ఘాటించారు. వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్టంగా ఉన్న విధానాలకు స్వస్తి పలికామన్నారు. ఈ క్రమంలోనే బ్లాక్‌మనీ హోల్డర్స్ భరతం పట్టడానికి నోట్లను రద్దు చేసినట్టు చెప్పారు. భారత్ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద తయారీదేశంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉందన్నారు. సీపీఐ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంకు నిర్దేశించిన 2 శాతం నుంచి 6 శాతానికి మధ్యలోనే ఉందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. '' ఎఫ్ఐఐలు రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా లోటు 1 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. 2016లో 3.2 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వద్ధి రేటు, 2017లో 3.4 శాతానికి పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేస్తోంది. వర్థమాన దేశాల వద్ధి రేటు 4.1 శాతం-4.5 శాతం పెరుగుతున్నాయి'' అని జైట్లీ పేర్కొన్నారు. -
ఉపాధి హామీకి పెద్దపీట
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బు మొత్తాన్ని ఖర్చుచేస్తే.. ఈ పథకం మీద ఇప్పటివరకు ఖర్చుపెట్టిన అత్యధిక మొత్తం ఇదే అవుతుందని గత బడ్జెట్ ప్రసంగం సమయంలో అరుణ్ జైట్లీ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వెయ్యి కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెస్తామని జైట్లీ అన్నారు. 15వేల పంచాయతీలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. గత సంవత్సరం నిధులు పూర్తిగా వినియోగించారని మహిళల భాగస్వామ్యం కూడా 48 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని తెలిపారు. -
మేం ముందు వెళ్తాం.. మీరు వెనక రండి
కొత్త బడ్జెట్లో తాము మూడు సంస్కరణలు తెచ్చామని అరుణ్ జైట్లీ అన్నారు. తాము ముందుకు వెళ్తామని, మీరంతా మా వెనక రావాలని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''కరెంటు ఖాతా లోటు 0.3 శాతానికి తగ్గింది. ఫిస్కల్ కన్సాలిడేషన్ మీద ప్రభుత్వం దృష్టిపెట్టింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థికవ్యవస్థ అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆరో అతిపెద్ద ఉత్పత్తి దేశంగా భారత్ వచ్చింది. ఇంతకుముందు 9వ స్థానంలో ఉంది. గత సంవత్సరం దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక విధాన నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ అమలుకు రాజ్యాంగ బిల్లు ఆమోదం, పెద్దనోట్ల రద్దు.. ఈ రెండూ ముఖ్యమైనవి. జీఎస్టీని ఆమోదించినందుకు ఇరు సభల సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. పెద్దనోట్ల రద్దు చాలా సాహసోపేతమైన చర్య. చాలా దశాబ్దాలుగా పన్ను ఎగవేత మామూలైపోయింది. దానివల్ల పేదలపై ప్రభావం పడుతోంది. సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అది చాలావరకు తగ్గింది. అవినీతి, నల్లధనాన్ని, నకిలీనోట్లు, ఉగ్రవాదులకు నిధులు.. వీటన్నింటినీ అది అరికట్టింది. ఆర్థిక వ్యవస్థలో డిజిటైజేషన్ కూడా సాధ్యమైంది. వీటన్నింటి వల్ల జీడీపీ వృద్ధిరేటు పెరగడం కూడా సాధ్యమైంది. 'జామ్' విజన్‌లో ఇది ప్రభుత్వ మూడో అతిపెద్ద ముందడుగు. ''దేనికీ భయపడద్దు.. ముందడుగు వేయండి.. ఎందుకు భయపడతారు, మేం ముందు వెళ్తాం, మా వెనక రండి మీరు'' అని అర్థం వచ్చేలా ఒక హిందీ షాయరీ చెప్పారు. 2017, 18 సంవత్సరాల్లో జీడీపీ వృద్ధిరేటు 7.2, 7.7 శాతం చొప్పున ఉంటుందని అంచనా వేశాం. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులలో నగదు అందుబాటు పెరిగి, వడ్డీ రేట్లు తగ్గడమే కాక, నిధుల అందుబాటు కూడా పెరిగింది. పేదలకు గృహనిర్మాణం, రైతులకు రుణసదుపాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం.. ఇవన్నీ కూడా మెరుగవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచాలన్నది మా లక్ష్యం. '' 2017-18 బడ్జెట్ విషయంలో మూడు సంస్కరణలు 1) ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం. దీనివల్ల మంత్రిత్వశాఖలు కొత్త పథకాలను కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయడానికి వీలయింది. 2) రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో కలపడం. 1924 నుంచి బ్రిటిష్ వలస విధానంలో ఉన్న దీన్ని మేం ఛేదించాం. 3) వ్యయాల్లో ప్రణాళిక, ప్రణాళికేతర విధానాన్ని వదిలిపెట్టాం. వనరులను రంగాల వారీగా మాత్రమే కేటాయిస్తాం -
కేంద్ర బడ్జెట్ పవిత్రతను కాపాడాలి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేరళ ఎంపీ ఈ. అహ్మద్ మృతి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంపీ మృతి నేపథ్యంలో బడ్జెట్‌ను వాయిదా వేయాలా? వద్దా? అన్నది లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కాగా, బడ్జెట్ వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను స్పీకర్ మహాజన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే కేంద్ర బడ్జెట్ యతాథతంగా ఉంటుందని వారు వెల్లడించారు. -
బడ్జెట్ ప్రసంగం ప్రారంభం ఇలా..
-
ఎంపీ అహ్మద్ మృతికి లోక్‌సభ సంతాపం
-
బడ్జెట్ ప్రసంగం ప్రారంభం ఇలా..
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2017-18 సంవత్సర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా కేంద్ర మాజీమంత్రి ఇ.అహ్మద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ తన రూలింగ్ ఇస్తూ, అరుణ్ జైట్లీని బడ్జెట్ ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరారు. అందుకు కాంగ్రెస్ సభ్యుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అహ్మద్ చాలా సీనియర్ సభ్యుడని, ఆయన పార్లమెంటు విధుల్లో ఉండగానే కుప్పకూలిపోయారని అన్నారు. అందువల్ల ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు సభను వాయిదా వేసి, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టుకోవచ్చన్నారు. కానీ అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దాంతో అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వసంత పంచమి శుభదినం రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, ఈ శుభదినం సందర్భంగా అందరికీ అభినందనలని చెప్పారు. నల్లధనం మీద పోరాటం ప్రారంభించామని, ద్రవ్యోల్బణాన్ని సింగిల్ డిజిట్లోకి తెచ్చామని అన్నారు. ప్రజాధనానికి ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉందన్నారు. -
కాసేపట్లో బడ్జెట్ : రైల్వే స్టాక్స్ ఢమాల్
మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైల్వే స్టాక్స్ పడిపోయాయి. రైల్వేకు సంబంధించిన కంపెనీలన్నీ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న రైల్వే బడ్జెట్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. మొదటిసారి రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిపి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్స్మాకో రైల్, కాళిందీ రైల్ నిర్మాణ్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ షేర్లు బుధవారం ఇంట్రాడేలో 3 నుంచి 5 శాతం దిగువకు ట్రేడవుతున్నాయి. రైల్వేస్ భద్రతా ఫండ్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవల పలుచోట్ల ఘోర రైల్వేప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. రైల్వే డెవలప్మెంట్ అథారిటీ అండ్ హై స్పీడ్ రైల్వే అథారిటీని కూడా ఈ బడ్జెట్లోనే ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు మార్కెట్లు సైతం ఆందోళనలో లాభనష్టాల ఊగిసలాటలో నడుస్తున్నాయి. -
కేంద్ర బడ్జెట్ యథాతథం
ప్రతిపక్షాలు ఏమన్నా కూడా.. బడ్జెట్‌ను యథాతథంగా బుధవారమే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా నిర్ధారించారు. తాను బడ్జెట్ ప్రవేశపెడతానని, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభ టీవీ లైవ్‌లో దాన్ని చూడాలని అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మాజీమంత్రి, కేరళ ఎంపీ మరణించడం వల్ల బడ్జెట్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీయూ లాంటి పక్షాలు కోరుతున్నా, సభ్యుల మృతివల్ల బడ్జెట్ వాయిదా పడదని స్పీకర్ కార్యాలయం కూడా వారికి తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. కావాలనే అహ్మద్ మృతివార్తను అధికారికంగా ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ.. కేంద్రం మాత్రం తొలుత అహ్మద్ మృతికి సంతాపం తెలిపి, ఆ తర్వాత బడ్జెట్ యథాతథంగా ప్రవేశపెడతారని చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మద్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అంతకుముందే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు బడ్జెట్ ప్రతులను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీసుకెళ్లి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన దానికి ఆమోదముద్ర కూడా వేసినట్లు తెలిసింది. అహ్మద్ ఇంటి నుంచి ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఇక బడ్జెట్ వాయిదా వేయడం సాధ్యం కాదని, అలాగే అది సరి కూడా కాదని రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ చెప్పారు. ఇప్పటికే పార్లమెంటుకు కూడా బడ్జెట్ ప్రతులు చేరినందున ఈరోజు ప్రవేశపెట్టడమే సబబన్నారు. -
బడ్జెట్‌పై దుమారం: సభ్యుడు చనిపోతే ఆపరా?
- ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు.. ఖర్గే సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ: సిట్టింగ్ ఎంపీ చనిపోయినప్పటికీ బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఒకవైపు సహచరుడు మరణించి ఉండగా, సభను జరపడడం, బడ్జెట్‌ను ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని కాంగ్రెస్, జేడీయూ, ఆర్ఎల్డీ పార్టీలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆర్ఎల్డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఒక అడుగు ముందుకేసి ప్రధాని, ఆర్థిక మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్ మరణవార్తను ప్రకటించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని ఖర్గే అన్నారు. మళప్పురం(కేరళ) ఎంపీ అహ్మద్ మంగళవారం సభలోనే గుండెపోటుకు గురయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ఉభయసభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నతరుణంలోనే ఈ ఘటన జరిగింది. పార్లమెంట్ సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం 2:30కి కన్నుమూశారు. అయితే ఉదయం 9:30 గంటలకుగానీ ఆయన మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు. ఎంపీ మరణవార్తపై కుట్రలు కాంగ్రెస్ పక్షనేత ఖర్గే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆస్పత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే అహ్మద్ చనిపోయారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలుసు. కానీ ఉద్దేశపూర్వకంగా మరణవార్త ప్రకటనను ఆలస్యం చేశారు. తద్వారా బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలనేది వారి పన్నాగం’అని ఖర్గే విమర్శించారు. సీనియర్ సభ్యుడి మరణానికి సంతాపంగా సభను వాయిదావేయాలని డిమాండ్ చేశారు. సూట్‌కేసు పట్టుకొని పరుగెత్తడం అవసరమా? మాజీ ప్రధాని ఎంపీ మరణం నేపథ్యంలో సభ జరపాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ సూట్‌కేసుతో రాష్ట్రపతిని కలవడాన్ని మాజీ ప్రధాని దేవేగౌడ తప్పుపట్టారు. ‘ఆర్థిక మంత్రి సూట్‌కేసు పట్టుకుని హడావిడిగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. నిజానికి బడ్జెట్ ప్రభుత్వం సంకల్పిస్తే బడ్జెట్ వాయిదా పెద్ద కష్టమేమీకాదు. హడావిడి సృష్టించడం ద్వారా బడ్జెట్ వాయిదా వేయకూడదనే తన సంకల్పాన్ని ప్రభుత్వం బయటపెట్టకుంది’అని దేవేగౌడ అన్నారు. బడ్జెట్ వద్దు: లాలూ ఆర్ఎల్డీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కూడా బడ్జెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అహ్మద్ మృతికి లాలూ సంతాపం తెలిపారు. -
పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు..
-
పార్లమెంట్‌కు బడ్జెట్ ప్రతులు..
న్యూఢిల్లీ: ఎంపీ ఆకస్మిక మరణంతో బడ్జెట్ వాయిదా పడుతుందా? లేదా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్న తరుణంలోనే బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి బుధవారం ఉదయం రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన చేతిలో బడ్జెట్ సూట్‌కేసు కూడా ఉంది. ఇదిలాఉంటే, బడ్జెట్ ప్రకటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్న తరుణంలోనే ‘బడ్జెట్ తప్పక ఉంటుంది’ అంటూ ప్రభుత్వ వర్గాలు చూచాయగా పేర్కొన్నాయి. మరణించిన ఎంపీ అహ్మద్‌కు సభలో నివాళులు అర్పించిన అనంతరం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని తెలిసింది. అయితే అధికారిక ప్రకటనమాత్రం స్పీకర్ నిర్ణయం తర్వాతే ఉంటుంది. ఇటు పార్లమెంట్ ఆవరణలోనూ బడ్జెట్ హడావిడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకే బడ్జెట్ ప్రతులు ఉంచిన భారీ బాక్సులను సిబ్బంది పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. ఈ పేపర్ ప్రతులను కేవలం ఎంపీలకు మాత్రమే అందజేస్తారు. వార్తాసంస్థలు, ఇతర మాద్యమాలకు డిజిటల్ బడ్జెట్‌ను అందుబాటులో ఉంచుతారు. 92 ఏళ్ల సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రకటించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో కలిపి ప్రకటించనున్నారు. (ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?) -
10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఎంతో ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌ను నేడు పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి రైల్వే పద్దును, సాధారణ బడ్జెట్లో విలీనం చేసి దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు.... భారత తొలి బడ్జెట్ : జేమ్స్ విల్సన్ తొలిసారి ఇండియన్ బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్‌కు ఆర్థికమంత్రిగా పనిచేసేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ : స్వతంత్ర భారతంలో ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. 1947 నవంబర్‌లో ఆయన దేశీయ తొలి ఆర్థికమంత్రి. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకున్న కాలాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ చదవని మంత్రి : శెట్టి తర్వత 1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్‌గా పేరుగాంచింది. బడ్జెట్‌ను చదవకూడదని నిర్ణయించిన ఆయన, అన్ని వివరాలను వైట్ పేపర్లలో సర్క్యూలేట్ చేస్తున్నట్టు సభ్యులకు చెప్పారు. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆయనే : ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. గరిష్టంగా 10 సార్లు ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన బర్త్‌డే రోజే బడ్జెట్‌ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న మోరార్జీ దేశాయ్ బర్త్‌డే. బ్లాక్ బడ్జెట్ : రూ. 550 కోట్ల లోటు కారణంగా 1973-1974 కాలంలో తీసుకొచ్చిన బడ్జెట్‌కు బ్లాక్ బడ్జెట్‌గా పేరు. దీన్ని మాజీ ఆర్థికమంత్రి పీ. చిదంబరం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతులు : ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్లు మాత్రమే ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం వీరు రాష్ట్రపతులయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ : అత్యంత క్లిష్ట పరిస్థితుల సమయంలో రెండు ప్రభుత్వ హయాంలో యశ్వంత్ సిన్హా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. పోఖ్రాన్ రెండవ పేలుళ్ల అనంతరం 1999లో, కార్గిల్ యుద్ధం అనంతరం 2000లో, గుజరాత్లో అత్యంత భీకరమైన భూకాపం అనంతరం 2001లో, ఫారెక్స్ సంక్షోభ సమయం 1991లో యశ్వంత్ సిన్హా బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఒకే ఒక్క మహిళే : ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశాయ్ రాజీనామా చేయడంతో దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1970-71 సమయంలో ఆమె బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రెండు బడ్జెట్ల విడిపోయిన కాలం: 1924లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. అప్పటి నుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఆ 92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి , ప్రస్తుతం రెండు బడ్జెట్లను కలిపి మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన ముగ్గురు ప్రధానులు : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేస్తూనే బడ్జెట్ తీసుకొచ్చారు. అతిపెద్ద బడ్జెట్ : 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అతిపెద్ద బడ్జెట్‌గా పేరు. అదేసమయంలో దేశీయ ఆర్థిక విధానాలన్నింటిల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమయం మార్పులు : ముందు వరకు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అటల్ బిహార్ వాజ్‌పేయి కాలం 1999లో బడ్జెట్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. ఆ బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా బడ్జెట్ తేదీలనే మార్చేసి, ఒకనెల ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. -
జైట్లీ వడ్డింపు.. స్వీటా? హాటా?
