Karvy
-
కార్వీ గ్రూప్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు
కార్వీ గ్రూపునకు చెందిన కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (కేఐఎస్‌ఎల్) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను కేఐఎస్‌ఎల్ నిర్వహిస్తోంది. గతేడాది మార్చిలో సెబీ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. కానీ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించింది. వ్యాపార బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన సాధనా సంపత్తి లేదని కూడా నిర్థారించింది. సంస్థ డైరెక్టర్ ఒకరు సెక్యూరిటీస్ మార్కెట్ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పాటు మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన ఇతర నియమ నిబంధనలు సైతం పాటించడం లేదని, పైగా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయడానికి ఫీజు చెల్లించలేదని తేలింది. తత్ఫలితంగా ఈ సంస్థకు ఉన్న సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ‘సెబీ’ వెల్లడించింది. ఇదీ చదవండి: అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు -
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
కార్వీ కేసులో సెబీకి నాలుగు వారాల గడువు: శాట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయడానికి మార్కెట్ రెగ్యులేటర్, డిపాజిటరీలకు 2023 డిసెంబర్ 20 నుండి నాలుగు వారాల సమయం ఉందని సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం స్పష్టం చేసింది. శాట్ మునుపటి ఆర్డర్ ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లను విడుదల చేయనందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) వ్యతిరేకంగా యాక్సిస్ బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసింది. ‘ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి అప్పీలుదారు అయిన యాక్సిస్ బ్యాంక్, అలాగే సెబీ, నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లకు (ఎన్ఎస్డీఎల్) ఆర్డర్ తేదీ నుండి నాలుగు వారాల గడువు ఉందని స్పష్టం చేయబడింది’ అని శాట్ పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లు సెబీ, ఎన్ఎస్డీఎల్ ద్వారా కార్వీ ఖాతాదారులకు బదిలీ అయ్యాయి. ఈ సెక్యూరిటీల కోసం రుణదాతలకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్‌కు తాకట్టు పెట్టిన షేర్లు అలాగే ఉన్నాయి. దీనిని గుర్తించిన ట్రిబ్యునల్.. ఆ తనఖా షేర్లను విక్రయించడానికి యాక్సిస్ బ్యాంక్‌కు అనుమతించింది. 2023 డిసెంబర్ 20 నాటి శాట్ ఆర్డర్‌పై డిసెంబర్ 30న సుప్రీంకోర్టులో సెబీ అప్పీల్ దాఖలు చేసింది. -
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
కార్వీ మాజీ అధికారుల బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ - సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) క్లయింట్ల నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి రూ. 1.80 కోట్లు రాబట్టేందుకు కార్వీ గ్రూప్ మాజీ అధికారులైన ముగ్గురి బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. వీరిలో మాజీ వీపీ (ఫైనాన్స్, అకౌంట్స్) కృష్ణ హరి జి., మాజీ కాంప్లయెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు ఉన్నారు. వీరి ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతి ఉంటుంది. క్లయింట్ల సెక్యూరిటీలను వారికి తెలియకుండా తనఖా పెట్టి కేఎస్‌బీఎల్ దాదాపు రూ. 2,033 కోట్ల మేర నిధులు సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈ ఏడాది మే నెలలో సెబీ కృష్ణ హరికి రూ. 1 కోటి, రాజుకి రూ. 40 లక్షలు, శ్రీకృష్ణకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. వడ్డీలు, ఇతర వ్యయాలతో సహా మొత్తం సుమారు రూ. 1.8 కోట్లు కట్టాలంటూ గత నెల డిమాండ్ నోటీసులు జారీ చేసింది. -
సెబీ షాక్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను బ్రోకరేజ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. కేఎస్‌బీఎల్ క్లయింట్ల నిధులను గ్రూప్ కంపెనీల ఖాతాల్లోకి బదిలీ చేసుకుందని, అలాగే రూ. 2,700 కోట్ల విలువ చేసే క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి దాదాపు రూ. 2,033 కోట్ల నిధులు సేకరించిందని బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో సెబీ పేర్కొంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా? ఆయా క్లయింట్లకు నిధులు, సెక్యూరిటీలను తిరిగి ఇవ్వకపోగా.. ఖాతాల మదింపు విషయంలో ఫోరెన్సిక్ ఆడిటర్లకు సరిగ్గా సహకరించలేదని కూడా తెలిపింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఇప్పటికే కేఎస్‌బీఎల్‌ను డిఫాల్టరుగా ప్రకటించి, బహిష్కరించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెబీ పేర్కొంది. క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను కార్వీ, దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా సెబీ గత నెలలో నిషేధం విధించింది. (రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!) ఇలాంటి మరిన్ని బిజినెస్వార్తలు, ఇతరఅప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
