parthasarathi
-
నా మాటే శాసనం: MLA Parthasarathi
-
నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే
ఆదోని టౌన్: ‘ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులుబ్దిపొందేలా చూసుకుంటా. నేను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పినట్లే. గతంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నివిధాలుగా లబ్ధిపొందారు. ఇక చాలు.. రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలి’.. అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌షాపు డీలర్లు .. అన్నీ వదిలి వెళ్లిపోవాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా చేస్తున్నది చాలు. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకొచ్చినా నేను బెదరను. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అదే చెల్లుబాటవుతుంది. ఆ పిమ్మట ఎవరు చెప్పినా ఏం జరగదు’.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. -
నేను చెప్తే బాబు, పవన్ చెప్పినట్టే..
-
బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు. -
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. జీవో 140 నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: హెటిరో అధినేత పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానమేట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయింపు చేస్తూ విడుదల చేసిన జీవో 140ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల కోసం హాస్పిటల్ నిర్మాణం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన భూమి కేటాయించింది. సర్వే నంబర్ 41/14/2లోని భూమికి ఏడాదికి రూ. 1,47,743 లీజు మొత్తాన్ని సాయిసింధూ ఫౌండేషన్ చెల్లించేలా నిర్ణయించింది. -
సత్తుపల్లి జిల్లా అయ్యేలా కృషి చేస్తాం - బీఆర్ ఎస్ ఎంపీ బండి పార్థసారథి
-
బాలు శిష్యుడుకు కిన్నెర బాలు అవార్డు..
-
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
అఫ్ఘాన్ మాటున పాక్ ద్వంద్వ నీతి
అఫ్ఘానిస్తాన్ పరిణామాలను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి పావులు కదుపుతోంది. కానీ దాని వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. పాక్ నిర్వహించిన... మధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్ పొరుగున ఉన్న కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుంచి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్ పాలన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించడానికి ఢిల్లీలో తలపెట్టిన విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవ్వడం చూస్తే... పాక్‌కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న గౌరవం తెలిసిపోతోంది. ఒక పక్క అమెరికా తలపెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాల్గొంటున్నట్లు నటిస్తూనే, మరోవైపు తాలిబన్లకు సాయం చేసి అఫ్ఘాన్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాక్ ద్వంద్వ నీతిని అమెరికాతో సహా దాని మిత్రదేశాలు గుర్తించాయి. అందుకే అవి అఫ్ఘాన్ సమస్యపై పాక్ చూపిస్తున్న చొరవను నమ్మే పరిస్థితిలో లేవు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, ఆయన తర్వాత 2022 నవంబర్ 1న సైన్యాధ్యక్ష పదవిని అధిష్ఠిస్తాడని అనుకుంటున్న ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్‌ల మధ్య విభేదాలు సృష్టించడంలో విజయం సాధించిన మొదటి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. కాబూల్ నుండి కాందహార్‌కు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను తరిమేసిన హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదులకు అన్ని విధాలా తన ఐఎస్ఐ ద్వారా సహాయ సహకారాలు అందించిన వాడిగా హమీద్ ప్రపంచవ్యాప్తంగా బోలెడంత అపఖ్యాతిని మూట గట్టుకున్నాడు. హమీద్ సమక్షంలోనే కొత్త అఫ్ఘానిస్తాన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయింది. ఇమ్రాన్ ఖాన్ ఇందుకు మద్దతు ఇచ్చినప్పటికీ, ఈ చర్య ఆయనకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలే ఎక్కువ. హమీద్ వారసుడు లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్... ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు వినే పరిస్థితి కనిపిం చడం లేదు. పాకిస్తాన్ ఆక్రమణ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సమయంలో ఈ పరిణా మాలు చోటుచేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్‌కు సంబంధించిన అనేక ఆర్థిక సూచీలను గమనించినప్పుడు... పాకిస్తాన్ కంటే బంగ్లా దేశ్ చాలా మెరుగ్గా ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాకిస్తాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త పర్వేజ్ హుడ్భోయ్ ‘‘ఇవ్వాళ కొంతమంది ఆర్థికవేత్తలు బంగ్లాదేశ్ తదుపరి ‘ఆసియా పులి’ అవుతుందని అంటున్నారు. గత ఏడాది భారత్ (8 శాతం)తో సమానంగా వృద్ధి రేటు (7.8 శాతం)సాధించింది. అదే సమయంలో పాకిస్తాన్ (5.8 శాతం) కంటే బాగా ముందుంది. బంగ్లాదేశ్ తలసరి రుణం 434 డాలర్లు. ఇది పాకిస్తాన్ తలసరి రుణం (974 డాలర్లు)లో సగం కన్నా తక్కువే. బంగ్లాదేశ్ విదేశీ మారక నిల్వలు 32 బిలియన్ డాలర్లు కాగా పాకిస్తాన్ నిల్వలు 8 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే పాకిస్తాన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువన్నమాట. ఆర్థిక పరంగా భారత్‌తో సమాన స్థాయిని తానూ కలిగి ఉన్నానని పాకిస్తాన్ పేర్కొన్నప్పటికీ, భారతదేశ విదేశీ మారక నిల్వల్లో కేవలం 1.25 శాతం మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి...’’ అని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ నిర్వహించిన... మ«ధ్య ఆసియాలోని అఫ్ఘానిస్తాన్ పొరుగున ఉన్న ఇస్లామిక్ కజకస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం నుండి ఆయా దేశాల మంత్రులు అర్ధంతరంగా వైదొలగి... తాలిబన్ పాలన నుండి ఉత్పన్నమయ్యే సమస్యలపైన, ప్రాంతీయ సహకారంపైనా చర్చించడానికి ఢిల్లీలో జరుగుతున్న విదేశాంగ మంత్రుల సమావేశా నికి హాజరయ్యారు. ఈ పరిణామం ఏమంత ఆశ్చర్యపడవలసిందేమీ కాదు. ఇస్లామాబాద్ సదస్సును పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారం భించారు. అయితే, ఈ సమావేశానికి హాజరైనవారిలో చాలా మంది నుంచి సహాయం అందే అవకాశం లేదు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో–ఆపరేషన్ (ఓఐసి) వ్యవస్థాపక దేశంగా సౌదీ అరేబియా మాత్రం ప్రాథమికంగా కొంత సహాయం చేసింది. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన వల్ల ప్రçపంచంలో తలెత్తిన ఆందోళనలను తనకు అనుకూలంగా మార్చుకొని ఆర్థిక లబ్ధి పొందడానికే పాకిస్తాన్ తనను తాను అఫ్ఘాన్ పరిణామాలపై చర్చా వేదికగా ప్రకటించుకుంది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ తన సొంత దేశంలో అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితిలో ఉన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలను నిరాకరించిన తాలిబన్ల విధానానికి ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపడం వల్ల... అమెరికా, ఐరోపా లేదా ఇతర ఇస్లామిక్ మిత్రదేశాల నుంచి అతడికి మద్దతు దొరికే అవకాశం లేదు. అఫ్ఘానిస్తాన్‌కు అంతర్జాతీయ సహాయం అందించేందుకు సంప్రదింపులు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారత్, ఇరాన్... వాటి ఇతర మధ్య ఆసియా భాగస్వామ్య దేశాలు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును రవాణా కారిడార్‌గా చేసుకొని అఫ్ఘానిస్తాన్‌కు మరింత అంతర్జాతీయ సహాయం అందించడానికి చర్యలు చేపట్టాలి. 2023లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో... రానున్న రెండు సంవత్సరాలు ఇమ్రాన్ ఖాన్‌కు కీలకం కాబోతు న్నాయి. ఈ ఎన్నికలకు ముందే పాకిస్తాన్ తదుపరి సైన్యాధిపతి ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. ఇమ్రాన్ ఖాన్‌కు, సైన్యాధి పతి జనరల్ బజ్వాకు మధ్య సత్సంబంధాలు లేవనేది రహస్యమేమీ కాదు. ఆర్మీ చీఫ్ నామినీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్‌ను కొత్త ఐఎస్ఐ చీఫ్‌గా నియమించాలని, ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను సైనిక దళాల అధిపతిగా బదిలీ చేయాలని ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బజ్వా నిర్ణయించ డంతో... ఆ నిర్ణయాన్ని అమలుచేసే విషయంలో ప్రధాని ఇమ్రాన్, జనరల్ బజ్వా మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. అమెరికా తల పెట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో తాను కూడా పాల్గొన్నానని పాకి స్తాన్ చెప్పుకుంటున్నప్పటికీ... అది తాలిబన్లకు సహాయం చేసి నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో పాకిస్తాన్ చేరినందుకు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యను పాకిస్తాన్ ‘తనకు తాను చేసుకున్న గాయం’గా ఆయన అభివర్ణించారు. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా, సైనికంగా అమెరికా నుంచి సహాయం పొందిన పాకిస్తాన్ ఇప్పుడు వాషింగ్టన్ పట్ల నిరాశాజనకంగా మాట్లాడటం ఆసక్తిదాయకం. ఎన్నికైన అఫ్ఘాన్ ప్రభుత్వాలకు రక్షణ, ఆర్థికపరమైన సహాయాలను అందించినప్పటికీ, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో సైని కంగా పాల్గొనకుండా భారతదేశం తగిన విధంగా వ్యవహరించింది. అయితే, పాకిస్తాన్ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తు న్నప్పటికీ... ఆ దేశానికి తానిస్తున్న స్థానమేంటో... అమెరికా అధ్య క్షుడు బైడెన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వెల్లడించారు. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా... పాలనలో సైన్యం ప్రధాన పాత్ర వహిస్తుందనే వాస్తవాన్ని విస్మరించి, తాను ఎంతో ప్రచారార్భాటాలతో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం’ (సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీస్)కు పాకిస్తాన్‌ను ఆహ్వానించి పాక్ పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాసియాలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకొనిపోయిన బంగ్లాదేశ్, శ్రీలంకలను ఆహ్వానించకపోవడం గమనించదగిన విషయం. అయితే అమెరికా పాకిస్తాన్‌కు ఇంత ప్రాధాన్యం ఇచ్చినా స్పష్టంగా చైనా ఒత్తిడితో ఇమ్రాన్ ఖాన్ అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ పరిణామాలన్నింటినీ భారతదేశం గమనిస్తూనే ఉంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన... భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని అనుకుంటున్నట్లు ప్రపంచానికి స్పష్టం చేసింది. తాను ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో వ్యూహా త్మక భాగస్వామ్యం కలిగి ఉండాలనే విషయంలో బైడెన్ న్యూఢిల్లీని బలవంతం చేయలేడని పుతిన్ పర్యటన స్పష్టం చేసింది. ఇటీవల అఫ్ఘానిస్తాన్–పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాస్పద డ్యూరాండ్ రేఖ సరిహద్దులో కంచె వేయడానికి పాకిస్తాన్ సైనికులు చేసిన ప్రయత్నాన్ని తాలిబన్లు భగ్నం చేయడం విశేషం. బ్రిటిష్ వాళ్లు అఫ్ఘానిస్తాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య నిర్ణయించిన సరిహద్దురేఖ డ్యూరాండ్. పాక్ తలపెట్టిన ఈ సరిహద్దు కంచెను ‘చట్టవిరుద్ధం’ అని అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనయతుల్లా ఖ్వారిజ్మీ అభివర్ణించారు. ఈ మొత్తం సంఘటనను అఫ్ఘాన్లు వీడియో తీశారు. వివాదాస్పదమైన 2,600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇటువంటి సంఘటనలకు పాకిస్తాన్, అఫ్ఘాన్‌లో అధికారం పొందటంలో దాని నుంచి సహాయం పొందిన తాలిబన్ సిరాజుద్దీన్ హక్కానీలు భవి ష్యత్తులో పరస్పరం ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి. – జి. పార్థసారథి వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హైకమిషనర్, జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్ -
Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని జైల్లో విచారించింది. తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. రూ.3 వేల కోట్ల స్కాం కార్వీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్ హెడ్‌గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్ ఆఫ్ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్‌కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి -
బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి
-
‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్ సి.పార్థసారథితోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్‌సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను బట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవర్ ఆఫ్ అటార్నీని అనువుగా మార్చుకొని... కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్‌కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి కొలట్రల్ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌పై కార్వీ ఛైర్మన్‌ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు
హైదరాబాద్: కార్వీ షేర్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణహరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్‌ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
‘ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేరు’
-
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
-
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
సాక్షి,హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని విచారించనున్నారు. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు. కాగా రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసులు ఆగస్టు 19న అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. చదవండి:Telangana Schools Reopen: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే -
కార్వీ సీఎండీ పార్థసారథి కేసు: సీసీఎస్‌కు పెరుగుతున్న బాధితుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: కార్వీ సీఎండీ పార్థసారథి కేసులో(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పార్థసారథిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో (సీసీఎస్) పోలీసులు ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. చదవండి: కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్ -
కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయని, ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గచ్చిబౌలి కేంద్రంగా పని చేసే కేఎస్‌బీఎల్ సంస్థ.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద రిజిస్టరై ఉంది. ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను ఈ సంస్థ పర్యవేక్షించేది. ఆయా ఖాతాల్లో క్లయింట్ల షేర్లతో పాటు నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం వరకు రుణం పొందొచ్చు. దీన్ని అనువుగా మార్చుకుని మదుపరుల అనుమతి లేకుండా డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి పార్థసారథి మార్చుకున్నారు. ఆ షేర్లను కొలేటరల్ సెక్యూరిటీగా పెట్టి దాదాపు రూ.680 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాలను తమ సొంత కంపెనీల్లోకి మళ్లించడం, రుణాలు చెల్లించి షేర్లను తిరిగి మదుపరుల ఖాతాల్లోకి పంపడం ఏళ్లుగా సాగింది. షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ.. అలాగే వారి డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న దాదాపు రూ.720 కోట్లనూ ఇదే పంథాలో మళ్లించడం, తిరిగి జమ చేయడం చోటు చేసుకున్నాయి. ఇలా తమ ఖాతాల్లోని షేర్లు, నగదు దారి మళ్లినట్లు మదుపరులకు తెలియకుండా కార్వీ సంస్థ జాగ్రత్త పడింది. వారి అనుమతి లేకుండా ఈ వ్యవహారాలు నెరపినా వర్చువల్ ఖాతాలో మాత్రం ఆ షేర్లు, నగదు ఉన్నట్లు చూపిస్తూ మోసం చేసింది. ఇదే పంథాలో షేర్లను తనఖా పెట్టిన కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు.. 2019– 20ల్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, హెచ్డీఎఫ్సీ నుంచి రెండు విడతల్లో రూ.347 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి వాటి అభివృద్ధికి వినియోగించాలి. దీనికి భిన్నంగా వ్యవహరించిన పార్థసార«థి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లోకి మళ్లించారు. తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను, నగదును కార్వీ సంస్థ మళ్లిస్తున్న విషయం గుర్తించిన కొందరు మదుపరులు సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో 2019లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సెబీ అవకతవకలు జరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే 2020లో కేఎస్‌బీఎల్ ఎక్కడా స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిషేధం విధించింది. అప్పటికే ఈ సంస్థ అధీనంలో ఉన్న డీమ్యాట్ ఖాతాలను వేర్వేరు సంస్థలకు బదిలీ చేయించింది. ఆ సందర్భంలో కార్వీ సంస్థలు ఆయా బ్యాంకులకు తాకట్టు పెట్టిన షేర్లను వాటి అనుమతి లేకుండానే మదుపరుల ఖాతాలకు బదిలీ చేసేశారు. దీంతో బ్యాంకు రుణాలపై ష్యూరిటీ లేకుండాపోవడంతో పాటు చెల్లింపులు ఆగిపోయాయి. పార్థసారథికి కోర్టు రిమాండ్... సెబీ నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన నేపథ్యం లో కుంభకోణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని నివా సంలో పార్థసారథిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం పార్థసారథిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో మరికొందరూ నిందితులుగా ఉన్నారని చెబుతున్నారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై 2019లో స్టాక్ మార్కెట్ కుంభ కోణం బయటపడింది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.2 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం బయటపడే దాకా ఈ సంస్థ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అందించింది. వ్యవస్థలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని, క్లయింట్ల నిధులు, షేర్లను అక్రమంగా తన ఖాతాలోకి బదలాయించుకోవడం ద్వారా ప్రయోజనాలు పొందిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా తీసుకున్న వాటిలో సుమారు రూ.1,096 కోట్ల మొత్తాన్ని కార్వీ రియల్టీ సంస్థకు మళ్లించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. -
రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ఫలితాలు: ఆర్వోలదే తుది నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే (ఆర్వోలు) తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలు తప్పక పాటించాలని, కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి/ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను పరిశీలకుల ఆమోదం తర్వాతే రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి, పారదర్శకంగా నిర్వహిం చాలని, స్ట్రాంగ్ రూంను అభ్యర్థి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 గంటలకు తెరవాలని చెప్పారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిట ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తర్వాత ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్‌లోనికి అనుమతించరాదని పేర్కొన్నారు. హాల్ చిన్నగా ఉన్న 16 వార్డులలో 7 టేబుళ్ల చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతిస్తూ ఆర్వోలు, అదనపు ఆర్వోలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152, ఒక్కో రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. 74,67,256 మంది ఓటర్లకుగాను 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్స్ జారీ చేశారన్నారు. -
ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ డివిజన్ల డీ లిమిటేషన్, రిజర్వేషన్లు, ఎన్నికలు పాత జీహెచ్ఎంసీ చట్టం ప్రకారమా.. కాదా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ స్పందన మేరకు, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారై తమకు అందాక నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డివిజన్ల డీ లిమిటే షన్‌కు సంబంధించి వైఖరిని వెల్లడించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని, సంబంధించిన జీవోలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించే వరకు ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరుందో.. లేదో.. చెక్ చేసుకుని, లేకపోతే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల కోసం ఎస్ఈసీ మొబైల్యాప్ కూడా అందుబాటులో ఉంచిందని, ఎస్ఈసీ వెబ్సైట్లోనూ తమ ఓటు ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలు చూసుకోవచ్చన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో పార్ధసార«థి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఓటరే కీలకం... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్‌దే కీలకపాత్ర. ఓటు హక్కున్న ప్రతీ పౌరుడు ఓటు వేయ డాన్ని బాధ్యతగా తీసుకో వాలి. వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేం దుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు పోస్టర్లు, ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, సెలబ్రిటీల సందేశాలు వంటివి చేపడుతున్నాం. సవాళ్లతో కూడుకున్నదే... కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రజలను మోటివేట్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. ఓటేసేందుకు అవసరమైన సురక్షిత చర్యలను చేపడుతున్నాం. బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టాం. అన్ని పరిశీలించాకే ఈ–ఓటింగ్.. కరోనా నేపథ్యంలో ఓటింగ్ పెంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాం. ఓటేసేందుకు పరిస్థితులు అనుకూలించని వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ–ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాలని భావిస్తున్నాం. అయితే ఐటీశాఖ నుంచి సాఫ్ట్వేర్ అందాక, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నాకే పైలట్ బేసిస్‌తో చేపట్టడంపై నిర్ణయం తీసుకుంటాం. ఏర్పాట్లు పూర్తికావొస్తున్నాయి... ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నుంచి అసెంబ్లీ ఓటర్ల జాబితా డేటా త్వరలోనే రానుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ ఏరియా వరకు 26 శాసనసభ నియోజకవర్గాల వారీగా 30 మంది జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కార్పొరేషన్ డివిజన్ల వారీగా అసెంబ్లీ జాబితాలతో ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేసి ఎస్ఈసీకి ఇవ్వగానే పోలింగ్ స్టేషన్లపై నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రక్రియకు ముందు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న భవనాల ఎంపికను అధికారులు పూర్తిచేస్తారు. బూత్‌కు వెయ్యిమంది ఓటర్లు... ఒక్కో పోలింగ్ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లుండేలా చూడాలని ఈసీ ఇదివరకే సూచించింది. దీనికనుగుణంగా ఏర్పాట్లుచేస్తాం. వెయ్యికంటే తక్కువ మందికి ఒక బూత్ చేయాలనే ఆలోచన ఉన్నా బిల్డింగ్లు, సిబ్బంది ఏ మేరకు అందుబాటులో ఉంటాయనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఫేస్ రికగ్నిషన్ పద్ధతి... 150 పోలింగ్ బూత్‌లలో ఫేస్ రికగ్నిషన్ అమలుకు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించాం. వీటి కోసం ఎంపిక చేసే భవనాల్లో సరైన వెలుతురు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించాం. ఐటీ శాఖ, టెక్నాలజీ సర్వీసెస్ విభాగం సహకారంతో ఈ ప్రక్రియను చేపడుతున్నాం. ఈవీఎంలా, బ్యాలెటా.. త్వరలోనే నిర్ణయం జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ బ్యాలెట్ పేపర్లతోనా.. ఈవీఎంలతోనా.. అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అందాయి. ఏ విధానంతో ఎలాంటి సమస్యలు అన్న దానిని పరిశీలించి, నిపుణుల సలహాలు తీసుకున్నాక దీనిని ప్రకటిస్తాం. (చదవండి: బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!) -
‘పిల్లల కోసం కూడా అంబులెన్స్’
సాక్షి, తాడేపల్లి: 108,104 అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ, ‘ ప్రతి మండలానికి 108, 104 ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 15, గ్రామాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 చేరుకుంటుంది. పేదల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉక్రోషంతో 104, 108లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.108,104 లకు 203 కోట్లు ఖర్చు చేస్తే 307 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘పెద్దలకే కాదు చిన్న పిల్లలు కోసం నియో నానిటల్ అంబులెన్స్ ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. 1800 వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 1800ల 108, 104 వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ చేస్తున్నా. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో 104, 108 వ్యవస్థ ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో 108, 104 షెడ్లకు పరిమితమయ్యాయి. డీజల్ లేక మధ్యలోనే పేషంట్లతో 108 వాహనాలు ఆగిపోయేవి. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు సీఎం జగన్ పెంచారు. ఐదు లక్షల ఆదాయం ఉన్నా సరే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 28 వేల కోట్లు ఖర్చు చేసింది. పార్టీ సైనికులుగా విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పని చేశారు. వారిపైన కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. వారి భుజాలు పైన మరింత బాధ్యతను సీఎం జగన్ పెట్టారు. ఇప్పుడు వారికి కొత్తగా పదవులు కట్టబెట్టలేదు. గతంలో కూడా వారు జిల్లాల బాధ్యతలు చూశారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టావు. లోకేష్ ఏమి సాధించాడని దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టావు. దాదాపు వందకు పైగా దేశాల్లో అరబిందో విస్తరించి ఉంది. లాభాపేక్ష కోసం అరబిందో కు 104, 108 ఇచ్చారని మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని పార్థసారధి అన్నారు. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) -
‘బీసీల అభ్యున్నతికి బాబు మోకాలు అడ్డుపెట్టారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబుకు స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, బీసీల రిజర్వేషన్లను బాబు అడ్డుకున్నారని, ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారని తెలిపారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూముల కోసం అమాయకులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, బాబుకు రాజకీయ విలువలు లేవని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. (స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబేనని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. ప్రతాప్‌రెడ్డి బాబు అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలతో ప్రతాప్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, బీసీల అభ్యున్నతికి చంద్రబాబు మోకాలు అడ్డుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పించామని, బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయన తెలిపారు. -
ఇసుకపై చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలు
-
జనసేనకు సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, విజయవాడ: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ నుంచి నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఘోరంగా పరాజయం పాలవడంతో ఆ పార్టీని విడిచిపెడుతున్న నాయకుల రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జనసేన సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చైర్మన్ చింతల పార్థసారథి బుధవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో జనసేన తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కేవలం 6.67 శాతం ఓట్లు (82588 ఓట్లు) మాత్రమే తెచ్చుకుని పరాజయం పాలయ్యారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనపార్టీకి చింతల గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపించారు. ఆయన ఏ పార్టీలో చేరతారో వెల్లడి కాలేదు. కాగా, కృష్ణా జిల్లా జనసేన కన్వీనర్ పాలడుగు డేవిడ్ రాజు ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఆగస్టు 1న ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నా జనసేన అగ్రనేతలు స్పందించకపోవడం గమనార్హం. (చదవండి: ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది!) -
దేవినేని ఉమా ఓ పిచ్చోడు
సాక్షి, విజయవాడ: దేవినేని ఉమా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనో పిచ్చోడు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి మండి పడ్డారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరుతుండటం పట్ల టీడీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఈ విమర్శలపై స్పందించారు. బాబు నివాసం వరదకు మునిగి పోతుందని తాము ఎప్పుడో హెచ్చరించామని.. నేడు అది నిజమయ్యిందని పార్థసారథి తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికే తెలుగు దేశం నేతలు డ్రామాలాడుతున్నారని పార్థసారథి విమర్శించారు. చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వస్తుందనే విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నాయకులు డ్రోన్ పేరుతో కొత్త రాజకీయాలు చేస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. తన ఇంట్లోకి నీరు వస్తుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాబు.. హైదరాబాద్‌లో దాక్కున్నాడు.. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ పార్థసారథి ఎగతాళి చేశారు. -
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్‌తో పాటు మరో అయిదుగురు విప్‌లను నియమించారు. విప్‌లుగా కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, బుడి ముత్యాల నాయుడు, కొరుముట్ల శ్రీనివాసులు ఎంపికయ్యారు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ ఆశించినా, సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దూరమైంది. -
వరికి మద్దతు ధర రూ. 3,650
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుల సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని, వ్యయానికి తగ్గట్టు వాటిని పెంచాలని భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. రబీ పంటలకు రైతులు పెట్టే ఖర్చుల వివరాలు నివేదిస్తూ వాటికి ఇవ్వాల్సిన మద్దతు ధరలను కమిషన్‌కు సిఫారసు చేసింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ఫ్రతిఫలం తదితరాలన్నీ మదింపు చేసిన ఈ నివేదికను హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సీఏసీపీ సమావేశంలో సమర్పించారు. ఈ సమావేశంలో సీఏసీపీ చైర్మన్ విజయ పాల్ శర్మ, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి కమిషనర్ రాహుల్ బొజ్జ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్వింటా సాధారణ వరి పండించాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ. 2,433గా రాష్ట్ర వ్యవసాయాధికారులు నిర్ధారించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇవ్వాలని సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. ఆ సూత్రం ప్రకారం 2019–20 రబీ వరికి క్వింటాకు రూ.3,650 ఇవ్వాలని కోరింది. మొక్కజొన్న, శెనగ, వేరుశెనగ పంటలకు కూడా ఖర్చు, ఎంఎస్పీని పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేసింది. అలాగే మొక్కజొన్నకు క్వింటా పండించేందుకు రూ.3,104 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఎంఎస్పీ రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్నకు రూ.1,700 ఎంఎస్పీ ఉంది. వేరుశెనగ క్వింటా పండించేందుకు రూ.5,148 ఖర్చు అవుతుండగా, క్వింటాకు ఎంఎస్పీ రూ.7,700 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరింది. ఇక క్వింటా శెనగ పండించేందుకు రూ. 5,222 వ్యయం అవుతుండగా, మద్ధతు ధర రూ.7,800 ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటా శెనగకు రూ.4,620 ఉంది. సాగు సహా ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమవుతోందని అధికారులు చెబుతున్నారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ, ఏపీ రైతు ప్రతినిధులు వరికి గోధుమ పంటతో సమానంగా మద్దతు ధర కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్ర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల హెక్టార్లు పైగా విస్తీర్ణంలో మక్కలు పండిస్తున్నందున వాటికి మద్దతు ధర గతంలో లాగానే ప్రకటించాలని కోరారు. తమిళనాడు రైతు ప్రతినిధులు మాట్లాడుతూ శెనగలకు ఇప్పుడున్న క్వింటాలుకు రూ. 4,620 నుంచి రూ.6,000 పైగా ప్రకటించాలని కోరారు. -
టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీకి అన్యాయం చేసింది
-
అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు
-