-
బడ్జెట్ డే : ఫ్లాట్‌గా ఎంట్రీ
ముంబై : బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొన్న పరిస్థితుల్లో మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 16.91 పాయింట్ల లాభంలో 27672.87 వద్ద, నిఫ్టీ 8.20 పాయింట్ల లాభంలో 8569.50 వద్ద ప్రారంభమయ్యాయి. లుపిన్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హీరో మోటో, విప్రో లాభాలు పండిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్‌ఫార్మాలు నష్టాలు గడిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడింది. మంగళవారంతో పోలిస్తే నేడు 67.65గా ప్రారంభమైంది. నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ మంగళవారం జరిగిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమావేశాల ప్రారంభ ప్రసంగ సమయంలో మళ్లప్పురం(కేరళ) లోక్‌సభ ఎంపీ ఇ.అహ్మద్ గుండెపోటుతో అస్వస్థకు గురై, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మృతి చెందడంతో బడ్జెట్ ప్రవేశంపై సందిగ్థత నెలకొంది. నేడు బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అని మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
బడ్జెట్ వాయిదా?: కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ: మళప్పురం లోక్‌సభ సభ్యుడు ఇ. అహ్మద్ హఠాన్మరణం నేపథ్యంలో బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేక గురువారానికి వాయిదా వేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రివర్గం సమాలోచనలు జరుపుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అరుణ్ జైట్లీ సిద్ధం చేసిన బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. (ఎంపీ హఠాన్మరణం:కేంద్ర బడ్జెట్ వాయిదా..?) పార్లమెంట్ వాయిదాపై తుది నిర్ణయం స్పీకర్ సుమిత్రా మహాజన్దే అయినప్పటికీ, ప్రభుత్వ అభిప్రాయం ఏమిటన్నది కీలకాంశంగా మారింది. చనిపోయిన వ్యక్తి సిట్టింగ్ ఎంపీ కావడం, అందునా, పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే కుప్పకూలడం లాంటి అంశాల నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజుకు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరే అవకాశంఉంది. అన్నివర్గాల అభిప్రాయాలు విన్నపిదప ఉదయం 10 గంటలకు స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారని తెలిసింది. ఇదిలా ఉంటే, ‘నేటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. బడ్జెట్ యధాతధంగా ప్రకటించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ఎంపీ హఠాన్మరణం : కేంద్ర బడ్జెట్ వాయిదా?
-
మోదీపై వ్యక్తిగత దాడులొద్దు!
పార్టీ ఎంపీలకు టీఎంసీ అధినేత్రి సూచన పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు కలిగిన ఇబ్బందులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కాస్తా స్వరాన్ని తగ్గించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయవద్దని పార్టీ ఎంపీలకు ఆమె సూచించారు. పెద్దనోట్ల రద్దును ఆమె ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ ప్రభుత్వం వెనుకకు తగ్గని విషయం తెలిసిందే. నోట్లరద్దుకు నిరసనగా బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆమె పార్టీ ఎంపీలకు సూచించారు. అయితే, ఈ నిరసన ప్రదర్శన విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులుగానీ, నిందాపూర్వక వ్యాఖ్యలుగానీ చేయకూడదని ఆమె సూచించారు. ప్రధానిని తాను సంబోధించినట్టు.. మోదీ బాబు అని సంబోధించవద్దని ఆమె టీఎంసీ ఎంపీలకు స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత మమతా బెనర్జీ, నరేంద్రమోదీ మధ్య స్నేహసంబంధాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత మమతతోపాటు ఆమె పార్టీ ఎంపీలు కూడా మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగారు. నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలు కుంభకోణాల్లో టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడం కూడా మోదీ సర్కారుపై మమత కోపాన్ని పెంచింది. ఈ పరిణామాలతో ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ-టీఎంసీ బద్ధవిరోధులుగా పరస్పర రాజకీయ దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. -
ఒక్కో బడ్జెట్ కాపీ ఖర్చెంతో తెలుసా?
రైల్వే పద్దును సాధారణ బడ్జెట్లో కలుపుతూ చరిత్రాత్మకమైన కేంద్ర బడ్జెట్‌ను నేడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌తో పాటు కీలకమైన యూపీ లాంటి ఐదు రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరుగబోతుండటం దీని ప్రాధాన్యత. జనవరి 19న ప్రారంభమైన హల్వా సెర్మనీతో ఈ బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది. ఎంతో పకడ్బందీగా జరిగిన ఈ ప్రతుల ప్రింటింగ్, మొత్తం 788 బడ్జెట్ కాపీలను ముద్రించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కాపీని ముద్రించడానికి రూ.3450 ఖర్చు అయిందని తెలుస్తోంది.. పార్లమెంట్‌లోని ఎంపీలకు, పలువురు అధికారులకు మాత్రమే బడ్జెట్ ప్రతులను అందించనున్నారు. బయటి వ్యక్తులకు మాత్రం డిజిటల్ ప్రతులనే పంపనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. -
కేంద్ర బడ్జెట్ వాయిదా..?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక బడ్జెట్ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయనున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 1న కాకుండా రేపు(ఫిబ్రవరి 2న) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. కేరళలోని మళప్పురం పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ ఇ. అహ్మద్ ఆకస్మిక మరణం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిన్న(మంగళవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో గుండెపోటుకు గురై, ఆస్పత్రిలో చేరిన ఎంపీ అహ్మద్.. బుధవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే అహ్మద్ కిందపడిపోయారు. దీంతో సిబ్బంది ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కొద్ది గంటల చికిత్స అనంతర బుధవారం ఉదయం2:30 గంటల సమయంలో అహ్మద్ కన్నువూశారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సందర్భాలలో ఉభయసభలలోనూ ఆయన/ఆమె కు అంజలిఘటిస్తారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సభ ఒకరోజుకు వాయిదా వేస్తారు. బడ్జెట్ వాయిదా వార్తలపై పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ గాంగ్వర్ స్పందించారు. ‘ఎంపీలు చనిపోయినప్పుడు సభను వాయిదా వేడయం ఆనవాయితీనే. అయితే తుది నిర్ణయం మాత్రం స్పీకర్‌దే’అని గాంగ్వర్ అన్నారు. సాధారణంగా సమావేశాలు లేని సందర్భంలోనూ ఎంపీలు ఎవరైనా చనిపోతే, ఆ సీజన్లో సభ ప్రారంభమైన మొదటిరోజే మృతులకు నివాళులు అర్పించిన పిదప సభను వాయిదావేస్తారు. గత ఏడాది వేసవి కాల సమావేశాల్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. షహదోల్(మధ్యప్రదేశ్) నియోజకవర్గ ఎంపీ దళ్పత్ సింగ్ పరాస్తే జూన్ 1న కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపకంగా వేసవికాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే నివాళులు అర్పించి, సభను వాయిదావేశారు. మలప్పురం ఎంపీ ఇ.అహ్మద్ పార్లమెంట్ హాలులోనే అస్వస్థతకుగురై, ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో అహ్మద్ విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. ఎంపీ అహ్మద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘పశ్చిమ ఆసియా’పై ఆయనది కీలక పాత్ర: ప్రధాని మోదీ రాజకీయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అహ్మద్ కేరళ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, ఆయన మరణం తీవ్ర వేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రిగా పశ్చిమ ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో అహ్మద్ కీలక పాత్ర పోశించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చురుకైన రాజకీయవేత్తగా అహ్మద్ పేరుతెచ్చుకున్నారని, ఆయన అకాలమరణం బాధకుగురిచేసిందని అన్నారు. (పార్లమెంట్లో పడిపోయిన ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు) -
పార్లమెంట్లో గుండెపోటు: ఎంపీ కన్నుమూత
న్యూఢిల్లీ: అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరిన సీనియర్ పార్లమెంటేరియన్ ఇ.అహ్మద్(79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మళప్పురం(కేరళ) నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన.. నిన్న(మంగళవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో పడిపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రివరర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ జాతీయ అధ్యక్షుడైన అహ్మద్.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అహ్మద్ మృతిపట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
జైట్లీ వడ్డింపు.. స్వీటా? హాటా?
అవును! ఉద్యోగులదెప్పుడూ పన్ను గొడవే. వృద్ధులదైతే... వడ్డీ గొడవ. మరి కంపెనీలు..? రాయితీలడుగుతాయి. ప్రోత్సాహకాలు ఇవ్వమంటాయి. బడ్జెట్ ముందు ఎప్పుడూ వినిపించేవి ఇవే కదా!! అని అంతా అనుకోవచ్చు. అసలు బడ్జెట్ అంటేనే ఆదాయ–వ్యయాల చిట్టా. మరి చేతిలో కొంత ఆదాయం మిగలాలంటే పన్ను తగ్గటమో, మినహాయింపు పరిమితి పెరగటమో జరగాలి కదా? ఉద్యోగులకు అంతకన్నా పెద్ద విషయం ఏముంటుంది? ఎవరైనా కోరుకునేది చేతికి నాలుగు డబ్బులు రావాలనే. వచ్చిన డబ్బులు మిగలాలనే. మన దేశంలో అసలు పింఛన్ భరోసా ఉన్నది ఎంతమందికి? ప్రభుత్వోద్యోగం ఉన్నది ఎందరికి? కాబట్టే అంతా పొదుపు పథకాలపై ఆధారపడతారు. వృద్ధాప్యంలో దానిపై వచ్చే వడ్డీనే జీతంగా భావిస్తారు. కాబట్టే బడ్జెట్ ముందు ఎవరిని కదిపినా వాటిపైనే మాట్లాడారు. దీన్నుంచి మీరేం ఆశిస్తున్నారని అడిగితే... వాటికే ఓటేస్తారు. ఈసారి బడ్జెట్‌కు బోలెడన్ని విశిష్ఠతలున్నాయి. మొదటిది... ఇది వేళకాని వేళలో వస్తున్న బడ్జెట్. అంటే సంప్రదాయాన్ని తోసిరాజని ఫిబ్రవరి నెలాఖరుకు బదులు నెల మొదటనే తెస్తున్న బడ్జెట్. రెండోది యూపీ, పంజాబ్ వంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో... ఆ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి వరాలూ ఇవ్వబోమని హామీ ఇచ్చి మరీ కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్. మూడోది... పెద్ద నోట్లను రద్దు చేసినందుకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో దాన్ని గాడిన పెట్టే చర్యలు తీసుకోవచ్చని అంచనాలు వేస్తున్న బడ్జెట్. నగదు లావాదేవీల్ని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించటం, జీఎస్టీ అమలుకు తగ్గ పరిస్థితులు సృష్టించటం... ఇవన్నీ ఈ బడ్జెట్ ముఖంగా చేపట్టబోయే చర్యలే. అందుకే దీనికంత ప్రాధాన్యం. జనం మాత్రం... యథా ప్రకారం తమ కోరికలు ఈ సారైనా నెరవేరుతాయేమోననే ఆశలతోనే ఉన్నారు. రైతు తనకు దొరకని మద్దతు ధరను... అక్కరకు రాని పంటల బీమాను... రుణమివ్వని బ్యాంకుల్ని గుర్తు చేసుకుంటూ... అవన్నీ ఈ బడ్జెట్‌తో సర్దుకోవాలని ఆశిస్తున్నాడు. గృహిణులు పెరిగే ధరల్ని నిందిస్తూ... ఈ బడ్జెట్ వాటిని దించేయాలని కోరుకుంటున్నారు. చిత్రమేంటంటే అంతా ఈ బడ్జెట్లోనే ఇవన్నీ జరిగిపోతాయని ఆశిస్తున్నారు. జరిగిపోవాలని కోరుకుంటున్నారు. అన్నీ బడ్జెట్లోనే జరిగిపోవటానికి ఇదేమైనా అక్షయ పాత్రా..? ఏమో... చూద్దాం ఈ రోజు. వైద్యానికి 5 శాతం కేటాయించాలి ఏటా బడ్జెట్లో వైద్య రంగానికి దేశ జీడీపీలో 1.2 శాతమే కేటాయిస్తున్నారు. దీన్ని ఐదు శాతానికి పెంచాలి. ఈ మొత్తంలో 55 శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 35 శాతాన్ని ఏరియా ఆస్పత్రులకు, 10 శాతాన్ని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదల చేయకపోవడం వల్ల గడిచిన రెండేళ్లలో జాతీయ అంధత్వం నివారణ వంటి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌తో పాటు వైద్య పరికరాలపై విపరీతమైన టాక్స్ విధించడం వల్ల వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. వీటిపై టాక్స్‌లు ఉపసంహరించాలి. ఆర్బీఎస్కే, జేఎస్ఎస్కే, జేఎస్వై వంటి పథకాలను ఒకే పథకంగా రూపొందించి అమలు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. ఇమ్యూనైజేషన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ వంటి కార్యక్రమాలు పీపీపీ పద్ధతిలో చేపడితే సత్పలితాలు సాధించొచ్చు. ప్రతీ పీహెచ్సీలో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేలా నిధులు కేటాయిస్తే టెలీ మెడిసిన్ వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కొత్త పథకాల అమలుకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. గత బడ్జెట్లో జిల్లా ఆసుపత్రులున్న చోట మెడికల్æకళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదించారు. నిధుల లేమితో ఇవి ప్రారంభం కాలేదు. – ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్సింగరెడ్డి, రామన్నపేట (వరంగల్ తూర్పు) ధరలు తగ్గితేనే బతకగలం ఈసారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా నిత్యావసర సరుకులపై భారం పడకుండా చూడాలి. ధరలు బాగా పెరిగిపోతున్నాయి. తట్టుకోవటం కష్టమవుతోంది. వివిధ వర్గాలకు అవసరమైన చిన్న చిన్న సరుకుల ధరలపై నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు అదుపులో ఉంటే రవాణా పరంగా ప్రజలపై భారం తగ్గుతుంది. – ఎస్.