సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు.
కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’
చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు
Comments
Please login to add a commentAdd a comment