ఈ–నామ్ అమలులో తెలంగాణ అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో సంస్క రణలు అనూహ్య ఫలితాలు ఇవ్వడమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ–నామ్ పథకం అమలులో ఎన్నో మైలురాళ్లు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ–నామ్‌తోపాటు ఈ–నామ్‌యేతర వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ ఆర్థిక లావాదేవీలు పెం పొందించుకున్నట్లైతే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. మంగళవారం తెలంగాణ, ఏపీలలో ఈ–నామ్ వ్యవస్థ, వ్యవసాయ, ఉద్యానోత్పత్తుల కొనుగోళ్లపై జరిగిన అంతర్రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మూడేళ్లకాలంలో 47 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయోత్పత్తుల విక్రయాలు జరగడం ద్వారా రూ.9 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. ఈ–నామ్ అమలవుతున్న మార్కెట్లలో లైసెన్సింగ్ విధానం, మోడల్ యాక్ట్, నిబంధనలు, లావాదేవీలు వంటి అంశాలపై వర్తకులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ, ఏపీల్లో 64 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతున్న నేపథ్యంలో అంతర్రాష్ట్రాల మధ్య వ్యాపారం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో 22 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలవుతోందని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ వెల్లడించారు. -
‘అదే వైఎస్ జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా’
సాక్షి, విజయవాడ : కలకత్తాలో జరిగిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి గానీ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని దమ్ము ధైర్యంలేని పిరికిపంద, అసమర్దుడు సీఎం చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. అదే ఫెడరల్ ఫ్రంట్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చలు జరిపితే తొలి ప్రాధాన్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించే మాట్లాడారని తెలిపారు. అదే వైఎస్ జగన్‌కు చంద్రబాబుకు ఉన్న తేడా అన్నారు. టీఆర్ఎస్ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేశారని ధ్వజమెత్తారు. వీటిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. విజయవాడ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 'కేటీఆర్, వైఎస్ జగన్ చర్చలు జరిపితే అది ఫిడేల్ ఫ్రంట్ అని ఎద్దేవా చేశారు. కలకత్తాలో జరిగింది తోడేళ్ల ఫ్రంటా? వైఎస్ జగన్ కలుగులో దాక్కున్నారని మంత్రి దేవినేని ఉమ కళ్లులేని కబోదిలా మాట్లాడారు. సంవత్సరం మూడు నెలలపాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజల హృదయాలలో ఉన్నారనే విషయం మరిచిపోయావా? ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు తంత్రాలు కుతంత్రాలు మొదలు పెట్టారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు చంద్రబాబును ఓడించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వైఎస్ జగన్ నవరత్నాలు ప్రకటిస్తే వాటికి మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదని మంత్రి యనమల ఎద్దేవా చేశారు. ఇప్పుడు వాటిలోని పింఛన్ పెంపు, డ్వాక్రామహిళల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు, రైతుబంధు పేరుతో ఇన్ పుట్ సబ్సిడీలను చంద్రబాబు ఇప్పుడు ప్రకటించారు. వీటిని నవరత్నాలలో నుంచి దొంగిలించి చంద్రబాబు ప్రకటించడమంటే అది వైఎస్ జగన్ విజయమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి కనీసం ఐదు వందల కోట్లు కూడా చెల్లించకుండా చికిత్సలు నిలిపివేసి, ఇప్పుడు ఐదులక్షల పెంపుదల ఎలా ఇస్తారు. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, పదివేలు అంటూ చంద్రబాబు తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాటిని ఎల్లో మీడియా మసాలా వేసి మరీ ఆకర్షణీయంగా ప్రకటిస్తున్నాయి. యాదవ కార్పొరేషన్ కోసం వెళ్తే దాని గురించి సరైన హామీ ఇవ్వలేదు. నాయీబ్రాహ్మణులు ఆదుకోమని వెళ్తే వారిని తోకలు కత్తిరిస్తామని అవమానించాడు. ఈరోజు బీసీ నేతలను పిలిచి తాయిలాలు ప్రకటిస్తూ దొంగప్రేమ ఒలకబోస్తున్నాడు. వైఎస్ జగన్ బీసీల అధ్యయన కమిటీ పెట్టి వారికి ఏం కావాలో విస్తృత స్దాయిలో చర్చించారు. త్వరలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతున్న తరుణంలో చంద్రబాబు దొంగ ప్రేమలు నటిస్తున్నారు. బీసీలకు న్యాయం చేయగలిగేది వైఎస్ జగన్ మాత్రమే అని బీసీ వర్గాలు నమ్ముతున్నాయి' అని పార్థసారథి అన్నారు. -
‘పవన్.. ఆ టీఆర్ఎస్ నేతలు ఎవరో చెప్పు..’
-
‘పవన్.. ఆ టీఆర్ఎస్ నేతలు ఎవరో చెప్పు..’
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలవమని చెప్పిన టీఆర్ఎస్ నాయకులు ఎవరో తెలియ చేయాలని వైఎస్సార్ సీపీ నేత పార్ధసారథి కోరారు. పవన్‌కు వైఎస్సార్ సీపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎవరి సహకారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసికంగా ఓటమికి సిద్దమైనట్లు ఉన్నారని, అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగా చంద్రబాబు అనేక శంఖుస్థాపనలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉందని అన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కేసును న్యాయస్ధానం ఎన్ఐఏకు అప్పగించిందన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఎందాకైనా
-
దర్యాప్తు సంస్ధలను తప్పదారి పట్టిస్తోంది
-
న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తాం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో న్యాయం కోసం రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఘటనకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన వ్యూహంపై శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నంతో భుజానికి గాయం అయినప్పటికీ ప్రజలకోసం పాదయాత్ర చేయడానికి జగన్ సిద్ధమయ్యారని.. అయితే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని పార్టీ నేతలంతా విన్నవించనున్నట్లు తెలిపారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీపైన, తమ అధినేతపై బురద చల్లడమే పనిగా..చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్తున్నారన్నారు. జగన్ కేసులో చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2 అన్నారు. డీజీపీ ఠాకూర్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. సరైన విచారణ జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం నియమించిన సిట్ కాకుండా వేరే ఏజెన్సీ ద్వారా విచారణ జరగాలని కోరారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ కొన్ని టీవీ చానళ్లలో జగన్మోహన్రెడ్డి ఏపీ పోలీసుల దర్యాప్తును వద్దని, తెలంగాణా పోలీసుల విచారణ కావాలని వ్యాఖ్యనించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని.. అలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ దురుద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. లోకేష్ మాటలే డీజీపీ పలికారు.. మరో సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ మంత్రి లోకేష్ ట్విట్టర్లో వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుది నేరచరిత్ర విద్యార్థి దశనుంచే చంద్రబాబుకు నేరచరిత్ర ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తసిక్తమేనన్నారు. చదువుకునే రోజుల్లోనే ఎస్వీ యూనివర్సిటీలో కుల రాజకీయాలను పెంచిపోషించిన చంద్రబాబు.. నేడు రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడయ్యాడని దుయ్యబట్టారు. వంగవీటి రంగా, జర్నలిస్ట్ పింగళి దశరథరామ్‌ను హత్య చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ సెక్రటరీ రాఘవేంద్రరావును లారీతో తొక్కించి హత్య చేయించడంలోనూ ఆయన పాత్ర ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేయించి, నిందితులకు ఆశ్రయం కల్పించి వారిని కాపాడారని ఆరోపించారు. -
రేపు రైతుల ఖాతాల్లోకి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రబీ రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్లో మొదటిదశ పెట్టుబడి సొమ్మును సోమ వారం రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధ్రువీకరించారు. ఐదు లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.500 కోట్లు బదిలీ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రభుత్వం రూ.5,100 కోట్లు పంపిణీ చేసింది. మొత్తం 51 లక్షల మంది రైతులకు గ్రామసభల్లో పెట్టుబడి చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్మును అందజేయాలని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పడంతో బదిలీ ప్రక్రియ చేపట్టింది. 13 లక్షల బ్యాంకు ఖాతాల సేకరణ... రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేపనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) 13 లక్షలు సేకరించారు. వాటిని మరోసారి పరిశీలించాక ఎటువంటి అభ్యంతరాల్లేని ఖాతాలు ఐదు లక్షలు మండల వ్యవసాయ అధికారుల(ఏవో) వద్దకు చేరాయి. వాటిని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపారు. వాటిని సరిచూసుకున్న ఆర్థికశాఖ సోమవారం ఆయా బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము బదిలీ చేయనుంది. నెలలోగా పూర్తి చేసే ప్రణాళిక... మొదటిదశలో ఐదు లక్షలమంది రైతులకు పెట్టుబడి సొమ్మును బదిలీ చేశాక, తదుపరి వారంరోజుల్లోనే మరో విడత సొమ్ము అందజేసేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. నెల రోజుల్లోగా మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చేరనుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతాల సేకరణ, సొమ్ము బదిలీ పనిలో దాదాపు 2,400 మంది ఏఈవోలు నిమగ్నమయ్యారు. -
మహాత్ముని స్పూర్తితో వైఎస్సార్సీపీ ముందుకెళ్తుంది
-
క్రికెట్ టోర్నీని భగ్నం చేసేందుకు బాబు సర్కారు కుట్ర
-
టోర్నీని అడ్డుకునేందుకు కుట్ర: రోజా
తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో ఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆర్కే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ డ్రిల్ మాస్టర్లను పంపాలని తాను ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని..ఇందుకు వారు పంపుతానని కూడా తెలిపారని అన్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు డ్రిల్ మాస్టర్లను రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ఇది తన మీద కక్ష సాధింపేనని పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవని, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తారని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వైఎస్సార్సీపీ బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాబుది గోబెల్ ప్రచారం: పార్థసారథి రాష్ట్ర ప్రయోజనాల మీద చంద్రబాబుకు చిత్త శుద్ధి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేశాడని,ప్రజలను తప్పుదోవ పట్టించ దానికే ప్రధాని మీద ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్సీపీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీచేస్తాయని చంద్రబాబు గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికే వైఎస్సార్సీపీ, బీజేపీతో కలసి పోటీ చేయదని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేక సార్లు చెప్పాడని గుర్తు చేశారు.నేను చంద్రబాబుకు సవాల్ విసురుతున్నావచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి వైఎస్సార్సీపీ పోటీ చేస్తే నేను రాజకీయాలనుంచి విరమించుకొంటా.. కలసి పోటీ చేయకపోతే చంద్రబాబు తప్పుకుంటాడా అని పార్ధసారథి ప్రశ్నించారు. -
పంటల బీమా ప్రీమియం గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: పత్తి సహా ఇతర పంటల బీమా ప్రీమియం గడువును పెంచుతూ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు. గతంలో వ్యవసాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మిర్చి పంటకు ప్రీమియం చెల్లించేందుకు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు గడువుగా నిర్ధారించారు. పత్తి పంటకు ఏప్రిల్ 1 నుంచి జూలై 15 వరకు గడువుగా పెట్టారు. ఆయిల్‌పామ్‌కు జూలై 14, బత్తాయికి ఆగస్టు 9వరకు గడువుగా ప్రకటించారు. తాజాగా ఆ తేదీలను పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతుల నుంచి బీమా ప్రీమియం వసూలు చేయాలని ఆదేశించినట్లు పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతుల నుంచి పంటల బీమా ప్రీమియాన్ని మినహాయించే పద్ధతిలో పట్టాదారు పాసు పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవద్దన్నారు. ఇప్పటివరకు రైతుబంధు చెక్కులు తీసుకున్న ప్రతీ రైతుకూ ప్రీమియం చెల్లించటానికి అవకాశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్ సీజన్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్లు్యబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం (యూపీఐఎస్)లు అమలుకానున్నాయి. ఆయా బీమా పథకాలను జాతీయ బీమా కంపెనీ (ఎన్ఐసీ), టాటా ఏఐజీ సాధారణ బీమా కంపెనీ, వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ)లు అమలుచేస్తాయి. -
ఎమ్మెల్య్ ప్రోగ్రెస్ రిపోర్ట్ - బీకే పార్థసారధి
-
‘మార్కెటింగ్’లో 200 ఖాళీల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసార థి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్–3 సెక్రటరీ పోస్టులు 11, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులు 27, అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్ పోస్టులు 80, గ్రేడర్ పోస్టులు 13, బిడ్ క్లర్క్ పోస్టులు 9, జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ పోస్టులు 60 ఉన్నాయి. ఆయా పోస్టులను నేరు గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్–3 సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టులకు తాజా రోస్టర్ పాయింట్లను తయారు చేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు చేతకానితనం వల్ల రైతన్నల వలసలు
-
రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు
కంకిపాడు/ఉయ్యూరు : చంద్రబాబూ...ఖబడ్దార్. రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉయ్యూరులోని మార్కెట్ సెంటరులో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర బహిరంగ సభలో పార్థసారథి ప్రసంగించారు. పేదవాడికి రేషన్‌కార్డు, పక్కా ఇల్లు, ఇంటి స్థలం, పింఛను ఏ ఒక్కటి ఇవ్వాలన్నా వాళ్ల బాబు సొమ్ము పోతున్నట్లు టీడీపీ ప్రభుత్వం బాధపడుతుందని మండిపడ్డారు. టీడీపీ తన పాలనలో ఉయ్యూరులో ఏ ఒక్కరికీ సెంటు భూమి ఇచ్చి, ఇల్లు కట్టించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు సేకరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆగ్రహం.... పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘జనాల కోసం డ్యాన్సులు వేయటం మాకు చేతకాదు.. ఉయ్యూరు సెంటరులో జనంతో చప్పుట్లు కొట్టించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డ్యాన్స్‌లు వేశారు... ప్రజలు కడుపుకాలి ఆకలితో బాధపడుతుంటే డ్యాన్సులు ఎవరైనా వేస్తారా?... ప్రజలు కష్టాలు తెలుసుకుని ఆకలి తీర్చేందుకు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు కాబట్టే వేలాదిగా జనం తరలివచ్చారన్నారు. ఈశ్వరయ్య లేఖపై నోరెత్తలేని దద్దమ్మ... జస్టిస్ ఈశ్వరయ్య బీసీలకు న్యాయమూర్తుల ఎంపికపై జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా లేఖ రాస్తే సమాధానం చెప్పలేని దద్దమ్మ చంద్రబాబు కాదా? అన్నారు. కేంద్రం ఈశ్వరయ్య వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే చంద్రబాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఒక్క రూపాయి కూడా పేదల నుంచి తీసుకోకుండా రూ.3 లక్షలతో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని, కాల్వ కట్ల వాసులకు పూర్తి భరోసా ఇవ్వాలని జగన్‌కు విజ్ఞప్తిచేశారు. -
ప్రజలు ఉద్యమిస్తుంటే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు
-
చంద్రబాబుకు సవాల్ విసిరిన పార్థసారధి
సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కొనసాగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఏపీకి చెందిన మొత్తం ఎంపీల మూకుమ్మడి రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని పిలుపునిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో కలిసి రావడం లేదంటూ మండిపడ్డారు. విజయవాడలో పార్థసారధి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసులపై విచారణ చేపడతానేమోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే హోదా పోరాటంలో బాబు వెనకడుకు వేస్తున్నారని ఆరోపించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా పోరు ఉధృతం చేయాలంటూ చంద్రబాబుకు పార్థసారధి సవాల్ విసిరారు. రాజీనామాలతోనే టీఆర్ఎస్ నేతలు తెలంగాణ సాధించుకున్నారని గుర్తుచేశారు. హోదా కోసం కలిసి రావాలంటే చంద్రబాబు మాత్రం వెనకడుకు వేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తేనే హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబుకు ఏపీకి ప్రయోజనాలు చేకూర్చాలని, హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇప్పటివరకూ చేస్తున్న మోసాలు, నాటకాలను ఇక ఆపాలంటూ పార్థసారధి హితవు పలికారు. ఇన్నేళ్లు ప్యాకేజీ జపం చేసిన చంద్రబాబు.. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలతో యూ టర్న్ తీసుకుని ఇప్పుడు హోదా జపం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
జయం మనదే
అనంతపురం టౌన్: ‘టీడీపీ నాయకుల అవినీతి, అక్రమాలు దాడులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతున్నారు.. ఎవరూ అధైర్యపడొద్దు .. మరో ఎనిమిది నెలలు ఓపిక పట్టండి.. మన అందరి పార్టీ అధికారంలోకి వస్తుంది’ అని మాజీ మంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. మంగళవారం కేటీఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి అధ్యక్షతన అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి, గుంతకల్, కదిరి, పెనుకొండ నియోజక వర్గాల బూత్ కన్వీనర్ల శిక్షణ తరగుతులు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన పార్థసారధి తొలుత వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ జిల్లా ఇన్చార్జ్ మిథున్‌రెడ్డి, పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్లు పార్టీకి పట్టుకొమ్మలన్నారు. చంద్రబాబు మోసాలను, టీడీపీ నేతల అవినీతి అక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముస్లింలకు మంత్రి వర్గంలో స్థానం లేదనీ, ఇదేమిటని ప్రశ్నిస్తే మా పార్టీ నుంచి మైనార్టీలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదంటూ ముఖ్యమంత్రి దాట వేస్తున్నాడన్నారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికైనాడా? ఆయన్ను ఏవిధంగా మంత్రి వర్గంలోకి తీసుకున్నారో మైనార్టీలకు చెప్పాలన్నారు. ఇక.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని సాక్షత్తూ సీఎం చంద్రబాబే అని .. ఇప్పుడు దళితతేజం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారన్నారు. దళిత వాడలకు వచ్చే టీడీపీ నేతల కాలర్ పట్టుకొని నిలదీయాలని పిలుపు నిచ్చారు. ప్రత్యేకహోదా కోసం ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వజ్రా భాస్కర్‌రెడ్డి, జక్కల ఆదిశేషు, రమేష్‌రెడ్డి, బత్తల హరిప్రసాద్, జిల్లా పరిశీలకుడు వైఎస్ కొండారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు వీరాంజినేయులు, మైనార్టీసెల్ అధ్యక్షుడు మున్నా, పైలా నరసింహయ్య, రామలింగం, జింకల రామాంజినేయలు, ప్రవీణ్‌కుమార్, లింగేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు ప్రజలు చాలా తెలివైనవారు చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే మళ్లీ బాబు రావాలనే గ్లోబల్ ప్రచారానికి సన్నద్ధమయ్యాడు. బాబు గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలకు వివరించే బాధ్యత బూత్ కమిటీ కన్వీనర్లపైనే ఉంది. బీజేపీ అన్ని విధాల రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తోందని.. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని బీజేపీ, టీడీపీ రెండు కవల పిల్లలు అంటూ నాడు ఊదరగొట్టిన బాబు.. నేడు మాట మార్చి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలాంటి చేయూతను అందించలేదని ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పని చేయకపోవడంతోనే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతో ఓటమి పోయాం. అందుకే ముందస్తుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ కన్వీనర్లు శ్రీకారం చుట్టాలి.– మిథున్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జ్ నవరత్నాలపై అవగాహన కల్పించాలి చంద్రబాబు నాలుగేళ్ల ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చాడు. అందరూ సమిష్టిగా శక్తివంచన లేకుండా పనిచేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేయడానికి సన్నద్ధం అవుతారు. ప్రతీ బూత్ కమిటీ కన్వీనర్ వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించాలి. – శంకర్‌నారాయణ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు టీడీపీ కుట్రలను తిప్పికొడదాం టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. మళ్లీ కుట్రలు చేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. టీడీపీ కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలి. ఈ 8 నెలల పాటు పార్టీ కోసం పని చేద్దాం. జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తే బూత్ కన్వీనర్లకు మంచి గుర్తింపు ఉంటుంది. – అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు జేసీ సోదరులు చేసింది శూన్యం తాడిపత్రి నియోజకవర్గంలో 30 సంవత్సరాలు జేసీ కుటుంబానికి అధికారం ఇచ్చినా చేసింది శూన్యం. ప్రజలను ఫ్యాక్షన్‌లోకి దింపి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అనేక పరిశ్రమలు ఉన్నా యువతకు ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస పోతుండటం బాధాకరం. పరిశ్రమలు, ఉద్యోగాలివ్వకపోయినా జేసీ సోదరులు ప్రశ్నించరు. వారికొచ్చే మామాళ్లు తీసుకొని యువతకు అన్యాయం చేస్తున్నారు. తాడిపత్రి ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త సోషల్ మీడియాదే కీలక పాత్ర 2014 ఎన్నికల్లో సోషియల్ మీడియా కీలక పాత్ర పోషించింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలంటే సోషియల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే ఎదుటి వారు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలి. – హర్ష, సోషల్ మీడియా ప్రతినిధి -
నంబర్ వన్ విలన్ చంద్రబాబు...
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను దగ్గరుండి మరీ నాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడేనని నంబర్ వన్ విలన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసినా.. నేడు బీజేపీ అన్యాయం చేస్తున్నా.. దీనికి కారణం చంద్రబాబేనని, అప్పుడు లేఖ రాసి రాష్ట్ర విభజనకు సహకరించారని, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాడని ఆయన విమర్శించారు. విజయవాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే సీనియర్ నాయకుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు విశ్వసనీయతలో అథముడని ప్రత్యేక హోదా విషయంలో స్పష్టంగా అర్థమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేది ఒక్క చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని ఇన్నాళ్లు మభ్యపెట్టారని, ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్‌గా మార్చి భూములు దోచుకున్నారని, తన స్వార్థం, కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ పనులు చేజిక్కించుకున్నారని పార్థసారధి వ్యాఖ్యానించారు. అఖిల సంఘం పేరుతో కొత్త డ్రామాలు ఎందుకు? హోదా కంటే ప్యాకేజీ మేలు అని చెప్పినప్పుడు అఖిలపక్షం గుర్తుకురాలేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్యాకేజీ బావుంది అని అర్థరాత్రి మీడియాకి చెప్పే సమయంలో అఖిలపక్షం గుర్తుకు రాలేదా అని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రా లేక టీడీపీ సీఈవోనా అని ప్రశ్నలు సంధించారు. పవన్ కల్యాణ్ పేరుతో చంద్రబాబు మళ్లీ డ్రామాలు చేస్తున్నారన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేరని.. అబద్ధాలు, మోసాలు, మాటలు మారుస్తున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘ఏపీ కోలుకోవటానికి 30 ఏళ్లు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీరును పలు పార్టీల కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న విధంగా నిధుల కేటాయింపు జరిగిందా లేదా చెప్పాలని టీడీపీ నేతలను పార్థసారధి డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో బాబు కేవలం ఆయన స్వార్ధం కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు. బాబుకు మంచి వైద్యం చేయించాలి: సీపీఐ నేత రామకృష్ణ ‘రాష్ట్రానికి ఏం సాధించాలి, ఏవి కావాలన్న విషయం మీద ఒక్క చంద్రబాబుకి తప్ప, ఏపీ నేతలతో పాటు ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజితో సమానమని చెప్పారు. ఇప్పుడు అది నిజం కాదనే ధోరణిలో వ్యవహరిస్తూ పక్కా గందరగోళంలో ఉన్నారు. చంద్రబాబు సందిగ్ధత నుంచి ముందు బయటకు రావా. లేదా ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలంటూ’ అన్ని పార్టీల నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది: సీపీఎం నేత మధు ‘రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సంప్రదింపులకే బీజేపీ నేతలకు నాలుగేళ్లు పట్టిందా. 11 జాతీయ విద్యా సంస్థలకు, మరో 9 సంస్థలుకు అనుమతులు ఇచ్చారు. రూ. 9000 కోట్ల నిధులకు కేవలం రూ. 420 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది. ఇక ముసుగులో గుద్దులాటలు ఉండవు. మార్చి 5, 6 కల్లా అంతా తేలిపోతుంది. ఇన్నేళ్లలో అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమంటే చేయనేలేదు. సీఎం దుర్మార్గంగా, ఏ బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రానిది ఒక నాటకం.. రాష్టానిది ఒక నాటకం. మార్చి 6వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన: కొణతాల రాష్ర్ట విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక విశాఖపట్నం బీచ్ లో మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శన నిర్వహించనుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవు
-
వైఎస్ఆర్సీపీ నేత పార్థసారధి అరెస్ట్
-
తక్షణమే స్పందించిన వైఎస్సార్సీపీ నేతలు
-
కృష్ణానదిలో విషాదం.. స్పీడ్ బోటు ఉండి ఉంటే..!
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో బోటు మునిగిపోయి.. ప్రయాణికులు చనిపోయిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించడంపై వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, జోగి రమేశ్, ఉదయభాను తదితరులు మండిపడ్డారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్ముటికీ ప్రభుత్వ వైఫల్యమే..! కృష్ణానదిలో జరిగిన ప్రమాదం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్సీపీ నేత పార్థసారథి అన్నారు. 'స్పీడ్ బోటు ఉండి ఉంటే ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ చనిపోయేవారు కాదని స్మిమ్మర్ స్వయంగా చెప్పారు. సిమ్మరే వెళ్లి గొడ్డలి, సుత్తి తెప్పించుకొని బోటుకు రంధ్రం చేయడంతో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు' అని ఆయన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కన్నా ముందే తాము ప్రమాద స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించామని చెప్పారు. 'ప్రైవేటు వాళ్లకు బోట్లు ఇచ్చారు. ముందస్తు భద్రతా చర్యలను ఏమాత్రం తీసుకోలేదు. ఒక్కరికి కూడా లైవ్ జాకెట్ ఇవ్వలేదు. బోటులో సిమ్మర్లు లేరు. డ్రైవర్ కొత్తవాడు. అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు' అని ఆయన అన్నారు. సాయంత్రం 5.20 గంటలకు ప్రమాదం గురించి 108కు సమాచారం ఇచ్చారని. అయినా వెంటనే ఎవరూ స్పందించలేదని అన్నారు. సహాయక చర్యలు చేపడుతూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తమపై మాపైనే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులు, ప్రభుత్వం తమ వైఫల్యం కవర్ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్, ఉదయభాను అన్నారు. -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే!
-
ఏం ప్యాకేజీ తీసుకొని వెళ్తున్నారు?
విజయవాడ: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏం ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పిన ఆమె ఇప్పుడు టీడీపీలోకి ప్రాణంతోనే వెళుతున్నారా? లేక మరే విధంగానైనా వెళుతున్నారా? అని ప్రశ్నించారు. అత్యున్నతమైన చట్టసభలో ఎంపీగా కూర్చోబెట్టిన పార్టీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళగా పేద ప్రజల బాగు కోసం పోరాడాల్సిన ఎంపీ తన సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సబబు కాదన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుట్టా రేణుక కర్నూలు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. రూ.70 కోట్లు ఆశించి వెళ్తున్నారా? బలహీన వర్గాలకు చెందిన మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపిస్తే బుట్టా రేణుక కొంచెమైన విశ్వాసం లేకుండా పార్టీ మారారని ధ్వజమెత్తారు. పార్టీ మారితే దాదాపు రూ.70 కోట్లు ఇచ్చేలా ఒప్పందాలు జరిగినట్లు జనం చెప్పుకుంటున్నారని, డబ్బులు ఆశించే వెళ్లారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని పార్థసారధి మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి తమ పార్టీలో జగన్ చేర్చుకున్నారని గుర్తు చేశారు. అది చూసిన తరువాతైనా చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రతో అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి ప్రతిపక్ష నేత వైఎస్ వైఎస్ అ«ధ్యక్షతన జరిగిన బీసీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైందని పార్థసారధి తెలిపారు. టీడీపీ సర్కారు కుల వృత్తులను తొక్కేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని బీసీ సంఘాల నేతలు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారన్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై చాలెంజ్‌లు విసరటం సిగ్గు చేటన్నారు. ఇన్నేళ్ల చంద్రబాబు పరిపాలనలో ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ఎద్దేవా చేశారు. బీసీలకు చేసిన అభివృద్ధిపై కేబినెట్ మంత్రులంతా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో కలిసి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌కు రావాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్థి చెందాలని అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. బీసీ మంత్రులకు అధికారాలేవీ? రాజధాని డిజైన్ల కోసం సినీ దర్శకుడు రాజమౌళిని లండన్‌కు పంపించడం చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. విపక్ష ప్రజాప్రతినిధులను చేర్చుకుంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మంత్రి పదవులను అలంకారప్రాయంగా మార్చి అధికారాలన్నీ లోకేష్‌కు అప్పజెప్పారన్నారు. కనీసం వీఆర్వో, వీఆర్ఏలను కూడా బదిలీ చేసే అధికారం లేని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విపక్ష నేత జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బోయలను ఎస్టీల్లోకి చేరుస్తామన్న హామీని నెరవేర్చాలని చంద్రబాబును మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం బోయలను మోసగించిన ఆయనకు విపక్ష నేతను విమర్శించే హక్కు లేదన్నారు. -
నంద్యాలలో టీడీపీది గెలుపు కాదు.. బలుపు
హైదరాబాద్ : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలనకు నక్కకు నాగలోకానికి తేడా ఉందని స్వయంగా ప్రజలే చెబుతున్నారని, టీడీపీ పెద్దలు, నేతలు ఏ ఇంటికి వెళ్లి అడిగినా ప్రజల నుంచి ఇదే సమాధానం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. నంద్యాలలో టీడీపీది గెలుపు కాదని.. బలుపు అని మండిపడ్డారు. అధికార బలం ఉపయోగించడంతోపాటు డబ్బును విచ్చలవిడిగా పంచడం వందలకోట్లు ఖర్చు చేయడంతో వారు గెలిచారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆత్మీయ కుటుంబంలో దాదాపు 50లక్షల మంది చేరిన సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. 'మేం ఎవరినీ బలవంతం చేయలేదు.. బలవంతంగా ఫోన్ చేయించలేదు.. మాయమాటలు అంతకంటే చెప్పలేదు. దాదాపు 50లక్షలమంది ప్రజలు స్వయంగా ఫోన్ చేసి వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతామని చెప్పారు. వారే వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యుడిగా చేరాలని ఫోన్లు చేస్తున్నారు. 14 రోజులుగా వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమం ఆత్మీయంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. మాక్కూడా ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరినీ పలకరించే అవకాశం దక్కింది. మాది ఆరు నెలలకోసారి కార్యక్రమాలు చేసే ప్రతిపక్షం కాదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే ప్రతిపక్షం. నంద్యాలలో టీడీపీది గెలుపు కాదు.. బలుపు. మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు వందలకోట్లు ఖర్చుచేశారు. ప్రజలను భయపెట్టారు. రాష్ట్రం మొత్తానికి ప్రకటించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కచోట మరోసారి మోసం చేసి ప్రకటించారు. వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ఫోన్ చేసిన వారి సంఖ్య 50లక్షలకు చేరింది. ఇంటింటికి వెళ్లి రాజశేఖర్ రెడ్డిగారి పాలన గుర్తుందా అని ప్రశ్నిస్తే చిన్నపిల్లలు కూడా చాలా అద్భుతంగా చెబుతున్నారు. ఎస్సీఎస్టీలకు పది లక్షల ఎకరాలు పంపిణీ చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డి గారిదే. పెన్షన్ల విషయంలో ఎవరిపైనా వివక్ష చూపించలేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా వైఎస్ఆర్ పాలనకు చంద్రబాబు పాలనకు ఉందని ప్రజలు అంటున్నారు. నాడు భరోసా ఉండేదని.. ఇప్పుడు మూడున్నారేళ్లయినా అది లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎక్కడా చంద్రబాబు ఒక్క ఇళ్లు కట్టించలేదు.. ఇళ్ల స్థలం ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. అలాగే ఒక మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క ఇటుక కూడా పేర్చకుండా మళ్లీ అమరావతియే రాజధాని కావాలంటే తనకే ఓటు వేయాలని చంద్రబాబు బెదిరిస్తారని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు రైతుల్లో నూటికి ఒకశాతం మందికే రుణమాఫీ అందింది. అది కూడా అరకొరే.. మహిళలకు ఎలాంటి రుణ మాఫీ చేయలేదు. పట్టిసీమ నుంచి నీళ్లిచ్చామని చంకలు గుద్దుకుంటున్న టీడీపీ 500 నుంచి 600కోట్లు దోచుకుంది. అంత పెద్ద మొత్తం ఖర్చు చేసి కేవలం 40 టీఎంసీలు ఇచ్చి చేతులు దులుపుకుంది' అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'అర్థాంతరంగా తొలగించాలని చూడటం దారుణం'
విజయవాడ: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 143వ జీఓ ద్వారా ఎనిమిది వేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని, ఇంటర్మీడియట్ వ్యవస్థకు వారే మూలస్తంభాలుగా నిలిచారని అన్నారు. ఒక్కొక్కరూ పదేళ్ళ సీనియారిటీతో పనిచేస్తున్నారని, వారిని అర్థంతరంగా తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దపడుతోందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలోనే కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం జరిగిందని, వారి జీతాలను రూ.9 వేల నుంచి రూ.18వేలకు పెంచిన ఘనత ఆయనదేనని అన్నారు. అంతేకాక వైఎస్ హయాంలోనే పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని కూడా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఒప్పంద ఉద్యోగులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కోసం చేసే ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. -
'అర్థాంతరంగా తొలగించాలని చూడటం దారుణం'
-
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..
-
బీసీలను కించపర్చిన మంత్రి లోకేశ్
వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలకు సీటు ఇస్తే గెలవగలరా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ బీసీలను కించపరిచేలా మాట్లాడారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. బలహీనవర్గాలను కించపర్చిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమలో ఐదు లక్షల ఉద్యోగాలిచ్చామంటూ చంద్రబాబు, నారా లోకేశ్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని కోరితే అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోకేశ్‌బాబు కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారని పార్థసారథి విమర్శించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘రాయలసీమకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్టు చూపించు.. అని కర్నూలు జిల్లాలో మంత్రి లోకేశ్‌ను యువకులు నిలదీస్తే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరితే రేయ్ ఉండ్రా అంటూ దౌర్జన్యం చేశారు. బలహీనవర్గాలకు సీటు ఇస్తే గెలవగలరా? అంటూ లోకేశ్ బీసీలను అవమానించేలా మాట్లాడారు. బలహీన వర్గాలు ఏమీ చేయలేరు, రాజకీయాలు చేతకాదన్న అభిప్రాయంతోనే ఓడిపోయే సీట్లను టీడీపీ బలహీన వర్గాలకు కేటాయిస్తోంది. బలహీనవర్గాలను కించపర్చిన టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం బాబు రైతుల సమస్యలను పట్టించుకోకుండా నంద్యాల ఉపఎన్నికల్లో ఈవెంట్ మేనేజర్‌గా మారాడు. చంద్రబాబు ఎక్కడా అభివృద్ధి చేయడు, చేస్తున్నట్టు ఎన్నికల్లో నటిస్తాడని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఎన్నికలున్నాయనే నంద్యాలకు రూ.300 కోట్లు నిధులు విడుదల చేస్తూ జీవోలిచ్చారు. అవి అమలు కావని అందరికీ తెలుసు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే. పట్టిసీమ నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. కృష్ణా డెల్టాలో పిల్ల కాలువలకు నీళ్లందే పరిస్థితి లేక రైతులు మోటార్లతో నీళ్లు తోడుకుంటున్నారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటూ హడావుడి చేసి గడ్డాలు, గుండు గీయించుకున్నారే తప్ప ఎక్కడా నీళ్లిచ్చిన పాపాన పోలేదు.’’అని అన్నారు. -
నారా లోకేష్ వ్యాఖ్యలు బాధాకరం..
-
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తారా?
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోపిడీకి కొత్త మార్గాలు వెతుకుతున్నారని, ఏవిధంగా దోచుకోవాలా అని కొత్త ఆలోచనలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. సాగునీరు, తాగు నీరు గురించి మరిచిపోయి మద్యంపై సమీక్షలు చేయడం దారుణమన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా చేయాలని చంద్రబాబు ఆలోచన అని, 2030 నాటికి మద్యం ఎంత అవసరమో ఇప్పుడే ఆలోచిస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడాది కంటే ఎక్కువగా లైసెన్స్‌లు ఇవ్వలేదని, అలాంటిది చంద్రబాబు సర్కార్ మాత్రం ముడుపులు తీసుకునే బార్లకు అయిదేళ్లు లైసెన్స్‌లు పొగిడిస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రామనే తెలిసే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. దోపిడీలు ఆపి ప్రజా సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. -
టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
-
ఉద్యాన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం
వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: ఉద్యాన సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ కార్యదర్శి పార్థసారథి అధికారులకు సూచించారు. ఆదివారం జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, పాలీహౌస్ రైతులు, అభ్యుదయ రైతులు, సూక్ష్మ సేద్య కంపెనీల ప్రతినిధులకు ఉద్యాన పంటల సాగులో అత్యాధునిక పద్ధతులు, మెళకువలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంట సాగు విధానంలో అధిక దిగుబడి సాధించేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన, సాంకేతిక సమాచారం అందించాలని పార్థసారథి అన్నారు. నర్సరీ చట్టంలో సవరణ చేసిన వివరాలను జిల్లా అధికారులు పాటించాలని, ప్రతి నర్సరీలో నాణ్యమైన నారు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటంతో పాటు కేటాయించిన జిల్లాల్లో స్థానికంగా నివాసం ఉండాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల కమిషనర్ వెంకట్రాంరెడ్డి ఆదేశించారు. పట్టు పరిశ్రమ పథకాల అమలుకు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లతో మాట్లాడినట్లు చెప్పారు. సమావేశంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, సెంటర్ అఫ్ ఎక్సలెన్సీ ఇన్చార్జి లహరి, రాజ్ కుమార్, రాష్ట్ర పాలీ హౌస్ రైతుల సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2017-18 ఏడాదికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు ప్రజలను నిరాశ పరిచిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టించుకోవాలన్న ఉద్దేశం ఎన్డీయే ప్రభుత్వానికి లేదని అర్థమైందని చెప్పారు. రైతుల చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా పట్టించుకోవాలని సూచించారు. రైల్వే జోన్, అమరావతి కనెక్టవిటీ గురించి ప్రస్తావన లేదని, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. -
ఎమ్మెల్యే కల్పనకు షాక్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు షాకిచ్చారు. ఆమె తనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన లెక్కలన్నీ తప్పని నియోజకవర్గ నేతలు తేల్చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండల కన్వీనర్లు స్పష్టం చేశారు. తాము ఉప్పులేటి కల్పన వెంట వెళ్లడం లేదని మొవ్వ, పామర్రు జడ్పీటీసీ సభ్యులు విజయశాంతి, పద్మావతి తెలిపారు. కాగా.. చంద్రబాబు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుడు పార్థసారథి మండిపడ్డారు. ఉప్పులేట కల్పన పార్టీ మారినా ఆమె వెంట ఎవరూ వెళ్లలేదని చెప్పారు. ఆమె చెప్పిన లెక్కలన్నీ అబద్ధాలేనని తెలిపారు. నిన్నటివరకు చంద్రబాబును తూర్పారబట్టిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు పచ్చ కండువా కప్పగానే చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. సర్వేలన్నీ తనకే అనుకూలమని చెబుతున్న చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడతారా అని సవాలు చేశారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అనైతిక చర్యలు మానుకుని, ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని పార్థసారథి హితవు పలికారు. -
వ్యవసాయంలోకి చదువుకున్న యువత
అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం: పార్థసారథి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు చదువుకున్న యువతను వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. పట్టణాల నుంచి పల్లెల కు వలసలు వచ్చేంత అద్భుతంగా వ్యవసాయాన్ని తీర్చి దిద్దుతామన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. పంట సాగు ఖర్చు తగ్గించి రైతుకు నికర ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నామన్నా రు. నాబార్డు రుణం ద్వారా రూ.874 కోట్లతో మరో 4.5లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యవసాయంపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే చూపిస్తోందని... అయితే అవి తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు చెప్పినవన్నీ కాకిలెక్కలే
హైదరాబాద్: దేశ జీడీపీ కంటే ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనని, ఎక్కడా వాస్తవాలకు దగ్గరగా లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని వృద్ధిరేటు ఏపీలో ఉందంటే నమ్మశక్యమేనా అని పార్థసారథి నిలదీశారు. మాయమాటలతో ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని, వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడేలా చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒంగోలు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని చెప్పారు. -
చంద్రబాబు చెప్పినవన్నీ కాకిలెక్కలే
-
విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ
ఆ దిశగా చర్యలు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి సీఎం దత్తత గ్రామాల్లో పర్యటన జగదేవ్‌పూర్: తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్, వ్యవసాయ అనుబంధ శాఖల కార్యదర్శి పార్థసారథి అన్నారు. మంగళవారం సీఎం దత్తత గ్రామాలైన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో రాష్ట్ర విత్తన ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళి, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకటరామ్‌రెడ్డిలతో కలిసి సోయాబీన్ పంటను పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖీ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ... రాష్ట్రంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటి కుంటల పునరుద్ధరణతోపాటు వివిధ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటిసారిగా దాదాపు 5 లక్షల హెక్టార్లలో పత్తి సాగు నుంచి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించినట్టు తెలిపారు. వర్ష ఆధారిత ప్రాంతమైన రాష్ట్రంలో పత్తిసాగును రైతులు తగ్గించి ఉద్యాన సాగు ద్వారా తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. నాణ్యమైన సోయాబీన్ విత్తన ఉత్పత్తి పంట సస్యరక్షణకు క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తల సూచనల మేరకు సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. 2.5 లక్షల హెక్టార్ల పప్పు ధాన్యాలు సాగవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 520 గ్రామాల్లో దాదాపు 10 వేల మంది రైతులు 45 వేల హెక్టార్లలో సోయాబీన్ విత్తన ఉత్పత్తి సాగు చేస్తున్నారని చెప్పారు. వారం పది రోజులుగా వర్షాలు లేక మొక్కజొన్న ఎండిపోతుందని, సోయాబీన్ ఆరిపోతుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన రాష్ట్రంలో పంటల పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు పార్థసారథి తెలిపారు. రైతులకు పంట రక్షణ కోసం సాంకేతిక సలహాలిస్తామన్నారు. 27 తర్వాత మంచి వర్షాలు ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. సీఎం దత్తత గ్రామాల్లో పంట రక్షణ కోసం బోరుబావి ఉన్న రైతుకు స్ప్రింక్లర్లను అందించాలని ఆదేశించారు. తపాస్‌పల్లి డ్యాం నుంచి రెండు గ్రామాల్లో చెరువు, కుంటలకు నీరు ఇప్పుడు సాధ్యకాదని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం అలోచిస్తుందన్నారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లు అద్భుతం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అద్భుతంగా ఉన్నాయని పార్థసారథి అన్నారు. ఎర్రవల్లిలో నమూనా ఇంటిని ఆయన పరిశీలించారు. ఆయన వెంట జేడీఏ మాధవిశ్రీలత, ఉద్యాన శాఖ డీడీ రామలక్ష్మి, ఏడీఏ అశోక్‌కుమార్, గఢా అధికారి హన్మంతరావు, ఏఓ నాగరాజు, ఏఈఓ దామోదర్, సర్పంచ్‌లు భాగ్య, బాల్‌రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, కృష్ణ, బాల్‌రాజు, వెంకట్‌రెడ్డి, సత్తయ్య, మల్లేశం రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే..
హైదరాబాద్: విజయవాడలో వైఎస్సాఆర్ విగ్రహం తొలగింపుపై వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అధికార ప్రతినిధి పార్థసారథిలు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గపు చర్య అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని చేయకపోతే తామే విగ్రహాన్ని తిరగి ఏర్పాటు చేస్తామని అన్నారు. మహానేత వైఎస్ఆర్ ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారని, పులిచింతల ప్రాజెక్టుకు చిహ్నమే వైఎస్ఆర్ విగ్రహం అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. వైఎస్ విగ్రహాలంటే చంద్రబాబుకు అసహనంగా ఉందని, సంస్కారహీనంగా మహానేత విగ్రహాన్ని తొలగించడాన్ని ప్రజలంతా ఖండిస్తున్నారని పార్థసారధి అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం తర్వాతే వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబువన్నీ విధ్వంసకర ఆలోచనలని విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో పటమట, పామర్రులో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించలేదు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వైఎస్ విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దని నిబంధనలు ప్రకారం వ్యవహరించాలని కోరారు. -
దొంగచాటుగా విగ్రహాన్ని తొలగించారు
-
‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పనుల్ని టీడీపీ నేతలు దోపిడీకి ఆయుధంగా మలుచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. వందల కోట్ల పుష్కరాల నిధుల దోపిడీకోసం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ పనుల్ని నామినేషన్ విధానంలో కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖలలో దోపిడీ విధానమంతా సీఎం కార్యాలయం ప్రమేయంతోనే జరుగుతోందని ఆరోపించారు. పరిపాలన అనుమతులు లేకుండానే పనులు చేపట్టి.. ఆ తర్వాత అనుమతులివ్వడంలో ఆంతర్యమేంటన్నారు. రూ.35 కోట్ల విలువైన పనుల్ని ఎలా అనుమతించారో చెప్పాలన్నారు. నిబంధనల ప్రకారం వెళతామన్న అధికారులపై సీఎం కన్నెర్ర చేస్తూ కర్రపెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు నిధుల విడుదల దగ్గర్నుంచీ టెండర్ల వ్యవహారం, పనుల కేటాయింపుపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సాగునీటిశాఖ మంత్రి నివాసముండే ప్రాంతానికి కూతవేటు దూరంలోని అత్యంత ప్రాముఖ్యమైన దుర్గాఘాట్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. ఆ కమిషన్ చంద్రబాబును విచారించిందా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచారార్భాటానికి 30 మంది బలయ్యారని, ఈ దుర్ఘటన జరిగి ఏడాదైనా ప్రజల మదినుంచి తొలగిపోలేదని పార్థసారథి అన్నారు. అసలు తొక్కిసలాటకు బాధ్యుడైన చంద్రబాబును సోమయాజులు కమిషన్ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. కమిషన్ గడువు గతనెల 29నాటికి పూర్తై చంద్రబాబును ప్రశ్నించలేదంటే.. వారిచ్చే నివేదికెలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో 30మందిని బలి తీసుకుంటే, కృష్ణా పుష్కరాలకు 30 గుళ్లు కూల్చేశారన్నారు. -
‘పుష్కర’ దోపిడీపై విచారణ జరపాలి