
న్యూఢిల్లీ: కార్వీ గ్రూప్ సంస్థకి ఇచ్చిన రుణాలు రాబట్టుకునే క్రమంలో కార్వీ డేటా మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (కేడీఎంఎస్‌ఎల్) తనఖా ఉంచిన 24 లక్షల షేర్లను స్వాధీనం చేసుకున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఇది కేడీఎంఎస్‌ఎల్ పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వాటాకు సమానం. గ్రూప్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) తీసుకున్న రుణాల కోసం కేడీఎంఎస్‌ఎల్ ఈ షేర్లను తనఖా ఉంచింది. వీటి ముఖ విలువ రూ. 10. 2008లో ఏర్పాటైన కేడీఎంఎస్‌ఎల్ సంస్థ .. ఐటీ సేవలు అందిస్తోంది. 2018–19లో కంపెనీ టర్నోవరు రూ. 1,274 కోట్లు.