రెహమాన్, చిరు వ్యాపారి, కర్నూలు పన్ను మినహాయింపును పెంచాల్సిందే! ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఆరేళ్లుగా పెంచలేదు. కాకపోతే పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా జీతాలు కొంత పెరిగాయి. దీనివల్ల నాల్గవ తరగతి ఉద్యోగులు కూడా ఆదాయపన్ను పరిధిలోకి వస్తున్నారు. అందుకని ఈ సారి బడ్జెట్లో తప్పని సరిగా పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నాం. పెంచకపోతే ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసినట్లే. ఎందుకంటే నూటికి నూరు శాతం పన్ను చెల్లించేది ఉద్యోగులే. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేలయ్యాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఆశిస్తున్నాం. అలా చేస్తే వ్యాపారాలు పుంజుకుంటాయి. జీఎస్టీ గానీ ప్రవేశ పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పడిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌కు దీనివల్ల రూ.5వేల కోట్ల మేర పన్నులు తగ్గిపోతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ ఏడాది జీఎస్టీ ప్రవేశపెడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారన్నది బడ్జెట్లో చెప్పాలి. ఆ మేరకు కేంద్రం నిధులు కూడా కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్‌కు 12 విద్యాసంస్థలు, 600 కిలోమీటర్ల రోడ్లు, పోర్టులు మంజూరు చేసినట్లు కేంద్రంఘనంగా చెబుతోంది. కానీ గత బడ్జెట్లో నిధులు మాత్రం అరకొరగా కేటాయించింది. ఇలాగైతే ఏన్ని సంవత్సరాలు పూర్తయినా ఆయా ప్రాజెక్టులు ఉపయోగంలోకి రావు. అందువల్ల ఈ సారి బడ్జెట్లో సాధ్యమైన ఎక్కువ నిధులు కేటాయించాలి. – ఎ.విద్యాసాగర్,ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నేత వృద్ధులకైనా వడ్డీ పెంచాలి ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీలు బాగా తగ్గిపోయాయి. నిజానికి మన దగ్గర సామాజిక భద్రత వంటివి గానీ, నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు గానీ లేవు. పెన్షన్ ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకైతే పర్వాలేదు. కానీ ప్రైవేటు రంగంలోనో, కార్పొరేట్ రంగంలోనో పనిచేసి రిటైరైన వారు తమ శేష జీవితానికి ప్రధానంగా ఆధారపడేది పొదుపు సొమ్ము. దానిపై వచ్చే వడ్డీపైనే. అయితే స్వల్పకాలిక సేవింగ్స్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్‌కు ప్రస్తుతం 5 శాతమే వడ్డీ ఇస్తున్నారు. కనీసం 8 శాతం ఇవ్వాలి. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య ప్రయోజనాలు కల్పించాలి. వారి జీవితాంతం ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక పథకం ప్రకటించాలి. ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి, వాటిలో చేరే సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. తక్కువ వడ్డీకే హౌసింగ్ రుణాలు ఇవ్వాలి. వృద్ధుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి. – కె.ఎం. లక్ష్మణరావు, రిటైర్డు జనరల్ మేనేజర్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, విశాఖపట్నం వంటింటి బడ్జెట్ సరిపోవడం లేదు రెండున్నరేళ్లుగా నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. దీంతో వంటింటి ఖర్చులు పెరిగాయి. మునుపటిలా బడ్జెట్ కేటాయిస్తే ఇంటికి సరిపోవటం లేదు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో రెండు పూటలా టిఫిన్లు చేసుకుని ఒక్కపూట మాత్రమే భోజనం చేయాల్సి వస్తోంది. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల ధరలు కొనడానికి దగ్గరగా లేవు. రెండేళ్ల క్రితం పప్పుల ధరలు కిలో రూ.60 ఉన్నపుడు నెలకు కిలో చొప్పున మూడు రకాల పప్పులు కొనేవాళ్లం. ధరలు పెరగడంతో రెండు రకాల పప్పులు మాత్రమే అరకిలో చొప్పున కొని సర్దుకోవాల్సి వస్తోంది. చింతపండు ధరలు పెరగడంతో పప్పుచారు రుచి మరచిపోయాం. పాల ధరలు బాగా పెరిగాయి. టీ, కాఫీ పొడుల ధరలూ అంతే. నూనెల ధరల కారణంగా పిండి వంటలు తగ్గించాల్సి వస్తోంది. నిత్యం కూరలు తగ్గించి పచ్చళ్లే చేసుకోవాల్సి వస్తోంది. దిగువ మధ్య తరగతి వాసుల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇక స్కూలు ఫీజుల వంటి మోతలు షరా మామూలే. నోట్ల రద్దుతో కుటంబ ఖర్చులను తగ్గించాం. వచ్చే బడ్జెట్లోనైనా నిత్యావసరాలపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉంది. – ఎస్.రమాదేవి,హాలియా, నల్లగొండ జిల్లా యువతలో స్కిల్స్‌ను పెంచాలి.. దేశంలో ఎక్కువ శాతం ఉన్నది యువతే.. నిరుద్యోగులూ వీరే.. చదువుకున్న వారిలో 10 శాతం మందికే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగిలిన వారు నెలకు రూ.7 వేల వేతనం ఇచ్చే ఉద్యోగాలు చేయాల్సి వస్తోందంటేనే పరిస్థితి అర్థమవుతుంది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసినా ఉద్యోగాలు సాధించే నైపుణ్యలు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకటం లేదు. అలాంటి వారిలో నైపుణ్యాల్ని పెంచేందుకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాజెక్ట్ తేవాలి. ఉద్యోగాలే కాకుండా స్వయం ఉపాధి పైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం కొన్ని అంశాల్లో మాత్రమే ఉపాధి శిక్షణ ఇస్తున్నారు. దీన్ని అన్ని రంగాలకు విస్తరించటమే కాక బ్యాంకు రుణాలు వచ్చేలా చూడాలి. ప్రస్తుతం బ్యాంకులు అర కొర రుణాలిస్తూ... వాటికీ లక్ష కొర్రీలు వేస్తున్నాయి. యువత అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ప్రతి పైసానీ ప్రభుత్వాలు పెట్టుబడిగానే భావించాలి. కొన్ని వర్గాలకు చెందిన ఔత్సాహిక ప్రారిశ్రామిక వేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. అన్ని వర్గాలలో నిరుపేదలున్నారు. వారికీ ఫలాలు అందాలి. పెద్ద నోట్లు రద్దు తరువాత డిజిటల్ చెల్లింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ చెల్లింపుల్లోనూ యువతదే పైచేయి. వారిని మరింత ప్రోత్సహించేలా రాయితీలివ్వాలి. చాలా చోట్ల ఈ – పేమెంట్లపై పన్నులు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎత్తేయాలి. క్రీడల్లోను యువతకు ప్రాధాన్యమిస్తూ ఆ మేరకు కేటాయిపులు జరపాలి. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించాలి. అన్ని క్రీడల్నీ సమానంగా భావించి కేటాయింపులు జరిపితే మెరికల్లాంటి క్రీడాకారులు తయారవుతారు. – ఆర్.వినయ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా సాగుభద్రతకు ప్రత్యేక నిధి ఇవ్వాలి దేశంలో రైతులకిపుడు చాలా సమస్యలున్నాయి. మద్దతు ధర అనేది ఎప్పటికీ అందని ద్రాక్షే. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోతే ఏడాది దాటినా పరిహారం రావడం లేదు. బీమా కంపెనీలపై నమ్మకం పోతోంది. పంట చేతికి వచ్చే సమయానికి ధర ఉండడం లేదు. మార్కెట్లోకి వెళ్లిపోయిన తరువాత మాత్రం రేటు పెరుగుతోంది. అటువంటప్పుడు కేంద్రం రైతుకు ప్రత్యేక నిధి ఇచ్చి ఆదుకోవాలి కదా? ఇందుకోసం బడ్జెట్లో కనీసం రూ.50 వేల కోట్లయినా కేటాయిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది. సాగు భద్రత మాత్రం లేదు. పంట పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలి. ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర తగ్గినట్టయితే కేంద్రమే నేరుగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులనూ కొనుగోలు చేయాలి. రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సామూహికంగా కోల్డ్‌స్టోరేజ్‌లు, గోడౌన్లు నిర్మించాలి. రైతులు సొంతంగా నిర్మించుకుంటే 90 శాతం రాయితీ ఇచ్చేందుకు సైతం నిధులు కేటాయించాలి. కొబ్బరి వంటి వాణిజ్య పంటలను దేశంలో అమ్ముకునేందుకు వీలు కల్పిస్తామన్న కేంద్రం ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ విస్తరించేందుకు, రైతులకు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు కేటాయించాలి. పంట పెట్టుబడికి తగినవిధంగా రుణాలు మంజూరు చేసి, జీరో పర్సంట్ వడ్డీకి అందించాలి. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం కాకుండా బడ్జెట్లో కనీసం రూ.10 వేల కోట్లు కేటాయించాలి. – యాళ్ల వెంకటానందం, భారతీయ కిసాన్ సంఘ్, తూర్పు గోదావరి మొబైల్స్ జోలికెళ్లకుండా ఉంటే బెటర్ బడ్జెట్లో గనక మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించినా, పెంచినా ఇబ్బందులే ఉంటాయి. గత ఏడాది స్మార్ట్‌ఫోన్ ధరలు ఒకేసారి తగ్గాయి. దీంతో షాపులో ఉన్న మొబైళ్లను తగ్గించిన ధరలకే విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల నష్టం వచ్చింది. ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మొబైల్స్ ధరల జోలికి వెళ్లకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. నిరుద్యోగిగా నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఎనిమిదేళ్లుగా సెల్ఫోన్ల విక్రయ దుకాణాన్ని నడుపుతున్నా. మా మెదక్ జిల్లాలో మొబైల్స్ విక్రయాలు భారీగా ఉంటాయి. నెల వారీగా చూస్తే.. శామ్సంగ్ రూ.1.20 కోట్లు, వీవో మొబైల్స్ రూ.50 లక్షలు, ఒప్పో రూ.50 లక్షలు, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, కార్బన్ మొబైల్స్ కలిపి నెలకు రూ.3 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం మొబైల్ వినియోగంపై క్రేజ్ పెరిగింది. సామాన్యుడికి సైతం అందుబాటులోకి ఫోన్లు రావాలంటే ధరల నియంత్రణ అవసరం. – జి.రాజేశ్, మొబైల్ షాపు యజమాని, జోగిపేట ఎగుమతి రాయితీలివ్వాలి మేక్ ఇన్ ఇండియా నినాదంతో మొబైల్ ఫోన్ల కంపెనీలు భారత్‌లో తయారీని ప్రారంభించాయి. చాలా కంపెనీలు సొంత ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఎగుమతులను ప్రోత్సహిస్తేనే ఈ సంస్థలకు ప్రయోజనం. ఇందుకోసం ఎగుమతి రాయితీలు కనీసం 7 శాతమైనా ఇవ్వాలి. చైనా 17 శాతం ఇస్తోంది కాబట్టే అక్కడ తయారీ మంచి ఊపుమీద ఉంది. ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ కోరినట్టు ప్రభుత్వం గనక రాయితీలు ప్రకటిస్తే ఆఫ్రికాతో పాటు ఎన్నో దేశాలకు మొబైల్ ఫోన్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. విడిభాగాల తయారీ కంపెనీలనూ పన్ను మినహాయింపులతో ప్రోత్సహించాలి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు దేశంలో అధికమయ్యాయి. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మొబైళ్లపై వ్యాట్ 5 శాతం, ఎక్సైజ్ సుంకం 2 శాతముంది. జీఎస్టీ అమలైతే పన్ను 12 శాతానికి మించకూడదు. పన్ను పెరిగితే ఆ భారం తిరిగి సామాన్య ప్రజానీకంపైనే పడుతుంది. – వై.గురు, సీఎండీ,సెల్కాన్ మొబైల్స్ స్టార్టప్ ట్యాక్స్ హాలిడే పొడిగించాలి దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు స్టార్టప్‌లు టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపిస్తున్నాయి. కాబట్టి అలాంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం స్టార్టప్స్కున్న మూడేళ్ల ట్యాక్స్ హాలిడేను 5–7 ఏళ్లకు పొడిగించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో స్టార్టప్స్, ఉద్యోగులకు ప్రత్యేకమైన ఆదాయ పన్ను శ్లాబ్‌లను ప్రకటించాలి. లేదా పూర్తిగా మినహాయించాలి. అప్పుడే ప్రతిభావంతమైన యువత స్టార్టప్‌లలోకి వస్తారు. స్టా్టర్టప్ కంపెనీలు పెట్టడమే కాదు. దాన్లోకి ఉద్యోగుల్ని తీసుకోవటానికి కూడా ఈ ప్రోత్సాహకాలు పనికొస్తాయి. స్టార్టప్ కంపెనీలకు ఏంజిల్ ఫండింగ్ అనేది తొలి ఆర్ధిక వనరు. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం పన్నులు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి. దీంతో కొత్త కొత్త ఆలోచనలు ఆదిలోనే ఆగిపోతున్నాయి. ఏంజిల్ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. గతంలో ప్రకటించిన స్టార్టప్ ఇండియా పాలసీ, క్రెడిట్ గ్యారంటీ స్కీంను పూర్తిగా అమలులోకి తీసుకురావాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా వరకు లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. కానీ, ఈ–లావాదేవీలతో కస్టమర్లకు, కంపెనీలకు ఇద్దరికీ పన్నులు పడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విజయవంతం కావాలంటే ఈపేమెంట్స్ పన్నులను మినహాయించాల్సిందే. అలాగే డిజిటల్ లావాదేవీలను వినియోగించుకునేందుకు వీలుగా వేగవంతమైన ఇంటర్నెట్, సబ్సిడీ డేటాను అందిచాల్సిన అవసరం కూడా ఉంది. – శ్రీనివాస్ కొల్లిపర, టీ–హబ్ ఫౌండర్ అండ్ సీఓఓ -
బడ్జెట్ భారతం
-
నేడే కేంద్ర బడ్జెట్
-
ఎదురు దెబ్బలు తగిలినా భవిష్యత్తు ఆశాజనకమే !
-
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడ్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించనున్నారని, పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో..ఆయా ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో పలు ప్రతిపాదనలుండొచ్చు. అయితే, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. జైట్లీ తాజా పద్దు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. -
భద్రత, వేగానికి పెద్దపీట!
రైల్వే బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు! న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్‌ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు. రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది. -
ముందస్తు బడ్జెట్‌తో అభివృద్ధి: మోదీ
న్యూఢిల్లీ: తన ప్రభుత్వాన్ని విమర్శించేందుకు విపక్షానికి ఏ అంశమూ కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ముందుకు జరపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. దీని ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చని మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. ‘ముందస్తు బడ్జెట్‌తో అభివృద్ధి కార్యక్రమాలను ముందే చేపట్టొచ్చు. గతంతో ఇవి రుతుపవనాలు ముగి శాక మొదలయ్యేవి’ అని అన్నారు. గతంలో పద్మ అవార్డులు అధికార ప్రాపకం ఉన్నవారికే దక్కేవని, ఈ ఏడాది తొలిసారి సామాన్యులకు కూడా దక్కాయని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం తాజా బడ్జెట్ సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని, దీని కోసం అందరూ కలసి రావాలని కాంక్షిం చారు. సభాకార్యక్రమాలు నిరాటంకంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించిందని పార్లమెంటు వద్ద విలేకర్లతో అన్నారు. పార్లమెంటులో నోట్లరద్దుపై ఆర్డినెన్సు పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టారు. గతేడాది, నవంబర్ 9న కేంద్ర కేబినెట్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై డిసెంబర్ 30న కేంద్రం ‘నిర్దిష్ట బ్యాంకు నోట్ల (ఆస్తుల నిలుపుదల) ఆర్డినెన్సు, 2016ను తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శత్రువుల ఆస్తుల (సవరణ, క్రమబద్ధీకరణ) ఆర్డినెన్సు, వేతన చెల్లింపుల (సవరణ) ఆర్డినెన్సులను కూడా పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. డిజిటల్ రేడియోతో విప్లవం: వెంకయ్య డిజిటల్ రేడియోతో శ్రోతలకు నాణ్యమైన ఆడియో సేవలు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రధాని కోరుకుంటున్న డిజిటల్, అనుసంధాన విప్లవాన్ని సాధించడానికి ప్రజలకు, ప్రైవే టు రంగానికి ఇదొక విశిష్ట అవకాశమన్నారు. -
రైల్వే ప్రాజెక్టుల్లో ఇక రాష్ట్రాలే సుప్రీం!
కొత్త పనుల ఖర్చు సగం భరించాల్సి రావడమే కారణం రాష్ట్రం ముందుకొచ్చే ప్రాజెక్టులకే కేంద్రం పచ్చజెండా బడ్జెట్ ముందు ప్రతిపాదనలిచ్చే విధానానికి స్వస్తి సాక్షి, హైదరాబాద్: ‘‘ఫలానా రైల్వే లైన్ మాకు చాలా అవసరం. దయచేసి ఈ బడ్జెట్లో దాన్ని పొందుపరచండి. ఈ ఏడాదే పనులు మొదలయ్యేలా నిధులివ్వండి..’’ అంటూ ఏటా రైల్వే శాఖను రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ వచ్చేది. ఇకపై ఈ తీరు మారనుంది. ఏ ప్రాజెక్టు చేపట్టాలి, దేన్ని వదిలేయా లన్నది ఇక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే. ఏ రైల్వే ప్రాజెక్టు చేపట్టినా అందులో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉండటమే ఇందుకు కారణం. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే.. మిగతా మొత్తాన్ని ప్రకటించేందుకు రైల్వే కూడా సిద్ధపడనుంది. అంటే... ప్రాజెక్టుల ఎంపిక ఇక దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారమే జరగ నుంది. రైల్వే ప్రాజెక్టుల భారాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే మోయటం సాధ్యం కాదని గతంలోనే ప్రధాని మోదీ తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రైల్వేతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇక రైల్వే ప్రాజెక్టుల వ్యయంలో 50 శాతం రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంటుంది. సగానికి సగం భారం తగ్గటంతో ఇక పనుల్లో కూడా రైల్వే వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్క తెలంగాణకు సంబంధించే దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన పెండింగు ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులు గతంలో కేవలం బడ్జెట్లో ప్రకటించిన పనులనే నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని సమూలంగా మార్చేశారు. బడ్జెట్లో నామమాత్రంగానే రైల్వే ప్రాజెక్టులను ప్రకటించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపుల ఆధారంగా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా బడ్జెట్ ముందు ప్రతిపాదనలను రైల్వేకు సమర్పించే విధానం కూడా లేకుండా పోయింది. ఇక నుంచి ఏ ప్రతిపాదన ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే ఆచితూచి వ్యవరించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాల్సి ఉన్నందున తోచినన్ని ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉండదు. ఖర్చుకు సిద్ధమయ్యే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డబ్లింగ్ పనులకు ప్రాధాన్యం.. ప్రస్తుతం సరుకు రవాణాను పెంచేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ డబ్లింగ్ పనులపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తూనే సాధారణ మార్గాల్లో రెండు, మూడో లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనే ప్రారంభమై ముందుకు సాగని పనులను పరుగుపెట్టించేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్–విజయవాడ–బల్లార్షాకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్–నాగ్‌పూర్ ప్రత్యేక కారిడార్‌పై దష్టి సారించే అవకాశం ఉంది. -
అసంపూర్ణ ‘సర్వే’క్షణం!
బడ్జెట్‌కు ఒకటి రెండు రోజుల ముందు రివాజుగా పార్లమెంటు ముందుంచే ఆర్ధిక సర్వే ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో వివిధ రంగాల పనితీరును సవివరంగా సమీక్షించడంతోపాటు రాబోయే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమ్యాలను కూడా రేఖామాత్రంగా స్పృశిస్తుంది. సర్వే ఏకరువు పెట్టే అంశాలను ఆధారం చేసు కుని కొత్త బడ్జెట్లో ఏ బండలు పడబోతున్నాయో, ఎలాంటి వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉందో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తారు. నవంబర్ 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం సామాన్య పౌరులు నిన్న మొన్నటి వరకూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. నోట్ల అలభ్యత వల్ల అనేకానేక రంగాలు కుంటుబడ్డాయి. సంఘటిత రంగం మాటెలా ఉన్నా 94 శాతంమందికి ఉపాధి కల్పించే అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ అనిశ్చిత వాతావరణం దేశ ఆర్ధిక వ్యవస్థపై చూపిన ప్రభావమేమిటో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే వెల్లడిస్తుందని అందరూ ఆశించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ముగుస్తున్న ఆర్ధిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 0.5 శాతం కోత పడిందని, మొత్తంగా వృద్ధిరేటు 6.5 శాతం ఉన్నదని సర్వే అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో అది తిరిగి సాధారణ స్థితికి చేరుకుని దాదాపు 7.5 శాతానికి చేరుతుందని భావించింది. నిరుడు సమర్పించిన ఆర్ధిక సర్వేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 2016–17లో దాదాపు 7.5 శాతం జీడీపీని సాధిస్తామని, ఆ తదుపరి రెండేళ్లలో దీన్ని 8 నుంచి 10 శాతం వరకూ తీసుకెళ్తామని భరోసా ప్రకటించింది. సంక్షోభం వైపుగా పయనిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని రూపొందించారని అప్పట్లోనే విమర్శలొచ్చాయి. ప్రధాన దేశాలు వృద్ధిలో క్షీణతను నమోదు చేస్తున్న తరుణంలో రాబోయే కాలం బ్రహ్మాం డంగా ఉంటుందని అంచనాకు రావడంలో అర్ధం లేదు. తాజా ఆర్ధిక సర్వే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పైపైకి ఎగబాకటం, ప్రధాన దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు తలెత్తడం వగైరాలను దృష్టిలో పెట్టుకుంది. కానీ పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని సరిగా మదింపు వేసినట్టు కనబడదు. ఆ చర్య అనంతరం టోకు వర్తకం దాదాపు 80 శాతం పడిపోయిందని, ఉత్పాదకతలో దాదాపు 45 శాతాన్ని ఆక్ర మించే అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో జీడీపీకి కేవలం 0.5 శాతం మాత్రమే కోత పడిందని చెప్పడం సరైందేనా? అది కనీసం 2 శాతం వరకూ ఉండొచ్చునని ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట. దానికి తోడు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసు కుంటున్న నిర్ణయాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. వెనువెంటనే సాఫ్ట్వేర్ రంగంపైనా, తదు పరి ఇతర రంగాలపైనా ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరంనుంచి జీఎస్టీ అమలు, దాని పర్య వసానంగా పన్ను వసూళ్లలో కనబడే పెరుగుదల వంటివాటిపై సర్వే ఆశలు పెట్టుకున్నట్టు కనబడుతోంది. నల్లడబ్బును అరికట్టాలంటే కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు చెల్లించే ప్రత్యక్ష పన్ను లను తగ్గించడం తప్పనిసరవువుతుంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆగ్రహించిన మధ్యతరగతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆదాయ పన్ను పరిమితిని గణనీయంగా పెంచే అవకాశం లేకపోలేదు. సర్వే ప్రస్తావించిన అంశాలను గమనిస్తే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయ బోతున్నదన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. అలాంటపుడు జీఎస్టీపై అతిగా ఆశలు పెట్టుకోవడమే అవుతుంది. పెద్ద నోట్ల రద్దు కలిగించిన ఇబ్బంది స్వల్పకాలమైనదేనని, దీర్ఘకాలంలో నల్ల డబ్బును అది గణనీయంగా తగ్గించ డంతోపాటు పన్ను వసూళ్లను మెరుగు పరు స్తుందని సర్వే భావిస్తోంది. పెద్ద నోట్ల చలామణి యథాతథమయ్యాక మళ్లీ పూర్వ స్థితి ఏర్పడుతుందని కూడా అంచనా వేస్తోంది. కానీ ఒకసారి ఉపాధి అవకాశాలు తగ్గి, లాభాలు పడిపోయి, ఉత్పాదకత మందగించినప్పుడు నోట్ల చలామణి దానంతటదే సాధారణ పరిస్థితిని తీసుకు రాలేదు. వస్తువులు, సేవల వినిమయంలోనైతేనేమి, పెట్టుబడుల విషయంలో అయితేనేమి గతంలో ఉన్న చొరవ, ధైర్యం ఉండవు. కనుక డిమాండ్ సాధారణ స్థితికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ఈ ఆర్ధిక సర్వే కన్నా ఒక రోజు ముందు సోమవారం కాంగ్రెస్ ఆర్ధిక నివేదికను విడుదల చేసింది. అది కూడా వృద్ధి రేటు 6.6 శాతం కంటే తక్కువుంటుందని అంచనా వేసినా వెనువెంటనే ఆర్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం లేదని తెలిపింది. నిరుపేదలకు నెలవారీగా నిర్దిష్ట నగదు మొత్తాన్ని చెల్లించడానికి ఉద్దేశించిన సార్వజనీన కనీస ఆదాయ పథకం(యూబీఐ) గురించి కూడా సర్వే మాట్లాడింది. అయితే అందుకింకా సమయం ఆసన్నం కాలేదని చెప్పడం ద్వారా ప్రస్తుత బడ్జెట్లో అది ఉండకపోవచ్చునన్న సంకేతాన్నిచ్చింది. అసలు ఇలాంటి పథకాలు మన దేశంలో ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఒకవేళ అమలు చేసినా పేరుకు సార్వజనీన పథకమన్న పేరు పెట్టినా పరిమిత వర్గాలకు, అది కూడా రకరకాల ఆంక్షలతో మాత్రమే అమలు చేయక తప్పదు. లేనట్టయితే ఈ పథకానికయ్యే వ్యయం అపరిమితంగా ఉంటుంది. లక్షిత వర్గాలకు నేరుగా నగదును అందజేసే ఇలాంటి పథకాలు సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్లలోనే ఉంటాయి. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ దాన్ని ఆపి ఉంచే అవకాశం ఉంది. ఇక ప్రజారోగ్యంపై మన దేశం చేసే వ్యయం ప్రపంచ దేశాలన్నిటి ముందూ తీసికట్టుగా ఉన్నదని సర్వే అంటున్నది. అది జీడీపీలో ఒక శాతం కన్నా కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్నదని చెబుతోంది. మొత్తానికి సర్వేలో ప్రస్తావించిన అనేక అంశాల విషయంలో బడ్జెట్ ఎలాంటి కార్యాచరణను ప్రతిపాదించబోతున్నదో, ఏఏ రంగాల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నదో మరికొన్ని గంటల్లో వెల్లడవుతుంది. -
పేదరిక నిర్మూలనకు కొత్త రూటు
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తాజా ఎకనమిక్ సర్వేలో ‘సార్వత్రిక కనీస ఆదాయం’ (యూబీఐ) అనే ఒక కొత్త ఆలోచనకు తెరతీశారు. ‘‘ప్రతి కంటి నుంచీ ప్రతి కన్నీటి చుక్కనూ తుడవాలి’’ అన్న మహాత్ము ని ఆశయ సాధనను ఎకనమిక్ సర్వే ప్రస్తావించింది. పేదలకు కొంత కనీస ఆదాయం తప్పనిసరిగా లభించేలా(నగదు బదిలీ) చర్యలు తీసుకోవడమే క్లుప్తంగా ఈ యూబీఐ లక్ష్యం. సబ్సిడీలను తొలగించడం.. ప్రస్తుత పథకాలకు ప్రత్యామ్నాయంగా యూబీఐ ఆలోచనకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విజయవంతం కావాలంటే..? ఈ పథకం విజయవంతానికి రెండు అంశాలు కీలకమని పేర్కొన్న సర్వే... ఇందులో ఒకటి జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎం)అని పేర్కొంది. మరొకటి దీనికి అయ్యే వ్యయంపై కేంద్ర–రాష్ట్రాల మధ్య చర్చలని వివరించింది. ఎంత ఖర్చవుతుంది? సర్వే అంచనాల ప్రకారం తాజా పథకం పేదరికాన్ని 0.5 శాతానికి తగ్గిస్తుంది. అయితే స్థూల దేశీయోత్పత్తిలో ఇందుకోసం అయ్యే వ్యయం 4 శాతం నుంచి 5 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం మధ్య తరగతికి ఇస్తున్న సబ్సిడీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల సబ్సిడీల విలువ జీడీపీలో దాదాపు 3 శాతంగా ఉంది. టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం– స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ జనాభాలో 70 శాతం పేదరికం ఉంటే, 2011–12 నాటికి 22 శాతానికి తగ్గింది. అయితే ప్రతి ఒక్కరి కన్నీరూ తుడవాలన్న లక్ష్యంగా తాజా పథకాన్ని ప్రవేశపెట్టాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇప్పుడు ఎన్నో లొసుగులు..: ప్రస్తుత పేదరిక నిర్మూలనా, పేదల సంక్షేమ పథకాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు సర్వే వివరించింది. తాజా యూబీఐ ద్వారా పేదలకు భౌతికంగా, మానసికంగా అపార ప్రయోజనాలు, భరోసా కల్పించాలన్నది లక్ష్యమని సర్వే పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేషన్ ఉద్యోగాల కల్పనకు విఘాతమని వస్తున్న ఆందోళనలకు సైతం యూబీఐ పరిష్కారం చూపే విధంగా ఉండాలన్నది సర్వే ఉద్దేశం. ఇప్పటికే ఫిన్లాండ్లో... ఇప్పటికే ఫిన్లాండ్ దేశంలో పైలట్ ప్రాతిపదికన ఈ తరహా పథకం అమలు జరుగుతోంది. మిగిలిన కొన్ని దేశాలూ దీనిని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది స్విట్జర్లాండ్ ఓటర్లు ఈ తరహా పథకాలను తిరస్కరించారు. ఆహారం, సేవలను అందించడం లేదా కూపన్లు ఇవ్వడం లేదా ప్రత్యక్షంగా డబ్బు ఇవ్వడం వంటి అంశాలు తాజా పథకంలో ఇమిడి ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. -
నేడు ట్విటర్లో జైట్లీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో నెటిజన్ల సందేహాలు తీర్చనున్నారు. నెటిజన్లు తమ సందేహాలను నేరుగా తనకే పంపవచ్చని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ట్విటర్లో ‘మైక్వశ్చన్టుఎఫ్ఎం’ హాష్‌ట్యాగ్‌తో సందేహాలు పంపవచ్చు. -
నగదు బదిలీ... పన్నుల కోత!
2016–17 ఆర్థిక సర్వే చెబుతోందిదే... పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ ప్రతిపాదన సబ్సిడీల స్థానంలో అమలు చేయాలని సూచన ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలి... రియల్ ఎస్టేట్‌పై స్టాంప్ డ్యూటీలో కోత విధించాలి... మరింత మంది పన్ను పరిధిలోకి ... ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు షాక్... 6.5 శాతానికి పడిపోవచ్చు వచ్చే ఏడాది 6.75–7.5 శాతంగా అంచనా జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ ఫలాలు, నిర్మాణాత్మక సంస్కరణలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులే జీఎస్టీ పరిధిలోకి భూ, ఇతర స్థిరాస్తి లావాదేవీలు... పన్ను పరిధిలోకి ఇక వ్యవసాయ ఆదాయం! నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించేందుకు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాల మంత్రాన్ని ప్రయోగించనుందా? అరుణ్ జైట్లీ అటు సామాన్యులు, వేతన జీవులకు.. ఇటు కార్పొరేట్ వర్గాలకూ తీపి కబురు అందిస్తారా? సంస్కరణ మోత మోగుతుందా? ఆర్థిక సర్వే నివేదికను చూస్తే నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి పెద్దపీటవేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక పథకాల రూపంలో పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి... దీని స్థానంలో నగదు బదిలీ(సార్వత్రిక కేనీస ఆదాయం–యూబీఐ)ని ప్రవేశపెట్టాలంటూ సర్వే సూచించింది. అంతేకాదు.. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ)తో పాటు కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని పేర్కొంది. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు షాక్ తప్పదని తేల్చిచెప్పింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించినప్పటికీ.. వచ్చే ఏడాది మళ్లీ భారీగా పుంజుకోనుందని అభిప్రాయపడింది. మొత్తంమీద చూస్తే.. జైట్లీ ‘డ్రీమ్ బడ్జెట్’పై నెలకొన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016–17 ఆర్థిక సర్వేలో ప్రధానంగా దీన్ని ప్రస్తావించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నట్లుగా... ప్రజల కడగండ్లను తుడిచిపెట్టాలంటే పేదలందరికీ కనీస ఆదాయాన్ని(యూబీఐ) అందించాలంటూ సర్వేలో సూచించారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీలన్నింటినీ తొలగించి.. యూబీఐని ప్రవేశపెట్టాలని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది(2016–17) వృద్ధి రేటు కనీసం అర శాతం మేర దిగజారి 6.5 శాతానికి మందగించవచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం తిరిగి వృద్ధి 6.75–7.5 శాతం స్థాయికి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం చూసినా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపింది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. వ్యవసాయ ఆదాయంపైనా పన్ను...? ప్రభుత్వం పన్నుల తగ్గింపు విషయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని సర్వే సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్ల తగ్గింపునకే పరిమితం కాకుండా.. కార్పొరేట్ పన్నుల కోతకు సంబంధించిన కార్యాచరణ(టైమ్‌టేబుల్)ను వేగవంతం చేయాలని పేర్కొంది. అంతేకాదు ‘అధిక ఆదాయం కలిగిన వారందరూ’ పన్నులు కట్టేవిధంగా పన్నుల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఈ అధిక ఆదాయం కలిగినవారందరూ అంటే ఎవరనేది మాత్రం నిర్వచించలేదు. ప్రస్తుతం పన్నుల పరిధిలో లేని వ్యవసాయ ఆదాయాన్ని ఈ విధంగా ప్రస్తావించి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణల జోరు పెంచాలి... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు, డీమోనిటైజేషన్ ఫలాలతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలన్నీ అమలు చేయగలిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పరుగులు తీయడం ఖాయమని సర్వే నొక్కిచెప్పింది. మన ఆర్థిక వ్యవస్థకున్న వాస్తవ సామర్థ్యం ప్రకారం మధ్యకాలికంగా 8–10 శాతం వృద్ధిని అందుకోవడం సాధ్యమేనని తెలిపింది. 2015–16లో జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది(తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7.9 శాతం). ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతానికి తగ్గొచ్చనేది ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే, డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని ఈ అంచనాల్లో పూర్తిగా లెక్కలోకి తీసుకోలేదు. సంస్కరణల అమలు, విధానాత్మక చర్యల విషయంలో వెనకడుగు వేస్తే.. మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కూడా డీమోనిటైజేషన్ ప్రతికూలతలను ఆర్థిక వ్యవస్థ చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. రిస్కులపై అప్రమత్తత అవసరం... ‘నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరతతో కొన్ని వ్యవసాయోత్పత్తుల సరఫరాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పాలు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయల ఉత్పాదకత దిగజారింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పప్పుదినుసుల విషయంలో ఎదురైన తీవ్ర పరిస్థితులు(ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్నంటడం) ఇప్పుడు ఇతర వ్యవసాయోత్పత్తులపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సర్వే సూచించింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర ఎగబాకుతుండటం... అగ్ర దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పొంచిఉన్నాయని గుర్తుచేసింది. ‘క్రూడ్ ధర బ్యారెల్‌కు 60–65 డాలర్లకు గనుక ఎగబాకితే.. దేశీయంగా వినియోగం తగ్గేందుకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులకు ఆస్కారం తగ్గుతుంది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో ప్రైవేటు పెట్టుబడులను కూడా దెబ్బతీస్తుంది. అధిక క్రూడ్ ధర కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్క్ అధికమవుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని వివరించింది. సాధారణ స్థాయికి నగదు సరఫరా... నోట్ల రద్దు కారణంగా నెలకొన్న కరెన్సీ కొరత క్రమంగా తగ్గుము ఖం పడుతోందని సర్వే పేర్కొంది. కొత్త కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులోకి వస్తుండటంతో ఆర్థిక వృద్ధి కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘డీమోనిటైజేషన్ అనేది ద్రవ్యపరంగా అత్యంత అసాధారణ పరిణామాలకు కారకమైంది. నగదు సరఫరా, చలామణీని వ్యవస్థ నుంచి భారీగా తగ్గించేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మరోరకంగా కరెన్సీ భారీగా పెరిగింది. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తుందన్న విశ్వాసం పెంచాలంటే.. పన్ను చెల్లింపులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గుముఖం పడతాయి’ అని సర్వేలో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ వల్ల స్వల్పకాలంలో భారం పడినప్పటికీ.. దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చిచెప్పింది. జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టే్టట్... డీమోనిటైజేషన్ చాలా శక్తివంతమైన ప్రక్రియ అని.. దీని ప్రయోజనాలు కనబడాలంటే తగిన చర్యలు అవసరమని సర్వే ఐదంచెల వ్యూహాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జీఎస్టీ పరిధిని మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా నల్లధనం పోగుపడేందుకు మూలకారణంగా నిలుస్తున్న భూ క్రయవిక్రయాలు, ఇతరత్రా స్థిరాస్తి లావాదేవీలు, కార్యకలాపాలను జీఎస్టీ కిందికి తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లతో పాటు రియల్ ఎస్టేట్ స్టాంప్ డ్యూటీలను కూడా తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఐటీ పరిధిని నెమ్మదిగా విస్తరించాలని.. దీనికి రాజ్యాంగపరంగా తగిన విధానాలను పాటించాలని సూచించింది. అసమానతలను తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచాలని పేర్కొంది. ఈ ఏడాది చేపట్టిన అత్యంత కీలకమైన పాలసీ చర్యల్లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం... రూ.1,000; రూ.500 నోట్ల రద్దు నిలుస్తాయని తెలిపింది. జీఎస్టీ వల్ల భారత్‌లో ఏకీకృత మార్కెట్‌ను సృష్టిస్తుంది. పన్ను చెల్లింపులు, పరిపాలన మెరుగుపడటంతో పెట్టుబడులు, వృద్ధికి చేయూత లభిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకారం(కోపరేటివ్ ఫెడరలిజమ్) కొత్త పుంతలు తొక్కుతుంది’ అని పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై– నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాజా స్కీమ్)తో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.1 శాతానికి ఎగబాకనుంది. గతేడాది ఈ వృద్ధి 1.2 శాతమే. పారిశ్రామిక రంగం వృద్ధి మాత్రం 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గొచ్చు. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం. పొదుపులను ప్రోత్సహించాలి. దీనివల్ల విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడకుండా పెట్టుబడి నిధులు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలి. సామాజికపరమైన మార్పులకు దీర్ఘకాలంగా పరిష్కృతం కాకుండా ఉన్న మూడు కీలకమైన సవాళ్లను భవిష్యత్తులో మనం అధిగమించాల్సి ఉంటుంది. సంపద పంపిణీలో అసమర్థతలు, ప్రైవేటు రంగం–ప్రాపర్టీ హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి, సామర్థ్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి పుంజుకోలేకపోతుండటం వీటిలో ఉన్నాయి. ప్రతికూలతలను గుర్తించింది.. పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు .. ఎకానమీ ఎదుర్కొంటున్న ఎదురుగాలులను ఆర్థిక సర్వే స్పష్టంగా గుర్తించిందని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో సాహసోపేతమైన ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు. సంస్కరణలతో బడ్జెట్.. సర్వే బట్టి చూస్తే బడ్జెట్ సాహసోపేతంగా, సంస్కరణలతో కూడుకున్నదిగా ఉండొచ్చని తెలుస్తోంది. మౌలిక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. – రిచర్డ్ రేఖీ, సీఈవో, కేపీఎంజీ ఇండియా సవాళ్లు.. అవకాశాలు.. ఎకానమీ ఎదుర్కొం టున్న సవాళ్లు.. ముందున్న అవకాశాలను సర్వేలో స్పష్టంగా ప్రస్తావించారు. డిమాండ్‌కు ఊతమివ్వడం, పన్ను రేట్లు తగ్గించడం, పన్ను విధానాలను సంస్కరించడం తదితర చర్యలతో పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన మంచిదే. – పంకజ్ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలుండాలి.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, జీఎస్టీ అమలు ద్వారా ఎగుమతులకు మరింత ఊతమివ్వాలి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఎకానమీకి మళ్లీ ఊపిర్లూదేలా.. ఉపాధి కల్పనపై మరింత దృష్టి పెట్టాలి. అపారెల్ తదితర విభాగాల్లాగానే లెదర్, ఫుట్‌వేర్ రంగాలకూ సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వాలి. – ఎస్సీ రాల్హన్, ప్రెసిడెంట్, ఎఫ్ఐఈవో డిమాండ్‌కు తోడ్పాటు ఉండాలి.. డిమాండ్‌కు ఊతమిచ్చే లా బడ్జెట్ ఉండగలదని ఆశిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్సేషన్ వంటి ప్రత్యక్ష పన్నులను కొంత సడలిస్తే ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఆందోళనకరంగా రక్షణాత్మక ధోరణులు.. ప్రపంచ ఎకానమీకి పొంచి ఉన్న రిస్కులు.. వాటి ఫలితంగా చమురు రేట్ల పెరుగుదల, వాణిజ్య సమస్యలS రూపంలో భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాలను సర్వే గుర్తించింది. భారతీయ ఎగుమతులను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. – సునీల్ కనోడియా, ప్రెసిడెంట్, అసోచాం -
ఇవి చరిత్రాత్మక సమావేశాలు
-
రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
ముంబై : బంగారం లేదా వెండి ఆభరణాలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో కొనదలుచుకున్నారా? అయితే తప్పనిసరి చేతిలో పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బులియన్, జువెల్లరీలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేసన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనావేస్తున్నారు. రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ను తీసుకొస్తారని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్‌మనీ హోల్డర్స్పై ఎక్కువగా దృష్టిసారించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేశాక, చాలామంది బ్లాక్‌మనీ హోల్డర్స్ తమ దగ్గరున్న నగదును జువెల్లరీ, బులియన్, రియల్ ఎస్టేట్‌లోకి మరలించినట్టు తెలిసింది. దీంతో డీమానిటైజేషన్ అనంతరం ఎవరు ఎంతమొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి. కేవైసీ అవసరాన్ని సమీక్షించి, వచ్చే బడ్జెట్లో రూ.లక్ష దాటిని కొనుగోళ్లకు ఈ నిబంధనలు తీసుకొస్తారని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ సురేంద్ర మెహతా సైతం చెబుతున్నారు. -
ఇవి చరిత్రాత్మక సమావేశాలు
- తొలిసారి సాధారణ బడ్జెట్లో ‘రైల్వే’ విలీనం - ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ నినాదంతో ప్రభుత్వం ముందడుగు - పీడిత వర్గాల అభ్యున్నతికి విశేషకృషి - బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి - ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ ముఖర్జీ - రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి న్యూఢిల్లీ: అనేక కారణాల రీత్యా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకవైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ మావేశాలను ప్రారంభించిన ఆయన.. దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సబ్కా సాత్ - సబ్కా వికాస్(సమిష్టిగా సర్వతోముఖాభివృద్ధి) నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. పీడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అంతకుముందు, బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు పార్లమెంట్ భవనానికి చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్(ఉపరాష్ట్రపతి) హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితరులు ప్రణబ్‌కు వందనం చేసి సభలోపలికి తీసుకెళ్లారు. జాతీయగీతాలాపన తర్వాత రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(బుధవారం ) ఉదయం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. -
బడ్జెట్లో కార్పొరేట్ పన్నుల కోత!
-
బడ్జెట్లో కార్పొరేట్ పన్నుల కోత!
యూకేఐబీసీ న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో కార్పొరేట్ పన్ను కోతలు ఉండే అవకాశం ఉందని బ్రిటన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), బ్రిటన్ పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ)లు అంచనా వేస్తున్నాయి. దీనితోపాటు సరళతర, సంక్లిష్టతలకు తావులేని పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టాలని తద్వారా భారత్‌లో బ్రిటన్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశాయి. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని పటిష్టంగా, ఎటువంటి అవాంతరాలూ లేకుండా అమలు చేయాలని కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. దీనివల్ల దేశంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దేశీయ పెట్టుబడులు మెరుగుపడతాయని వివరించింది. ఇబ్బందులూ ఉన్నాయ్... భారత్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, న్యాయ, నియంత్రణ, పన్ను అంశాలో ఇంకా పలు అస్పష్టతలు, సంక్లిష్టతలు ఉన్నాయని యుకేఐబీసీ చీఫ్ పాట్రిసియా హీవిట్ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో పోటీ పూర్వక వ్యాపార వాతావరణాన్ని బడ్జెట్ తీసుకువస్తుందని, విదేశీ ఇన్వెస్టర్ల హక్కుల రక్షణకు చర్యలు ఉంటాయని బ్రిటన్ సంస్థలు భావిస్తున్నట్లు సీబీఐ డైరెక్టర్ జనరల్ ఫైర్బ్రెన్ అన్నారు. బడ్జెట్లో బ్రిటన్ సంస్థలు ఏమి కోరుకుంటున్నాయన్న అంశాలను ఇప్పటికే రెండు వాణిజ్య ప్రాతినిధ్య సంస్థలు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సమర్పించాయి. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును ఆర్థికమంత్రి తన వచ్చే బడ్జెట్ నుంచీ దశలవారీగా 25 శాతానికి తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. -
మోదీ బడ్జెట్లో కొత్త ‘ప్రణాళిక’?
ప్రణాళిక– ప్రణాళికేతర వ్యయాలుండవు ఉమ్మడి పద్దు కిందే పథకాలపై కేంద్రం వ్యయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వం బడ్జెట్ తేదీనే కాకుండా... బడ్జెట్ స్వరూప స్వభావాలను కూడా మార్చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఫిబ్రవరి నెలలో చివరి రోజున బడ్జెట్ పెట్టడమనేది సంప్రదాయం. కానీ ఈ సారి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. ఇప్పటి వరకూ బడ్జెట్ వ్యయాలను ప్రణాళిక, ప్రణాళికేతర అంశాలుగా విభజించి నిధుల కేటాయింపులు జరిపేవారు. ప్రణాళిక అంటే మౌలిక సదుపాయాల వంటి ఆస్తుల కల్పనపై పెట్టే ఖర్చన్న మాట. ప్రణాళికేతరమంటే జీతాల వంటి నిర్వహణ ఖర్చు. అయితే వచ్చే బడ్జెట్లో ఇలా కాకుండా, ప్రణాళిక– ప్రణాళికేతర వ్యయాలను ఉమ్మడి పద్దు కిందే చూపించి వివిధ రంగాలకు నిధుల కేటాయింపు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆర్థికాభివృద్ధికి కొత్త రూపును ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. – న్యూఢిల్లీ ఇప్పటి వరకూ ఇలా... తమ శాఖలకు సంబంధించిన ఖర్చుల గురించి మంత్రులంతా నివేదికలు సమర్పించడంతో బడ్జెట్ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయమని రెండు రకాలుగా ఈ నివేదికలు ఉంటాయి. ప్రణాళిక వ్యయం విషయానికి వస్తే... అప్పటికే అమలుచేస్తున్న పథకాలతో పాటు నిధుల లభ్యతను అనుసరించి ఇంకా ఏమైనా కొత్త పథకాలు అమలు చేయొచ్చా అన్న అంశం ప్రాతిపదికన ఈ వ్యయ గణాంకాలు రూపొందుతాయి. ప్రణాళికేతర వ్యయం విషయానికి వస్తే, ఇందులో మెజారిటీ శాతం వడ్డీలు, సబ్సిడీలు, ఉద్యోగుల జీతాలు చెల్లింపులుంటాయి. సోదాహరణంగా చెప్పాలంటే, పాఠశాల నిర్మాణం ప్రణాళికా వ్యయం కిందకు వస్తే, ప్రణాళికేతర వ్యయం పరిధిలోకి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల వేతనాలు వస్తాయి. కొత్త విధానం ఇలా ఉండొచ్చు! అత్యున్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం– ఈ సారి బడ్జెట్ పత్రాలు కొత్త రూపంలో దర్శనమివ్వబోతున్నాయి. ప్రణాళిక–ప్రణాళికేతర వ్యయ విభాగాలు ఒకటిగా కలిసిపోతాయి. ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి తాజా విధానం ఎలా ఉండబోతుందన్న అంశంపై ‘ఒక మార్గదర్శక పత్రం’ ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు అందింది. దీని ప్రకారం నాలుగు రూపాల్లో ప్రభుత్వ వ్యయాలు జరుగుతాయి. సాధారణ, సామాజిక, ఆర్థిక విభాగాలతో పాటు ఇతరాలు కింద నిధుల కేటాయింపులు జరుగుతాయి. ఈ మార్పు ఎందుకంటే..? ► దీనివల్ల నిధుల కేటాయింపు, వినియోగం సహా పలు అంశాల్లో సంక్లిష్టత తొలగిపోతుందని, ఆయా రంగాలకు తగిన రీతిలో డబ్బు అందడం సాధ్యమవుతుందని కేంద్రం విశ్వసిసోంది. ► ప్రస్తుతం పలు సందర్భాల్లో ప్రణాళిక వ్యయాలపైనే దృష్టి అధికంగా ఉంటోంది. నిర్వహణకు సంబంధించిన వ్యయాలపై కొంత దృష్టి తగ్గుతోందన్న వాదనకు తాజా నిర్ణయం తెరదింపుతుందని కేంద్రం భావిస్తోంది. ► ప్రణాళిక వ్యయాలకు అనుగుణంగా ఒక ఆస్తిని సృష్టిస్తే– దాని నిర్వహణ సరిగాలేక ఆ అసెట్‌పై చేసిన వ్యయం వృధాగా అభివృద్ధి రహిత వ్యయంగా మారుతోందన్న విమర్శ ఉంది. మరొక మాటలో చెప్పాలంటే... ప్రణాళిక వ్యయం కింద పాఠశాల నిర్మిస్తే... నాన్ ప్రణాళికా వ్యయాలు సరిగా లేకపోయినా, వినియోగం సరిగా జరక్కపోయినా (ఉపాధ్యాయులు లేకపోయినా లేక నిర్వహణ విధిగా జరక్కపోయినా) మొత్తం వ్యయాలు వృధాగా మారిపోతాయి. -
100 సంస్థలను ప్రైవేటు పరం చేయండి
► కేంద్రానికి సీఐఐ విజ్ఞప్తి ► పీపీపీపై 50 రైల్వే స్టేషన్ల నిర్మాణానికి వినతి న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ సమర్పిస్తున్న నేపథ్యంలో– పారిశ్రామిక సంస్థ సీఐఐ తన కోర్కెల చిట్టాను ఆయన ముందు ఉంచింది. ఎయిర్ ఇండియా, అశోకా హోటెల్స్ సహా 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, 2017 ముగిసే నాటికి ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) 50 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించటం ఇందులో కొన్ని. సీసీఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ తెలిపిన సమాచారాన్ని బట్టి మరిన్ని ఈ పారిశ్రామిక సమాఖ్య కోర్కెలను చూస్తే– ♦ పీపీపీతో ముడివడి ఉన్న అన్ని పెండింగ్ వివాదాల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుంది. దీనితో పెట్టుబడులు పెరిగి, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది. ♦ 2015 డిసెంబర్లో ఫైనాన్షియల్ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసిన విధంగా వివిధ రంగాల్లో పీపీపీ ప్రాజెక్టుల పరిశీలనకు స్వతంత్ర రెగ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. తద్వారా సత్వర నిర్ణయాలకు మార్గం సుగమం చేయాలి. ♦ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నష్టదాయక కంపెనీలనే కాకుండా, లాభదాయక కంపెనీలను సైతం ప్రైవేటు పరం చేయాలి. -
ఆటోమొబైల్‌కు ప్రోత్సాహకాలివ్వాలి
భారత ఆర్థిక రంగం అభివృద్ధికి ఆటోమొబైల్ రంగం ముఖ్య చోదకంగా ఉపయోగపడింది. అనేక మందికి ఉపాధి కల్పించడమే కాకుండా జీడీపీ వృద్ధికి కూడా సాయపడింది. కొన్నేళ్లుగా ఆర్థిక సంబంధ ఇబ్బందులతో ఈ రంగం ఆశించిన లక్ష్యాల్ని అందుకోలేదు. అందువల్ల 2017 కేంద్ర బడ్జెట్లో ఈ రంగానికి ప్రోత్సాహకాల్ని ఆశిస్తున్నాం. ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేలా అనుకూల నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం. మా ఉద్దేశం ప్రకారం... ► వినియోగం, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఆదాయ, కార్పొరేట్ పన్ను తగ్గించాలి. ► ఆర్ అండ్ డి ఖర్చుపై 200 శాతం తగ్గింపును మళ్లీ కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ►మౌలిక వసతుల నాణ్యతను మెరుగుపరచాలి. నాణ్యమైన రోడ్లు, జాతీయ రహదారులతో పాటు సప్లై చైన్ లాజిస్టిక్ సేవల్ని అభివృద్ధి చేయాలి. ► పోర్టుల్లో మౌలికవసతుల కోసం పెట్టుబడులు పెరిగేలా చూడాలి. ► మరిన్ని ఎఫ్డీఐల్ని ఆకర్షించేలా ఆటోమొబైల్ వ్యాపార నిర్వహణ సులభతరం చేయాలి. – సుమిత్ సాహ్ని,సీఈవో అండ్ ఎండీ,రెనాల్డ్ ఇండియా -
ఆదాయపు పన్నుపైనే ఆశలు!
బేసిక్ లిమిట్‌ను పెంచాలంటున్న నిపుణులు 10 శాతం శ్లాబును మరింత విస్తరించాలి కొనుగోళ్లను పెంచటం తక్షణ కర్తవ్యం అలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు దానికి పన్ను మినహాయింపులే శరణ్యం ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు ఈ సారి అరుణ్ జైట్లీ పెట్టబోయే బడ్జెట్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి... ఫిబ్రవరి నెలాఖరుకు బదులు ఈ సారి ఫిబ్రవరి నెల మొదట్లోనే పెడుతున్నారు. రెండోది పెద్ద నోట్లను రద్దు చేసి... డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికంటూ పలు చర్యలు చేపట్టాక ఈ బడ్జెట్‌ను తెస్తున్నారు. మూడోది... పెద్ద నోట్ల రద్దుతో ఇపుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనే విమర్శలొస్తున్న తరుణంలో, ఎకానమీకి ఊతమివ్వటానికి ఈ బడ్జెట్లో పలు చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జైట్లీ ఈ సారి గత రెండు బడ్జెట్లకు భిన్నమైన బడ్జెట్ తెస్తారని ఫిక్కీ, సీఐఐ, డెలాయిట్, కేపీఎంజీ వంటి ఆర్థిక సంస్థలతో సహా వివిధ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మినహాయింపులు తప్పనిసరి అన్నది వారి విశ్లేషణ. వారి ప్రతిపాదనల వివరాలివీ... ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు 1. ఆదాయపు పన్ను ప్రాథమిక మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలి. 2. మినహాయింపులు పోగా ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉండే పన్ను చెల్లించాల్సిన ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీన్ని రూ.10 లక్షల ఆదాయం వరకూ వర్తింపజేయాలి. 3. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉటే దానిపై 20 శాతం పన్ను విధిస్తున్నారు. ఆ పరిమితిని రూ.20 లక్షల వరకూ వర్తింపజేయాలి. 4. ఇక రూ.10 లక్షలు పైబడి పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే... వారు ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. దాన్ని రూ.20 లక్షలు పైబడ్డ వారికి మాత్రమే వర్తింపజేయాలి. డెలాయిట్ సర్వేలో తేలిందిదీ... ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో... రూ.2.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పలువురు సూచించారు. దీనివల్ల ప్రజల వద్ద నగదు మిగులుతుందని, కొనుగోళ్లు పెరుగుతాయని, పొదుపు పెరిగి పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని సంస్థ అంచనా వేస్తోంది. అలాగే ఐటీ చట్టం 80సీ మినహాయింపుల్ని రూ.1,50,000 నుంచి రూ.2,50,000కు పెంచాలన్నది మరో సూచన. అంతేకాక నేషనల్ పింఛన్ పథకం, భవిష్య నిధి(పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణపై పూర్తిగా పన్ను మినహాయించాలి. ముందస్తు పన్ను చెల్లింపునకు మినహాయింపును మరింత పెంచాలి. వైద్య ఖర్చుల మినహాయింపు రూ. 15,000 నుంచి రూ.50,000కు పెంచాలి. ట్రావెలింగ్ అలవెన్స్‌పై రూ. 5,000 వరకు మినహాయింపు ఇవ్వాలి. శ్లాబుల్ని సవరించాలి: సీఐఐ పన్ను శ్లాబుల్ని సవరించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, శ్లాబుల్ని కూడా సవరించాలని సీఐఐ కోరింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ అవసరం వినియోగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం, డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహం, పన్ను పరిధిని విస్తరించడం, అధిక వృద్ధి సాధించేలా మొత్తంగా 2017 కేంద్ర బడ్జెట్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌గా ఆశిస్తున్నాం. గార్, పన్ను మినహాయింపులు, జీఎస్టీలకు సంబంధించి విధానాల్ని స్పష్టంగా నిర్వచించాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం మరో కీలకాంశం. అలాగే వ్యవసాయం, మౌలిక వసతులు, సేవా రంగాలపై మరింత దృష్టిపెడతారని ఆశిస్తున్నాం. – ఎన్.ఎహెచ్.భన్సాలీ, సీఈవో, ఇమామీ లిమిటెడ్(ఫైనాన్స్,స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) జూలై తరవాతే జీఎస్టీ: కేపీఎంజీ ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 750 మంది పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించిన అనంతరం సంస్థ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... ► దాదాపు సగం మంది నిపుణులు ఈ సారి గార్ (జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్)ను వాయిదా వేయాలని కోరారు. గార్ నిబంధనల్ని 2012 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అయితే సరైన రీతిలో నిబంధనలు రూపొందించకపోవడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే గార్‌ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఆదాయం లెక్కింపు, వెల్లడి నిబంధనలను (ఐసీడీఎస్) వాయిదా వేయాలని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► నోట్ల రద్దు సమీప భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం లేదని పలువురు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతాయని దాదాపు 82 శాతం మంది అంచనా వేశారు. ► జీఎస్టీ అమలుకు 1, జులై 2017 అనువైనదని 49 శాతం మంది చెప్పగా... 43 శాతం మంది మాత్రం జులై తర్వాతే జీఎస్టీ అమలు చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ నమూనా చట్టం ఆమోదించాలని 68 శాతం సూచించగా... జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రాయితీ ఇవ్వాలని 82 శాతం మంది కోరారు. జీఎస్టీ ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని 95 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 85 శాతం మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు ఆశిస్తున్నారు. 94 శాతం ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపుల్లో ఉపశమనం దక్కవచ్చని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో సంస్కరణలు ఆశిస్తున్నాం ఈ బడ్జెట్ దేశానికే కాకుండా, బీజేపీ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. జీడీపీ వృద్ధి అంచనాల్ని అందుకోవడం, నల్లధనం వెలికి తీసేందుకే నోట్ల రద్దు నిర్ణయమని నిరూపించుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాలు.. ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు, భూముల రిజిస్ట్రేషన్ సంస్కరణలతో పాటు డిజిటలైజేషన్‌కు మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. ఆర్థిక సమానత్వ సాధనకు, మేకిన్ ఇండియా కోసం కొత్త పథకాలు ప్రవేశపెడతారని ఆశిస్తున్నాం – సంజయ్ సేథీ, సీఈవో, షాప్‌క్లూస్ -
బడ్జెట్‌కు, ఆ బ్రీఫ్‌కేస్‌కు ఉన్న లింకేంటి?
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థికమంత్రి పార్లమెంట్‌లోకి... మనకు కనిపించే ఫస్ట్ సీన్. ఆర్థికమంత్రి ఓ లెదర్ బ్రీఫ్ కేస్‌ను పట్టుకుని ఫోటోలో కనిపించడం. ఈ బ్రీఫ్‌కేస్‌ను అలానే భద్రంగా పార్లమెంట్‌లోకి తీసుకెళ్లి బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికమంత్రి ప్రారంభిస్తారు. కానీ బడ్జెట్ పత్రాలను ఆనవాయితీగా ఆ బ్రీఫ్‌కేస్‌లోనే ఎందుకు తీసుకొస్తారు. ఆ లెదర్ బ్రీఫ్కేస్కున్న ప్రాధాన్యమేమిటి, ఎప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుందో ఓ సారి తెలుసుకుందాం.... ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ అనే పదం బొగెట్టీ అనే ప్రెంచి పదం నుంచి వచ్చింది. బొగెట్టీ అంటే ప్రెంచిలో లెదర్ బ్యాగ్ అని అర్థం. ప్రాచీన కాలంలో సంపదను తీసుకురావడానికి బ్రీఫ్‌కేస్‌ను సరియైనదిగా భావించేవారు. ఆ తర్వాత అదే ప్రపంచ బడ్జెట్‌ను తీసుకురావడానికి ఎంపికచేశారు. 1860 నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేముందు రెడ్ బ్రీఫ్‌కేస్‌ను లేదా బడ్జెట్ బాక్స్‌ను తీసుకొచ్చే సంప్రదాయం బ్రిటీష్ వారి కాలంలోనే ప్రారంభమైంది. ఈ డిజైన్డ్ లెదర్ బాక్స్(బ్రీఫ్‌కేస్)నే తర్వాతి కాలంలో బడ్జెట్ బాక్స్‌గా పిలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆర్థికమంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్‌స్టోన్ మొదట బ్రీఫ్‌కేస్ ద్వారా బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 5, 6 గంటలపాటు జరిగిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో అప్పట్లో అదే అతిపెద్ద బడ్జెట్‌గా పేరుగాంచింది. ఈ లాంగ్ బడ్జెట్‌కు అవసరమయ్యే పేపర్లను పట్టుకెళ్లడానికి కచ్చితంగా బాక్స్ అవసరమవుతుందని ఆయన భావించారు. ఆ తర్వాత నుంచి అందరు మంత్రులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. దీంతో ఆ చిన్న లెదర్ బ్యాగే దేశాలను ముందుకు నడిపించే స్థాయికి వెళ్లింది. బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం స్వాతంత్య్ర భారత్‌లో మొదట 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టి, బడ్జెట్ బ్యాగ్ ట్రేడ్ మార్కును కొట్టేశారు. బడ్జెట్ ఫోటోగ్రాఫ్ కూడా శెట్టినే ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆ సంప్రదాయాన్ని అలానే కొనసాగిస్తూ నవ్వుతూ, ఎంతో నమ్మకంగా బడ్జెట్ ఫోటోగ్రాఫ్‌కు ఫోజులిస్తారు ఆర్థికమంత్రి. ఒకవేళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఫోటోగ్రాఫర్ల ముందుకు రాకపోతే ఆ బడ్జెట్‌ను అసంపూర్తిగా వారు భావిస్తారు. మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఫోటోగ్రాఫర్ల ముందుకు రావడం కొనసాగుతోంది. ఉగండ, జింబాబ్వే, మలేసియాలు వంటి దేశాలు కూడా ఈ ఫోటోగ్రాఫ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. బడ్జెట్ బ్యాగ్ రంగులు: పదేళ్ల తర్వాత టీటీ కృష్ణమాచారి బడ్జెట్ బాక్స్‌కు బదులు స్లెండర్ ఫైల్లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు. అనంతరం 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా బ్లాక్ రంగుల్లో లెదర్ బ్యాగ్ తీసుకొచ్చారు. అదేసంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థికసంస్కరణల సమయం 1991లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు. అయితే యూపీఏ కాలంలో ఆర్థికమంత్రిగా ఉన్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్ వారిలాగా బ్లాక్ రంగు బ్యాగ్‌కు బదులు రెడ్ కలర్ బాక్స్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. అనంతరం కాలంలో ప్రతేడాది ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటిరెండు కాలంలో బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్‌ను వాడారు. అయితే బడ్జెట్ బాక్స్‌ను ఆర్థికమంత్రిత్వ శాఖ సేకరిస్తోంది. అనంతరం మూడు లేదా నాలుగు రంగుల్లో బ్యాగ్‌లను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. అయితే ఈ సారి అరుణ్ జైట్లీ ఏ రంగు బ్యాగును బడ్జెట్ పత్రాలు తీసుకురావడానికి ఎంచుకుంటారో చూడాలి. -
రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్..!
న్యూఢిల్లీ: రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 2016-17 బడ్జెట్లో రైల్వేలకు ప్రత్యేక ప్రతిపాదనలు చేయనున్నారట. ముఖ్యంగా వరుస ప్రమాదాలతో కునారిల్లుతున్నభారతీయ రైల్వే వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందు కు ప్రత్యేక నిధులతో రడీ అవుతోంది. రైలు భద్రత ప్రత్యేక ఫండ్ కోసం రూ .20,000 కోట్ల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్ కోసం రెండు పేజీలను ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. సాధారణ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ప్రాజెక్టులు, వ్యయ మరియు ఆదాయ లక్ష్యాలు సహా రైల్వే 'రాబోయే కార్యకలాపాలు గురించి ప్రస్తావన ఉంటుంది. రాబోయే బడ్జెట్ 2017-18 లో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ట్రాక్‌లు మరియు వంతెనల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రత్యేక భద్రతా నిధి కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నారు. కొత్త రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలపై పెద్దగా ప్రతిపాదనలు ఉండకపోవచ్చు కానీ, ప్రయాణికుల భద్రత ఫండ్ కు సంబంధించిన కీలకమైన ప్రకటన వెలువడే అవకాశంఉందని సీనియర్ రైలు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. రైలు నెట్వర్క్ అభివృద్ధిలో ఇది ఒక నమూనా మార్పుగా ఆయన అభివర్ణించారు. ఫెన్సింగ్ ల వద్ద మనుషులు, పశువుల చొరబాటును నిరోధించడంపై బడ్జెట్ పేపర్లలో ప్రముఖ ప్రస్తావన ఉండనున్నట్టు చెప్పారు. ప్రధాన రహదారు మార్గం వెంట మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపుతో పాటు , ఫెన్సింగ్, ట్రాక్ మరియు సిగ్నలింగ్ అభివృద్ధి , రెండు కారిడార్లు కోసం రూ 21,000 కోట్ల అంచనా వ్యయంతో నిధులను కేటాయించనున్నారు. . రైల్వే ట్రాక్‌లు, వంతెనల బలోపేతం, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. రూ. 34 వేల కోట్ల మూలధనంతో రైల్వే హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేసే ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలిపారు. దీని ప్రకారం ఐఆర్సీటీసీ, ఆర్ఐటీఈఎస్, కొంకర్, రైల్‌టెల్, ఎమ్ఆర్వీసీ సహా మొత్తం 14 ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. రైల్వేల వేగాన్ని నియంత్రించకుండా, ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలనేది ప్లాన్. తొలుత 160 కిలోమీటర్లకు, అనంతరం 200 కిలోమీటర్లకు పెంచే యోచన ఉన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం కిలోమీటర్‌కు రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాగా గత రెండు నెల్లో అయిదు ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా దాదాపు 200 మంది రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్టో విలీనం చేసిన యూనియన్ బడ్జెట్ ను మొదటిసారి ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనున్నసంగతి తెలిసిందే. -
జైట్లీకి విషమ పరీక్షే!
నోట్ల రద్దు నేపథ్యంలో ఈసారి బడ్జెట్ రూపకల్పన క్లిష్టతరం ► జీఎస్టీ అమలు ప్రభావంపై దృష్టిపెట్టాలి ► చిన్న పరిశ్రమలు, గ్రామీణ రంగాలూ కీలకమే... అసోచామ్ ప్రీ–బడ్జెట్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోరెండు రోజుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అటు కార్పొరేట్లు, ఇటు వేతన జీవులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను(ఐటీ), కార్పొరేట్ పన్నుల్లో కోత ఉండొచ్చన్న అంచనాలు చాలానే ఉన్నాయి. అయితే, పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్ ) నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కూర్పు ఆర్థిక మంత్రి జైట్లీకి కత్తిమీద సామేనని పారిశ్రామిక మండలి అసోచామ్ అంటోంది. ప్రధానంగా నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలు, గ్రామీణ రంగాలను గాడినపెట్టడంపై బడ్జెట్లో కచ్చితంగా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా వివిధ వర్గాలపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కూడా చాలా కీలకమని ఆదివారం విడుదల చేసిన ప్రీ–బడ్జెట్ నివేదికలో తెలిపింది. వినియోగ డిమాండ్ పునరుద్ధరణ పెద్ద సవాల్... ‘డీమోనిటైజేషన్ పరిణామం తర్వాత ప్రతిఒక్కరూ తమ సమస్యలను బడ్జెట్లో పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఈ భారీ అంచనాల నేపథ్యంలో ఆర్థిక మంత్రికి బడ్జెట్ రూపకల్పన అనేది సవాలుతో కూడుకున్నదే. ముఖ్యంగా జీఎస్టీ అమలుకు రంగం సిద్ధం అవుతుండటం, నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న తరహా పరిశ్రమలు–వ్యాపారాలపై నెలకొన్న తీవ్ర ఒత్తిడి దీనికి ప్రధాన కారణం’ అని అసోచామ్ పేర్కొంది. పట్టణ వినియోగ డిమాండ్‌ను మళ్లీ పునరుద్ధరించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలని అభిప్రాయపడింది. నోట్ల రద్దు కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థేనని.. దీనికి భారీ ఉద్దీపన చర్యలను ప్రకటించడం కూడా ముఖ్యమేనని వివరించింది. ‘ద్రవ్యోల్బణం తగ్గుదలను వాస్తవికంగా భావించకూడదు. ఎందుకంటే చాలా పంటలకు సంబంధించి ఉత్పత్తుల అధిక సరఫరా.. ముఖ్యంగా కూరగాయల దిగుబడి అధికం కావడం దీనికి ప్రధాన కారణం. నవంబర్‌లో నోట్ల రద్దు అంశం కూడా ద్రవ్యోల్బణం తగ్గుదలకు దారితీసింది’ అని పేర్కొంది. డబ్బులున్నా.. రుణాలివ్వలేని పరిస్థితి! ‘పారిశ్రామిక రంగం కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30 శాతం స్థాయి నుంచి 25 శాతానికి తగ్గించాలని కోరుతోంది. మరోపక్క, వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా మినహాయింపు పరిమితిని రూ.10,000–20,000 మాత్రమే పెంచితే కుదరదని.. నోట్ల రద్దు ప్రభావం కారణంగా భారీగా పెంచాలని కోరుతున్నారు. స్టాక్ మార్కెట్ వర్గాల అంచనాలూ ఇదే స్థాయిలో ఉన్నాయి. వీటిని అందుకోవడం ఆర్థిక మంత్రికి కష్టమే’ అని అసోచామ్ పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ల వెల్లువతో బ్యాంకుల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. రుణాలిచ్చే విషయంలో అచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందని అసోచామ్ వెల్లడించింది. ఒకపక్క, మొండిబకాయిల సమస్య.. మరోపక్క, దర్తాప్తు సంస్థలు బ్యాంకింగ్ కార్యకలాపాలపై మరింతగా దృష్టిపెట్టడమే దీనికి కారణమని పేర్కొంది. పన్నులను తగ్గించాలి: ఫిక్కీ, సీఐఐ బడ్జెట్లో కార్పొరేట్ పన్ను తగ్గింపును వేగవంతం చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం అందించాలని.. లిటిగేషన్ , వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేదిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. ‘వడ్డీరేట్లను మరింత తగ్గించడంతోపాటు హౌసింగ్ వంటి రంగాలకు రుణ లభ్యత పెరిగేలా చేయాలి. ఈ చర్యలతో వ్యాపారవర్గాల్లో విశ్వాసం పెరగడమేకాకుండా పెట్టుబడులకు డిమాండ్ పెంచేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యాఖ్యానించారు. పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, వినియోగ వ్యయాన్ని పెంచాలంటే వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్లను తగ్గించడం చాలా కీలకమని ఆయన సూచించారు. ముఖ్యంగా డీమోనిటైజేషన్ తర్వాత వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది కొంత పరిష్కారం చూపుతుందన్నారు. కాగా, నోట్ల రద్దు తర్వాత మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు పన్ను పరిధిలోకి వస్తుండటంతో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. భారీ సంస్కరణలు ఉండొచ్చు: బ్యాంకులు న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో భారీ సంస్కరణలు ఉండొచ్చని బ్యాంకింగ్ రంగం భావిస్తోంది. ఎఫ్‌డీఐ పరిమితి పెంపు, అదనపు మూలధనం కేటాయింపులు వీటిలో కొన్ని. 17 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై చేపట్టిన ఫిక్కీ, ఐబీఏ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత రుణ డిమాండ్ క్షీణించింది. రుణ డిమాండ్ 3–6 నెలల్లో మెరుగవుతుందని సర్వేలో పాల్గొన్న అధిక బ్యాంకులు భావిస్తున్నాయి. డిపాజిట్ నిధులు భారీగా వచ్చిపడ్డాయని బ్యాంకులు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితి ప్రస్తుతమున్న 20% నుంచి 49%కి పెంచితే మూలధన సమీకరణకు మార్గం సులభం అవుతుంది. తద్వారా బాసెల్–3 నిబంధన ప్రకారం మూలధన అవసరాలను పూర్తి చేసుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. ఆదాయపు పన్ను తగ్గిం పు, 80సి, గృహ రుణాల వడ్డీపై అదనపు తగ్గింపుల ద్వారా రుణాల స్వీకరణ, పెట్టుబడులను పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. టెర్మ్ డిపాజిట్లపై అదనపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్యాంకులు ఆశిస్తున్నాయి. సేవల పన్ను 16–18 శాతానికి పెంపు! విమానయానం, హోటల్ తిండి, ఫోన్ బిల్లులు ఇతరత్రా అనేక సేవలపై వినియోగదారులు ఏప్రిల్ 1 నుంచి మరింతగా చేతిచమురును వదిలించుకోవాల్సిందేనా? జీఎస్టీని ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానుండటంతో.. ఈ బడ్జెట్లో సేవల పన్ను రేటును జైట్లీ ఇప్పుడున్న 15 శాతం నుంచి 16–18 శాతానికి పెంచే అవకాశాలున్నాయని ట్యాక్స్ నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీలో 5%, 12%, 18%, 28 శాతం ఇలా విభిన్న పన్ను శ్లాబ్‌లను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందులో ఏదోఒక పన్ను శ్లాబ్‌కు(జీఎస్టీలో సేవలపై పన్ను 18 శాతంగా ఖరారు చేయొచ్చని అంచనా) దగ్గరగా బడ్జెట్లో సేవల పన్నును పెంచొచ్చనేది వారి అం చనా. గత బడ్జెట్లో సేవల పన్నును అర శాతం పెంచి 15%కి చేర్చిన జైట్లీ... ఈసారి దీన్ని కనీసం 1% పెంచి 16 శాతానికి చేరుస్తారని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కొన్ని ప్రాథమిక సేవలకు తక్కువ సేవల పన్ను రేటు(12 శాతం), మిగతావాటికి 18 శాతం చొప్పున పన్ను రేటును నిరే్ధశించే అవకాశాలున్నాయని మరికొందరు లెక్కలేస్తున్నారు. డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కోసం బడ్జెట్లో సామాజిక పథకాలపై వ్యయాన్ని ప్రభుత్వం పెంచే అవకాశాలున్నాయని.. దీనికి తగిన నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా బడ్జెట్లో పన్నుల పెంపుపై జైట్లీ దృష్టిపెట్టొచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఒకేసారి ప్రజలపై అధిక సేవల పన్నును మోపేకంటే.. నెమ్మదిగా కొత్త రేటుకు అలవాటుపడేలా చేయడం మంచిదనేది నిపుణుల మాట. ప్రస్తుతం సేవల పన్ను కేంద్రానికి చెందినది. జీఎస్టీ అమల్లోకివస్తే.. రాష్ట్రాలు, కేంద్రం సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్యం, విద్య వంటి నిత్యావసరాలను మినహాయిస్తే.. చాలావరకూ సేవలు జీఎస్టీ కిందికి వస్తాయి. -
ఒకవైపు పన్నులు.. మరోవైపు రాయితీలు
కేంద్ర బడ్జెట్‌పై భిన్న అంచనాలు • సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం • క్యాపిటల్ గెయిన్స్లోనూ మార్పులు! • కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు • లేదంటే పలు రంగాలకు ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: కొంత బాదుడు... కొంత ప్రోత్సాహకం... ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తీసుకురానున్న బడ్జెట్ రూపం ఇలా ఉండనుంది. కానీ, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే మోదీ సర్కారు నగదు కొరతతో ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆకస్మిక చర్యలకు దిగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపులను సవరించొచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్ పార్టిసిపెంట్లు తగినంత మొత్తాన్ని జాతి నిర్మాణం కోసం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్లో చేసిన ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏడాది లోపు షేర్లను కొని విక్రయిస్తే స్వల్ప కాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాలనే నిబంధన ఉంది. ఏడాదికి మించి అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేదు. అయితే, ప్రధాని ప్రకటన తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపునకు బదులు ప్రస్తుతమున్న ఏడాది కాలాన్ని మూడేళ్లకు మార్చే అవకావం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి చర్యలకు సంబంధించి ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైనా... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు లేదా నోట్ల రద్దు వల్ల నష్టపోయిన రంగాలకు ఇచ్చే ప్రోత్సాహక చర్యలతో దాన్ని ప్రభుత్వం అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రభుత్వం వ్యాపార నిర్వహణ వ్యయం, సంక్లిష్టతలను తగ్గించాలనుకుంటోంది. భారత్ పోటీతత్వాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని భావిస్తోంది. కానీ, అదే సమయంలో ద్రవ్య పరమైన లక్ష్యాలను చేరుకునేందుకు ఆదాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటోంది’’ అని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ట్యాక్స్ పార్ట్నర్ రాజేష్ హెచ్గాంధీ పేర్కొన్నారు. మరోవైపు పరోక్ష నిధుల బదిలీ పన్ను విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియే ఇన్వెస్టర్లు మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. విదేశీ కంపెనీలు తమ ఆస్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మొత్తం భారత్‌లో కలిగి ఉంటే, తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో పరోక్ష బదిలీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ గత డిసెంబర్లో ప్రకటన చేసింది. తమ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని భారత్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఫండ్స్‌కు ఈ ప్రకటన శరాఘాతమే. ఈ విషయంలో అవి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సినిమాలు, రెస్టారెంట్లలో తిండి మరింత ఖరీదు?
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నాలుగోసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కొన్ని వాతలు తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా సేవాపన్నును మరింత పెంచే అవకాశం కనిపిస్తుండటంతో.. దాని ప్రభావం చాలా అంశాల మీద ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులలో సినిమాలు చూడటం, రెస్టారెంట్లలో ఆహారం తినడం, విమానాల్లో ప్రయాణించడం.. ఇలాంటివన్నీ కాస్త ఖరీదు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండు సెస్‌లతో కలిపి సేవాపన్ను 15 శాతం వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఇది మరో 0.5 నుంచి 1 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సేవాపన్ను అనేది కస్టమర్ల నుంచి సర్వీసు ప్రొవైడర్లు వసూలుచేసి.. మళ్లీ ప్రభుత్వానికి కట్టే పన్ను. ఈ పన్ను పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవచ్చన్నది ప్రభుత్వ వర్గాల ఆలోచన. దీనివల్ల ఉద్యోగులకు ఆదాయపన్ను నుంచి మరింత వెసులుబాటు ఇచ్చే అవకాశం కూడా కలుగుతుంది. ఇప్పటికి సేవాపన్నును రెండుసార్లు సవరించారు. 2015-16లో దీన్ని 12.36 నుంచి 14 శాతం చేశారు. ఆ తర్వాత స్వచ్ఛభారత్ సెస్ 0.5 శాతం దీనికి కలిసింది. 2016-17లో కృషి కళ్యాణ్ సెస్ మరో 0.5 శాతం కలవడంతో ఇప్పటికి అది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. -
బడ్జెట్ ను వాయిదా వేయండి!
-
ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆశలు..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రభావితమైన ఎఫ్ఎంసీజీ కంపెనీలు బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. వినియోగదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఉద్దీపన చర్యలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచే ఉద్దీపన చర్యలు బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్నాం. క్రియాశీలక సంస్కరణలు మధ్యతరగతి, గ్రామీణ ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా డిమాండ్ పుంజుకుంటుంది. దీంతో ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి పరంగా పట్టాలెక్కుతుంది. – వివేక్ గంభీర్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ వృద్ధి ఆధారిత బడ్జెట్ వినియోగాన్ని, ప్రజల పెట్టుబడులను, డిజిటైజేషన్‌ను, పన్నుల పరిధిని పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించే విధంగా బడ్జెట్ ఉంటుంది. గార్, పీఓఈఎం, జీఎస్టీ వంటి విధానాలపై బడ్జెట్‌తో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇతర అన్ని బడ్జెట్ల మాదిరిగా లోటును అడ్డుకట్ట వేయడం, అధిక వృద్ధిని సాధించడం అన్నది ప్రస్తుతానికి సవాలే. కనీస పన్ను మినహాయింపు వంటి పలు చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. – ఎన్‌హెచ్ బన్సాలీ, ఇమామీ సీఎఫ్‌వో ఆయుర్వేద ఉత్పత్తులపై తక్కువ పన్ను ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారు చేసిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం సంతోషకరం. చాలా వరకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇటీవలి కాలంలో ఈ విభాగంలోకి అడుగుపెట్టాయి. ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తులను జీఎస్టీలో చాలా తక్కువ పన్ను రేటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. – ప్రదీప్ చోలాయిల్, చోలాయిల్ లిమిటెడ్ (మెడిమెక్స్ తయారీ) ఎండీ -
రాయితీలు.. ఆర్థిక వృద్ధే లక్ష్యం!
బడ్జెట్‌పై వివిధ సంస్థల వినతి l పన్నుల వ్యవస్థలో మార్పు: కేర్ l పన్ను మినహాయింపులు కావాలి: ఎస్బీఐ l ద్రవ్యలోటు లక్ష్యం పెరుగుతుంది: గోల్డ్‌మన్ l పసిడిపై పన్నుల భారం తగ్గించాలి: డబ్ల్యూజీసీ ముంబై: కేంద్ర బడ్జెట్ సమయం ఫిబ్రవరి 1వ తేదీ దగ్గరపడుతుండడంతో, దీనిపై పలు విశ్లేషణా, అధ్యయన సంస్థల నుంచి వివిధ రంగాల్లో నిపుణుల వరకూ విభిన్న అంచనాలు వెలువడుతున్నాయి. పన్నుల వ్యవస్థలో మార్పులు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ– కేర్ పేర్కొంది. ఆర్థిక వృద్ధి అవసరమని, ఇందుకు ఐటీలో మినహాయింపులు కావాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ పేర్కొంటే, ద్రవ్యలోటు కట్టు తప్పడం ఖాయమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్సీసెస్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషించింది. ఇక పసిడి వ్యాపారంలో పారదర్శకతను పెంచాలని ప్రపంచ పసిడి మండలి డిమాండ్ చేసింది. వేర్వేరుగా ముఖ్యాంశాలు చూస్తే... అదనపు ఆదాయం లక్ష్యం వ్యక్తులు, కార్పొరేట్లకు సంబంధించి పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రెవెన్యూ పెంపు ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండవచ్చు. పరోక్ష పన్నులకు సంబంధించిన వ్యవస్థ జీఎస్టీకి కొంత దగ్గరకు జరిగే విధంగా బడ్జెట్ రూపొందించే అవకాశం ఉంది. సేవలపై ప్రభుత్వ లెవీ పన్ను 12 నుంచి 18 శాతంగా ఉండవచ్చు. కాగా ప్రత్యక్ష పన్నుల విషయంలో కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించవచ్చు. వచ్చే నాలుగేళ్లలో ఈ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి రోడ్ మ్యాప్ ఉంటుందని భావిస్తున్నాం. కొన్ని మినహాయింపులను రద్దుచేస్తూ... తొలిదశగా ఈ రేటును 27.5 శాతానికి తగ్గించవచ్చు. రెవెన్యూ వ్యయాల విషయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 17.31 లక్షల కోట్లు ఉంటే, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతానికి పెరిగే వీలుంది. ఇక మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్‌కు సంబంధించి వ్యయాలను 10% వరకూ పెంచవచ్చు. 3 లక్షలకు ఐటీ మినహాయింపు పరిమితి పెంపు! ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితులను పెంచాలని ప్రభుత్వ రంగ ఎస్బీఐ ఒక నివేదికలో కోరింది. ఈ పరిమితి ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి చర్య తీసుకుంటే 75 లక్షల మంది ఆదాయపు పన్ను మినహాయింపు పొందగలుగుతారని పేర్కొంది. సెక్షన్ 80 సీ కింద పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతారన్నది అంచనాగా తెలిపింది. గృహ రుణంపై వడ్డీ మినహాయింపును రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల్లో స్థిర డిపాజిట్ల లాకిన్ కాలాన్ని ఐదేళ్ల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించాలన్నది గత కొంత కాలంగా బ్యాంకింగ్ చేస్తున్న విజ్ఞప్తిగా వివరించింది. అలాగే వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం పెరిగే అవకాశం ఉందనీ, ఇది 3.4 శాతంగా (5.74 లక్షల కోట్లు) ఉండవచ్చని నివేదిక అంచనావేసింది. 3.4 శాతం వరకూ ద్రవ్యలోటు...: గోల్డ్‌మన్ శాక్స్ మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం మార్చే వీలుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. ఈ లోటు 3.3% నుంచి 3.4 శాతం మధ్య ఉంటుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. పసిడి పన్నులను తగ్గించాలి: డబ్ల్యూజీసీ రానున్న బడ్జెట్లో పసిడిపై పన్నులను కేంద్రం ప్రస్తుత భారీ 13 శాతం నుంచి తగ్గించాలని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల దేశంలోకి పసిడి అక్రమ రవాణా తగ్గుతుందని, స్థానిక పసిడి వాణిజ్యంలో పారదర్శకత మెరుగుపడుతుందని విశ్లేషించింది. ప్రస్తుతం పసిడిపై 10 శాతం కస్టమ్స్ సుంకం ఉంది. ఎక్సైజ్ సుంకం 1 శాతం. వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ 1.5 శాతం. ఈ రంగంలో పారదర్శకతను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, కేంద్రం తప్పనిసరిగా పసిడిపై పన్నుల తీరును సమీక్షించాలని డబ్ల్యూజీసీ భారత్ కార్యకలాపాల చీఫ్ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ‘‘జీఎస్టీ వ్యవస్థలో 3 నుంచి 6 శాతం పన్ను ఉంటుందని భావిస్తున్నారు. కస్టమ్స్ సుంకం 10 శాతంగా కొనసాగితే, యల్లోమెటల్పై మొత్తం పన్ను 13 నుంచి 16 శాతంగా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఇదే జరిగితే దేశంలో మరింత పసిడి అక్రమ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని, దీనికి తావివ్వడం తగదు’’ అని విశ్లేషించారు.