కార్వీ మాజీ ఉద్యోగులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు.. కార్వీ గ్రూప్‌నకు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మొత్తం రూ.1.9 కోట్ల జరిమానా విధించింది. వీరిలో కేఎస్‌బీఎల్ ఎఫ్అండ్ఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణ హరి, కాంప్లియెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు, కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనుబంధ కంపెనీ కేడీఎంఎస్‌ఎల్ ఎండీ వి.మహేశ్ ఉన్నారు. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సెబీ వీరిని ఆదేశించింది. కంపెనీ చేసిన తప్పులకు సహకరించిన, కుమ్మక్కైన కేఎస్‌బీఎల్‌కు చెందిన కీలక వ్యక్తులపై సెబీ న్యాయ విచారణను ప్రారంభించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. -
కార్వీ ప్రమోటర్లపై 7 ఏళ్ల సెబీ నిషేధం
-
హైకోర్టులో ‘కార్వీ’కి ఊరట
సాక్షి, హైదరాబాద్: కార్వీ గ్రూప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి హైకోర్టు సింగిల్ జడ్జి రెండు నెలల సమయం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. ఖాతాదారులకు చెందిన షేర్లను తాకట్టు పెట్టి రుణం పొంది వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలపై కార్వీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ... షేర్లు, భూములు, భవనాలు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను జప్తు చేయడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సంస్థ సీఎండీ పార్థసారథి సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఈడీ ఎడ్జుడికేటింగ్ అథారిటీ ఆస్తుల జప్తు నోటీసులపై సమాధానం ఇవ్వడానికి కార్వీకి 2 నెలల సమయం ఇచ్చారు. ఈ తీర్పును తప్పుబడుతూ ఈడీ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అథారిటీ 180 రోజుల్లో రిపోర్టు అందజేయాల్సి ఉంటుందని, అదనంగా సమయం ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సమయ వెసులుబాటు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన రెండు నెలల గడువు మరో వారంలో ముగియనుండగా ఇప్పడు సవాల్ చేయడాన్ని తప్పుబడుతూ అప్పీల్‌ను కొట్టివేసింది. -
హైదరాబాద్: కార్వీ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
కార్వీ కేసులో ‘షాక్’ ఎక్స్చేంజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) కేసులో సంచలనం. స్టాక్ ఎక్స్చేంజీలకు షాక్ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీల దుర్వినియోగాన్ని గుర్తించే విషయంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వైఫల్యాన్ని సెబీ ఎత్తి చూపింది. ఈ మేరకు బీఎస్ఈకి రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. 95,000లకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల సెక్యూరిటీలను కేవలం ఒక డీమ్యాట్ ఖాతా నుండి తాకట్టు పెట్టి కార్వీ దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కేఎస్‌బీఎల్, గ్రూప్ కంపెనీలు 8 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.851.43 కోట్ల రుణం పొందాయి. నిస్సందేహంగా ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తాకట్టు పెట్టడం ద్వారా కేఎస్‌బీఎల్ దుర్వినియోగానికి పాల్పడిందని సెబీ స్పష్టం చేసింది. నష్టానికి కార్వీదే బాధ్యత..: ‘పెట్టుబడిదారులకు, అలాగే రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టంతో సహా.. సొంతం కాని సెక్యూరిటీలను తాకట్టు పెట్టడం వల్ల కలిగే నష్టానికి కేఎస్‌బీఎల్ బాధ్యత వహిస్తుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సభ్యుడిగా ఉండటంతో స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ పర్యవేక్షణలో కార్వీ ఉంది. ఎక్స్చేంజీల వైఫల్యం ఉంది. ఫలితంగా కేఎస్‌బీఎల్‌లో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో స్టాక్ ఎక్స్చేంజీలు జవాబుదారీగా ఉండాలి’ అని సెబీ తన ఉత్తర్వుల్లో ఘాటుగా స్పందించింది. జూన్ 2019 నుండి కార్వీలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెబీ సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి. -
కార్వీ స్కాంలో కొత్త మలుపు
-
కార్వీ సంస్థ షేర్లను ఫ్రీజ్ చేసిన ఈడీ
-
కార్వీకి భారీ షాక్: 700 కోట్ల షేర్లు ఫ్రీజ్
సాక్షి,హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథికి భారీ షాక్ తగిలింది. కార్వీకి సంబంధించిన 700 కోట్ల రూపాయల షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఫ్రీజ్ చేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల షేర్లు ఫ్రీజ్ చేశారు. రూ.3 వేల కోట్ల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోజురోజుకు ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్లను ఫ్రీజ్ చేసింది. సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడి అధికారులు..వీటితో పాటు ఎండీ పార్ధసారథి ఆస్తుల జప్తు, ఇద్దరు కుమారుల ఆస్తుల్ని ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. కాగా, ఇటీవల కార్వీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని విచారించింది. -
హైదరాబాద్ : కార్వీ కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
హైదరాబాద్ కార్వీ కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని జైల్లో విచారించింది. తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. రూ.3 వేల కోట్ల స్కాం కార్వీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్ హెడ్‌గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్ ఆఫ్ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్‌కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి -
బెంగళూరు పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి
-
కార్వీలో బయటపడ్తున్న కొత్త స్కాంలు
-
‘కార్వీ’ చుట్టూ ఈడీ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఆ సంస్థ చైర్మన్ సి.పార్థసారథితోపాటు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్‌సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణహరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజలను ప్రశ్నించింది. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని మూడు బ్యాంకుల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ రెండు కమిషనరేట్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మేర మోసం చేశారంటూ సికింద్రాబాద్‌కు చెందిన మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో మరో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకుని పార్థసారథిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటంతో చంచల్‌గూడ జైల్లోనే విచారిస్తున్నారు. వారంపాటు పార్థసారథిని ప్రశ్నించడానికి అనుమతి కోరగా మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆది, సోమవారాల్లో ఆయనను ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా విచారించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారుల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను బట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పవర్ ఆఫ్ అటార్నీని అనువుగా మార్చుకొని... కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచేందుకు మదుపరులు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని పార్థసారథి తనకు అనువుగా మార్చుకుని భారీ స్కామ్‌కు తెగబడ్డారు. మదుపరుల అను మతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. అవన్నీ తమవే అంటూ చూపించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి కొలట్రల్ సెక్యూరిటీ(తనఖా)గా పెట్టి దాదాపు రూ.వెయ్యి కోట్లు అప్పు గా తీసుకున్నారు. ఈ మొత్తాలను రుణం పొందిన సంస్థల్లోనే ఉంచి, వాటి అభివృద్ధి–విస్తరణలకు వినియోగించాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్ సంస్థల్లోకి మళ్లించి భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. దానికి సంబంధించిన వివరాల కోసమే పార్థసారథిని ప్రశ్నించి సమగ్ర వాంగ్మూలం నమోదు చేస్తోంది. కోర్టు అనుమతితో మిగిలిన నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలికంగా జప్తు చేయనుంది. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్‌పై కార్వీ ఛైర్మన్‌ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
కార్వీ స్కాం విచారణకు రంగంలోకి దిగిన టీం
-
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదు
-
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్‌ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి