ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చంద్రబాబు రావాలి, జాబు రావాలంటూ టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టారని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వచ్చింది జాబు కాదని, కరువు వచ్చిందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పార్థసారధి మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.