కృష్ణానదిలో బోటు మునిగిపోయి.. ప్రయాణికులు చనిపోయిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించడంపై వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, జోగి రమేశ్, ఉదయభాను తదితరులు మండిపడ్డారు.