‘పిల్లల కోసం కూడా అంబులెన్స్‌’ | YSRCP MLA Parthasaradi Criticise Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

‘ఏం అర్హత ఉందని లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టావు’

Published Thu, Jul 2 2020 6:17 PM | Last Updated on Thu, Jul 2 2020 6:32 PM

YSRCP MLA Parthasaradi Criticise Chandra Babu Naidu  - Sakshi

 సాక్షి, తాడేపల్లి: 108,104 అంటే గుర్తుకు వచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ, ‘ ప్రతి మండలానికి 108, 104 ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు. పట్టణాల్లో 15, గ్రామాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 చేరుకుంటుంది. పేదల ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. చంద్రబాబు ఉక్రోషంతో 104, 108లో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.108,104 లకు 203 కోట్లు ఖర్చు చేస్తే 307 కోట్లు అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..)

ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘పెద్దలకే కాదు చిన్న పిల్లలు కోసం నియో నానిటల్ అంబులెన్స్ ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. 1800 వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 1800ల 108, 104 వాహనాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చూపించాలని సవాల్ చేస్తున్నా. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో 104, 108 వ్యవస్థ ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో 108, 104 షెడ్లకు పరిమితమయ్యాయి. డీజల్ లేక మధ్యలోనే పేషంట్లతో 108 వాహనాలు ఆగిపోయేవి. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు సీఎం జగన్ పెంచారు. ఐదు లక్షల ఆదాయం ఉన్నా సరే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం 28 వేల కోట్లు ఖర్చు చేసింది. పార్టీ సైనికులుగా విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పని చేశారు. వారిపైన కూడా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. వారి భుజాలు పైన మరింత బాధ్యతను సీఎం జగన్ పెట్టారు. ఇప్పుడు వారికి కొత్తగా పదవులు కట్టబెట్టలేదు. గతంలో కూడా వారు జిల్లాల బాధ్యతలు చూశారు. లోకేష్‌కు ఏమి అర్హత ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబె‍ట్టావు. లోకేష్ ఏమి సాధించాడని దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి కట్టబెట్టావు. దాదాపు వందకు పైగా దేశాల్లో అరబిందో విస్తరించి ఉంది. లాభాపేక్ష కోసం అరబిందో కు 104, 108 ఇచ్చారని మాట్లాడడం కరెక్ట్ కాదు’ అని పార్థసారధి అన్నారు. (ఏపీలో అన్‌లాక్‌ 2.0 అమలు ఉత్తర్వులు జారీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement