ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఈనెల 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం పర్యటించనున్నట్లు ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తెలిపారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఈనెల 23న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం పర్యటించనున్నట్లు ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తెలిపారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూ సేకరణపై రైతుల అభ్యంతరాలు, సమస్యలు, ప్రభుత్వ ఒత్తిడి తెలుసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు.
రాజధాని భూ సేకరణలో అప్రజాస్వామికంగా ముందుకెళ్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములతో వ్యాపారం చేసి కోట్లు గడించే కుట్ర చేస్తోందని పార్థసారధి విమర్శించారు. తుళ్లూరులో రాజధానికి తాము వ్యతిరేకంగా కాదని, తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.