
చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను నిరాశ పరిచిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పట్టించుకోవాలన్న ఉద్దేశం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు. రైతుల చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలని సూచించారు. రైల్వే జోన్, అమరావతి కనెక్టవిటీ గురించి ప్రస్తావన లేదని, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు.