న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నిబంధనలను ఉల్లంఘించినందుకు.. కార్వీ గ్రూప్‌నకు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మొత్తం రూ.1.9 కోట్ల జరిమానా విధించింది.
వీరిలో కేఎస్‌బీఎల్ ఎఫ్‌అండ్‌ఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.కృష్ణ హరి, కాంప్లియెన్స్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ జీఎం శ్రీనివాస రాజు, కార్వీ స్టాక్ బ్రోకింగ్ అనుబంధ కంపెనీ కేడీఎంఎస్‌ఎల్ ఎండీ వి.మహేశ్ ఉన్నారు.
45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సెబీ వీరిని ఆదేశించింది. కంపెనీ చేసిన తప్పులకు సహకరించిన, కుమ్మక్కైన కేఎస్‌బీఎల్‌కు చెందిన కీలక వ్యక్తులపై సెబీ న్యాయ విచారణను ప్రారంభించిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment