హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోపిడీకి కొత్త మార్గాలు వెతుకుతున్నారని, ఏవిధంగా దోచుకోవాలా అని కొత్త ఆలోచనలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. సాగునీరు, తాగు నీరు గురించి మరిచిపోయి మద్యంపై సమీక్షలు చేయడం దారుణమన్నారు.
ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా చేయాలని చంద్రబాబు ఆలోచన అని, 2030 నాటికి మద్యం ఎంత అవసరమో ఇప్పుడే ఆలోచిస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడాది కంటే ఎక్కువగా లైసెన్స్‌లు ఇవ్వలేదని, అలాంటిది చంద్రబాబు సర్కార్ మాత్రం ముడుపులు తీసుకునే బార్లకు అయిదేళ్లు లైసెన్స్‌లు పొగిడిస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రామనే తెలిసే ఇదంతా చేస్తున్నారని పార్థసారధి మండిపడ్డారు. దోపిడీలు ఆపి ప్రజా సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.